Ayodhya Kanda Sarga 39 In Telugu – అయోధ్యాకాండ ఏకోనచత్వారింశః సర్గః

అయోధ్యాకాండ ఏకోనచత్వారింశః సర్గలో, దశరథ మహారాజు మరణం తరువాత, ఐక్య రాజ్యం తీవ్ర దుఃఖంలో మునిగిపోతుంది. మరణం తరువాత, వసిష్ఠుడు, సుమంతుడు మరియు ఇతర మంత్రులు, భార్యలు కౌసల్య మరియు సుమిత్రలతో కలిసి దశరథుని అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆ తరువాత, దశరథుని మరణ వార్తను భారతుని వద్దకు పంపే ప్రయత్నం చేస్తారు, భారతుడు తన తల్లి కైకేయితో కలిసి కేకయ దేశంలో ఉంటున్నాడు. ఇందులో, వసిష్ఠ మహర్షి వేద విద్యాసంపన్నుడిగా, రాజ్య నిర్వహణలో కీలకంగా ఉంటాడు. అతను రాజ్యంలోని పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తాడు మరియు భరతుని వెంటనే అయోధ్యకు రావలసిందిగా సందేశం పంపిస్తాడు. ఈ సందేశం ద్వారా భరతుడు తండ్రి మరణం మరియు అయోధ్యలో నెలకొన్న విషాదం గురించి తెలుసుకుంటాడు.

వనగమనాపృచ్ఛా

రామస్య తు వచః శృత్వా మునివేషధరం చ తమ్ |
సమీక్ష్య సహ భార్యాభిః రాజా విగతచేతనః || ౧ ||

నైనం దుఃఖేన సంతప్తః ప్రత్యవైక్షత రాఘవమ్ |
న చైనమభిసంప్రేక్ష్య ప్రత్యభాషత దుర్మనాః || ౨ ||

స ముహూర్తమివాసంజ్ఞో దుఃఖితశ్చ మహీపతిః |
విలలాప మహాబాహుః రామమేవానుచింతయన్ || ౩ ||

మన్యే ఖలు మయా పూర్వం వివత్సా బహవః కృతాః |
ప్రాణినో హింసితా వాఽపి తస్మాదిదముపస్థితమ్ || ౪ ||

న త్వేవానాగతే కాలే దేహాచ్చ్యవతి జీవితమ్ |
కైకేయ్యా క్లిశ్యమానస్య మృత్యుర్మమ న విద్యతే || ౫ ||

యోఽహం పావకసంకాశం పశ్యామి పురతః స్థితమ్ |
విహాయ వసనే సూక్ష్మే తాపసాచ్ఛాదమాత్మజమ్ || ౬ ||

ఏకస్యాః ఖలు కైకేయ్యాః కృతేఽయం క్లిశ్యతే జనః |
స్వార్థే ప్రయతమానాయాః సంశ్రిత్య నికృతిం త్విమామ్ || ౭ ||

ఏవముక్త్వా తు వచనం బాష్పేణ పిహితేంద్రియః |
రామేతి సకృదేవోక్త్వా వ్యాహర్తుం న శశాక హ || ౮ ||

సంజ్ఞాం తు ప్రతిలభ్యైవ ముహూర్తాత్స మహీపతిః |
నేత్రాభ్యామశ్రుపూర్ణాభ్యాం సుమంత్రమిదమబ్రవీత్ || ౯ ||

ఔపవాహ్యం రథం యుక్త్వా త్వమాయాహి హయోత్తమైః |
ప్రాపయైనం మహాభాగమితో జనపదాత్పరమ్ || ౧౦ ||

ఏవం మన్యే గుణవతాం గుణానాం ఫలముచ్యతే |
పిత్రా మాత్రా చ యత్సాధుర్వీరో నిర్వాస్యతే వనమ్ || ౧౧ ||

రాజ్ఞో వచనమాజ్ఞాయ సుమంత్రః శీఘ్రవిక్రమః |
యోజయిత్వాఽఽయయౌ తత్ర రథమశ్వైరలంకృతమ్ || ౧౨ ||

తం రథం రాజపుత్రాయ సూతః కనకభూషితమ్ |
ఆచచక్షేఽంజలిం కృత్వా యుక్తం పరమవాజిభిః || ౧౩ ||

రాజా సత్వరమాహూయ వ్యాపృతం విత్తసంచయే |
ఉవాచ దేశకాలజ్ఞం నిశ్చితం సర్వతః శుచిమ్ || ౧౪ ||

వాసాంసి చ మహార్హాణి భూషణాని వరాణి చ |
వర్షాణ్యేతాని సంఖ్యాయ వైదేహ్యాః క్షిప్రమానయ || ౧౫ ||

నరేంద్రేణైవముక్తస్తు గత్వా కోశగృహం తతః |
ప్రాయచ్ఛత్సర్వమాహృత్య సీతాయై సమమేవ తత్ || ౧౬ ||

సా సుజాతా సుజాతాని వైదేహీ ప్రస్థితా వనమ్ |
భూషయామాస గాత్రాణి తైర్విచిత్రైర్విభూషణైః || ౧౭ ||

వ్యరాజయత వైదేహీ వేశ్మ తత్సువిభూషితా |
ఉద్యతోంశుమతః కాలే ఖం ప్రభేవ వివస్వతః || ౧౮ ||

తాం భుజాభ్యాం పరిష్వజ్య శ్వశ్రూర్వచనమబ్రవీత్ |
అనాచరంతీం కృపణం మూర్ధ్న్యుపాఘ్రాయ మైథిలీమ్ || ౧౯ ||

అసత్యః సర్వలోకేఽస్మిన్సతతం సత్కృతాః ప్రియైః |
భర్తారం నానుమన్యంతే వినిపాతగతం స్త్రియః || ౨౦ ||

ఏష స్వభావో నారీణామనుభూయ పురా సుఖమ్ |
అల్పామప్యాపదం ప్రాప్య దుష్యంతి ప్రజహత్యపి || ౨౧ ||

అసత్యశీలా వికృతా దుర్గ్రాహ్యహృదయాః సదా |
యువత్యః పాపసంకల్పాః క్షణమాత్రాద్విరాగిణః || ౨౨ ||

న కులం న కృతం విద్యాం న దత్తం నాపి సంగ్రహమ్ |
స్త్రీణాం గృహ్ణాతి హృదయమనిత్యహృదయా హి తాః || ౨౩ ||

సాధ్వీనాం హి స్థితానాం తు శీలే సత్యే శ్రుతే శమే |
స్త్రీణాం పవిత్రం పరమం పతిరేకో విశిష్యతే || ౨౪ ||

స త్వయా నావమంతవ్యః పుత్రః ప్రవ్రాజితో మమ |
తవ దైవతమస్త్వేషః నిర్ధనః సధనోఽపి వా || ౨౫ ||

విజ్ఞాయ వచనం సీతా తస్యా ధర్మార్థసంహితమ్ |
కృతాంజలిరువాచేదం శ్వశ్రూమభిముఖే స్థితామ్ || ౨౬ ||

కరిష్యే సర్వమేవాహమార్యా యదనుశాస్తి మామ్ |
అభిజ్ఞాఽస్మి యథా భర్తుః త్వర్తితవ్యం శ్రుతం చ మే || ౨౭ ||

న మామసజ్జనేనార్యా సమానయితుమర్హతి |
ధర్మాద్విచలితుం నాహమలం చంద్రాదివ ప్రభా || ౨౮ ||

నాతంత్రీ వాద్యతే వీణా నాచక్రో వర్తతే రథః |
నాపతిః సుఖమేధేత యా స్యాదపి శతాత్మజా || ౨౯ ||

మితం దదాతి హి పితా మితం మాతా మితం సుతః |
అమితస్య హి దాతారం భర్తారం కా న పూజయేత్ || ౩౦ ||

సాఽహమేవంగతా శ్రేష్ఠా శ్రుతర్ధర్మపరావరా |
ఆర్యే కిమవమన్యేఽహం స్త్రీణాం భర్తా హి దైవతమ్ || ౩౧ ||

సీతాయా వచనం శ్రుత్వా కౌసల్యా హృదయంగమమ్ |
శుద్ధసత్త్వా ముమోచాశ్రు సహసా దుఃఖహర్షజమ్ || ౩౨ ||

తాం ప్రాంజలిరభిక్రమ్య మాతృమధ్యేఽతిసత్కృతామ్ |
రామః పరమధర్మాత్మా మాతరం వాక్యమబ్రవీత్ || ౩౩ ||

అంబ మా దుఃఖితా భూస్త్వం పశ్య త్వం పితరం మమ |
క్షయో హి వనవాసస్య క్షిప్రమేవ భవిష్యతి || ౩౪ ||

సుప్తాయాస్తే గమిష్యంతి నవ వర్షాణి పంచ చ |
సా సమగ్రమిహ ప్రాప్తం మాం ద్రక్ష్యసి సుహృద్వృతమ్ || ౩౫ ||

ఏతావదభినీతార్థముక్త్వా స జననీం వచః |
త్రయః శతశతార్ధాశ్చ దదర్శావేక్ష్య మాతరః || ౩౬ ||

తాశ్చాపి స తథైవార్తా మాతౄర్దశరథాత్మజః |
ధర్మయుక్తమిదం వాక్యం నిజగాద కృతాంజలిః || ౩౭ ||

సంవాసాత్పరుషం కించిదజ్ఞానాద్వాఽపి యత్కృతమ్ |
తన్మే సమనుజానీత సర్వాశ్చామంత్రయామి వః || ౩౮ ||

వచనం రాఘవస్యైతద్ధర్మయుక్తం సమాహితమ్ |
శుశ్రువుస్తాః స్త్రియః సర్వాః శోకోపహతచేతసః || ౩౯ ||

జజ్ఞేఽథ తాసాం సన్నాదః క్రౌంచీనామివ నిస్వనః |
మానవేంద్రస్య భార్యాణామేవం వదతి రాఘవే || ౪౦ ||

మురజపణవమేఘఘోషవ-
-ద్దశరథవేశ్మ బభూవ యత్పురా |
విలపితపరిదేవనాకులం
వ్యసనగతం తదభూత్సుదుఃఖితమ్ || ౪౧ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకోనచత్వారింశః సర్గః || ౩౯ ||

Ayodhya Kanda Sarga 39 Meaning In Telugu

దశరథుడు రాముని వంక చూచాడు. అప్పటికే రాముడు నారచీరలు ధరించాడు. ముని కుమారుని వేషంలో ఉన్నాడు. పట్టాభిషేకము చేసుకుంటూ పట్టు పీతాంబరములు ధరించి సింహాసనము మీద కూర్చుండగా చూడవలసిన రాముని నార చీరలలో మునివేషధారణలో చూడగానే దశరథునికి దుఃఖం ముంచుకొచ్చింది. రామునికి బదులు చెప్పలేకపోయాడు. శరీరం వశం తప్పుతూ ఉంది. నిలదొక్కుకున్నాడు. దుఃఖంతో తలవంచుకొని కూర్చున్నాడు.

“పూర్వము నేను ఎందరినో పిల్లలను తమ తల్లి తండ్రుల వద్దనుండి విడదీసిఉంటాను. అందుకే నాకు ఈనాడు ఈ దుర్గతి దాపురించింది. లేకపోతే నా రాముడు నన్ను విడిచి అడవులకు పోవడం ఏమిటి. రాముని మునివేషధారణలో చూచి కూడా నా ప్రాణములు పోలేదంటే నాకు ఇంకా కాలం ఆసన్నం కాలేదన్నమాట. ఈ నాడు ఒక్క కైక స్వార్థము కొరకు అయోధ్యా ప్రజలందరూ బాధపడు తున్నారు. ఒక్కరి లాభం కోసం ఇంతమంది బాధపడవలెనా!” అని తనలో తనే కుమిలిపోతున్నాడు.

ఇంకతప్పదని సుమంత్రుని చూచి “సుమంత్రా! రాముని ప్రయాణమునకు రథము సిద్ధం చెయ్యి. రాముని అందులో ఎక్కించుకొని ఈ దేశపు సరిహద్దులు దాటించి అవతల ఉన్న అరణ్యములో విడిచిపెట్టు. సుమంత్రా! మనిషి మంచివాడుగా ఉండవచ్చు కానీ అతి మంచి వాడు కాకూడదు. రాముని అతి మంచితనమే అతనికి చేటు తెచ్చింది. ఏమి చేస్తాం. నేను నా భార్య మాట విన్నాను. రాముడు నా మాట విన్నాడు. అయోధ్య కష్టాల పాలయింది” అన్నాడు దశరథుడు.

రాజు ఆజ్ఞమేరకు సుమంత్రుడు ఉత్తమ జాతి అశ్వములను కట్టిన రథమును తీసుకొని వచ్చి రాజమందిర ద్వారము దగ్గర నిలిపాడు. “రామా! రథము సిద్ధము ఉంది” అని చెప్పి ఊరుకున్నాడు సుమంత్రుడు. దశరథుడు తన కోశాధికారిని పిలిపించి అతనితో ఇలా అన్నాడు.
“సీత అరణ్యములో ఎన్ని సంవత్సరములు ఉండవలెనో, అన్ని సంవత్సరములకూ సరిపడా అమూల్యమైన దుస్తులు, అలంకారములు, ఆభరణములు తీసుకొనిరా. ” అని ఆదేశించాడు. కోశాధికారి అదే ప్రకారము దుస్తులు ఆభరణములు తెచ్చి సీతకు ఇచ్చాడు. సీత మారు మాటాడకుంటా పూర్వము మాదిరి విలువైన దుస్తులు, ఆభరణములు అలంకరించుకొంది. సాక్షాత్తు లక్ష్మీదేవి లాగా ప్రకాశిస్తూ ఉంది. లక్ష్మీకళ ఉట్టిపడుతున్న కోడలిని చూచి కౌసల్య ఆమెను గట్టిగా కౌగలించు కొంది.

“అమ్మా! సీతా! సాధారణంగా శీలవంతులు కాని స్త్రీలు తమ భర్తలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఆదరిస్తారు. నీచ స్థితిలో ఉన్నప్పుడు అవమానిస్తారు. . భర్తపట్ల ఏ మాత్రం గౌరవము చూపరు. అవకాశం వస్తే మొగుడిని వదిలేస్తారు. అది ఆడువారి స్వభావము. ఎప్పుడూ చెడ్డ ఆలోచనలు కలవారికి శీలము ఉండదు. అటువంటివారు ఈ క్షణంలో భర్త మీద అనురాగం చూపినా మరుక్షణంలో వారిని ద్వేషిస్తారు. వారు చాలా చంచలంగా ఉంటారు. స్థిరమైన బుద్ధి ఉండదు.

కాని శీలవంతులూ, సత్యవ్రతులూ, స్థిరమైన బుద్ధి కలవారు మాత్రము తమ భర్త ఏ పరిస్థితిలో ఉన్నా వారిని ఆదరిస్తారు. గౌరవిస్తారు. నా కుమారుడు రాముడు ఈ అయోధ్యకు రాజు. ప్రస్తుతము అడవులలో ఉన్నాడని రాముని అగౌరవంగా చూడకు. ధనము లేదని రాముని నిందించకు. భర్తయే పతికి దైవము. నీవు రాముని దైవసమానుడిగా భావించాలి.” అని పలికింది కౌసల్య.

అత్తగారి మాటలలో ఆంతర్యం గ్రహించింది సీత. అత్తగారితో ఇలా అంది. “అత్తగారూ! నన్ను సాధారణ స్త్రీ అనీ, దుష్టస్వభావము కల స్త్రీ అనీ ఎందుకు అనుకుంటున్నారు. నేను అలాంటి దానిని కాను. కష్టసుఖములలో భర్తతో ఎలా ప్రవర్తించాలో నాకు బాగా తెలుసు. దీని గురించి నేను ఇదివరకే చాలా చదివాను, విన్నాను. భర్త లేనిదే స్త్రీకి సుఖము లేదని నాకు బాగా తెలుసు. తల్లిగానీ, తండ్రి గానీ, కుమారుడు కానీ, కుమార్తె గానీ స్త్రీకి పరిమితమైన సుఖము, ఆనందము కలిగించగలరు. కానీ భర్త మాత్రము జీవితాంతము భార్యము సుఖాన్ని ఆనందాన్ని పంచి ఇస్తాడు. అట్టి భర్తను ఏ భార్య ఆదరించదు? గౌరవించదు? స్త్రీలకు భర్తయే దైవము. ఆవిషయం నాకు బాగా తెలుసు. అట్టి దైవాన్ని నేను ఎందుకు అవమానిస్తాను? ఆ విషయంలో మీరు ఎలాంటి చింతాపెట్టుకోవద్దు.” అని వినయంగా పలికింది సీత. సీత మాటలు విన్న కౌసల్యము మనసులో ఉన్న బాధంతా చేత్తో తీసినట్టు మాయం అయింది. సీతను ఆదరంగా దగ్గరకు తీసుకొంది.

రాముడు తల్లి కౌసల్యకు ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరించి ఇలా అన్నాడు. “అమ్మా! నీవు ఎంత మాత్రమూ దు:ఖపడవద్దు. నేను అతి త్వరలో వనవాసము ముగించుకొని నీ ముందు నిలబడతాను. నీవుమాత్రము తండ్రి గారిని జాగ్రత్తగా చూచుకో. అమ్మా! పద్నాలుగు సంవత్సరాలు అంటే ఎంతసేపు. ఇట్టే గడిచిపోతుంది. నువ్వు అలా నిద్రపోయి ఇలా లేచేసరికి నేను అరణ్యవాసము ముగించుకొని నీ కళ్లముందు ఉంటాను.” అని తల్లి కన్నీరు తుడిచాడు రాముడు.

తరువాత అక్కడే ఉన్న తన 350 మంది తల్లుల వంకా చూచాడు. వారందరికీ భక్తి నమస్కరించాడు. “తల్లులారా! నాకు మీతో ఉన్న పరిచయం చేత గానీ, లేక నా అవివేకము వలన గానీ తెలిసో తెలియకో ఏమైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించండి. నేను మీ అందరి దగ్గరా సెలవు తీసుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించడి.” అని అందరికీ నమస్కరించాడు. రాముని మాటలు విని దశరథుని భార్యలందరూ గట్టిగా రోదించారు. అలాగే రాముని ఆశీర్వదించారు. ఎల్లప్పుడూ మంగళవాద్యములతోనూ వేద మంత్రములతోనూ మార్మోగే దశరథుని గృహము ఇప్పుడు రోదనలతో నిండిపోయింది.

శ్రీమద్రామాయణము అయోధ్యాకాండము
ముప్పది తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ చత్వారింశః సర్గః (40) >>

Leave a Comment