మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని త్రిచత్వారింశః సర్గలో భగీరథుని అసాధారణ ప్రయత్నంతో గంగ భూమికి దిగుతుంది. శివుడు తన తలపై గంగను దిగడానికి అంగీకరించాడు మరియు ఆమె అక్కడ నుండి బిందుసరోవర్ అనే సరస్సులోకి విడుదల చేయబడుతుంది మరియు అక్కడ నుండి ఆమె ఏడు ప్రవాహాలలో ప్రవహిస్తుంది. భూమిపై భగీరథుడు తన పూర్వీకులు తవ్విన పాతాళంలోకి ఆమెను తీసుకువెళతాడు, అక్కడ అతని తాతముత్తాతల బూడిద కుప్పలు ఉన్నాయి మరియు ఆత్మలకు మోక్షం ప్రకారం ఆ బూడిద గుట్టలను ముంచెత్తడానికి ఆమె ప్రవేశిస్తుంది.
గంగావతరణమ్
దేవదేవే గతే తస్మిన్సోంగుష్ఠాగ్రనిపీడితామ్ |
కృత్వా వసుమతీం రామ సంవత్సరముపాసత ||
1
ఊర్ధ్వబాహుర్నిరాలంబో వాయుభక్షో నిరాశ్రయః |
అచలః స్థాణువత్స్థిత్వా రాత్రిందివమరిందమ ||
2
అథ సంవత్సరే పూర్ణే సర్వలోకనమస్కృతః |
ఉమాపతిః పశుపతీ రాజానమిదమబ్రవీత్ ||
3
ప్రీతస్తేఽహం నరశ్రేష్ఠ కరిష్యామి తవ ప్రియమ్ |
శిరసా ధారయిష్యామి శైలరాజసుతామహమ్ ||
4
తతో హైమవతీ జ్యేష్ఠా సర్వలోకనమస్కృతా |
తదా సా సుమహద్రూపం కృత్వా వేగం చ దుఃసహమ్ ||
5
ఆకాశాదపతద్రామ శివే శివశిరస్యుత |
అచింతయచ్చ సా దేవీ గంగాం పరమదుర్ధరా ||
6
విశామ్యహం హి పాతాలం స్రోతసా గృహ్య శంకరమ్ |
తస్యావలేపనం జ్ఞాత్వా క్రుద్ధస్తు భగవాన్హరః ||
7
తిరోభావయితుం బుద్ధిం చక్రే త్రిణయనస్తదా |
సా తస్మిన్పతితా పుణ్యా పుణ్యే రుద్రస్య మూర్ధని ||
8
హిమవత్ప్రతిమే రామ జటామండలగహ్వరే |
సా కథంచిన్మహీం గంతుం నాశక్నోద్యత్నమాస్థితా ||
9
నైవ నిర్గమనం లేభే జటామండలమోహితా |
తత్రైవాబంభ్రమద్దేవీ సంవత్సరగణాన్బహూన్ ||
10
తామపశ్యన్పునస్తత్ర తపః పరమమాస్థితః |
అనేన తోషితశ్చాభూదత్యర్థం రఘునందన ||
11
విససర్జ తతో గంగాం హరో బిందుసరః ప్రతి |
తస్యాం విసృజ్యమానాయాం సప్త స్రోతాంసి జజ్ఞిరే ||
12
హ్లాదినీ పావనీ చైవ నలినీ చ తథాఽపరా |
తిస్రః ప్రాచీం దిశం జగ్ముర్గంగాః శివజలాః శుభాః ||
13
సుచక్షుశ్చైవ సీతా చ సింధుశ్చైవ మహానదీ |
తిస్రస్త్వేతా దిశం జగ్ముః ప్రతీచీం తు శుభోదకాః ||
14
సప్తమీ చాన్వగాత్తాసాం భగీరథమథో నృపమ్ |
భగీరథోఽపి రజర్షిర్దివ్యం స్యందనమాస్థితః ||
15
ప్రాయాదగ్రే మహాతేజా గంగా తం చాప్యనువ్రజత్ |
గగనాచ్ఛంకరశిరస్తతో ధరణిమాగతా ||
16
వ్యసర్పత జలం తత్ర తీవ్రశబ్దపురస్కృతమ్ |
మత్స్యకచ్ఛపసంఘైశ్చ శింశుమారగణైస్తథా ||
17
పతద్భిః పతితైశ్చాన్యైర్వ్యరోచత వసుంధరా |
తతో దేవర్షిగంధర్వా యక్షాః సిద్ధగణాస్తథా ||
18
వ్యలోకయంత తే తత్ర గగనాద్గాం గతాం తదా |
విమానైర్నగరాకారైర్హయైర్గజవరైస్తదా ||
19
పారిప్లవగతైశ్చాపి దేవతాస్తత్ర విష్ఠితాః |
తదద్భుతతమం లోకే గంగాపతనముత్తమమ్ ||
20
దిదృక్షవో దేవగణాః సమీయురమితౌజసః |
సంపతద్భిః సురగణైస్తేషాం చాభరణౌజసా ||
21
శతాదిత్యమివాభాతి గగనం గతతోయదమ్ |
శింశుమారోరగగణైర్మీనైరపి చ చంచలైః ||
22
విద్యుద్భిరివ విక్షిప్తమాకాశమభవత్తదా |
పాండురైః సలిలోత్పీడైః కీర్యమాణైః సహస్రధా ||
23
శారదాభ్రైరివాకీర్ణం గగనం హంససంప్లవైః |
క్వచిద్ద్రుతతరం యాతి కుటిలం క్వచిదాయతమ్ ||
24
వినతం క్వచిదుద్భూతం క్వచిద్యాతి శనైః శనైః |
సలిలేనైవ సలిలం క్వచిదభ్యాహతం పునః ||
25
ముహురూర్ధ్వపథం గత్వా పపాత వసుధాతలమ్ |
[* తచ్ఛంకరశిరోభ్రష్టం భ్రష్టం భూమితలే పునః | *]
వ్యరోచత తదా తోయం నిర్మలం గతకల్మషమ్ ||
26
తత్ర దేవర్షిగంధర్వా వసుధాతలవాసినః |
భవాంగపతితం తోయం పవిత్రమితి పస్పృశుః ||
27
శాపాత్ప్రపతితా యే చ గగనాద్వసుధాతలమ్ |
కృత్వా తత్రాభిషేకం తే బభూవుర్గతకల్మషాః ||
28
ధూతపాపాః పునస్తేన తోయేనాథ సుభాస్వతా |
పునరాకాశమావిశ్య స్వాఁల్లోకాన్ప్రతిపేదిరే ||
29
ముముదే ముదితో లోకస్తేన తోయేన భాస్వతా |
కృతాభిషేకో గంగాయాం బభూవ విగతక్లమః ||
30
భగీరథోఽపి రాజర్షిర్దివ్యం స్యందనమాస్థితః |
ప్రాయాదగ్రే మహాతేజాస్తం గంగా పృష్ఠతోఽన్వగాత్ ||
31
దేవాః సర్షిగణాః సర్వే దైత్యదానవరాక్షసాః |
గంధర్వయక్షప్రవరాః సకిన్నరమహోరగాః ||
32
సర్వాశ్చాప్సరసో రామ భగీరథరథానుగామ్ |
గంగామన్వగమన్ప్రీతాః సర్వే జలచరాశ్చ యే ||
33
యతో భగీరథో రాజా తతో గంగా యశస్వినీ |
జగామ సరితాం శ్రేష్ఠా సర్వపాపవినాశినీ ||
34
తతో హి యజమానస్య జహ్నోరద్భుతకర్మణః |
గంగా సంప్లావయామాస యజ్ఞవాటం మహత్మనః ||
35
తస్యావలేపనం జ్ఞాత్వా క్రుద్ధో జహ్నుశ్చ రాఘవ |
అపిబచ్చ జలం సర్వం గంగాయాః పరమాద్భుతమ్ ||
36
తతో దేవాః సగంధర్వా ఋషయశ్చ సువిస్మితాః |
పూజయంతి మహాత్మానం జహ్నుం పురుషసత్తమమ్ ||
37
గంగాం చాపి నయంతి స్మ దుహితృత్వే మహాత్మనః |
తతస్తుష్టో మహాతేజాః శ్రోత్రాభ్యామసృజత్పునః ||
38
తస్మాజ్జహ్నుసుతా గంగా ప్రోచ్యతే జాహ్నవీతి చ |
జగామ చ పునర్గంగా భగీరథరథానుగా ||
39
సాగరం చాపి సంప్రాప్తా సా సరిత్ప్రవరా తదా |
రసాతలముపాగచ్ఛత్ సిద్ధ్యర్థం తస్య కర్మణః ||
40
భగీరథోఽపి రాజార్షిర్గంగామాదాయ యత్నతః |
పితామహాన్భస్మకృతానపశ్యద్దీనచేతనః ||
41
అథ తద్భస్మనాం రాశిం గంగాసలిలముత్తమమ్ |
ప్లావయద్ధూతపాప్మానః స్వర్గం ప్రాప్తా రఘూత్తమ ||
42
Balakanda Sarga 43 In Telugu Pdf With Meaning
బ్రహ్మదేవుడు వెళ్లిపోయిన తరువాత భగీరథుడు ఒంటికాలి మీద నిలబడి ఒక సంవత్సరము పాటు మహాశివుని గూర్చి తపస్సు చేసాడు. భగీరథుని తపస్సుకు మెచ్చి మహాశివుడు ప్రత్యక్షం అయ్యాడు.
“ఓ భగీరథా! నీ తపస్సుకు మెచ్చాను. నీవు కోరినట్టు హిమవంతుని కుమార్తె అయిన గంగను నా శిరస్సున ధరిస్తాను.” అని అన్నాడు.
అప్పుడు దేవలోకములో ప్రవహించు గంగానది మహా వేగంతో భూమి మీదికి దూకింది. ఆ ప్రవాహాన్ని శివుడు తన శిరస్సును అడ్డుపెట్టి ఆపాడు. గంగకు కోపం వచ్చింది.
‘ఏమీ! నా ప్రవాహ వేగాన్ని శివుడు ఆపగలడా! నేను ఆ మహాశివునితో సహా పాతాళము ప్రవేశిస్తాను.” అని మనసులో అనుకొంది గంగ.
గంగ ఆలోచనను గ్రహించాడు శివుడు. మహాశివుడు తన శిరస్సుమీద పడ్డ గంగను తన శిరస్సుమీద ఉన్న జటాజూటములలో బంధించాడు. గంగా దేవి ఎంత ప్రయత్నించిననూ ఆ జటాజూటములలో నుండి బయటకు రాలేకపోయింది.
ఆకాశము నుండి బయలు దేరిన గంగ భూమి మీదికి దిగి రాలేదు. కారణం తెలియక భగీరథుడు వ్యాకుల పడ్డాడు. మరలా ఈశ్వరుని గూర్చి తపస్సు చేసాడు. భగీరథుని తపస్సుకు సంతోషించిన మహాశివుడు గంగను బిందు సరోవర ప్రాంతంలో భూమి మీదికి విడిచి పెట్టాడు.
శివుని జటాజూటములలో నుండి విడివడిన గంగ తీవ్రమైన వేగంతో భూమి మీదికి ఏడు ప్రవాహములుగా ప్రవహించింది. ఆ ఏడు ప్రవాహములలో హ్లాదినీ, పావనీ, నళినీ అనే మూడు నదులు తూర్పుదిక్కుగా ప్రవహించాయి. సుచక్షువు, సీత, సింధు అనే మూడు నదులు పడమర దిక్కుగా ప్రవహించాయి. ఏడవది ఆఖరుది అయిన ప్రవాహము భగీరథుని అనుసరించింది.
భగీరథుడు తన రథము మీద ముందు వెళుతుంటే ఆ రథము వెంట గంగ ప్రవహించింది. గంగానది ఆకాశము నుండి భూమి మీదక ప్రవహిస్తుంటే దేవతలు, గంధర్వులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. గంగావతరణమును కనులారా చూచుటకు దేవలోకములోని వారందరూ తమ తమ వాహనముల మీద ఆకాశములో నిలబడ్డారు.
ఆ గంగానది నురగలు కక్కుకుంటూ భూమి మీదికి దూకుతూ ఉంది. భూమి మీదికి దిగిన గంగ కొన్ని చోట్ల మెల్లగానూ, మరి కొన్ని చోట్ల దూకుడుగాను, కొన్ని చోట్ల వంకర టింకర గానూ, కొండలను కోనలను దాటుకుంటూ ప్రవహిస్తూ ఉంది.
ఆగంగానది మొదట ఆకాశమునుండి మహాశివుని శిరస్సు మీద పడి అక్కడి నుండి భూమి మీదికి తన నిర్మల జలాలను ప్రవహించింది. ఆ గంగలో స్నానము చేసిన వారి సమస్త పాపములు నశించి పోయాయి. గంగా స్నానము ఆచరించిన వారు స్వర్గలోక ప్రాప్తి పొందారు. గంగలో మునిగిన వారి శారీరక బాధలు అన్నీ మటుమాయం అయ్యాయి.
మార్గ మధ్యంలో జహ్ను మహాముని ఆశ్రమం వచ్చిది. తన ఆశ్రమం వద్ద జహ్నుమహాఋషి యాగము చేస్తున్నాడు. గంగానది ఆ ఆశ్రమమును ముంచి వేసింది. అది చూచిన జహ్ను మహాఋషికి కోపం వచ్చింది. గంగానది గర్వము అణచుటకు ఉధృతంగా ప్రవహిస్తున్న గంగా జలమును అంతా త్రాగివేసాడు.
ఇది చూచి దేవతలు అందరూ ఆశ్చర్యపోయారు. భగీరథుడు, దేవతా గణములు అందరూ జహ్ను మహాఋషిని పూజించి గంగను విడువమని వేడుకున్నారు. వారి పూజలకు సంతసించిన జహ్నువు తన చెవులనుండి గంగా ప్రవాహమును విడిచిపెట్టాడు. అప్పటి నుండి గంగానదికీ జాహ్నవి, జహ్నుసుత అనే పేర్లు వచ్చాయి.
గంగానది మరలా భగీరథుని అనుసరించి ప్రవహించసాగింది. సగర పుత్రులకు మోక్షము కల్గించాడినికి భగీరథుడు గంగను పాతాళమునకు తీసుకొని వెళ్లాడు. గంగ సగరపుత్రుల భస్మరాసుల మీదుగా ప్రవహించింది. పవిత్రమైన గంగాజలములలో మునిగి సగర పుత్రులు అందరూ వారి వారి పాపములు నశించి, స్వర్గలోకము చేరుకున్నారు.
శ్రీమద్రామాయణము,
బాలకాండ, నలుబది మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
బాలకాండ చతుశ్చత్వారింశః సర్గః (44) >>