అయోధ్యా కాండ సర్గ 51 రామాయణంలో ముఖ్యమైన అధ్యాయం. గుహుడు లక్ష్మణునితో ఇలాఅన్నాడు. “లక్ష్మణకుమారా! వనవాస వ్రతము రామునికి కానీ నీకు కాదు కదా! నీకోసరము మెత్తని శయ్య సిద్ధమే చేసాము. నీవు దీని మీద పడుకో. మాకు ఈ కటికరాళ్ల మీద పడుకోవడం అలవాటే. నీవు రాచబిడ్డవు. నీవు పడుకోలేవు. మేము రాత్రి అంతా మేలుకొని రామునికి, నీకు కాపలా లక్ష్మణా! అంటూ పలికిన సందర్భం లోనిది…
గుహలక్ష్మణజాగరణమ్
తం జాగ్రతమదంభేన భ్రాతురర్థాయ లక్ష్మణమ్ |
గుహః సంతాపసంతప్తో రాఘవం వాక్యమబ్రవీత్ ||
1
ఇయం తాత సుఖా శయ్యా త్వదర్థముపకల్పితా |
ప్రత్యాశ్వసిహి సాధ్వస్యాం రాజపుత్ర యథాసుఖమ్ ||
2
ఉచితోఽయం జనః సర్వః క్లేశానాం త్వం సుఖోచితః |
గుప్త్యర్థం జాగరిష్యామః కాకుత్స్థస్య వయం నిశామ్ ||
3
న హి రామాత్ప్రియతరో మమాస్తి భువి కశ్చన |
బ్రవీమ్యేతదహం సత్యం సత్యేనైవ చ తే శపే ||
4
అస్య ప్రసాదాదాశంసే లోకేఽస్మిన్సుమహద్యశః |
ధర్మావాప్తిం చ విపులామర్థావాప్తిం చ కేవలామ్ ||
5
సోఽహం ప్రియతమం రామం శయానం సహ సీతయా |
రక్షిష్యామి ధనుష్పాణిః సర్వతః జ్ఞాతిభిః సహ ||
6
న హి మేఽవిదితం కించిద్వనేఽస్మింశ్చరతః సదా |
చతురంగం హ్యపి బలం సుమహత్ప్రసహేమహి ||
7
లక్ష్మణస్తం తదోవాచ రక్ష్యమాణాస్త్వయాఽనఘ |
నాత్ర భీతా వయం సర్వే ధర్మమేవానుపశ్యతా ||
8
కథం దాశరథౌ భూమౌ శయానే సహ సీతయా |
శక్యా నిద్రా మయా లబ్ధుం జీవితం వా సుఖాని వా ||
9
యో న దేవాసురైః సర్వైః శక్యః ప్రసహితుం యుధి |
తం పశ్య సుఖసంవిష్టం తృణేషు సహ సీతయా ||
10
యో మంత్రతపసా లబ్ధో వివిధైశ్చ పరిశ్రమైః |
ఏకో దశరథస్యేష్టః పుత్రః సదృశలక్షణః ||
11
అస్మిన్ప్రవ్రాజితే రాజా న చిరం వర్తయిష్యతి |
విధవా మేదినీ నూనం క్షిప్రమేవ భవిష్యతి ||
11
వినద్య సుమహానాదం శ్రమేణోపరతాః స్త్రియః |
నిర్ఘోషోపరతం చాతః మన్యే రాజనివేశనమ్ ||
12
కౌసల్యా చైవ రాజా చ తథైవ జననీ మమ |
నాశంసే యది జీవంతి సర్వే తే శర్వరీమిమామ్ ||
13
జీవేదపి హి మే మాతా శత్రుఘ్నస్యాన్వవేక్షయా |
తద్దుఃఖం యత్తు కౌసల్యా వీరసూర్వినశిష్యతి ||
14
అనురక్తజనాకీర్ణా సుఖాలోకప్రియావహా |
రాజవ్యసనసంసృష్టా సా పురీ వినశిష్యతి ||
15
కథం పుత్రం మహాత్మానం జ్యేష్ఠం ప్రియమపస్యతః |
శరీరం ధారయిష్యంతి ప్రాణా రాజ్ఞో మహాత్మనః ||
16
వినష్టే నృపతౌ పశ్చాత్కౌసల్యా వినశిష్యతి |
అనంతరం చ మాతాఽపి మమ నాశముపైష్యతి ||
17
అతిక్రాంతమతిక్రాంతమనవాప్య మనోరథమ్ |
రాజ్యే రామమనిక్షిప్య పితా మే వినశిష్యతి ||
18
సిద్ధార్థాః పితరం వృత్తం తస్మిన్కాలేఽప్యుపస్థితే |
ప్రేతకార్యేషు సర్వేషు సంస్కరిష్యంతి భూమిపమ్ ||
19
రమ్యచత్వరసంస్థానాం సువిభక్తమహాపథామ్ |
హర్మ్యప్రాసాదసంపన్నాం గణికావరశోభితామ్ ||
20
రథాశ్వగజసంబాధాం తూర్యనాదవినాదితామ్ |
సర్వకళ్యాణసంపూర్ణాం హృష్టపుష్టజనాఽకులామ్ ||
21
ఆరామోద్యానసంపన్నాం సమాజోత్సవశాలినీమ్ |
సుఖితా విచరిష్యంతి రాజధానీం పితుర్మమ ||
22
అపి జీవేద్ధశరథో వనవాసాత్పునర్వయమ్ |
ప్రత్యాగమ్య మహాత్మానమపి పశ్యేమ సువ్రతమ్ ||
23
అపి సత్యప్రతిజ్ఞేన సార్ధంకుశలినా వయమ్ |
నివృత్తవనవాసేఽస్మిన్నయోధ్యాం ప్రవిశేమహి ||
24
పరిదేవయమానస్య దుఃఖార్తస్య మహాత్మనః |
తిష్ఠతః రాజపుత్రస్య శర్వరీ సాఽత్యవర్తత ||
25
తథాహి సత్యం బ్రువతి ప్రజాహితే
నరేంద్రపుత్రే గురుసౌహృదాద్గుహః |
ముమోచ బాష్పం వ్యసనాభిపీడితో
జ్వరాతురో నాగ ఇవ వ్యథాఽఽతురః ||
26
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకపంచాశః సర్గః ||
Ayodhya Kanda Sarga 51 Meaning In Telugu
గుహుడు లక్ష్మణునితో ఇలాఅన్నాడు. “లక్ష్మణకుమారా! వనవాస వ్రతము రామునికి కానీ నీకు కాదు కదా! నీకోసరము మెత్తని శయ్య సిద్ధమే చేసాము. నీవు దీని మీద పడుకో. మాకు ఈ కటికరాళ్ల మీద పడుకోవడం అలవాటే. నీవు రాచబిడ్డవు. నీవు పడుకోలేవు. మేము రాత్రి అంతా మేలుకొని రామునికి, నీకు కాపలా లక్ష్మణా!
నాకు ఈ లోకములో రాముని కంటే ఇష్టమైన వాడు ఎవరూ లేరు. అటువంటి రాముడు ఇలా ఒంటరిగా అడవిలో కటికనేల మీద నిరాహారంగా నిద్రించడం బాధాకరంగా ఉంది. నీకు, రామునికి ఈ అరణ్యములో ఎలాంటి భయమూ లేదు. మాకు ఈ అరణ్యము కొత్త కాదు. నీవు సుఖంగా నిద్రించు.” అని అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు గుహునితో ఇలా అన్నాడు. “మిత్రమా! నీవు మా పక్కన ఉండగా మాకు ఏమి భయము.
అటుచూడు. నా అన్న, నా వదిన అలా కటికనేల మీద పడుకొని ఉండగా నాకు సుఖంగా నిద్ర ఎలా వస్తుంది. అసలు నాకు సుఖాలు పొందాలనే కోరిక ఎలా కలుగుతుంది. రాజాంతఃపురములలో పట్టుపరుపుల మీద పవళించిన సీతారాములు నేడు ఆ గడ్డిపానుపు మీద ఎలా సుఖంగా నిద్రిస్తున్నారోచూడు.
రాముడు దశరథునికి, ఎన్నో పూజలు వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తే పుట్టిన వాడు. అటువంటి రాముడు అడవులకు వెళితో దశరథుడు జీవించగలడా! ఏమో కొద్ది రోజులలో అయోధ్య అనాధ అవుతుందేమో అని భయంగా ఉంది. రాముని కొరకు ఏడ్చి ఏడ్చి అంత:పుర స్త్రీలు అందరూ ఈ పాటికి మౌనం వహించి ఉంటారు. రాముని తల్లి కౌసల్య, దశరథుడు, రాముడు లేడు అనే శోకంతో ఏమయ్యారో అని దిగులుగా ఉంది.
నా తల్లి సుమిత్ర నా తమ్ముడు శత్రుఘ్నుని చూచుకుంటూ జీవించి ఉంటుందేమో కానీ, ఒక్కగా నొక్క కొడుకును దూరం చేసుకున్న కౌసల్య జీవించి ఉండలేదు. అదే నాకు బాధగా ఉంది. రాముడు లేని అయోధ్య కూడా నిర్జీవము అయిపోయింది. చిన్నప్పటినుండి ప్రాణానికి ప్రాణంగా చూసుకొన్న రాముడు దూరం కాగానే దశరథుని ప్రాణాలు అతని దేహంలో ఉండటం కష్టమే. రాజు మరణించగానే, కౌసల్య ప్రాణత్యాగము చేస్తుంది. కౌసల్య చనిపోగానే నా తల్లి కూడా ఆమెనే అనుసరిస్తుంది. వారి కందరికీ భరతుడు ఉత్తర క్రియలు నిర్వర్తించాలేమో!
మిత్రమా! నేను ఏమేమో ఊహించుకొనుచున్నాను. అవన్నీ నిజం కావేమో. మేము అయోధ్యకు తిరిగి వచ్చువరకూ దశరథుడు మా కోసరం అయోధ్యానగర ముఖద్వారము వద్ద వేచి ఉండి, మమ్ములను సాదరంగా ఆహ్వానించి లోపలకు తీసుకుపోతాడేమో! మేమందరమూ మా తల్లులతో ఆనందంగా ఉంటామేమో!
మిత్రమా! ఏదైనా జరగ వచ్చు. దేనినీ మనము కాదనలేము కదా!” అంటూ పరిపరివిధముల మాట్లాడుచున్న లక్ష్మణుని మాటలు వింటూ ఉన్న గుహుని కూడా దు:ఖము ఆగలేదు. రామునికి, అయోధ్యకు పట్టిన దుర్గతి తలుచుకుంటూ బాధపడ్డాడు. వారిరువురి దీనాలాపములతో ఆ రాత్రి గడిచి పోయింది.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఏబదిఒకటవ సర్గసంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్