మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండము రామాయణంలోని రెండవ కాండ, ఇది ప్రధానంగా శ్రీ రాముడి జీవితంలోని అయోధ్య నగరంలో జరిగిన సంఘటనలను వివరిస్తుంది. పంచమః సర్గలో, రాముడు తన తండ్రి దశరథ మహారాజుతో పాటు ఆయోధ్యలో ఉన్న సందర్భాలపై దృష్టి సారిస్తాడు. ఈ సర్గ రాముని వైయక్తిక జీవితం, కుటుంబ బంధాలు మరియు ఆయోధ్యలోని ప్రజల అనురాగం పై కేంద్రీకృతమై ఉంది. రాముడు తన పితృ వాక్య పరిపాలనకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తాడో, తండ్రి ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడం కోసం సకల కష్టాలను ఎలా స్వీకరించాడో ఈ సర్గలో వివరించబడుతుంది.
వ్రతచర్యావిధానమ్
సందిశ్య రామం నృపతిః శ్వోభావిన్యభిషేచనే |
పురోహితం సమాహూయ వసిష్ఠం చేదమబ్రవీత్ ||
1
గచ్ఛోపవాసం కాకుత్స్థం కారయాద్య తపోధన |
శ్రీయశోరాజ్యలాభాయ వధ్వా సహ యతవ్రతమ్ ||
2
తథేతి చ స రాజానముక్త్వా వేదవిదాం వరః |
స్వయం వసిష్ఠో భగవాన్యయౌ రామనివేశనమ్ ||
3
ఉపవాసయితుం రామం మంత్రవన్మంత్రకోవిదః |
బ్రాహ్మం రథవరం యుక్తమాస్థాయ సుదృఢవ్రతః ||
4
స రామభవనం ప్రాప్య పాండురాభ్రఘనప్రభమ్ |
తిస్రః కక్ష్యా రథేనైవ వివేశ మునిసత్తమః ||
5
తమాగతమృషిం రామస్త్వరన్నివ ససంభ్రమః |
మానయిష్యన్స మానార్హం నిశ్చక్రామ నివేశనాత్ ||
6
అభ్యేత్య త్వరమాణశ్చ రథాభ్యాశం మనీషిణః |
తతోఽవతారయామాస పరిగృహ్య రథాత్స్వయమ్ ||
7
స చైనం ప్రశ్రితం దృష్ట్వా సంభాష్యాభిప్రసాద్య చ |
ప్రియార్హం హర్షయన్రామమిత్యువాచ పురోహితః ||
8
ప్రసన్నస్తే పితా రామ యౌవరాజ్యమవాప్స్యసి |
ఉపవాసం భవానద్య కరోతు సహ సీతయా ||
9
ప్రాతస్త్వామభిషేక్తా హి యౌవరాజ్యే నరాధిపః |
పితా దశరథః ప్రీత్యా యయాతిం నహుషో యథా ||
10
ఇత్యుక్త్వా స తదా రామముపవాసం యతవ్రతమ్ |
మంత్రవిత్కారయామాస వైదేహ్యా సహితం మునిః ||
11
తతో యథావద్రామేణ స రాజ్ఞో గురురర్చితః |
అభ్యనుజ్ఞాప్య కాకుత్స్థం యయౌ రామనివేశనాత్ ||
12
సుహృద్భిస్తత్ర రామోఽపి సుఖాసీనః ప్రియంవదైః |
సభాజితో వివేశాఽథ తాననుజ్ఞాప్య సర్వశః ||
13
ప్రహృష్టనరనారీకం రామవేశ్మ తదా బభౌ | [హృష్టనారీనరయుతం]
యథా మత్తద్విజగణం ప్రఫుల్లనలినం సరః ||
14
స రాజభవనప్రఖ్యాత్తస్మాద్రామనివేశనాత్ |
నిఃసృత్య దదృశే మార్గం వసిష్ఠో జనసంవృతమ్ || [నిర్గత్య]
15
బృందబృందైరయోధ్యాయాం రాజమార్గాః సమంతతః |
బభూవురభిసంబాధాః కుతూహలజనైర్వృతాః ||
16
జనబృందోర్మిసంఘర్షహర్షస్వనవతస్తదా |
బభూవ రాజమార్గస్య సాగరస్యేవ నిస్వనః ||
17
సిక్తసంమృష్టరథ్యా చ తదహర్వనమాలినీ |
ఆసీదయోధ్యా నగరీ సముచ్ఛ్రితగృహధ్వజా ||
18
తదా హ్యయోధ్యానిలయః సస్త్రీబాలాబలో జనః |
రామాభిషేకమాకాంక్షన్నాకాంక్షదుదయం రవేః ||
19
ప్రజాలంకారభూతం చ జనస్యానందవర్ధనమ్ |
ఉత్సుకోఽభూజ్జనో ద్రష్టుం తమయోధ్యామహోత్సవమ్ ||
20
ఏవం తం జనసంబాధం రాజమార్గం పురోహితః |
వ్యూహన్నివ జనౌఘం తం శనై రాజకులం యయౌ ||
21
సితాభ్రశిఖరప్రఖ్యం ప్రాసాదమధిరుహ్య సః |
సమీయాయ నరేంద్రేణ శక్రేణేవ బృహస్పతిః ||
22
తమాగతమభిప్రేక్ష్య హిత్వా రాజాసనం నృపః |
పప్రచ్ఛ స చ తస్మై తత్కృతమిత్యభ్యవేదయత్ ||
23
తేన చైవ తదా తుల్యం సహాసీనాః సభాసదః |
ఆసనేభ్యః సముత్తస్థుః పూజయంతః పురోహితమ్ ||
24
గురుణా త్వభ్యనుజ్ఞాతో మనుజౌఘం విసృజ్య తమ్ |
వివేశాంతఃపురం రాజా సింహో గిరిగుహామివ ||
25
తదగ్ర్యరూపం ప్రమదాజనాకులం [గణాకులం]
మహేంద్రవేశ్మప్రతిమం నివేశనమ్ |
విదీపయంశ్చారు వివేశ పార్థివః
శశీవ తారాగణసంకులం నభః ||
26
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచమః సర్గః ||
Ayodhya Kanda Sarga 5 Meaning In Telugu
తన దగ్గరనుండి రాముడు వెళ్లిపోయిన తరువాత దశరథుడు తన పురోహితుడు వసిష్ఠుని పిలిపించాడు. ఆయనతో ఇలా అన్నాడు.
“ఓ వసిష్ఠ మహామునీ! రేపే రామునికి యౌవరాజ్య పట్టాభిషేకము నిశ్చయించాము కదా. అందుకని మీరు రాముని మందిరమునకు వెళ్లి, రాజ్యము, యశస్సు, సంపదలు కలిగేటట్టు రామునితో, సీతతో ఈ రోజు ఉపవాసవ్రతము చేయించండి.” అని అన్నాడు.
దశరథుని ఆదేశాను సారము వసిష్ఠుడు రాముని మందిరమునకు వెళ్లాడు. తన మందిరమునకు వచ్చిన వసిష్ఠునికి రాముడు ఎదురు వచ్చి, స్వాగత సత్కారములు చేసాడు. ఉచితా సనము మీద కూర్చో పెట్టాడు. అప్పుడు వసిష్ఠుడు రామునితో ఇలా అన్నాడు. “రామా! రేపు ఉదయము నీకు యౌవరాజ్య పట్టాభిషేకము చేయవలెనని నీ తండ్రి దశరథుడు సంకల్పించాడు. ఆ సందర్భంలో నీవు ఈరోజు రాత్రి నీ భార్య సీతతో సహా ఉపవాస వ్రతము చేయాలి.” అని అన్నాడు. రాముడు సరే అన్నాడు. వసిష్ఠుడు రామునితో సీతతో వేదోక్తంగా ఉపవాసవ్రతము చేయించాడు. రాముడు సీత తమ గురువు గారైన వసిష్ఠును యధోచితంగా పూజించారు. తరువాత వసిష్ఠుడు రాముని మందిరము నుండి వెళ్లిపోయాడు.
ఈ వార్తవిన్న రాముని మిత్రులు, బంధువులు రాముని మందిరమునకు చేరుకున్నారు. రాముడు వారందరితో ప్రేమతో మాట్లాడాడు. రాముని మందిరము అంతా ఆ రాత్రి బంధుమిత్రులతో కళకళలాడింది.
మరునాడే పట్టాభిషేక మహోత్సవము కావడంతో అయోధ్యానగర వీధులన్నీ జనంతో కిట కిట లాడుతున్నాయి. నగరమంతా పచ్చని మామిడి తోరణాలతో అలంకరిస్తున్నారు. పుర వీధులు అన్నీ పన్నీటితో తడిపారు. అరటి స్తంభాలు కట్టారు. తోరణాలు కట్టారు. జండాలతో అలంకరించారు. ఆ రాత్రి ఎవరికీ నిద్రలేదు. స్త్రీలు, బాలురు, వృద్ధులు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు రామ పట్టాభిషేకము చూద్దామా అని ఉవ్విళ్లూరుతున్నారు. రామ మందిరము నుండి బయలు దేరిన వసిష్ఠుడు, దారిలో క్రిక్కిరిసి ఉన్న జనమును తోసుకుంటూ అతి ప్రయాసతో దశరథుని భవనమును చేరుకున్నాడు. దశరథుని కలుసుకున్నాడు.
” ఓ వసిష్ట మహామునీ! రామునితో నేను చెప్పినవి అన్నీ చేయించారా!” అని అడిగాడు.
“అంతా మీరుచెప్పినట్టే చేయించాను.” అని చెప్పాడు వసిష్ఠుడు.
అప్పటిదాకా దశరథుడు పురప్రముఖులతో మంతనాలు సాగిస్తున్నాడు. వసిష్టుడు వచ్చిన తరువాత, వారందరినీ పంపివేసాడు. తాను కూడా తన అంతఃపురములోకి వెళ్లాడు.
శ్రీమదామాయణము
అయోధ్యాకాండము ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.