Ayodhya Kanda Sarga 16 In Telugu – అయోధ్యాకాండ షోడశః సర్గః

“రామాయణం” లో అయోధ్యాకాండ షోడశః సర్గం (16వ సర్గ)లో, రాముడు, సీత, మరియు లక్ష్మణులు భద్రత కోసం చిత్రకూటం చేరుకుంటారు. అక్కడ, వారు తపస్వులు మరియు సన్యాసులతో కలుస్తారు. చిత్రకూటంలో సుఖశాంతులతో నివసిస్తూ, రాముడు తన తండ్రి దశరథుని మరణవార్త వింటాడు. ఈ వార్త రాముని, సీత మరియు లక్ష్మణులను తీవ్రంగా కలచివేస్తుంది. రాముడు పితృవేదనతో తపస్సులో మునిగిపోతాడు. ఈ సర్గలో, రాముడి ధర్మపరమైన కట్టుబాట్లు మరియు తండ్రి పట్ల ప్రేమ స్పష్టంగా తెలుస్తాయి. త్రయం చిత్రకూటంలో శోకంతో పాటు శాంతిని అనుభవిస్తారు.

రామప్రస్థానమ్

స తదంతఃపురద్వారం సమతీత్య జనాకులమ్ |
ప్రవివిక్తాం తతః కక్ష్యామాససాద పురాణవిత్ || ౧ ||

ప్రాసకార్ముకబిభ్రద్భిర్యువభిర్మృష్టకుండలైః |
అప్రమాదిభిరేకాగ్రైః స్వనురక్తైరధిష్ఠితామ్ || ౨ ||

తత్ర కాషాయిణో వృద్ధాన్వేత్రపాణీన్ స్వలంకృతాన్ |
దదర్శ విష్ఠితాన్ద్వారిః త్ర్యధ్యక్షాన్సుసమాహితాన్ || ౩ ||

తే సమీక్ష్య సమాయాంతం రామప్రియచికీర్షవః |
సహసోత్పతితాః సర్వే స్వాసనేభ్యః ససంభ్రమాః || ౪ ||

తానువాచ వినీతాత్మా సూతపుత్రః ప్రదక్షిణః |
క్షిప్రమాఖ్యాత రామాయ సుమంత్రో ద్వారి తిష్ఠతి || ౫ ||

తే రామముపసంగమ్య భర్తుః ప్రియచికీర్షవః |
సహభార్యాయ రామాయ క్షిప్రమేవాచచక్షిరే || ౬ ||

ప్రతివేదితమాజ్ఞాయ సూతమభ్యంతరం పితుః |
తత్రైవానాయయామాస రాఘవప్రియకామ్యయా || ౭ ||

తం వైశ్రవణసంకాశముపవిష్టం స్వలంకృతమ్ |
దదర్శ సూతః పర్యంకే సౌవర్ణే సోత్తరచ్ఛదే || ౮ ||

వరాహరుధిరాభేణ శుచినా చ సుగంధినా |
అనులిప్తం పరార్ధ్యేన చందనేన పరంతపమ్ || ౯ ||

స్థితయా పార్శ్వతశ్చాపి వాలవ్యజనహస్తయా |
ఉపేతం సీతయా భూతశ్చిత్రయా శశినం యథా || ౧౦ ||

తం తపంతమివాదిత్యముపపన్నం స్వతేజసా |
వవందే వరదం వందీ వినయజ్ఞో వినీతవత్ || ౧౧ ||

ప్రాంజలిస్తు సుఖం పృష్ట్వా విహారశయనాసనే |
రాజపుత్రమువాచేదం సుమంత్రో రాజసత్కృతః || ౧౨ ||

కౌసల్యా సుప్రజా రామ పితా త్వాం ద్రష్టుమిచ్ఛతి |
మహిష్యా సహ కైకేయ్యా గమ్యతాం తత్ర మా చిరమ్ || ౧౩ ||

ఏవముక్తస్తు సంహృష్టో నరసింహో మహాద్యుతిః |
తతః సమ్మానయామాస సీతామిదమువాచ హ || ౧౪ ||

దేవి దేవశ్చ దేవీ చ సమాగమ్య మదంతరే |
మంత్రయేతే ధ్రువం కించిదభిషేచనసంహితమ్ || ౧౫ ||

లక్షయిత్వా హ్యభిప్రాయం ప్రియకామా సుదక్షిణా |
సంచోదయతి రాజానం మదర్థం మదిరేక్షణే || ౧౬ ||

సా ప్రహృష్టా మహారాజం హితకామానువర్తినీ |
జననీ చార్థకామా మే కేకయాధిపతేః సుతా || ౧౭ ||

దిష్ట్యా ఖలు మహారాజో మహిష్యా ప్రియయా సహ |
సుమంత్రం ప్రాహిణోద్దూతమర్థకామకరం మమ || ౧౮ ||

యాదృశీ పరిషత్తత్ర తాదృశో దూత ఆగతః |
ధ్రువమద్యైవ మాం రాజా యౌవరాజ్యేఽభిషేక్ష్యతి || ౧౯ ||

అహం శీఘ్రమితో గత్వా ద్రక్ష్యామి చ మహీపతిమ్ | [హంత]
సహ త్వం పరివారేణ సుఖమాస్వ రామస్వ చ || ౨౦ ||

పతిసమ్మానితా సీతా భర్తారమసితేక్షణా |
ఆద్వారమనువవ్రాజ మంగళాన్యభిదధ్యుషీ || ౨౧ ||

రాజ్యం ద్విజాతిభిర్జుష్టం రాజసూయాభిషేచనమ్ |
కర్తుమర్హతి తే రాజా వాసవస్యేవ లోకకృత్ || ౨౨ ||

దీక్షితం వ్రతసంపన్నం వరాజినధరం శుచిమ్ |
కురంగశృంగపాణిం చ పశ్యంతీ త్వాం భజామ్యహమ్ || ౨౩ ||

పూర్వాం దిశం వజ్రధరో దక్షిణాం పాతు తే యమః |
వరుణః పశ్చిమామాశాం ధనేశస్తూత్తరాం దిశమ్ || ౨౪ ||

అథ సీతామనుజ్ఞాప్య కృతకౌతుకమంగళః |
నిశ్చక్రామ సుమంత్రేణ సహ రామో నివేశనాత్ || ౨౫ ||

పర్వతాదివ నిష్క్రమ్య సింహో గిరిగుహాశయః |
లక్ష్మణం ద్వారి సోఽపశ్యత్ప్రహ్వాంజలిపుటం స్థితమ్ || ౨౬ ||

అథ మధ్యమకక్ష్యాయాం సమాగమ్య సుహృజ్జనైః |
స సర్వానర్థినో దృష్ట్వా సమేత్య ప్రతినంద్య చ || ౨౭ ||

తతః పావకసంకాశమారురోహ రథోత్తమమ్ |
వైయాఘ్రం పురుషవ్యాఘ్రో రాజతం రాజనందనః || ౨౮ ||

మేఘనాదమసంబాధం మణిహేమవిభూషితమ్ |
ముష్ణంతమివ చక్షూంషి ప్రభయా హేమవర్చసమ్ || ౨౯ ||

కరేణుశిశుకల్పైశ్చ యుక్తం పరమవాజిభిః |
హరియుక్తం సహస్రాక్షో రథమింద్ర ఇవాశుగమ్ || ౩౦ ||

ప్రయయౌ తూర్ణమాస్థాయ రాఘవో జ్వలితః శ్రియా |
స పర్జన్య ఇవాకాశే స్వనవానభినాదయన్ || ౩౧ ||

నికేతాన్నిర్యయౌ శ్రీమాన్మహేంద్రాదివ చంద్రమాః |
ఛత్రచామరపాణిస్తు లక్ష్మణో రాఘవానుజః || ౩౨ ||

జుగోప భ్రాతరం భ్రాతా రథమాస్థాయ పృష్ఠతః |
తతో హలహలాశబ్దస్తుములః సమజాయత || ౩౩ ||

తస్య నిష్క్రమమాణస్య జనౌఘస్య సమంతతః |
తతో హయవరా ముఖ్యాః నాగాశ్చ గిరిసన్నిభాః || ౩౪ ||

అనుజగ్ముస్తదా రామం శతశోఽథ సహస్రశః |
అగ్రతశ్చాస్య సన్నద్ధాశ్చందనాగరురూషితాః || ౩౫ ||

ఖడ్గచాపధరాః శూరాః జగ్మురాశంసవో జనాః |
తతో వాదిత్రశబ్దాస్తు స్తుతిశబ్దాశ్చ వందినామ్ || ౩౬ ||

సింహనాదాశ్చ శూరాణాం తథా శుశ్రువిరే పథి |
హర్మ్యవాతాయనస్థాభిర్భూషితాభిః సమంతతః || ౩౭ ||

కీర్యమాణః సుపుష్పౌఘైర్యయౌ స్త్రీభిరరిందమః |
రామం సర్వానవద్యాంగ్యో రామపిప్రీషయా తతః || ౩౮ ||

వచోభిరగ్ర్యైర్హర్మ్యస్థాః క్షితిస్థాశ్చ వవందిరే |
నూనం నందతి తే మాతా కౌసల్యా మాతృనందన || ౩౯ ||

పశ్యంతీ సిద్ధయాత్రం త్వాం పిత్ర్యం రాజ్యమవస్థితమ్ |
సర్వసీమంతినీభ్యశ్చ సీతాం సీమంతినీం వరామ్ || ౪౦ ||

అమన్యంత హి తా నార్యో రామస్య హృదయప్రియామ్ |
తయా సుచరితం దేవ్యా పురా నూనం మహత్తపః || ౪౧ ||

రోహిణీవ శశాంకేన రామసంయోగమాప యా |
ఇతి ప్రాసాదశృంగేషు ప్రమదాభిర్నరోత్తమః || ౪౨ ||

శుశ్రావ రాజమార్గస్థః ప్రియా వాచ ఉదాహృతాః |
ఆత్మసంపూజనైః శృణ్వన్యయౌ రామో మహాపథమ్ || ౪౩ ||

స రాఘవస్తత్ర కథాప్రపంచాన్
శుశ్రావ లోకస్య సమాగతస్య |
ఆత్మాధికారా వివిధాశ్చ వాచః
ప్రహృష్టరూపస్య పురో జనస్య || ౪౪ ||

ఏష శ్రియం గచ్ఛతి రాఘవోఽద్య
రాజప్రసాదాద్విపులాం గమిష్యన్ |
ఏతే వయం సర్వసమృద్ధకామాః
యేషామయం నో భవితా ప్రశాస్తా || ౪౫ ||

లాభో జనస్యాస్య యదేష సర్వం
ప్రపత్స్యతే రాష్ట్రమిదం చిరాయ |
న హ్యప్రియం కించన జాతు కశ్చి-
-త్పశ్యేన్న దుఃఖం మనుజాధిపేఽస్మిన్ || ౪౬ ||

స ఘోషవద్భిశ్చ హయైర్మతంగజైః
పురఃసరైః స్వస్తికసూతమాగధైః |
మహీయమానః ప్రవరైశ్చ వాదకై-
-రభిష్టుతో వైశ్రవణో యథా యయౌ || ౪౭ ||

కరేణుమాతంగరథాశ్వసంకులం
మహాజనౌఘప్రతిపూర్ణచత్వరమ్ |
ప్రభూతరత్నం బహుపణ్యసంచయం
దదర్శ రామో రుచిరం మహాపథమ్ || ౪౮ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే షోడశః సర్గః || ౧౬ ||

Ayodhya Kanda Sarga 16 Meaning In Telugu

రాముని అంతఃపురములో ఒక్కొక్క ద్వారమును దాటు కుంటూ వెళుతున్నాడు సుమంత్రుడు. రాముని అంత:పురము బయట కాపలా ఉన్న భటులతో “రాముని దర్శనము కొరకు సుమంత్రుడు వచ్చి ఉన్నాడు” అని చెప్పండి అని చెప్పి పంపించాడు. సీతతో ముచ్చటిస్తున్న రామునితో భటులు సుమంత్రుడు వచ్చాడు అన్న మాటను చెప్పారు. “సుమంత్రుని సాదరంగా లోపలకు తీసుకొని రండి” అని ఆదేశించాడు రాముడు.
సుమంత్రుడు రాముని అంతఃపురములోకి వెళ్లాడు. రాముని చూచాడు. రామునికి నమస్కరించాడు. రాముని చూచి ఇలా అన్నాడు.
” ఓ కౌసల్యా నందనా! రామా! మీ తండ్రిగారు దశరథ మహారాజు గారూ, తమరి తల్లి కైకేయీ మహారాణి గారూ తమరిని చూడవలెనని అనుకుంటున్నారు. తమరు వెంటనే దశరథుల వారి అంతఃపురమునకు బయలు దేరండి.” అని పలికాడు.

ఆ మాటలు విన్న రాముడు పక్కనే ఉన్న సీతను చూచి ఇలా అన్నాడు. “సీతా! నా తండ్రి దశరథుడు, నా తల్లి కైక నా పట్టాభిషేకము గురించి నాతో చర్చించవలెనని అనుకుంటున్నారు. నన్ను తీసుకొని రమ్మని సుమంత్రుని పంపారు. నేను వెంటనే నా తల్లి తండ్రుల వద్దకు వెళ్లుతున్నాను.” అని చెప్పాడు.

సీత చిరునవ్వుతో భర్తను సాగనంపింది. ద్వారము దాకా తోడు వచ్చింది. “ఆర్యపుత్రా! మీకు జయమగుగాక! తమరు త్వరలో ఈ అయోధ్యకు పట్టాభిషిక్తులు కాబోతున్నారు. తమరు పట్టాభిషిక్తులు కావడం చూచి నేను ఎంతో ఆనందిస్తాను. దిక్పాలకులైన ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు తమరిని సదా రక్షించు గాక! శు భంగా వెళ్లిరండి.” అని భర్తను సాగనంపింది సీత. సీత వద్దనుండి అనుమతి తీసుకున్న రాముడు, సుమంత్రునితో సహా దశరధ మహారాజు మందిరమునకు బయలుదేరాడు.

ద్వారము దగ్గర లక్ష్మణుడు అన్నగారి కోసరము వేచి ఉన్నాడు. లక్ష్మణుని కూడా తనతో రమ్మన్నాడు రాముడు. ముగ్గురూ కలిసి వెళు తున్నారు. దారిలో తన కోసం వేచి ఉన్న తన మిత్రులను చూచి రాముడు వారికి ‘తండ్రిగారిని కలుసుకొని ఇప్పుడే వస్తాను’ అని చెప్పాడు. రాముడు లక్ష్మణుడు రథంలోకి ఎక్కారు. సుమంత్రుడు రథం తోలుతున్నాడు. రాముడు ఎక్కిన రథము రాజాంతఃపురమునకు బయలుదేరింది. లక్ష్మణుడు రాముని వెనక నిలబడి రాముని అప్రత్తంగా రక్షిస్తున్నాడు. రాముని రథము వెంట గుర్రములు, ఏనుగులు ఎక్కిన సైనికులు అనుసరించారు. కవచములు, ఆయుధములు ధరించిన భటులు రాముని రథమును అనుసరించి వెళుతున్నారు.

రాముని చూచి మార్గమునకు అటు ఇటు నిలబడ్డ ప్రజలు హర్షధ్వానాలు చేస్తున్నారు. రాముని గుణగణములను స్తుతిస్తున్నారు. మేడల మీద నిలబడ్డ స్త్రీలు రాముని మీద పూలు చల్లుతున్నారు. దారికి అటు ఇటు నిలబడ్డ ప్రజలు రామునికి భక్తితో నమస్కరిస్తున్నారు. అటువంటి రాముని భర్తగా పొందిన సీతను అయోధ్యావాసులు మనసులోనే అభినందించారు. “పూర్వజన్మలో ఏ తపస్సు చేసిందో ఏమో ఈ జన్మలో రాముని వంటి ఉత్తముని భర్తగా పొందినది”, సీత అదృష్టాన్ని పొగిడారు.

వారందరి మాటలు చిరునవ్వుతో వింటున్నాడు రాముడు. ఈ నాడే రాముడు మనకందరికీ పాలకుడు కాబోతున్నాడు. ఇంక మనకోరికలు అన్నీ తీరుతాయి. ఇంక అయోధ్యా ప్రజలకు దుఃఖము అనే మాట వినపడదు. అని అయోధ్యావాసులు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు.
ఆ ప్రకారంగా రాముడు, ముందు వంది మాగధులు కైవారములు చేస్తూ ఉంటే, వెనక ఆశ్విక బలము, గజబలము వెంట వస్తూ ఉంటే, రాజాంతఃపురమునకు వెళ్లాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము పదునారవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ సప్తదశః సర్గః (17) >>

Leave a Comment