Balakanda Sarga 49 In Telugu – బాలకాండ ఏకోనపంచాశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకోనపంచాశః సర్గలో, రాముడు వారి ఆశ్రమంలోకి ప్రవేశించినప్పుడు అహల్య తన శాపం నుండి విముక్తి పొందింది. విశ్వామిత్రుడు అహల్య పురాణం యొక్క కథనాన్ని కొనసాగిస్తూ, అహల్య ఎవరికీ కనిపించకుండా నివసిస్తున్న ఆమె ఆశ్రమంలోకి రామని అడుగుతాడు. ఒకసారి రాముడు ఆ ఆశ్రమంలోకి అడుగుపెట్టినప్పుడు, ఆమె తన శపించబడిన అదృశ్య స్థితి నుండి వ్యక్తమవుతుంది. ఆమె తన దివ్య రూపంతో ఉద్భవించింది మరియు రామ మరియు లక్ష్మణులకు అతిథిగా ఉంటుంది. గౌతమ మహర్షి కూడా తన నిష్క్రమించిన భార్య అహల్యను అంగీకరించడానికి ఈ తరుణంలో వస్తాడు.

అహల్యాశాపమోక్షః

అఫలస్తు తతః శక్రో దేవానగ్నిపురోగమన్ |
అబ్రవీత్ త్రస్తవదనః సర్షిసంఘాన్ సచారణాన్ ||

1

కుర్వతా తపసో విఘ్నం గౌతమస్య మహాత్మనః |
క్రోధముత్పాద్య హి మయా సురకార్యమిదం కృతమ్ ||

2

అఫలోఽస్మి కృతస్తేన క్రోధాత్సా చ నిరాకృతా |
శాపమోక్షేణ మహతా తపోస్యాపహృతం మయా ||

3

తస్మాత్సురవరాః సర్వే సర్షిసంఘాః సచారణాః |
సురసాహ్యకరం సర్వే సఫలం కర్తుమర్హథ ||

4

శతక్రతోర్వచః శ్రుత్వా దేవాః సాగ్నిపురోగమాః |
పితృదేవానుపేత్యాహుః సర్వే సహ మరుద్గణైః ||

5

అయం మేషః సవృషణః శక్రో హ్యవృషణః కృతః |
మేషస్య వృషణౌ గృహ్య శక్రాయాశు ప్రయచ్ఛత ||

6

అఫలస్తు కృతో మేషః పరాం తుష్టిం ప్రదాస్యతి |
భవతాం హర్షణార్థే చ యే చ దాస్యంతి మానవాః ||

7

అక్షయం హి ఫలం తేషాం యూయం దాస్యథ పుష్కలమ్ |
అగ్నేస్తు వచనం శ్రుత్వా పితృదేవాః సమాగతాః ||

8

ఉత్పాట్య మేషవృషణౌ సహస్రాక్షే న్యవేశయన్ |
తదాప్రభృతి కాకుత్స్థ పితృదేవాః సమాగతాః ||

9

అఫలాన్భుంజతే మేషాన్ఫలైస్తేషామయోజయన్ |
ఇంద్రస్తు మేషవృషణస్తదాప్రభృతి రాఘవ ||

10

గౌతమస్య ప్రభావేన తపసశ్చ మహాత్మనః |
తదాగచ్ఛ మహాతేజ ఆశ్రమం పుణ్యకర్మణః ||

11

తారయైనాం మహాభాగామహల్యాం దేవరూపిణీమ్ |
విశ్వామిత్రవచః శ్రుత్వా రాఘవః సహలక్ష్మణః ||

12

విశ్వామిత్రం పురస్కృత్య తమాశ్రమమథావిశత్ |
దదర్శ చ మహాభాగాం తపసా ద్యోతితప్రభామ్ ||

13

లోకైరపి సమాగమ్య దుర్నిరీక్ష్యాం సురాసురైః |
ప్రయత్నాన్నిర్మితాం ధాత్రా దివ్యాం మాయామయీమివ ||

14

స తుషారావృతాం సాభ్రాం పూర్ణచంద్రప్రభామివ |
మధ్యేఽమ్భసో దురాధర్షాం దీప్తాం సూర్యప్రభామివ ||

15

ధూమేనాపి పరీతాంగీం దీప్తామగ్నిశిఖామివ |
సా హి గౌతమవాక్యేన దుర్నిరీక్ష్యా బభూవ హ ||

16

త్రయాణామపి లోకానాం యావద్రామస్య దర్శనమ్ |
శాపస్యాంతముపాగమ్య తేషాం దర్శనమాగతా ||

17

రాఘవౌ తు తతస్తస్యాః పాదౌ జగృహతుస్తదా |
స్మరంతీ గౌతమవచః ప్రతిజగ్రాహ సా చ తౌ ||

18

పాద్యమర్ఘ్యం తథాఽఽతిథ్యం చకార సుసమాహితా |
ప్రతిజగ్రాహ కాకుత్స్థో విధిదృష్టేన కర్మణా ||

19

పుష్పవృష్టిర్మహత్యాసీద్దేవదుందుభినిఃస్వనైః |
గంధర్వాప్సరసాం చైవ మహానాసీత్సమాగమః ||

20

సాధు సాధ్వితి దేవాస్తామహల్యాం సమపూజయన్ |
తపోబలవిశుద్ధాంగీం గౌతమస్య వశానుగామ్ ||

21

గౌతమోఽపి మహాతేజా అహల్యాసహితః సుఖీ | [హి]
రామం సంపూజ్య విధివత్తపస్తేపే మహాతపాః ||

22

రామోఽపి పరమాం పూజాం గౌతమస్య మహామునేః |
సకాశాద్విధివత్ప్రాప్య జగామ మిథిలాం తతః ||

23

Balakanda Sarga 49 In Telugu Pdf With Meaning

ఆ ప్రకారంగా గౌతముని శాపముతో ఇంద్రుని వృషణములు కిందపడిపోయాయి. దానికి ఇంద్రుడు ఎంతో చింతించాడు. తన దగ్గరకు వచ్చిన అగ్ని, మొదలగు దేవతలతోనూ, ఋషులతోనూ ఇలా అన్నాడు.

“నేను మీ కోసం ఇదంతా చేసాను. గౌతమునికి కోపం తెప్పించి ఆయన తపస్సు భగ్నం చేసాను. ఆయన నాకు శాపం ఇచ్చేటట్లుగా చేసి ఆయన తపస్సు వృధా చేసాను. తద్వారా దేవ కార్యము సాధించాను. తుదకు నా వృషణములు పోగొట్టుకున్నాను. నేను మీ కోసం ఇదంతా చేసాను కాబట్టి మీరే నా వృషణములు నాకు మరలా వచ్చేట్టు చెయ్యాలి.” అని అన్నాడు దేవేంద్రుడు.

దేవేంద్రుని మాటలు విన్న అగ్ని మిగిలిన దేవతలు అందరూ కలిసి పితృదేవతల వద్దకు వెళ్లారు.

“ఓ పితృ దేవతలారా! మానవుడు యజ్ఞములు చేయునపుడు మేషములను(మేకలు, గొర్రెలు) బలి ఇస్తారు. అందులో మేషము యొక్క వృషణములు మీకు హవిస్సుగా సమర్పిస్తారు. ఆ ప్రకారంగా యజ్ఞ సమయములో మీకు ఇవ్వబడిన మేషము యొక్క వృషణములను మీరు వృషణములు లేని దేవేంద్రునికి ఇవ్వండి.” అని అన్నాడు.

అదే ప్రకారంగా పితృదేవతలు తమకు యజ్ఞములలో అర్పించిన వృషణములను దేవేంద్రునికి ఇచ్చారు. మేషము యొక్క వృషణము లను దేవేంద్రునికి అతికించారు. పితృదేవతలు తమకు యజ్ఞములలో లభించిన వృషణములను దేవేంద్రుడికి ఇచ్చారు కాబట్టి, అప్పటి నుండి పితృదేవతలు వృషణములు లేని మేషములనే ఆహారముగా తీసుకొంటున్నారు. దేవేంద్రుడు మేషవృషణుడు అయ్యాడు.

రామా! మనము ఇప్పుడు అహల్య ఉన్న ఆశ్రమములో ప్రవేశించి ఆమెకు శాపవిమోచన కలిగిద్దాము.” అని అన్నాడు విశ్వామిత్రుడు.

తరువాత విశ్వామిత్రుడు, రామ లక్ష్మణులతో కలిసి అహల్య ఉన్న ఆశ్రమములోనికి ప్రవేశించాడు. రాముడు అహల్యను చూచాడు. అప్పటి దాకా గౌతముని శాప ప్రభావం వలన ఆమె ఎవరికి కనపడటం లేదు. కేవలం రామునికి మాత్రమే కనపడింది. రాముని దర్శనంతో ఆమె శాపం అంతం అయింది. ఆమె అందరికి కనపడింది. రామలక్ష్మణులు అహల్య పాదాలకు నమస్కరించారు.

అహల్యకు గౌతముని మాటలు గుర్తుకు వచ్చాయి. రాముని గుర్తించింది. అహల్య రామ లక్ష్మణులకు అర్ఘ్యము పాద్యము ఇచ్చి సత్కరించింది. వారికి అతిథి మర్యాదలు చేసింది. ఈ అపూర్వ దృశ్యమును చూచి దేవతలు దుందుభులు మ్రోగించారు. అప్సరసలు నాట్యం చేసారు. దేవతలందరూ అహల్యను మెచ్చుకున్నారు.

ఆ సమయంలో గౌతముడు కూడా అక్కడకు వచ్చాడు. శ్రీరామ దర్శనంతో పునీతమైన అహల్యను భార్యగా స్వీకరించాడు. అహల్య గౌతములు రాముని పూజించారు. రాముడు వారి పూజలందు కున్నాడు.

గౌతముడు అహల్యతో కూడి తపస్సుకు వెళ్లిపోయాడు. రాముడు, లక్ష్మణునితో సహా విశ్వామిత్రుని అనుసరించి మిథిలకు వెళ్లాడు.

శ్రీమద్రామాయణము
బాలకాండ నలభైతొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ పంచాశః సర్గః (50) >>

Leave a Comment