Balakanda Sarga 64 In Telugu – బాలకాండ చతుఃషష్టితమః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ చతుఃషష్టితమః సర్గలో, విష్ణుమూర్తి దశరథుని తపస్సుకు సంతృప్తి చెంది, రామునిగా అవతరించడానికి సన్నాహాలు చేస్తాడు. దశరథుని యాగం పూర్తయిన తర్వాత, అగ్నిదేవుడు ప్రత్యక్షమై, పాయసాన్ని ఆయనకు అందిస్తాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన భార్యలకు పంపించి, వారు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అనే నాలుగు కుమారులను పొందుతారు.

|| రంభాశాపః ||

సురకార్యమిదం రంభే కర్తవ్యం సుమహత్త్వయా |
లోభనం కౌశికస్యేహ కామమోహసమన్వితమ్ ||

1

తథోక్తా సాఽప్సరా రామ సహస్రాక్షేణ ధీమతా |
వ్రీడితా ప్రాంజలిర్భూత్వా ప్రత్యువాచ సురేశ్వరమ్ ||

2

అయం సురపతే ఘోరో విశ్వామిత్రో మహామునిః |
క్రోధముత్సృజతే ఘోరం మయి దేవ న సంశయః ||

3

తతో హి మే భయం దేవ ప్రసాదం కర్తుమర్హసి |
ఏవముక్తస్తయా రామ రంభయా భీతయా తయా ||

4

తామువాచ సహస్రాక్షో వేపమానాం కృతాంజలిమ్ |
మా భైషి రంభే భద్రం తే కురుష్వ మమ శాసనమ్ ||

5

కోకిలో హృదయగ్రాహీ మాధవే రుచిరద్రుమే |
అహం కందర్పసహితః స్థాస్యామి తవ పార్శ్వతః ||

6

త్వం హి రూపం బహుగుణం కృత్వా పరమభాస్వరమ్ |
తమృషిం కౌశికం రంభే భేదయస్వ తపస్వినమ్ ||

7

సా శ్రుత్వా వచనం తస్య కృత్వా రూపమనుత్తమమ్ |
లోభయామాస లలితా విశ్వామిత్రం శుచిస్మితా ||

8

కోకిలస్య స శుశ్రావ వల్గు వ్యాహరతః స్వనమ్ |
సంప్రహృష్టేన మనసా తత ఏనాముదైక్షత ||

9

అథ తస్య చ శబ్దేన గీతేనాప్రతిమేన చ |
దర్శనేన చ రంభాయా మునిః సందేహమాగతః ||

10

సహస్రాక్షస్య తత్కర్మ విజ్ఞాయ మునిపుంగవః |
రంభాం క్రోధసమావిష్టః శశాప కుశికాత్మజః ||

11

యన్మాం లోభయసే రంభే కామక్రోధజయైషిణమ్ |
దశ వర్షసహస్రాణి శైలీ స్థాస్యసి దుర్భగే ||

12

బ్రాహ్మణః సుమహాతేజాస్తపోబలసమన్వితః |
ఉద్ధరిష్యతి రంభే త్వాం మత్క్రోధకలుషీకృతామ్ ||

13

ఏవముక్త్వా మహాతేజా విశ్వామిత్రో మహామునిః |
అశక్నువన్ధారయితుం క్రోధం సంతాపమాగతః ||

14

తస్య శాపేన మహతా రంభా శైలీ తదాఽభవత్ |
వచః శ్రుత్వా చ కందర్పో మహర్షేః స చ నిర్గతః ||

15

కోపేన సుమహాతేజాస్తపోఽపహరణే కృతే |
ఇంద్రియైరజితై రామ న లేభే శాంతిమాత్మనః ||

16

బభూవాస్య మనశ్చింతా తపోఽపహరణే కృతే |
నైవ క్రోధం గమిష్యామి న చ వక్ష్యామి కించన ||

17

అథవా నోచ్ఛ్వసిష్యామి సంవత్సరశతాన్యపి |
అహం విశోషయిష్యామి హ్యాత్మానం విజితేంద్రియః ||

18

తావద్యావద్ధి మే ప్రాప్తం బ్రాహ్మణ్యం తపసార్జితమ్ |
అనుచ్ఛ్వసన్నభుంజానస్తిష్ఠేయం శాశ్వతీః సమాః ||

19

న హి మే తప్యమానస్య క్షయం యాస్యంతి మూర్తయః |
ఏవం వర్షసహస్రస్య దీక్షాం స మునిపుంగవః |
చకారాప్రతిమాం లోకే ప్రతిజ్ఞాం రఘునందన ||

20

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే చతుఃషష్టితమః సర్గః ||

దేవేంద్రుడు రంభను చూచి ఇలా అన్నాడు.

“ఓ రంభా! విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేస్తున్నాడు. నీవు నీ అందరందాలతో అతనిని వశపరచుకొని అతని తపస్సు భగ్నం చేయాలి. ఇది దేవతా కార్యము. నీవు చేయాలి. తప్పదు. “అని అన్నాడు.

ఆ మాటలు విన్న రంభ చేతులు జోడించి ఇలా పలికింది. “ఓ దేవేంద్రా! నీమాటలు మాకు శిరోధార్యము. కాని ఆ విశ్వామిత్రుడు మహా కోపిష్టి. నా చేష్టలకు ఆయన నన్ను కోపంతో శపించగలడు. నాకు చాలా భయంగా ఉంది. తరువాత మీ ఇష్టం.” అని చెప్పింది.

దానికి దేవేంద్రుడు ఇలా అన్నాడు. “రంభా! నీకేం భయం లేదు. నేను, మన్మధుడు, కోకిలల రూపంలో నీ పక్కనే ఉంటాము. సమ యానికి వచ్చి ఆదుకుంటాము. నీవేం భయపడపనిలేదు. నీ హావభావవిలాసములతో విశ్వామిత్రుని మత్తెక్కించు. నా మాట మన్నించు.” అని అన్నాడు.

రంభకు ఒప్పుకోక తప్పలేదు. సరే అని విశ్వామిత్రుని వద్దకు వెళ్లింది. ఆయన ముందు నాట్యం చేసింది. ఆడింది. పాడింది. విశ్వామిత్రుని దృష్టిని ఆకర్షించింది. విశ్వామిత్రుడు రంభను చూచాడు. అందంగా ఉంది అనుకున్నాడు.

ఇంతలో విశ్వామిత్రునికి ఒక సందేహము కలిగింది. ఇది అంతా ఆ దేవేంద్రుని కుతంత్రము కాదు కదా అని అనుమాన పడ్డాడు. రంభను శపించాడు.

“తపస్సు చేసుకుంటున్న నన్ను నీ అందచందములతో ప్రలోభ పరచడానికి ప్రయత్నించావు కాబట్టి నీవు పదివేల సంవత్సరములు రాయిగా పడి ఉండు. నీకు ఒక బ్రాహ్మణుని వలన శాపవిమోచన కలుగుతుంది.” అని శాపము, విమోచనము అనుగ్రహించాడు. వెంటనే రంభ రాతిబండగా మారిపోయింది.

ఇది చూచి దేవేంద్రుడు, మన్మధుడు పారిపోయారు.

తరువాత విశ్వామిత్రుడు చాలా పశ్చాత్తాప పడ్డాడు.

“అయ్యో అనవసరంగా రంభ మీద కోపించాను. శపించాను. నా తపస్సును వృధా చేసుకున్నాను. నేను ఇంకా ఇంద్రియాలను ముఖ్యంగా కోపాన్ని జయించలేక పోతున్నాను. దీనితో నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఇంక ఎవరి మీదా కోపగించు కోకూడదు. నన్ను ఎవరు ఏమి చేసినా ఎవరి మీదా కోపపడను. ఇంద్రియములను జయించి తపస్సు చేస్తాను. నాకు బ్రాహ్మణ్యము సిద్ధించువరకూ ఘోర తపస్సు చేస్తాను. ” అని కఠోరంగా నిర్ణయించుకున్నాడు విశ్వామిత్రుడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము అరవైనాల్గవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

బాలకాండ పంచషష్టితమః సర్గః (65) >>

Leave a Comment