Ayodhya Kanda Sarga 62 In Telugu – అయోధ్యాకాండ ద్విషష్ఠితమః సర్గః

అయోధ్యాకాండ ద్విషష్ఠితమః సర్గలో మంత్రలే అత్రి మహర్షి ఇంటికి వెళ్ళి ఆధ్యాత్మికత, తపస్సు గురించి ప్రశంసలు అందుకుంటాడు. అత్రి మహర్షి, అతని భార్య అనసూయ, అతని ఆశ్రమంలో రాముడు, సీత మరియు లక్ష్మణుడిని ఆతిథ్యం ఇస్తారు. అనసూయ, సీతకు దుస్తులు మరియు ఆభరణాలు అందజేస్తుంది. ఆమె సీతకు పతివ్రత ధర్మాన్ని గురించి ఉపదేశాలు ఇస్తుంది. సీత, తన పతివ్రత ధర్మాన్ని పాటించాలని ప్రతిజ్ఞ చేస్తుంది. అందరూ కృతజ్ఞతా భావంతో ఆశ్రమం నుండి బయలుదేరి మరిన్ని అడవులలో ప్రయాణిస్తారు. ఈ సర్గ, సీత, రాముడు మరియు లక్ష్మణుడి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడాన్ని ప్రతిబింబిస్తుంది.

కౌసల్యాప్రసాదనమ్

ఏవం తు క్రుద్ధయా రాజా రామమాత్రా సశోకయా |
శ్రావితః పరుషం వాక్యం చింతయామాస దుఃఖితః || ౧ ||

చింతయిత్వా స చ నృపో ముమోహ వ్యాకులేంద్రియః |
అథ దీర్ఘేణ కాలేన సంజ్ఞామాప పరంతపః || ౨ ||

స సంజ్ఞాముపలభ్యైవ దీర్ఘముష్ణం చ నిశ్శ్వసన్ |
కౌసల్యాం పార్శ్వతో దృష్ట్వా పునశ్చింతాముపాగమత్ || ౩ ||

తస్య చింతయమానస్య ప్రత్యభాత్ కర్మ దుష్కృతమ్ |
యదనేన కృతం పూర్వమజ్ఞానాచ్ఛబ్ద వేధినా || ౪ ||

అమనాస్తేన శోకేన రామశోకేన చ ప్రభుః |
ద్వాభ్యామపి మహారాజః శోకాబ్యామన్వతప్యత || ౫ ||

దహ్యమానః సశోకాభ్యాం కౌసల్యామాహ భూపతిః |
వేపమానోఽంజలిం కృత్వా ప్రసాదర్థమవాఙ్ముఖః || ౬ ||

ప్రసాదయే త్వాం కౌసల్యే రచితోఽయం మయాఽంజలిః |
వత్సలా చానృశంసా చ త్వం హి నిత్యం పరేష్వపి || ౭ ||

భర్తా తు ఖలు నారీణాం గుణవాన్నిర్గుణోఽపి వా |
ధర్మం విమృశమానానాం ప్రత్యక్షం దేవి దైవతమ్ || ౮ ||

సా త్వం ధర్మపరా నిత్యం దృష్ట లోక పరావర |
నార్హసే విప్రియం వక్తుం దుఃఖితాఽపి సుదుఃఖితమ్ || ౯ ||

తద్వాక్యం కరుణం రాజ్ఞః శ్రుత్వా దీనస్య భాషితమ్ |
కౌసల్యా వ్యసృజద్బాష్పం ప్రణాలీవ నవోదకమ్ || ౧౦ ||

స మూర్ధ్ని బద్ధ్వా రుదతీ రాజ్ఞః పద్మమివాంజలిమ్ |
సంభ్రమాదబ్రవీత్ త్రస్తా త్వరమాణాక్షరం వచః || ౧౧ ||

ప్రసీద శిరసా యాచే భూమౌ నితతితాఽస్మి తే |
యాచితాఽస్మి హతా దేవ హంతవ్యాఽహం న హి త్వయా || ౧౨ ||

నైషా హి సా స్త్రీ భవతి శ్లాఘనీయేన ధీమతా |
ఉభయోః లోకయోః వీర పత్యాయా సంప్రసాద్యతే || ౧౩ ||

జానామి ధర్మం ధర్మజ్ఞ త్వాం జానే సత్యవాదినమ్ |
పుత్రశోకార్తయా తత్తు మయా కిమపి భాషితమ్ || ౧౪ ||

శోకో నాశయతే ధైర్యం శోకో నాశయతే శ్రుతమ్ |
శోకో నాశయతే సర్వం నాస్తి శోకసమః రిపుః || ౧౫ ||

శక్యమాపతితః సోఢుం ప్రహరః రిపుహస్తతః |
సోఢుమాపతితః శోకః సుసూక్ష్మోఽపి న శక్యతే || ౧౬ ||

వనవాసాయ రామస్య పంచరాత్రోఽద్య గణ్యతే |
యః శోకహతహర్షాయాః పంచవర్షోపమః మమ || ౧౭ ||

తం హి చింతయమానాయాః శోకోఽయం హృది వర్ధతే |
నదీనామివ వేగేన సముద్రసలిలం మహత్ || ౧౯ ||

ఏవం హి కథయంత్యాస్తు కౌసల్యాయాః శుభం వచః |
మందరశ్మిరభూత్సూర్యో రజనీ చాభ్యవర్తత || ౨౦ ||

తథ ప్రహ్లాదితః వాక్యైర్దేవ్యా కౌసల్యయా నృపః | [ప్రసాదితో]
శోకేన చ సమాక్రాంతర్నిద్రాయా వశమేయివాన్ || ౨౧ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్విషష్ఠితమః సర్గః || ౬౨ ||

Ayodhya Kanda Sarga 62 Meaning In Telugu

రాముని వియోగంతో కుమిలిపోతున్న కౌసల్య అన్న మాటలకు దశరథుడు బదులు చెప్పలేకపోయాడు. తనలో తాను దు:ఖిస్తున్నాడు. ఆ దుఃఖంలోనే దశరథునికి తాను పూర్వము చేసిన పాపము గుర్తుకు వచ్చింది. తాను వేసిన శబ్దవేది బాణముల వలన కలిగిన మహాపరాధము తలచుకొని తలచుకొని ఏడుస్తున్నాడు. తానుచేసిన పాపము మరొకరితో పంచుకొంటేనేగాని తీరదు అని అనుకున్నాడు. కౌసల్య వంక తిరిగాడు. ఆమెకు చేతులు జోడించి నమస్కరిస్తూ ఇలా అన్నాడు.

“కౌసల్యా! భర్త గుణవంతుడైనా, దుర్మార్గుడైనా, సతికి పతియే కదా ప్రత్యక్ష దైవము. నీకు దుఃఖము లేదు అని నేను అనను. కాని ఎంత దు:ఖములో కూడా భర్తనైన నన్ను ఈ విధంగా తిట్టడం ధర్మమేనా! ఆలోచించు.” అని అన్నాడు.

ఆ మాటలకు కౌసల్య తన కన్నీటితోనే బదులు చెప్పింది. అలాగే దశరథుని పాదముల మీద వాలి పోయింది. ఆయన పాదములు తన కన్నీటితో అభిషేకించింది.

“మహారాజా! మీరు నన్ను వేడుకొనడం ద్వారా నన్ను మీరు ఖండ ఖండాలుగా ఖండించినట్టయింది. మిమ్మల్ని తిట్టడం ద్వారా నేను మహాపరాధమే చేసాను. కాని మీరు కోపించకుండా నన్ను అనునయిస్తున్నారు. నేను ఎంత పాపం చేసానో ఇప్పుడు నాకు అర్థం అయింది. ఓ మహారాజా! మీరు ధర్మాత్ములు అని నాకు తెలియును. నాకూ ధర్మం తెలుసు. అంత అవివేకురాలిని కాను. కానీ పుత్రశోకం తట్టుకోలేక ఆ బాధలో మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను.

మహారాజా! తమరికి తెలియనిది కాదు. శోకము అన్ని అపరాథములకు మూలము. శోకసముద్రములో మునిగిన వాడికి మంచి చెడూ తెలియదు. శాస్త్రజ్ఞానము నశిస్తుంది. ధైర్యాన్ని కోల్పోతాడు. తాను ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో తెలియని స్థితిలో ఉంటాడు. శోకము మనిషికి కనపడని శత్రువు. సర్వనాశనం చేస్తుంది. ఎదురుగా ఉన్న శత్రువు కొట్టిన దెబ్బను తప్పుకోవచ్చు కానీ, మనసులో పుట్టిన చిన్నపాటి దుఃఖమును తట్టకోడం కష్టం. అన్ని ధర్మములు తెలిసినవారు, సర్వసంగపరిత్యాగులు అయిన సన్యాసులు కూడా శోకముతో కుమిలిపోవడం, మూర్ఖంగా ప్రవర్తించడం మనకు తెలుసుకదా!

ఓ మహారాజా! రాముడు మనలను విడిచిపోయి నేటికి ఐదు దినములు అయినది కానీ నాకు ఐదు సంవత్సరములు అయినట్టుంది. రాముడు మనసులో మెదిలితేనే నాకు దుఃఖము ముంచుకొస్తూ ఉంది. ఆ శోకావేశములో ఏమేమో మాటలాడి ఉంటాను. నన్ను క్షమించండి.” అని ప్రార్థించింది కౌసల్య ఇంతలో సాయంకాలము అయింది. దశరథుడు అలాగే ఒరిగిపోయి నిద్రలోకి జారుకున్నాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము అరువది రెండవ భాగము సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ త్రిషష్ఠితమః సర్గః (63) >>

Leave a Comment