Balakanda Sarga 60 In Telugu – బాలకాండ షష్టితమః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. రామాయణంలోని బాలకాండలో 60వ సర్గ, షష్టితమః సర్గగా పిలవబడుతుంది. ఈ సర్గలో విశ్వామిత్ర మహర్షి, రాముడు, లక్ష్మణుడు మిథిలా నగరానికి ప్రయాణిస్తారు. మార్గంలో వారు గౌతమ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడ రాముడు అహల్యను శాప విమోచనం చేస్తాడు. గౌతముడి శాపం వల్ల అహల్య పర్వత రూపంలో ఉంటూ, రాముడి స్పర్శతో మానవ రూపంలోకి మారుతుంది.

త్రిశంకుస్వర్గః

తపోబలహతాన్కృత్వా వాసిష్ఠాన్సమహోదయాన్ |
ఋషిమధ్యే మహాతేజా విశ్వామిత్రోఽభ్యభాషత ||

1

అయమిక్ష్వాకుదాయాదస్త్రిశంకురితి విశ్రుతః |
ధర్మిష్ఠశ్చ వదాన్యశ్చ మాం చైవ శరణం గతః ||

2

తేనానేన శరీరేణ దేవలోకజిగీషయా |
యథాయం స్వశరీరేణ స్వర్గలోకం గమిష్యతి ||

3

తథా ప్రవర్త్యతాం యజ్ఞో భవద్భిశ్చ మయా సహ |
విశ్వామిత్రవచః శ్రుత్వా సర్వ ఏవ మహర్షయః ||

4

ఊచుః సమేత్య సహితా ధర్మజ్ఞా ధర్మసంహితమ్ |
అయం కుశికదాయాదో మునిః పరమకోపనః ||

5

యదాహ వచనం సమ్యగేతత్కార్యం న సంశయః |
అగ్నికల్పో హి భగవాన్ శాపం దాస్యతి రోషితః ||

6

తస్మాత్ప్రవర్త్యతాం యజ్ఞః సశరీరో యథా దివమ్ |
గచ్ఛేదిక్ష్వాకుదాయాదో విశ్వామిత్రస్య తేజసా ||

7

తథా ప్రవర్త్యతాం యజ్ఞః సర్వే సమధితిష్ఠత |
ఏవముక్త్వా మహర్షయశ్చక్రుస్తాస్తాః క్రియాస్తదా ||

8

యాజకశ్చ మహాతేజా విశ్వామిత్రోఽభవత్క్రతౌ |
ఋత్విజశ్చానుపూర్వ్యేణ మంత్రవన్మంత్రకోవిదాః ||

9

చక్రుః సర్వాణి కర్మాణి యథాకల్పం యథావిధి |
తతః కాలేన మహతా విశ్వామిత్రో మహాతపాః ||

10

చకారావాహనం తత్ర భాగార్థం సర్వదేవతాః |
నాభ్యాగమంస్తదాహూతా భాగార్థం సర్వదేవతాః ||

11

తతః క్రోధసమావిష్టో విశ్వమిత్రో మహామునిః |
స్రువముద్యమ్య సక్రోధస్త్రిశంకుమిదమబ్రవీత్ ||

12

పశ్య మే తపసో వీర్యం స్వార్జితస్య నరేశ్వర |
ఏష త్వాం సశరీరేణ నయామి స్వర్గమోజసా ||

13

దుష్ప్రాపం స్వశరీరేణ దివం గచ్ఛ నరాధిప |
స్వార్జితం కించిదప్యస్తి మయా హి తపసః ఫలమ్ ||

14

రాజన్స్వతేజసా తస్య సశరీరో దివం వ్రజ |
ఉక్తవాక్యే మునౌ తస్మిన్సశరీరో నరేశ్వరః ||

15

దివం జగామ కాకుత్స్థ మునీనాం పశ్యతాం తదా |
దేవలోకగతం దృష్ట్వా త్రిశంకుం పాకశాసనః ||

16

సహ సర్వైః సురగణైరిదం వచనమబ్రవీత్ |
త్రిశంకో గచ్ఛ భూయస్త్వం నాసి స్వర్గకృతాలయః ||

17

గురుశాపహతో మూఢ పత భూమిమవాక్శిరాః |
ఏవముక్తో మహేంద్రేణ త్రిశంకురపతత్పునః ||

18

విక్రోశమానస్త్రాహీతి విశ్వామిత్రం తపోధనమ్ |
తచ్ఛ్రుత్వా వచనం తస్య క్రోశమానస్య కౌశికః ||

19

క్రోధమాహారయత్తీవ్రం తిష్ఠ తిష్ఠేతి చాబ్రవీత్ | [రోష]
ఋషిమధ్యే స తేజస్వీ ప్రజాపతిరివాపరః ||

20

సృజన్దక్షిణమార్గస్థాన్సప్తర్షీనపరాన్పునః |
నక్షత్రమాలామపరామసృజత్క్రోధమూర్ఛితః ||

21

దక్షిణాం దిశమాస్థాయ మునిమధ్యే మహాతపాః |
సృష్ట్వా నక్షత్రవంశం చ క్రోధేన కలుషీకృతః ||

22

అన్యమింద్రం కరిష్యామి లోకో వా స్యాదనింద్రకః |
దైవతాన్యపి స క్రోధాత్స్రష్టుం సముపచక్రమే ||

23

తతః పరమసంభ్రాంతాః సర్షిసంఘాః సురాసురాః |
సకిన్నరమహాయక్షాః సహసిద్ధాః సచారణాః ||

24

విశ్వామిత్రం మహాత్మానమూచుః సానునయం వచః |
అయం రాజా మహాభాగ గురుశాపపరిక్షతః ||

25

సశరీరో దివం యాతుం నార్హత్యేవ తపోధన |
తేషాం తద్వచనం శ్రుత్వా దేవానాం మునిపుంగవః ||

26

అబ్రవీత్సుమహద్వాక్యం కౌశికః సర్వదేవతాః |
సశరీరస్య భద్రం వస్త్రిశంకోరస్య భూపతేః ||

27

ఆరోహణం ప్రతిజ్ఞాయ నానృతం కర్తుముత్సహే |
స్వర్గోఽస్తు సశరీరస్య త్రిశంకోరస్య శాశ్వతః ||

28

నక్షత్రాణి చ సర్వాణి మామకాని ధ్రువాణ్యథ |
యావల్లోకా ధరిష్యంతి తిష్ఠంత్వేతాని సర్వశః ||

29

మత్కృతాని సురాః సర్వే తదనుజ్ఞాతుమర్హథ |
ఏవముక్తాః సురాః సర్వే ప్రత్యూచుర్మునిపుంగవమ్ ||

30

ఏవం భవతు భద్రం తే తిష్ఠంత్వేతాని సర్వశః |
గగనే తాన్యనేకాని వైశ్వానరపథాద్బహిః ||

31

నక్షత్రాణి మునిశ్రేష్ఠ తేషు జ్యోతిఃషు జాజ్వలన్ |
అవాక్శిరాస్త్రిశంకుశ్చ తిష్ఠత్వమరసన్నిభః ||

32

అనుయాస్యంతి చైతాని జ్యోతీంషి నృపసత్తమమ్ |
కృతార్థం కీర్తిమంతం చ స్వర్గలోకగతం యథా ||

33

విశ్వామిత్రస్తు ధర్మాత్మా సర్వదేవైరభిష్టుతః |
ఋషిభిశ్చ మహాతేజా బాఢమిత్యాహ దేవతాః ||

34

తతో దేవా మహాత్మానో మునయశ్చ తపోధనాః |
జగ్ముర్యథాగతం సర్వే యజ్ఞస్యాంతే నరోత్తమ ||

35

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే షష్టితమః సర్గః ||

Balakanda Sarga 60 Meaning In Telugu

ఆ ప్రకారంగా వసిష్ఠకుమారులను, మహోదయుని శపించిన తరువాత అక్కడకు వచ్చిన ఋత్విక్కులను, బ్రాహ్మణులను, ఋషులను చూచి విశ్వామిత్రుడు ఇలా అన్నాడు.

” ఇక్ష్వాకు వంశ రాజు, పరమ ధార్మికుడు అయిన త్రిశంకు నా వద్దకు తనను సశరీరంగా స్వర్గమునకు పంపేటందుకు ఒక యజ్ఞము చేయించమని నా సహాయము కోరాడు. ఆయన కోరికను నేను మన్నించాను. త్రిశంకును ఈ శరీరంతో స్వర్గమునకు పంపడానికి నేను ఒక యజ్ఞము చేస్తున్నాను. ఆ యజ్ఞమునకు మీరందరూ సాయపడాలి.” అని అన్నాడు విశ్వామిత్రుడు.

ఆ మాటలు విన్న ఋత్విక్కులు, బ్రాహ్మణులు, ఋషులు తమలో తమరు ఇలా అనుకున్నారు. “ఈ విశ్వామిత్రుడు మహా కోపిష్టి. మన కళ్ల ముందే వసిష్ఠకుమారులను దారుణంగా శపించాడు. ఆయన మాట వినక పోతే మనలకు కూడా శపించగలడు. అందుకని ఆయన చెప్పినట్టు చెయ్యడమే ప్రస్తుత కర్తవ్యము” అని అనుకున్నారు.

తరువాత విశ్వామిత్రునితో ఇలా అన్నారు. “ఓ విశ్వామిత్ర మహర్షీ ! నీవు చెప్పినట్లే మేము చేస్తాము. యజ్ఞమును ప్రారంభం చేస్తాము.”అని అన్నారు. తరువాత అందరూ కలిసి యజ్ఞము ఆరంభించారు. యజ్ఞమునకు యాజకుడుగా విశ్వామిత్రుడు ఉన్నాడు. ఋత్విక్కులు వేద మంత్రములు చదువుతున్నారు. వేదోక్తంగా యజ్ఞము చేస్తున్నారు.

విశ్వామిత్రుడు ఆయా దేవతలను వారి వారి యజ్ఞ భాగములను స్వీకరించుటకు మంత్రపూతంగా ఆహ్వానించాడు. కాని విశ్వామిత్రుని ఆహ్వానమును మన్నించి దేవతలు ఎవరూ వారి వారి హవిర్భాగము లను స్వీకరించుటకు రాలేదు. విశ్వామిత్రునకు కోపం వచ్చింది. యజ్ఞము చేసే స్రువను చేతిలోకి తీసుకున్నాడు. త్రిశంకుని చూచి ఇలా అన్నాడు.

“ఓ త్రిశంకూ! నా తపః ప్రభావాన్ని చూడు. నిన్ను ఈ శరీరంతో స్వర్గానికి పంపిస్తాను. ఇప్పటిదాకా సశరీరంగా ఎవ్వరూ వెళ్లలేని స్వర్గానికి నీవు వెళుతున్నావు. నేను సంపాదించిన తపస్సు ఫలంలో కొంత ధారపోసి నిన్ను స్వర్గానికి పంపుతున్నాను. వెళ్లు. ఈ శరీరంతో స్వర్గానికి వెళ్లు.” అని అన్నాడు.

విశ్వామిత్రుని తపఃశక్తిలో త్రిశంకు శరీరంతో స్వర్గానికి వెళ్లాడు. మానవ శరీరంతో స్వర్గానికి వస్తున్న త్రిశంకును దేవతలు చూచారు. దేవేంద్రునికి చెప్పారు. త్రిశంకును చూచి దేవేంద్రుడు ఇలా అన్నాడు.

“ఓరి త్రిశంకూ! నీవు మానవ శరీరంతో స్వర్గంలో అడుగుపెట్టలేవు. నీవు మూఢుడవు. సశరీరంగా స్వర్గములో ఉండలేవని నీకు తెలియదా! అందుకని తల్లక్రిందులుగా భూమి మీద పడు.” అని శపించాడు దేవేంద్రుడు.

“ఓ విశ్వామిత్ర మహర్షీ ! నన్ను రక్షించు నన్ను రక్షించు” అని పెద్దగా అరుస్తూ త్రిశంకు తల్లక్రిందులుగా భూమి మీదకు వస్తున్నాడు.

అది చూచాడు విశ్వామిత్రుడు. “ఆగు త్రిశంకూ ఆగు. అక్కడే ఉండు” అని పెద్దగా అరిచాడు.

వెంటనే విశ్వామిత్రుడు అపర బ్రహ్మగా మారిపోయాడు ఆకాశంలో దక్షిణ దిక్కున, ఒక నక్షత్ర మండలాన్ని ఒక సప్తర్షి మండలాన్ని సృష్టించాడు. “ఓ దేవేంద్రా! చూడు. నేను మరొక స్వర్గాన్ని, మరొక దేవేంద్రుడిని సృష్టిస్తున్నాను. అది సాధ్యం కాకపోతే నిన్ను నీ దేవేంద్రలోకాన్ని నాశనం చేస్తాను.” అని అన్నాడు.

ఆ మాటలకు దేవతలు గడగడలాడిపోయారు. దేవతలు, రాక్షసులు, సప్తఋషులు, గంధర్వులు విశ్వామిత్రుని వద్దకు వచ్చారు. “ఓ విశ్వామిత్ర మహర్షీ! నీకు తెలియనిది ఏమున్నది. ఇతడు మానవుడు. పైగా ఛండాలుడు. ఇతడు శరీరంతో స్వర్గ ప్రవేశమునకు అర్హుడు కాడు కదా!” అని అన్నారు.

దేవతల మాటలతో విశ్వామిత్రుడు శాంతించాడు. “మీరు చెప్పినది నిజమే. కాని నేను ఇతనిని సశరీరంగా స్వర్గానికి పంపుతానని మాట ఇచ్చాను. ఇప్పుడు నేను ఇతనిని స్వర్గానికి పంపకపోతే నేను ఇచ్చిన మాట తప్పివాడను అవుతాను కదా! నాకు అసత్య దోషము అంటుతుంది కదా! కాబట్టి నేను సృష్టించిన నక్షత్ర మండలము శాశ్వతంగా అంతరిక్షంలో ఉండేట్టు నాకు అనుమతి ఇవ్వండి. ఆ నక్షత్ర మండలంలో ఈ త్రిశంకు శాశ్వతంగాఉంటాడు.” అని అన్నాడు.

దానికి దేవతలు అంగీకరించారు. “ఓ విశ్వామిత్రా! నీవు చెప్పినట్లే జరుగుతుంది. కాని నీవు సృష్టించిన నక్షత్రమండలము జ్యోతిశ్చక్రము వెలుపల ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ నక్షత్ర మండలములో త్రిశంకు ఇప్పుడు ఉన్నట్టు తల్లక్రిందులుగా ప్రకాశిస్తూ ఉంటాడు. నీవు సృష్టించిన నక్షత్ర మండలములోని నక్షత్రములు త్రిశంకు చుట్టు తిరుగుతూ అతనిని సేవిస్తూ ఉంటాయి. “అని అన్నారు.

దానికి విశ్వామిత్రుడు సమ్మతించాడు. ఆ విధంగా విశ్వామిత్రుడు తన యజ్ఞమును పూర్తి చేసాడు. యజ్ఞమునకు వచ్చిన ఋత్విక్కులు, ఋషులు బ్రాహ్మణులు క్షేమంగా తమ తమ స్థానములకు తిరిగి వెళ్లారు.

శ్రీమద్రామాయణము
బాలకాండము అరవయ్యవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ ఏకషష్టితమః సర్గః (61) >>

Leave a Comment