అయోధ్యాకాండం యొక్క షట్సప్తతితమః సర్గంలో, దశరథ మహారాజు రాముని వనవాసం పట్ల తీవ్రంగా దుఃఖిస్తూ తన గత పాపాలను తలుచుకుంటాడు. ఆయన కైకేయితో చేసిన వాగ్దానం ఫలితంగా రాముడు అడవికి వెళ్లిపోయినందుకు పశ్చాత్తాపంతో బాధపడతాడు. రాత్రిలో దశరథుడు కౌసల్య, సుమిత్రలతో తన బాధను పంచుకుంటాడు. దశరథుడు రాముని విడిచి ఉండలేక, ఆ వేదనతో అణచిపడి, తన ప్రాణాలను విడుస్తాడు. ఆయన చివరి క్షణాలలో రాముని మరియాదలను, అతని కరుణామయ స్వభావాన్ని తలుచుకుంటాడు. కౌసల్య, సుమిత్రలు దశరథుని మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోతారు, అయోధ్యలో విషాద వాతావరణం నెలకొంటుంది.
దశరథౌర్ధ్వదైహికమ్
తమేవం శోకసంతప్తం భరతం కేకయీ సుతమ్ |
ఉవాచ వదతాం శ్రేష్ఠో వసిష్ఠః శ్రేష్ఠ వాగృషిః || ౧ ||
అలం శోకేన భద్రం తే రాజపుత్ర మహాయశః |
ప్రాప్తకాలం నరపతేః కురు సంయానముత్తమమ్ || ౨ ||
వసిష్ఠస్య వచః శృత్వా భరతర్ధారణాం గతః |
ప్రేతకార్యాణి సర్వాణి కారయామాస ధర్మవిత్ || ౩ ||
ఉద్ధృతం తైలసంరోదాత్ స తు భూమౌ నివేశితమ్ |
ఆపీతవర్ణవదనం ప్రసుప్తమివ భూపతిమ్ || ౪ ||
సంవేశ్య శయనే చాగ్ర్యే నానారత్నపరిష్కృతే |
తతర్దశరథం పుత్రః విలలాప సుదుఃఖితః || ౫ ||
కిం తే వ్యవసితం రాజన్ ప్రోషితే మయ్యనాగతే |
వివాస్య రామం ధర్మజ్ఞం లక్ష్మణం చ మహాబలమ్ || ౬ ||
క్వ యాస్యసి మహారాజ హిత్వేమం దుఃఖితం జనమ్ |
హీనం పురుషసింహేన రామేణాక్లిష్ట కర్మణా || ౭ ||
యోగక్షేమం తు తే రాజన్ కోఽస్మిన్ కల్పయితా పురే |
త్వయి ప్రయాతే స్వస్తాత రామే చ వనమాశ్రితే || ౮ ||
విధవా పృథివీ రాజన్ త్వయా హీనా న రాజతే |
హీనచంద్రేవ రజనీ నగరీ ప్రతిభాతి మామ్ || ౯ ||
ఏవం విలపమానం తం భరతం దీనమానసమ్ |
అబ్రవీద్వచనం భూయో వసిష్ఠస్తు మహామునిః || ౧౦ ||
ప్రేత కార్యాణి యాన్యస్య కర్తవ్యాని విశాంపతేః |
తాన్యవ్యగ్రం మహాబాహో క్రియంతామవిచారితమ్ || ౧౧ ||
తథేతి భరతః వాక్యం వసిష్ఠస్యాభిపూజ్య తత్ |
ఋత్విక్ పురోహితాచార్యాన్ త్వరయామాస సర్వశః || ౧౨ ||
యే త్వగ్నయో నరేంద్రస్య చాగ్న్యగారాద్బహిష్కృతాః |
ఋత్విగ్భిర్యాజకైశ్చైవ తే హ్రియంతే యథావిధి || ౧౩ || [ఆహ్రియంత]
శిబికాయామథారోప్య రాజానం గతచేతనమ్ |
బాష్పకంఠా విమనసః తమూహుః పరిచారకాః || ౧౪ ||
హిరణ్యం చ సువర్ణం చ వాసాంసి వివిధాని చ |
ప్రకిరంతః జనా మార్గం నృపతేరగ్రతః యయుః || ౧౫ ||
చందనాగురునిర్యాసాన్ సరలం పద్మకం తథా |
దేవదారూణి చాహృత్య క్షేపయంతి తథాపరే || ౧౬ ||
గంధానుచ్చావచాంశ్చాన్యాన్ తత్ర గత్త్వాఽథ భూమిపమ్ |
తతః సంవేశయామాసుశ్చితా మధ్యే తమృత్విజః || ౧౭ ||
తథా హుతాశనం దత్వా జేపుస్తస్య తదృత్విజః |
జగుశ్చ తే యథాశాస్త్రం తత్ర సామాని సామగాః || ౧౮ ||
శిబికాభిశ్చ యానైశ్చ యథాఽర్హం తస్య యోషితః |
నగరాన్నిర్యయుస్తత్ర వృద్ధైః పరివృతాస్తదా || ౧౯ ||
ప్రసవ్యం చాపి తం చక్రురృత్విజోఽగ్నిచితం నృపమ్ |
స్త్రియశ్చ శోకసంతప్తాః కౌసల్యా ప్రముఖాస్తదా || ౨౦ ||
క్రౌంచీనామివ నారీణాం నినాదస్తత్ర శుశ్రువే |
ఆర్తానాం కరుణం కాలే క్రోశంతీనాం సహస్రశః || ౨౧ ||
తతః రుదంత్యో వివశాః విలప్య చ పునః పునః |
యానేభ్యః సరయూతీరమ్ అవతేరుర్వరాంగనాః || ౨౨ ||
కృతోదకం తే భరతేన సార్ధమ్
నృపాంగనా మంత్రిపురోహితాశ్చ |
పురం ప్రవిశ్యాశ్రుపరీతనేత్రాః
భూమౌ దశాహం వ్యనయంత దుఃఖమ్ || ౨౩ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే షట్సప్తతితమః సర్గః || ౭౬ ||
Ayodhya Kanda Sarga 76 Meaning In Telugu
మరునాడు తెల్లవారింది. భరతుడు వచ్చాడు అన్న వార్త విని కులగురువు వసిష్ఠుడు భరతుని వద్దకు వచ్చాడు. భరతునితో ఇలా అన్నాడు. “నాయనా భరతా! నీకు శభము అగుగాక! నీ తండ్రి మరణము గురించి దుఃఖించకుము. నీ తండ్రికి కర్మకాండలు జరిపించు.” అని పలికాడు. కులగురువు వసిష్ఠుని ఆదేశము ప్రకారము భరతుడు తన తండ్రికి ఉత్తర క్రియలు అన్ని యధావిధిగా జరిపించాడు. దశరథ మహారాజు శరీరమును తైలద్రోణిలో నుండి బయటకు తీసి నేల మీద ఉంచారు. తైల ద్రోణిలో ఉంచడం వల్ల మహారాజు శరీరములో ఏ మార్పూ రాలేదు. నిద్రపోతున్నట్టు ఉన్నడు దశరథుడు. తరువాత మహారాజును రత్నములు పొదిగిన శయ్యమీద పడుకోబెట్టారు. తన తండ్రి శవమును చూచి భరతుడు ఎంతో దు:ఖించాడు.
“మహారాజా! నేను ఇంట్లో లేని సమయం చూచి రాముని అడవులకు ఎందుకు పంపావు? అటువంటి నిర్ణయము ఎందుకు తీసుకున్నావు? నీకేం హాయిగా స్వర్గానికి వెళ్లావు. రాముడు లక్ష్మణునితో కలిసి అరణ్యములకు వెళ్లాడు. నేను జీవచ్ఛవము లాగా ఇక్కడ ఉన్నాను. ఇంక ఈ అయోధ్య యోగక్షేమములు ఎవరు చూస్తారు? మహారాజా! నీవులేని అయోధ్య చంద్రుడు లేని ఆకాశము వలె కళావిహీనంగా ఉంది.” అని విలపిస్తున్నాడు భరతుడు. ఆ ప్రకారంగా శోకిస్తున్న భరతుని చూచి వసిష్ఠుడు ఇలా అన్నాడు.
“భరతా! పోయినవారి గురించి చింతించి ప్రయోజనములేదు. జరుగవలసిన కార్యము గురించి ఆలోచించు. మహారాజుకు ప్రేతకర్మలు నిర్వర్తించు. మహారాజును ప్రేతత్వము నుండి విముక్తి కలిగించు.” అని అన్నాడు. అగ్ని గృహమునుండి ఋత్విక్కులు అగ్నిని తీసుకొని వచ్చారు. దశరథుని పార్థివశరీరమును బయటకుతీసుకొని వచ్చారు. ఆయన శరీరమును పల్లకీలో పరుండబెట్టారు. ఆ పల్లకిని ఊరేగింపుగా శ్మశానమునకు తీసుకొని వెళ్లారు. దారిలో పురజనులు ఆయన శరీరము మీద వెండి, బంగారము, పూలు చల్లారు. చందనము కర్రలతో చితిని పేర్చారు. సుగంధ ద్రవ్యములను చితిలో వేసారు. దశరథుని శరీరమును చితిమీద ఉంచారు. ఋత్విక్కులు హెమం చేసారు. వేదములు పఠించారు. దశరథుని భార్యలందరూ తమ తమ వాహనములలో శ్మశానమునకు చేరుకున్నారు.
ఋత్విక్కులు, దశరథుని భార్యలు దశరథుని చితికి అప్రదక్షిణంగా తిరిగారు. అంత:పుర స్త్రీలందరూ రోదిస్తున్నారు. భరతుడు దశరథుని చితికి నిప్పంటించాడు. భరతుడు, మహారాజు భార్యలు, అందరూ దశరథునికి జలతర్షణములు విడిచారు. పదిదినములు గడిచిపోయినవి.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము డెబ్బది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.