Ayodhya Kanda Sarga 77 In Telugu – అయోధ్యాకాండ సప్తసప్తతితమః సర్గః

అయోధ్యాకాండం సప్తసప్తతితమః సర్గలో, దశరథ మహారాజు రాముని వనవాసం పట్ల తీవ్ర విచారం, క్షోభతో మరణించిన తరువాత, అయోధ్యలో విషాద వాతావరణం నెలకొంటుంది. భరతుడు, శతృఘ్నుడు వారి మాతామహుడి యైన అశ్వపతికి చెరి అక్కడ విషాద వార్త వింటారు. తండ్రి మరణవార్త విని, భరతుడు తీవ్ర దుఃఖంతో అయోధ్యకు తిరిగి వస్తాడు. కైకేయి చేసిన పాపాన్ని తెలుసుకొని, భరతుడు ఆమె పట్ల ఆగ్రహంతో ఉంటాడు. అయోధ్య ప్రజలు భరతుని ఆగమనాన్ని చూసి, రాముని గదిని శూన్యంగా చూచి, రాముని గురించీ భరతుని ప్రశ్నిస్తారు. దశరథుడి మరణంతో, భరతుడు బాధతో కైకేయిని విసురుకుంటాడు.

భరతశత్రుఘ్నవిలాపః

తతర్దశాహేఽతిగతే కృతశౌచో నృపాత్మజః |
ద్వాదశేఽహని సంప్రాప్తే శ్రాద్ధకర్మాణ్యకారయత్ || ౧ ||

బ్రాహ్మణేభ్యో దదౌ రత్నం ధనమన్నం చ పుష్కలమ్ |
వాసాంసి చ మహార్హాణి రత్నాని వివిధాని చ || ౨ ||

బాస్తికం బహు శుక్లం చ గాశ్చాపి శతశస్తథా |
దాసీదాసం చ యానం చ వేశ్మాని సుమహాంతి చ || ౩ ||

బ్రాహ్మణేభ్యో దదౌ పుత్రః రాజ్ఞస్తస్యౌర్ధ్వదైహికమ్ |
తతః ప్రభాతసమయే దివసేఽథ త్రయోదశే || ౪ ||

విలలాప మహా బాహుర్భరతః శోకమూర్ఛితః |
శబ్దాపిహితకంఠశ్చ శోధనార్థముపాగతః || ౫ ||

చితామూలే పితుర్వాక్యమిదమాహ సుదుఃఖితః |
తాత యస్మిన్నిసృష్టోఽహం త్వయా భ్రాతరి రాఘవే || ౬ ||

తస్మిన్వనం ప్రవ్రజితే శూన్యే త్యక్తోఽస్మ్యహం త్వయా |
యథా గతిరనాథాయాః పుత్రః ప్రవ్రాజితః వనమ్ || ౭ ||

తామంబాం తాత కౌసల్యాం త్యక్త్వా త్వం క్వ గతర్నృప |
దృష్ట్వా భస్మారుణం తచ్చ దగ్ధాస్థిస్థానమండలమ్ || ౮ ||

పితుః శరీరనిర్వాణం నిష్టనన్ విషసాద సః |
స తు దృష్ట్వా రుదన్ దీనః పపాత ధరణీతలే || ౯ ||

ఉత్థాప్యమానః శక్రస్య యంత్ర ధ్వజైవచ్యుతః |
అభిపేతుస్తతః సర్వే తస్యామాత్యాః శుచివ్రతమ్ || ౧౦ ||

అంతకాలే నిపతితం యయాతిమృషయో యథా |
శత్రుఘ్నశ్చాపి భరతం దృష్ట్వా శోకపరిప్లుతమ్ || ౧౧ ||

విసంజ్ఞో న్యపతద్భూమౌ భూమి పాలమనుస్మరన్ |
ఉన్మత్తైవ నిశ్చేతా విలలాప సుదుఃఖితః || ౧౨ ||

స్మృత్వా పితుర్గుణాంగాని తని తాని తదా తదా |
మంథరాప్రభవస్తీవ్రః కైకేయీగ్రాహసంకులః || ౧౩ ||

వరదానమయోఽక్షోభ్యో అమజ్జయచ్ఛోకసాగరః |
సుకుమారం చ బాలం చ సతతం లాలితం త్వయా || ౧౪ ||

క్వ తాత భరతం హిత్వా విలపంతం గతః భవాన్ |
నను భోజ్యేషు పానేషు వస్త్రేష్వాభరణేషు చ || ౧౫ ||

ప్రవారయసి నః సర్వాన్ తన్నః కోఽన్య కరిష్యతి |
అవదారణ కాలే తు పృథివీ నావదీర్యతే || ౧౬ ||

యా విహీనా త్వయా రాజ్ఞా ధర్మజ్ఞేన మహాత్మనా |
పితరి స్వర్గమాపన్నే రామే చారణ్యమాశ్రితే || ౧౭ ||

కిం మే జీవితసామర్థ్యం ప్రవేక్ష్యామి హుతాశనమ్ |
హీనో భ్రాత్రా చ పిత్రా చ శూన్యామిక్ష్వాకు పాలితామ్ || ౧౮ ||

అయోధ్యాం న ప్రవేక్ష్యామి ప్రవేక్ష్యామి తపోవనమ్ |
తయోర్విలపితం శ్రుత్వా వ్యసనం చాన్వవేక్ష్య తత్ || ౧౯ ||

భృశమార్తతరా భూయః సర్వ ఏవానుగామినః |
తతః విషణ్ణౌ శ్రాంతౌ చ శత్రుఘ్నభరతావుభౌ || ౨౦ || [విశ్రాంతౌ]

ధరణ్యాం సంవ్యచేష్టేతాం భగ్నశృంగావివర్షభౌ |
తతః ప్రకృతిమాన్ వైద్యః పితురేషాం పురోహితః || ౨౧ ||

వసిష్ఠో భరతం వాక్యముత్థాప్య తమువాచ హ |
త్రయోదశోఽయం దివసః పితుర్వృత్తస్య తే విభో || ౨౨ ||

సావశేషాస్థినిచయే కిమిహ త్వం విలంబసే |
త్రీణి ద్వంద్వాని భూతేషు ప్రవృత్తాన్యవిశేషతః || ౨౩ ||

తేషు చాపరిహార్యేషు నైవం భవితుమర్హతి |
సుమంత్రశ్చాపి శత్రుఘ్నముత్థాప్యాభిప్రసాద్య చ || ౨౪ ||

శ్రావయామాస తత్త్వజ్ఞః సర్వభూతభవాభవౌ |
ఉత్థితౌ తౌ నరవ్యాఘ్రౌ ప్రకాశేతే యశస్వినౌ || ౨౫ ||

వర్షాతప పరిక్లిన్నౌ పృథగింద్రధ్వజావివ |
అశ్రూణి పరిమృద్నంతౌ రక్తాక్షౌ దీనభాషిణౌ |
అమాత్యాస్త్వరయంతి స్మ తనయౌ చాపరాః క్రియాః || ౨౬ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తసప్తతితమః సర్గః || ౭౭ ||

Ayodhya Kanda Sarga 77 Meaning In Telugu

దశరథుడు మరణించిన పదవ రోజున శుద్ధిజరిగింది. పన్నెండవ రోజున మహారాజుకు శ్రాద్ధ కర్మలు భరతుడు నిర్వర్తించాడు. శ్రాద్ధ కర్మను పురస్కరించుకొని భరతుడు బ్రాహ్మణులకు, ఋత్విక్కులకు, బంగారము, వెండి, భూదానము, గోదానము, గృహదానము, వాహన దానము, వస్త్రదానములు విరివిగా చేసాడు. పదమూడవ రోజున భరతుడు అస్థిసంచయనము కొరకు శ్మశానమునకు వెళ్లాడు. తండ్రిచితిని చూచి భరతుడు తనలో తాను ఇలా అనుకున్నాడు.

“తండ్రీ! నన్ను నీవు రామునికి అప్పగించావు. నీవు వెళ్లిపోయావు. రాముడు నన్ను వదిలి అరణ్యములకు వెళ్లిపోయాడు. నేను ఒంటరిగా మిగిలిపోయాను. రాముడు అరణ్యములకు పోగా, కౌసల్య నిన్ను చూచుకొని జీవించుచున్నది. ఇప్పుడు నువ్వుకూడా ఆమెను ఒంటరిని చేసి వెళ్లిపోయావు.” అని పరిపరి విధాల ఏడుస్తున్నాడు.

ఆజానుబాహుడు అయిన దశరథుని కాష్టములో బూడిద చిన్న కుప్పగా పడి ఉండడం చూచి ఏడుపు ఆపుకోలేకపోయాడు. అస్థికలను ఏరుతూ కింద పడిపోయాడు. పక్కనే ఉన్న మంత్రులు భరతుని పట్టుకున్నారు. ఇదంతా చూచిన శత్రుఘ్నునికి దు:ఖము ఆగలేదు. పిచ్చివాడి వలె ఏడుస్తున్నాడు.

“తండ్రీ! కైక కోరిన కోరికలు అనే సముద్రంలో పడి మునిగి పోయావా! నీవు భరతుని ఎంతో గారాబం చేసావే. అటువంటి భరతుడు ఏడుస్తున్నాడు. ఓదార్చవా! మాకు కావలసిన వస్త్రములు, భోజనపదార్థములు ఏమి కావలిస్తే అవి మాకు తెచ్చి ఇచ్చే వాడివి. ఇప్పుడు మాకు ఎవరు తెచ్చి ఇస్తారు. ధర్మాత్ముడవు అయిన నీవు పోగానే ఈ భూమి బ్రద్దలు కావాల్సింది. కాని ఎందుకో అలా జరగలేదు. తండ్రీ! మీరు వెళ్లిపోయారు. రాముడు అరణ్యములకు వెళ్లాడు. ఇంక నేను ఎవరిని చూచుకొని బతకాలి. నేనుకూడా అగ్నిప్రవేశము చేస్తాను. లేని ఎడల తపోవృత్తిని స్వీకరించి అడవులకు వెళతాను. అంతేకానీ అయోధ్యలో అడుగుపెట్టను.” అని ఏడుస్తున్నాడు శత్రుఘ్నుడు.

ఆ అన్నదమ్ముల శోకమును చూచి అక్కడ ఉన్నవారికి కూడా దు:ఖము ఆగలేదు. అప్పుడు వసిష్ఠుడు వారి వద్దకు వచ్చి ఇలా అన్నాడు. “భరతా! నీ తండ్రి మరణించి నేటికి పదమూడవ దినము. నీవు అస్థి సంచయనము చేయవలెను. ఇంకనూ నీవు ఇలా శోకిస్తూ కూర్చుంటే ప్రయోజనమేమి? సకల జనులకు మూడు అవస్థలు తప్పవు. అవే ఆకలి దప్పులు, సుఖదుఃఖములు, జరామరణములు. ధనికుడైనా,

పేదవాడైనా, మహారాజైనా కటిక దరిద్రుడైనా ఇవి అనుభవించ వలసినదే. కాబట్టి నీ తండ్రి మరణము గురించి చింతించడం అవివేకము.” అని అన్నాడు. సుమంత్రుడు శత్రుఘ్నుని ఓదార్చాడు. వారి ఓదార్పుమాటలతో భరత శత్రుఘ్నులు తమ శోకమును విడిచిపెట్టారు. తదుపరి కార్యక్రమమును నిర్వర్తించారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము డెబ్బది ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్

అయోధ్యాకాండ అష్టసప్తతితమః సర్గః (78) >>

Leave a Comment