అయోధ్యాకాండ ఏకోనసప్తతితమః సర్గ రామాయణంలోని కీలకమైన ఘట్టం. ఈ సర్గలో, భరతుడు తన తల్లి కైకేయిని ఎదుర్కొంటాడు. దశరథుని మరణానికి, రాముని వనవాసానికి కారణమైందని ఆగ్రహంతో ఉంటాడు. భరతుడు కైకేయికి తన బాధను, తన తండ్రి, సోదరుడు రాముడి పట్ల ప్రేమను వ్యక్తం చేస్తాడు. కైకేయి చేసిన ద్రోహాన్ని ఖండిస్తాడు. ఈ సందర్భంగా భరతుడు తల్లి చర్యలను తిరస్కరించి, రాముడు తప్ప మరెవ్వరు కూడా అయోధ్య పట్నానికి రాజుగా అర్హులు కాదని ప్రకటిస్తాడు. రాముడి వనవాసం ముగించడానికి, అయోధ్య రాజ్యానికి తీసుకురావడానికి నిర్ణయిస్తాడు. ఈ సర్గ భరతుని ధర్మపాలన, భక్తి, కుటుంబ బాంధవ్యాలను ప్రతిబింబిస్తుంది.
భరతదుఃస్వప్నః
యామేవ రాత్రిం తే దూతాః ప్రవిశంతి స్మ తాం పురీమ్ |
భరతేనాపి తాం రాత్రిం స్వప్నో దృష్టోఽయమప్రియః || ౧ ||
వ్యుష్టామేవ తు తాం రాత్రిం దృష్ట్వా తం స్వప్నమప్రియమ్ |
పుత్రః రాజాధిరాజస్య సుభృశం పర్యతప్యత || ౨ ||
తప్యమానం సమాజ్ఞాయ వయస్యాః ప్రియవాదినః |
ఆయాసం హి వినేష్యంతః సభాయాం చక్రిరే కథాః || ౩ ||
వాదయంతి తథా శాంతిం లాసయంత్యపి చాపరే |
నాటకాన్యపరే ప్రాహుర్హాస్యాని వివిధాని చ || ౪ ||
స తైః మహాత్మా భరతః సఖిభిః ప్రియవాదిభిః |
గోష్ఠీ హాస్యాని కుర్వద్భిర్న ప్రాహృష్యత రాఘవః || ౫ ||
తమబ్రవీత్ప్రియసఖో భరతం సఖిభిర్వృతమ్ |
సుహృద్భిః పర్యుపాసీనః కిం సఖే నానుమోదసే || ౬ ||
ఏవం బ్రువాణం సుహృదం భరతః ప్రత్యువాచ హ |
శృణు త్వం యన్నిమిత్తం మే దైన్యమేతదుపాగతమ్ || ౭ ||
స్వప్నే పితరమద్రాక్షం మలినం ముక్తమూర్ధజమ్ |
పతంతమద్రిశిఖరాత్ కలుషే గోమయేహ్రదే || ౮ ||
ప్లవమానశ్చ మే దృష్టః స తస్మిన్ గోమయహ్రదే |
పిబన్నంజలినా తైలం హసన్నపి ముహుర్ముహుః || ౯ ||
తతస్తిలౌదనం భుక్త్వా పునః పునరధః శిరాః |
తైలేనాభ్యక్త సర్వాంగస్తైలమేవావగాహత || ౧౦ ||
స్వప్నేఽపి సాగరం శుష్కం చంద్రం చ పతితం భువి |
ఉపరుద్ధాం చ జగతీం తమసేవ సమావృతమ్ || ౧౧ ||
ఔపవాహ్యస్య నాగస్య విషాణం శకలీకృతమ్ |
సహసా చాపి సంశాంతం జ్వలితం జాతవేదసమ్ || ౧౨ ||
అవతీర్ణాం చ పృథివీం శుష్కాంశ్చ వివిధాన్ ద్రుమాన్ |
అహం పశ్యామి విధ్వస్తాన్ సధూమాంశ్చాపి పర్వతాన్ || ౧౩ ||
పీఠే కార్ష్ణాయసే చైనం నిషణ్ణం కృష్ణవాససమ్ |
ప్రహసంతి స్మ రాజానం ప్రమదాః కృష్ణపింగలాః || ౧౪ ||
త్వరమాణశ్చ ధర్మాత్మా రక్తమాల్యానులేపనః |
రథేన ఖరయుక్తేన ప్రయాతో దక్షిణాముఖః || ౧౫ ||
ప్రహసంతీవ రాజానం ప్రమదా రక్తవాసినీ |
ప్రకర్షంతీ మయా దృష్టా రాక్షసీ వికృతాననా || ౧౬ ||
ఏవమేతన్మయా దృష్టమిమాం రాత్రిం భయావహామ్ |
అహం రామోఽథవా రాజా లక్ష్మణో వా మరిష్యతి || ౧౭ ||
నరః యానేన యః స్వప్నే ఖరయుక్తేన యాతి హి |
అచిరాత్తస్య ధూమాగ్రం చితాయాం సంప్రదృశ్యతే || ౧౮ ||
ఏతన్నిమిత్తం దీనోఽహం తన్నవః ప్రతిపూజయే |
శుష్యతీవ చ మే కంఠో న స్వస్థమివ మే మనః || ౧౯ ||
న పశ్యామి భయస్థానం భయం చైవోపధారయే |
భ్రష్టశ్చ స్వరయోగో మే ఛాయా చోపహతా మమ || ౨౦ ||
జుగుప్సన్నివ చాత్మానం న చ పశ్యామి కారణమ్ |
ఇమాం హి దుఃస్వప్న గతిం నిశామ్య తామ్
అనేక రూపామవితర్కితాం పురా |
భయం మహత్తద్ధృదయాన్న యాతి మే
విచింత్య రాజానమచింత్య దర్శనమ్ || ౨౧ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకోనసప్తతితమః సర్గః || ౬౯ ||
Ayodhya Kanda Sarga 69 Meaning In Telugu
అయోధ్యనుండి వచ్చిన దూతలు భరత శత్రుఘ్నులు ఉన్న నగరంలో ప్రవేశించిన రాత్రి, భరతునికి ఒక చెడ్డ కల వచ్చింది. అదీ తెల్లవారు జామున వచ్చింది. మరునాడు భరతుని మనస్సు అంతా వ్యాకులంగా ఉండింది. స్నేహితులతో వినోద సంభాషణలలో పాలుపంచుకోలేక పోయాడు. విదూషకుల హాస్యపు మాటలకు స్పందించడంలేదు. మనసంతా వికలమయింది.
ఇది చూచి ఒక స్నేహితుడు భరతుడు అలా విషాదంగా ఉండటానికి కారణం అడిగాడు. అప్పుడు భరతుడు తన మనసులో మాట ఈ విధంగా చెప్పాడు. “మిత్రమా! ఈ రోజు నాకు ఒక చెడ్డ కల వచ్చింది. నా తండ్రి దశరథుడు ఒళ్లంతా మట్టికొట్టుకొని, వెంట్రుకలు విరబోసుకొని, ఆవు పేడ ఉన్న గుంటలో పడిపోయినట్టు కలవచ్చింది. అలా పడ్డ నా తండ్రి నూనె తాగుతున్నాడు. తరువాత నువ్వులు కలిసిన అన్నం తింటున్నాడు. తరువాత తలవంచుకొని నూనెలో మునిగి పోయాడు. మిత్రమా! ఇంకా నాకు సముద్రము ఎండిపోయినట్టు గానూ, చంద్రుడు నేలమీద పడిపోయినట్టుగానూ, పట్టపగలే చీకట్లు కమ్మినట్టుగానూ. అయోధ్యలో ఉన్న రాజులు ఊరేగే ఏనుగునకు దంతములు విరిగినట్టుగానూ, ప్రతి ఇంట్లోనూ వెలిగే అగ్నులు ఆరిపోయినట్టుగానూ, భూకంపము వచ్చినట్టుగానూ, నాకు కలలో కనపడింది. మిత్రమా!ఇదే కాకుండా నా తండ్రి ఇనపసింహాసనము మీద నల్లని దుస్తులు ధరించి కూర్చున్నట్టుగానూ, ఆయనను చూచి అందరూ నవ్వుతున్నట్టుగానూ, నా తండ్రి గాడిదలు కట్టిన రథము మీద దక్షిణ దిక్కుగా వెళుతున్నట్టుగానూ కల వచ్చింది.
ఈ స్వప్నములను బట్టి చూస్తే మా కుటుంబములో ఎవరో ఒకరికి మరణము ఆసన్నమయినది అని అర్థం అవుతూ ఉంది. ప్రస్తుతము వృద్ధుడు మా తండ్రి. ఆయన గురించే నాకు చింతగా ఉంది. ఎందుకంటే ఎవరైతే గాడిదలు కట్టిన రథంమీద దక్షిణ దిక్కుగా వెళ్లినట్టు కల వస్తుందో, అతని యొక్క చితి మంటలు త్వరలోనే చూడబడతాయి అని శాస్త్రప్రమాణము. ఎలాంటి దుర్వార్త వినవలసి వస్తుందో అని నా మనస్సులో చాలా ఆందోళనగా ఉంది. మరలా నా తండ్రిని చూస్తానా లేదా అని మనసంతా వ్యాకులంగా ఉంది.” అని అన్నాడు భరతుడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము అరువది తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.