Balakanda Sarga 53 In Telugu – బాలకాండ త్రిపంచాశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని త్రిపంచాశః సర్గలో, విశ్వామిత్రుడు కామధేనుని పొందాలని ప్రయత్నిస్తాడు, కాని వశిష్ట మహర్షి విశ్వామిత్రుని బేరసారాలు మరియు వస్తుమార్పిడిని పట్టుదలతో నిరాకరిస్తాడు. ‘సామాన్యమైన ఆవును మాత్రమే పవిత్రంగా భావించి, అది మార్కెట్ చేయలేని వస్తువు అయినప్పుడు, ఏ కోరికనైనా పాలు చేసే శబల ఎలా ఇవ్వబడుతుంది లేదా ఇతర సంపదల కోసం ఎలా మార్చబడుతుంది…’ అనేది వశిష్ఠుని వాదన. అయినప్పటికీ, విశ్వామిత్రుడు తన బిడ్డింగ్కు వెళతాడు, కానీ ఫలించలేదు.

శబలానిష్క్రియః

ఏవముక్తా వసిష్ఠేన శబలా శత్రుసూదన |
విదధే కామధుక్కామాన్యస్య యస్య యథేప్సితమ్ ||

1

ఇక్షూన్మధూంస్తథా లాజాన్మైరేయాంశ్చ వరాసవాన్ |
పానాని చ మహార్హాణి భక్ష్యాంశ్చోచ్చావచాంస్తథా ||

2

ఉష్ణాఢ్యస్యౌదనస్యాత్ర రాశయః పర్వతోపమాః |
మృష్టాన్నాని చ సూపాశ్చ దధికుల్యాస్తథైవ చ ||

3

నానాస్వాదురసానాం చ షడ్రసానాం తథైవ చ | [షాడబానాం]
భోజనాని సుపూర్ణాని గౌడాని చ సహస్రశః ||

4

సర్వమాసీత్సుసంతుష్టం హృష్టపుష్టజనాయుతమ్ |
విశ్వామిత్రబలం రామ వసిష్ఠేనాభితర్పితమ్ ||

5

విశ్వామిత్రోఽపి రాజర్షిర్హృష్టః పుష్టస్తదాభవత్ |
సాంతఃపురవరో రాజా సబ్రాహ్మణపురోహితః ||

6

సామాత్యో మంత్రిసహితః సభృత్యః పూజితస్తదా |
యుక్తః పరమహర్షేణ వసిష్ఠమిదమబ్రవీత్ ||

7

పూజితోఽహం త్వయా బ్రహ్మన్పూజార్హేణ సుసత్కృతః |
శ్రూయతామభిధాస్యామి వాక్యం వాక్యవిశారద ||

8

గవాం శతసహస్రేణ దీయతాం శబలా మమ |
రత్నం హి భగవన్నేతద్రత్నహారీ చ పార్థివః ||

9

తస్మాన్మే శబలాం దేహి మమైషా ధర్మతో ద్విజ |
ఏవముక్తస్తు భగవాన్వసిష్ఠో మునిసత్తమః ||

10

విశ్వామిత్రేణ ధర్మాత్మా ప్రత్యువాచ మహీపతిమ్ |
నాహం శతసహస్రేణ నాపి కోటిశతైర్గవామ్ ||

11

రాజన్దాస్యామి శబలాం రాశిభీ రజతస్య వా |
న పరిత్యాగమర్హేయం మత్సకాశాదరిందమ ||

12

శాశ్వతీ శబలా మహ్యం కీర్తిరాత్మవతో యథా |
అస్యాం హవ్యం చ కవ్యం చ ప్రాణయాత్రా తథైవ చ ||

13

ఆయత్తమగ్నిహోత్రం చ బలిర్హోమస్తథైవ చ |
స్వాహాకారవషట్కారౌ విద్యాశ్చ వివిధాస్తథా ||

14

ఆయత్తమత్ర రాజర్షే సర్వమేతన్న సంశయః |
సర్వస్వమేతత్సత్యేన మమ తుష్టికరీ సదా ||

15

కారణైర్బహుభీ రాజన్న దాస్యే శబలాం తవ |
వసిష్ఠేనైవముక్తస్తు విశ్వామిత్రోఽబ్రవీత్తతః ||

16

సంరబ్ధతరమత్యర్థం వాక్యం వాక్యవిశారదః |
హైరణ్యకక్ష్యాగ్రైవేయాన్సువర్ణాంకుశభూషితాన్ ||

17

దదామి కుంజరాణాం తే సహస్రాణి చతుర్దశ |
హైరణ్యానాం రథానాం చ శ్వేతాశ్వానాం చతుర్యుజామ్ ||

18

దదామి తే శతాన్యష్టౌ కింకిణీకవిభూషితాన్ |
హయానాం దేశజాతానాం కులజానాం మహౌజసామ్ ||

19

సహస్రమేకం దశ చ దదామి తవ సువ్రత |
నానావర్ణవిభక్తానాం వయఃస్థానాం తథైవ చ ||

20

దదామ్యేకాం గవాం కోటిం శబలా దీయతాం మమ |
యావదిచ్ఛసి రత్నం వా హిరణ్యం వా ద్విజోత్తమ ||

21

తావద్దాస్యామి తత్సర్వం శబలా దీయతాం మమ |
ఏవముక్తస్తు భగవాన్విశ్వామిత్రేణ ధీమతా ||

22

న దాస్యామీతి శబలాం ప్రాహ రాజన్కథంచన |
ఏతదేవ హి మే రత్నమేతదేవ హి మే ధనమ్ ||

23

ఏతదేవ హి సర్వస్వమేతదేవ హి జీవితమ్ |
దర్శశ్చ పౌర్ణమాసశ్చ యజ్ఞాశ్చైవాప్తదక్షిణాః ||

24

ఏతదేవ హి మే రాజన్వివిధాశ్చ క్రియాస్తథా |
అదోమూలాః క్రియాః సర్వా మమ రాజన్న సంశయః |
బహునా కిం ప్రలాపేన న దాస్యే కామదోహినీమ్ ||

25

Balakanda Sarga 53 In Telugu Pdf With Meaning

వసిష్ఠుడు ఆజ్ఞాపించిన ప్రకారము కామధేనువు విశ్వామిత్రునకు అతని పరివారమునకు షడ్రసోపేతమైన విందు భోజనము సమ కూర్చింది. చెరకు గడలు, తేనె, మద్యము, పానీయములు, రకరకాలైన భక్ష్యములు అడిగినవారికి అడిగినట్టు అన్ని పదార్థములు వడ్డించింది. అందరూ తృప్తిగా భోజనము చేసారు. వసిష్ఠుని ఆతిథ్యమునకు ఎంతో ఆనందించారు. విశ్వామిత్రుడు, అతని అంత:పుర కాంతలు, వారి వెంటవచ్చిన పురోహితులు, పరివారము, అందరూ ఎంతో సంతోషించారు.

అప్పుడు విశ్వామిత్రుడు వసిష్ఠునితో ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! నీ ఆతిథ్యమునకు మేమందరమూ ఎంతో ఆనందించాము. తమరిని ఒకటి అడుగుతాను. నేను తమరికి లక్ష గోవులను ఇస్తాను. ఈ కామధేనువు నాకు ఇవ్వండి. ఓ మహర్షీ! ఈ కామధేనువు రత్నము వంటిది. ఇలాంటివి మా వంటి మహారాజుల వద్ద ఉండాలి. రాజ్యములో ఉన్న సంపద అంతా రాజు యొక్క అధీనము కదా! కాబట్టి ఈ కామధేనువు కూడా మా అధీనము. వెంటనే ఈ కామధేనువును మాకు ఇవ్వండి.” అని అడిగాడు.

ఆ మాటలకు వసిష్ఠుడు ఇలా బదులు చెప్పాడు. “ఓ విశ్వామిత్రా! నీవు వందల వేల ఆవులు ఇచ్చినను, వెండి బంగారము రాసులు ఇచ్చినను. నా కామధేనువును నేను నీకు ఇవ్వను. ఇది నా ప్రాణము. మా బంధము శాశ్వతము. నేను ప్రతిరోజూ చేసే అగ్నిహోత్రమునకు కావలసిన పాలు, పెరుగు, నెయ్యి, నేను దేవతలకు అర్పించు హవిస్సులు ఈ కామధేనువు సమకూరుస్తుంది. ఈ కామధేనువు లేకపోతే నాకు రోజు గడవదు. అందుకని నేను ఈ కామధేనువును నీకు ఇవ్వలేను. ” అని చెప్పాడు వసిష్ఠుడు.

“అది కాదు మహర్షీ! ఒక్క ఆవులే కాదు. బంగారముతో అలంకరింపబడిన 14,000 ఏనుగులను నీకు కానుకగా ఇస్తాను. ఇంకా ఒక్కొక్క దానికి నాలుగు తెల్లని ఉత్తమాశ్వమఱులను కట్టిన 8 బంగారు రధములు ఇస్తాను. అంతేకాదు 11,000 మంచి జాతి గుర్రములను కూడా ఇస్తాను. అంతెందుకు నీకు కోటి పాడి ఆవులను ఇస్తాను. ఈ కామధేనువును నాకు ఇవ్వు. సరే….. అదీకాకపోతే నీకు ఏం కావాలో కోరుకో….. అవి అన్నీ ఇస్తాను. రత్నములా, బంగారమా, ఏం కావాలంటే అది కోరుకో… అవన్నీ ఇస్తాను. కానీ ఈ కామధేనువును మాతం నాకు ఇవ్వు. ” అని అడిగాడు విశ్వామిత్రుడు.

“నీవు ఎన్ని ఇచ్చినను నేను మాత్రము ఈ కామధేనువును నీకు ఇవ్వను. ఎందుకంటే నాకు ఈ కామధేనువే బంగారము, రత్నములు, ధనము, సర్వస్వము. నా జీవితము. ఇదే నాకు అన్ని యజ్ఞములు, యాగములు, దక్షిణలు, అన్ని రకములైన క్రియలు.

నేను చేసే అన్ని యజ్ఞములకు, యాగములకు, క్రియలకు ఇదే మూలము. అందుచేత, ఎట్టి పరిస్థితులలోనూ నేను నా కామధేనువును నీకు ఇవ్వలేను… ఇవ్వను” అని చెప్పాడు వసిష్ఠుడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము యాభైమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ చతుఃపంచాశః సర్గః (54) >>

Leave a Comment