Ayodhya Kanda Sarga 38 In Telugu – అయోధ్యాకాండ అష్టాత్రింశః సర్గః

అయోధ్యాకాండంలోని అష్టాత్రింశః సర్గంలో, దశరథ మహారాజు తన ఆఖరి రోజులు గడుపుతున్నాడు. ఆయన రాముడి వలస కారణంగా తీవ్ర దుఃఖంలో ఉంటాడు. ఈ సమయంలో, కౌసల్య మరియు సుమిత్రలు దశరథుని పక్కన ఉంటారు. దశరథుడు తన గతాన్ని గుర్తు చేసుకుంటూ, ఒకప్పుడు చేసిన తప్పును గురించి చెబుతాడు. యవన వయసులో దశరథుడు, శ్రవణ కుమారుని అజ్ఞానంలో వేటాడి చంపిన విషయం వివరిస్తాడు. శ్రవణ కుమారుడి తల్లిదండ్రులు అతన్ని శపిస్తారు, “నీ కుమార దుఃఖంతో నీవు కూడా మరణిస్తావు” అని. ఆ శాపం ఇప్పుడు ఫలించిందని దశరథుడు బాధపడుతాడు. రాముడి నిర్వాస వేదనతో, దశరథుడు తన ప్రాణాలు విడిచినట్లు ఈ సర్గలో తెలియజేయబడింది.

జనాక్రోశః

తస్యాం చీరం వసానాయాం నాథవత్యామనాథవత్ |
ప్రచుక్రోశ జనః సర్వో ధిక్త్వాం దశరథం త్వితి || ౧ ||

తేన తత్ర ప్రణాదేన దుఃఖితః స మహీపతిః |
చిచ్ఛేద జీవితే శ్రద్ధాం ధర్మే యశసి చాత్మనః || ౨ ||

స నిశ్శ్వస్యోష్ణమైక్ష్వాకస్తాం భార్యామిదమబ్రవీత్ |
కైకేయి కుశచీరేణ న సీతా గంతుమర్హతి || ౩ ||

సుకుమారీ చ బాలా చ సతతం చ సుఖోచితా |
నేయం వనస్య యోగ్యేతి సత్యమాహ గురుర్మమ || ౪ ||

ఇయం హి కస్యాపకరోతి కించి-
-త్తపస్వినీ రాజవరస్య కన్యా |
యా చీరమాసాద్య జనస్య మధ్యే
స్థితా విసంజ్ఞా శ్రమణీవ కాచిత్ || ౫ ||

చీరాణ్యపాస్యాజ్జనకస్య కన్యా
నేయం ప్రతిజ్ఞా మమ దత్తపూర్వా |
యథాసుఖం గచ్ఛతు రాజపుత్రీ
వనం సమగ్రా సహ సర్వరత్నైః || ౬ ||

అజీవనార్హేణ మయా నృశంసా
కృతా ప్రతిజ్ఞా నియమేన తావత్ |
త్వయా హి బాల్యాత్ప్రతిపన్నమేతత్
తన్మాం దహేద్వేణుమివాత్మపుష్పమ్ || ౭ ||

రామేణ యది తే పాపే కించిత్కృతమశోభనమ్ |
అపకారః క ఇహ తే వైదేహ్యా దర్శితోఽథ మే || ౮ ||

మృగీవోత్ఫుల్లనయనా మృదుశీలా తపస్వినీ |
అపకారం కమిహ తే కరోతి జనకాత్మజా || ౯ ||

నను పర్యాప్తమేతత్తే పాపే రామవివాసనమ్ |
కిమేభిః కృపణైర్భూయః పాతకైరపి తే కృతైః || ౧౦ ||

ప్రతిజ్ఞాతం మయా తావత్త్వయోక్తం దేవి శృణ్వతా |
రామం యదభిషేకాయ త్వమిహాగతమబ్రవీః || ౧౧ ||

తత్త్వేతత్సమతిక్రమ్య నిరయం గంతుమిచ్ఛసి |
మైథిలీమపి యా హి త్వమీక్షసే చీరవాసినీమ్ || ౧౨ ||

ఇతీవ రాజా విలపన్మహాత్మా
శోకస్య నాంతం స దదర్శ కించిత్ |
భృశాతురత్వాచ్చ పపాత భూమౌ
తేనైవ పుత్రవ్యసనే నిమగ్నః || ౧౩ ||

ఏవం బ్రువంతం పితరం రామః సంప్రస్థితో వనమ్ |
అవాక్ఛిరసమాసీనమిదం వచనమబ్రవీత్ || ౧౪ ||

ఇయం ధార్మిక కౌసల్యా మమ మాతా యశస్వినీ |
వృద్ధా చాక్షుద్రశీలా చ న చ త్వాం దేవ గర్హతే || ౧౫ ||

మయా విహీనాం వరద ప్రపన్నాం శోకసాగరమ్ |
అదృష్టపూర్వవ్యసనాం భూయః సమ్మంతుమర్హసి || ౧౬ ||

పుత్రశోకం యథా నర్ఛేత్త్వయా పూజ్యేన పూజితా |
మాం హి సంచింతయంతీయమపి జీవేత్తపస్వినీ || ౧౭ ||

ఇమాం మహేంద్రోపమ జాతగర్ధినీం
తథా విధాతుం జననీం మమార్హసి |
యథా వనస్థే మయి శోకకర్శితా
న జీవితం న్యస్య యమక్షయం వ్రజేత్ || ౧౮ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టాత్రింశః సర్గః || ౩౮ ||

Ayodhya Kanda Sarga 38 Meaning In Telugu

వసిష్ఠుడు కైకతో మాట్లాడిన మాటలు విన్న అంతఃపుర స్త్రీలు నార చీర కట్టుకోడానికి రాక అవస్థలుపడుతున్న సీతను చూచి, కైకను దశరథుని మనసులోనే తిట్టుకున్నారు. వారి మనోభావాలను గ్రహించాడు దశరథుడు.

దశరథుడు కైక వంక చూచి “ఓ కైకా! వసిష్ఠుల వారి మాటలు విన్నావు కదా! వారు చెప్పినది యదార్థము. సీత నారచీరలు ధరించనవసరము లేదు. సీత సుకుమారి. వయసులో చిన్నది. పుట్టినప్పటినుండి రాజభోగాలలో మునిగితేలింది. సీతకు వనవాసము సరికాదు. అని వసిష్ఠులవారు చెప్పినది అక్షరాలా సత్యము. జనకమహారాజు కుమార్తె సీత ఒక యోగిని వలె నారచీరలు ధరించనవసరం లేదు. ఓ కైకా! సీత నీకు ఏమి అపకారము చేసిందని ఆమెకు నారచీరలు ఇచ్చావు. నేను నీకు, ‘సీత కూడా నార చీరలు ధరించి అడవులకు వెళుతుంది’ అని వరం ఇచ్చానా! మరి సీతకు ఎందుకు ఇచ్చావు నారచీరలు? ఆమె ఎవరో తెలుసా! జనకమహారాజు కూతురు.

ఆమె నారచీరలు ధరించాలా! కాబట్టి, ఆమెకు పట్టుబట్టలు ఇవ్వు. అంతే కాదు ఆమె వెంట పట్టుబట్టలు, ఆభరణములు పంపించమని ఆదేశిస్తున్నాను. నాకే జీవించడానికి అర్హత లేదు. అటువంటి వాడిని నేను నీకు వరాలు ఇచ్చాను. నా మాటను రాముడు పాటిస్తున్నాడు అడవులకు వెళుతున్నాడు. వింతగా ఉంది కదూ! కాని నేను నీకు ఇచ్చిన వరాలతో, నేను నీకు ఇచ్చిన మాటతో సీతకు ఎలాంటి సంబంధము లేదు. రాముడు నీ కేమైనా అపకారము చేస్తాడని అడవులకు వెళ్లగొడుతున్నావు. అలాంటి అపకారము సీత వలన కలగదుకదా! మరి ఆమె ఎందుకు అడవులకు వెళ్లాలి? వెళ్లినా ఎందుకు నారచీరలు ధరించాలి? నీ పట్ల ఆమె ఏమి అపరాధము చేసింది?

ఓ కైకా! నీవు రాముని అడవులకు పంపుతూ మహాపాపము చేస్తున్నావు. అది చాలదన్నట్టు వాళ్లకు నారచీరలు ఇచ్చి ఘోరమైన అపరాధము చేస్తున్నావు. నరకానికిపోతావు. నరకానికి పోతావు” అని వలా వలా ఏడిచాడు దశరథుడు.

ఏడుస్తున్న తండ్రిని చూచి రాముడు ఆయన దగ్గరగా వెళ్లాడు. దశరథుని దగ్గర కూర్చుని ఇలా అన్నాడు. “ఓ మహారాజా! నా తల్లి కౌసల్య వృధ్యాప్యములో ఉంది. ఆమెకు ఏ పాపమూ తెలియదు. నేను వనములకు వెళ్లడం చూచి ఆమెకూడా మీ మాదిరి శోక సముద్రంలో మునిగి పోయింది. మీరు కూడా ఇలా శోకిస్తూ ఉంటే ఆమెను ఎవరు ఓదారుస్తారు. నా తల్లి కౌసల్యను ఆదరంతో చూడండి. ఆమెను నిరాదరించకండి. నా మీద ప్రేమతో నా తల్లి కౌసల్య ప్రాణ త్యాగము చేసుకోకుండా చూడండి. అదే మీరు నాకు ఇచ్చే వరము. ఈ ఒక్కవరాన్ని నాకు ప్రసాదించండి. నాకు వనములకు పోవుటకు అనుమతి ఇవ్వండి.” అని అన్నాడు రాముడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ముప్పది ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ఏకోనచత్వారింశః సర్గః (39) >>

Leave a Comment