Ayodhya Kanda Sarga 40 In Telugu – అయోధ్యాకాండ చత్వారింశః సర్గః

అయోధ్యాకాండ చత్వారింశః సర్గలో, భరతుడు కేకయదేశం నుండి తిరిగి వచ్చి తన తల్లి కైకేయితో మాట్లాడతాడు. తండ్రి దశరథుని మరణం, రాముడు, సీత, లక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్లిన విషయాలు తెలిసి, భరతుడు దిగ్భ్రాంతి చెందుతాడు. కైకేయి చేసిన ఈ పాపకార్యాల పట్ల భరతుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. తల్లి చర్యలను తిడతాడు, ఆమెకు దుర్వచనాలు పలుకుతాడు. భరతుడు రాముని రాజ్యం తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. తన తల్లి కైకేయిని క్షమించలేడని, రాముడిని రాజ్యానికి తీసుకురావాలని ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ సర్గ భరతుని ధర్మ నిష్ఠను, సోదర ప్రేమను, తల్లి చర్యల పట్ల అతని ప్రతిస్పందనను చూపిస్తుంది.

పౌరాద్యనువ్రజ్యా

అథ రామశ్చ సీతా చ లక్ష్మణశ్చ కృతాంజలిః |
ఉపసంగృహ్య రాజానం చక్రుర్దీనాః ప్రదక్షిణమ్ || ౧ ||

తం చాపి సమనుజ్ఞాప్య ధర్మజ్ఞః సీతయా సహ |
రాఘవః శోకసమ్మూఢో జననీమభ్యవాదయత్ || ౨ ||

అన్వక్షం లక్ష్మణో భ్రాతుః కౌసల్యామభ్యవాదయత్ |
అథ మాతుః సుమిత్రాయా జగ్రాహ చరణౌ పునః || ౩ ||

తం వందమానం రుదతీ మాతా సౌమిత్రిమబ్రవీత్ |
హితకామా మహాబాహుం మూర్ధ్న్యుపాఘ్రాయ లక్ష్మణమ్ || ౪ ||

సృష్టస్త్వం వనవాసాయ స్వనురక్తః సుహృజ్జనే |
రామే ప్రమాదం మా కార్షీః పుత్ర భ్రాతరి గచ్ఛతి || ౫ ||

వ్యసనీ వా సమృద్ధో వా గతిరేష తవానఘ |
ఏష లోకే సతాం ధర్మో యజ్జ్యేష్ఠవశగో భవేత్ || ౬ ||

ఇదం హి వృత్తముచితం కులస్యాస్య సనాతనమ్ |
దానం దీక్షా చ యజ్ఞేషు తనుత్యాగో మృధేషు చ || ౭ ||

లక్ష్మణం త్వేవముక్త్వా సా సంసిద్ధం ప్రియరాఘవమ్ |
సుమిత్రా గచ్ఛ గచ్ఛేతి పునః పునరువాచ తమ్ || ౮ ||

రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజామ్ |
అయోధ్యామటవీం విద్ధి గచ్ఛ తాత యథాసుఖమ్ || ౯ ||

తతః సుమంత్రః కాకుత్స్థం ప్రాంజలిర్వాక్యమబ్రవీత్ |
వినీతో వినయజ్ఞశ్చ మాతలిర్వాసవం యథా || ౧౦ ||

రథమారోహ భద్రం తే రాజపుత్ర మహాయశః |
క్షిప్రం త్వాం ప్రాపయిష్యామి యత్ర మాం రామ వక్ష్యసి || ౧౧ ||

చతుర్దశ హి వర్షాణి వస్తవ్యాని వనే త్వయా |
తాన్యుపక్రమితవ్యాని యాని దేవ్యాఽసి చోదితః || ౧౨ ||

తం రథం సూర్యసంకాశం సీతా హృష్టేన చేతసా |
ఆరురోహ వరారోహా కృత్వాలంఽకారమాత్మనః || ౧౩ ||

అథో జ్వలనసంకాశం చామీకరవిభూషితమ్ |
తమారురుహతుస్తూర్ణం భ్రాతరౌ రామలక్ష్మణౌ || ౧౪ ||

వనవాసం హి సంఖ్యాయ వాసాంస్యాభరణాని చ |
భర్తారమనుగచ్ఛంత్యై సీతాయై శ్వశురో దదౌ || ౧౫ ||

తథైవాయుధజాలాని భ్రాతృభ్యాం కవచాని చ |
రథోపస్థే ప్రతిన్యస్య సచర్మ కఠినం చ తత్ || ౧౬ ||

సీతాతృతీయానారూఢాన్దృష్ట్వా ధృష్టమచోదయత్ |
సుమంత్రః సమ్మతానశ్వాన్వాయువేగసమాంజవే || ౧౭ ||

ప్రతియాతే మహారణ్యం చిరరాత్రాయ రాఘవే |
బభూవ నగరే మూర్ఛా బలమూర్ఛా జనస్య చ || ౧౮ ||

తత్సమాకులసంభ్రాంతం మత్తసంకుపితద్విపమ్ |
హయశింజితనిర్ఘోషం పురమాసీన్మహాస్వనమ్ || ౧౯ ||

తతః సబాలవృద్ధా సా పురీ పరమపీడితా |
రామమేవాభిదుద్రావ ఘర్మార్తా సలిలం యథా || ౨౦ ||

పార్శ్వతః పృష్ఠతశ్చాపి లంబమానాస్తదున్ముఖాః |
బాష్పపూర్ణముఖాః సర్వే తమూచుర్భృశనిస్వనాః || ౨౧ ||

సంయచ్ఛ వాజినాం రశ్మీన్సూత యాహి శనైః శనైః |
ముఖం ద్రక్ష్యామ రామస్య దుర్దర్శం నో భవిష్యతి || ౨౨ ||

ఆయసం హృదయం నూనం రామమాతురసంశయమ్ |
యద్దేవగర్భప్రతిమే వనం యాతి న భిద్యతే || ౨౩ ||

కృతకృత్యా హి వైదేహీ ఛాయేవానుగతా పతిమ్ |
న జహాతి రతా ధర్మే మేరుమర్కప్రభా యథా || ౨౪ ||

అహో లక్ష్మణ సిద్ధార్థః సతతాం ప్రియవాదినమ్ |
భ్రాతరం దేవసంకాశం యస్త్వం పరిచరిష్యసి || ౨౫ ||

మహత్యేషా హి తే సిద్ధిరేష చాభ్యుదయో మహాన్ |
ఏష స్వర్గస్య మార్గశ్చ యదేనమనుగచ్ఛసి || ౨౬ ||

ఏవం వదంతస్తే సోఢుం న శేకుర్బాష్పమాగతమ్ |
నరాస్తమనుగచ్ఛంతః ప్రియమిక్ష్వాకునందనమ్ || ౨౭ ||

అథ రాజా వృతః స్త్రీభిర్దీనాభిర్దీనచేతనః |
నిర్జగామ ప్రియం పుత్రం ద్రక్ష్యామీతి బ్రువన్గృహాత్ || ౨౮ ||

శుశ్రువే చాగ్రతః స్త్రీణాం రుదంతీనాం మహాస్వనః |
యథా నాదః కరేణూనాం బద్ధే మహతి కుంజరే || ౨౯ ||

పితా హి రాజా కాకుత్స్థః శ్రీమాన్సన్నస్తదాఽభవత్ |
పరిపూర్ణః శశీ కాలే గ్రహేణోపప్లుతో యథా || ౩౦ ||

స చ శ్రీమానచింత్యాత్మా రామో దశరథాత్మజః |
సూతం సంచోదయామాస త్వరితం వాహ్యతామితి || ౩౧ ||

రామో యాహీతి సూతం తం తిష్ఠేతి స జనస్తదా |
ఉభయం నాశకత్సూతః కర్తుమధ్వని చోదితః || ౩౨ ||

నిర్గచ్ఛతి మహాబాహౌ రామే పౌరజనాశ్రుభిః |
పతితైరభ్యవహితం ప్రశశామ మహీరజః || ౩౩ ||

రుదితాశ్రుపరిద్యూనం హాహాకృతమచేతనమ్ |
ప్రయాణే రాఘవస్యాసీత్పురం పరమపీడితమ్ || ౩౪ ||

సుస్రావ నయనైః స్త్రీణామాస్రమాయాససంభవమ్ |
మీనసంక్షోభచలితైః సలిలం పంకజైరివ || ౩౫ ||

దృష్ట్వా తు నృపతిః శ్రీమానేకచిత్తగతం పురమ్ |
నిపపాతైవ దుఃఖేన హతమూల ఇవ ద్రుమః || ౩౬ ||

తతో హలహలాశబ్దో జజ్ఞే రామస్య పృష్ఠతః |
నరాణాం ప్రేక్ష్య రాజానం సీదంతం భృశదుఃఖితమ్ || ౩౭ ||

హా రామేతి జనాః కేచిద్రామమాతేతి చాపరే |
అంతఃపురం సమృద్ధం చ క్రోశంతః పర్యదేవయన్ || ౩౮ ||

అన్వీక్షమాణో రామస్తు విషణ్ణం భ్రాంతచేతసమ్ |
రాజానం మాతరం చైవ దదర్శానుగతౌ పథి || ౩౯ ||

స బద్ధ ఇవ పాశేన కిశోరో మాతరం యథా |
ధర్మపాశేన సంక్షిప్తః ప్రకాశం నాభ్యుదైక్షత || ౪౦ ||

పదాతినౌ చ యానార్హావదుఃఖార్హౌ సుఖోచితౌ |
దృష్ట్వా సంచోదయామాస శీఘ్రం యాహీతి సారథిమ్ || ౪౧ ||

న హి తత్పురుషవ్యాఘ్రో దుఃఖదం దర్శనం పితుః |
మాతుశ్చ సహితుం శక్తస్తోత్రార్దిత ఇవ ద్విపః || ౪౨ ||

ప్రత్యగారమివాయాంతీ వత్సలా వత్సకారణాత్ |
బద్ధవత్సా యథా ధేనుః రామమాతాఽభ్యాధావత || ౪౩ ||

తథా రుదంతీం కౌసల్యాం రథం తమనుధావతీమ్ |
క్రోశంతీం రామ రామేతి హా సీతే లక్ష్మణేతి చ || ౪౪ ||

రామలక్ష్మణసీతార్థం స్రవంతీం వారి నేత్రజమ్ |
అసకృత్ప్రైక్షత స తాం నృత్యంతీమివ మాతరమ్ || ౪౫ ||

తిష్ఠేతి రాజా చుక్రోశ యాహి యాహీతి రాఘవః |
సుమంత్రస్య బభూవాత్మా చక్రయోరివ చాంతరా || ౪౬ ||

నాశ్రౌషమితి రాజానముపాలబ్ధోఽపి వక్ష్యసి |
చిరం దుఃఖస్య పాపిష్ఠమితి రామస్తమబ్రవీత్ || ౪౭ ||

రామస్య స వచః కుర్వన్ననుజ్ఞాప్య చ తం జనమ్ |
వ్రజతోఽపి హయాన్ శీఘ్రం చోదయామాస సారథిః || ౪౮ ||

న్యవర్తత జనో రాజ్ఞో రామం కృత్వా ప్రదక్షిణమ్ |
మనసాప్యశ్రువేగైశ్చ న న్యవర్తత మానుషమ్ || ౪౯ ||

యమిచ్ఛేత్పునరాయాంతం నైనం దూరమనువ్రజేత్ |
ఇత్యమాత్యా మహారాజమూచుర్దశరథం వచః || ౫౦ ||

తేషాం వచః సర్వగుణోపపన్నం
ప్రస్విన్నగాత్రః ప్రవిషణ్ణరూపః |
నిశమ్య రాజా కృపణః సభార్యో
వ్యవస్థితస్తం సుతమీక్షమాణః || ౫౧ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే చత్వారింశః సర్గః || ౪౦ ||

Ayodhya Kanda Sarga 40 Meaning In Telugu

సీతారామలక్ష్మణులు వనవాసమునకు పోవడానికి సర్వం సిద్ధం అయింది. వారు దశరథునికి నమస్కరించి ఆయనకు ప్రదక్షిణం చేసారు. సాష్టాంగ పడ్డారు. ఆయన పాదములు తాకారు. దశరథుడు మౌనంగా వారిని ఆశీర్వదించాడు. వనవాసానికి అనుమతి ఇచ్చాడు. తరువాత వారు కౌసల్యకు నమస్కరించారు. ఆమె ఆశీర్వాదము తీసుకున్నారు. లక్ష్మణుడు తన తల్లి సుమిత్రకు నమస్కరించి ఆమె ఆశీర్వాదముతీసుకున్నాడు. సుమిత్ర లక్ష్మణుని తలను నిమిరి ఇలా అంది.

“నాయనా లక్ష్మణా! రాముడు నీ అన్న వనవాస సమయము లో రాముని జాగ్రత్తగా కాపాడుతూ ఉండు. ఎందుకంటే సుఖదు:ఖము లలో రాముడే నీకు దిక్కు. రాముని నీ తండ్రి దశరథుని గా భావించు. ఇంక నీ వదిన సీతను నీ తల్లి అంటే నేనుగా భావించు. నీ తల్లి తండ్రులకు సేవ చేసినట్టు వారికి కూడా సేవలు చెయ్యి. జాగ్రత్తగా వెళ్లిరా!” అనిపలికింది సుమిత్ర.

అందరూ రథము దగ్గరకు వచ్చారు. సుమంత్రుడు రథమువద్ద నిలబడి ఉన్నాడు. రాముని చూచి “రామా! రథము సిద్ధముగా ఉన్నది.
మీరు రథము ఎక్కండి. మనము ఎక్కడికి వెళ్లాలో చెబితే అక్కడకు తీసుకొని వెళుతాను.” అని అన్నాడు సుమంత్రుడు. రాముడు, లక్ష్మణుడు, సీత రథం ఎక్కారు. రథములో దశరథుని ఆదేశము మేరకు సీత కొరకు అనేకమైన విలువైన వస్త్రములు, ఆభరణములు పెట్టబడి ఉన్నాయి. రామలక్ష్మణులు ఉపయోగించుటకు అనేక రకములైన ఆయుధములు, కత్తులు, డాలులు మొదలగునవి రథములో పెట్టించాడు దశరథుడు.
రథము బయలు దేరింది. రాముడు అరణ్యములకో పోవడం చూచి అయోధ్యప్రజలు విలపిస్తున్నారు. అయోధ్య అంతా శోక సముద్రములో మునిగిపోయింది. అందరూ రాముని రథము వెంట పరుగెత్తుతున్నారు. వెనక నుండి అరుస్తున్నారు.

“ఓ సుమంత్రా! రథము కొంచెం నెమ్మదిగా పోనీయవయ్యా. మేము రాముని ఆఖరుసారిగా చూడాలి.” అని అరుస్తున్నారు. ఇంకొంతమంది అక్కడక్కడా నిలబడి “కన్నకొడుకు అడవులకు వెళుతుంటే ఆ కౌసల్య ఎలా భరించింది.” అని అనుకుంటున్నారు. ఇంకొంత మంది “ఆహా! ఆ సీతది ఏమి అదృష్టము. రాముని వెన్నంటి అడవులకు వెళుతూ ఉంది. లక్ష్మణుడుకూడా ఎంత పుణ్యం చేసుకున్నాడో. ఈ పధ్నాలుగేళ్లు రాముని వెంట ఉండే భాగ్యానికి నోచుకున్నాడు.” అని వారి అదృష్టానికి పొంగిపోతున్నారు.

ఆ ప్రకారంగా అయోధ్యా ప్రజలు రకరకాలుగా అనుకుంటూ కన్నీరు కారుస్తున్నారు. భవనముల పైన ఉన్న కిటికీల దగ్గర నిలబడి స్త్రీలు రాముని చూచి “పట్టాభిషేకము చేసుకోవాల్సినవాడు, అడవులకు వెళుతున్నాడు. ఏం విచిత్రము” అని శోకిస్తున్నారు.

అయోధ్యావాసుల శోకమును చూడలేక రాముడు “సుమంత్రా! రథమును తొందరగా తోలు. వీరి బాధ చూడలేకున్నాను.” అని అన్నాడు. కాని వెనక నుండి పౌరులు రథము ఆపమని అరుస్తున్నారు. ఎవరి మాట వినాలో తెలియక సుమంత్రుడు అయోమయంలో పడ్డాడు. రథము వేగమును అందుకోలేక చాలా మంది కిందపడి పోయారు. కొంతమంది మూర్ఛపోయారు. ఇంకొంతమంది పట్టువిడవకుండా రథము వెంట పరుగెత్తుతున్నారు.

రాముడు రథము మీద పోతూ ఉంటే, దశరథుడు, కౌసల్య ఇంకా కొంతమంది దశరథుని భార్యలు రాముని రధము వెంట కొంత దూరం వచ్చారు. ఇంక ముందుకు సాగలేక అక్కడే నిలబడ్డారు. తన రథము వెంట నడిచివస్తున్న వారిని చూచి రాముడు కళ్లనిండా నీళ్లు పెట్టుకున్నాడు. కాని బైటికి గంభీరంగా ఉన్నాడు. వారి బాధ చూడలేక రధమును తొందరగా పోనివ్వమన్నాడు.

కాని కౌసల్యమాత్రమూ రథము వెంట పరుగెత్తు తూనే ఉంది. “రామా రామా ఆగు రామా ఆగు” అంటూ అరుస్తూ ఉంది. రాముడు వెనక్కుతిరిగి తల్లిని చూచాడు. మనసు ఆగలేదు. కాని నిగ్రహించు కున్నాడు. వెనకనుండి కౌసల్యఅరుపులు సుమంత్రునికి వినిపిస్తున్నాయి. కాని రాముడు రథాన్ని ముందుకు పోనివ్వ మంటున్నాడు. సందిగ్ధంలో పడ్డాడు సుమంత్రుడు. రథం సాగిపోతూనే ఉంది. ఇంక రాముని వెంట నడవలేక, పరుగెత్తలేక కొంత మంది అయోధ్యా ప్రజలువెనుకకు తిరిగి వెళ్లిపోయారు. కాని మధ్యలో ఆగిపోయిన దశరథుడు ఉండ బట్టలేక మరలా రథం వెంట నడుస్తున్నాడు. అప్పుడు మంత్రులు ఆయనతో ఇలా అన్నాడు.

“మహారాజా! మనము ఎవరినైతే తిరిగి రావాలని కోరుకుంటామో, వారిని ఎక్కువ దూరము సాగనంపకూడదు. కాబట్టి వెనకుకు పోదాముపదండి.” అని అన్నారు. మంత్రులమాటలను మన్నించాడు దశరథుడు. ఆగిపోయాడు. రాముడువెళ్లిన దారివెంట చూస్తున్నాడు. రథము ధూళి కనపడ్డమేరా చూస్తున్నాడు. రాముని రథము కనుచూపుమేర దాటిపోయింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నలభైయవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ఏకచత్వారింశః సర్గః (41) >>

Leave a Comment