Balakanda Sarga 18 In Telugu – బాలకాండ అష్టాదశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ అష్టాదశః సర్గంలో, విశ్వామిత్రుడు రామ, లక్ష్మణులతో కలిసి మిథిలానగరికి ప్రయాణం ప్రారంభిస్తారు. మార్గంలో, విశ్వామిత్రుడు సుగ్రీవుడి కథను రాముడికి వివరిస్తారు. సుగ్రీవుడు తన సోదరుడు వాలి చేత అవమానితుడై, తన రాజ్యం కోల్పోయాడు. తరువాత, వారు గంగా నది తీరానికి చేరుకుంటారు. అక్కడ విశ్వామిత్రుడు గంగా నది ఉద్భవ కథను వివరిస్తాడు. ఈ ప్రయాణంలో రాముడు, లక్ష్మణుడు గురువు మాటలను ఆసక్తితో వింటారు.

శ్రీరామాద్యవతారః

నిర్వృత్తే తు క్రతౌ తస్మిన్హయమేధే మహాత్మనః |
ప్రతిగృహ్య సురా భాగాన్ ప్రతిజగ్ముర్యథాగతమ్ ||

1

సమాప్తదీక్షానియమః పత్నీగణసమన్వితః |
ప్రవివేశ పురీం రాజా సభృత్యబలవాహనః ||

2

యథార్హం పూజితాస్తేన రాజ్ఞా వై పృథివీశ్వరాః |
ముదితాః ప్రయయుర్దేశాన్ప్రణమ్య మునిపుంగవమ్ ||

3

శ్రీమతాం గచ్ఛతాం తేషాం స్వపురాణి పురాత్తతః |
బలాని రాజ్ఞాం శుభ్రాణి ప్రహృష్టాని చకాశిరే ||

4

గతేషు పృథివీశేషు రాజా దశరథస్తదా |
ప్రవివేశ పురీం శ్రీమాన్పురస్కృత్య ద్విజోత్తమాన్ ||

5

శాంతయా ప్రయయౌ సార్ధమృశ్యశృంగః సుపూజితః |
అన్వీయమానో రాజ్ఞాఽథ సానుయాత్రేణ ధీమతా ||

6

ఏవం విసృజ్య తాన్సర్వాన్రాజా సంపూర్ణమానసః |
ఉవాస సుఖితస్తత్ర పుత్రోత్పత్తిం విచింతయన్ ||

7

తతో యజ్ఞే సమాప్తే తు ఋతూనాం షట్సమత్యయుః |
తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ ||

8

నక్షత్రేఽదితిదైవత్యే స్వోచ్చసంస్థేషు పంచసు |
గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతావిందునా సహ ||

9

ప్రోద్యమానే జగన్నాథం సర్వలోకనమస్కృతమ్ |
కౌసల్యాఽజనయద్రామం దివ్యలక్షణసంయుతమ్ ||

10

విష్ణోరర్ధం మహాభాగం పుత్రమైక్ష్వాకువర్ధనమ్ |
[* లోహితాక్షం మహాబాహుం రక్తోష్ఠం దుందుభిస్వనమ్ | *]
కౌసల్యా శుశుభే తేన పుత్రేణామిత తేజసా ||

11

యథా వరేణ దేవానామదితిర్వజ్రపాణినా |
భరతో నామ కైకేయ్యాం జజ్ఞే సత్యపరాక్రమః ||

12

సాక్షాద్విష్ణోశ్చతుర్థభాగః సర్వైః సముదితో గుణైః |
అథ లక్ష్మణశత్రుఘ్నౌ సుమిత్రాజనయత్సుతౌ ||

13

సర్వాస్త్రకుశలౌ వీరౌ విష్ణోరర్ధసమన్వితౌ |
పుష్యే జాతస్తు భరతో మీనలగ్నే ప్రసన్నధీః ||

14

సార్పే జాతౌ చ సౌమిత్రీ కులీరేఽభ్యుదితే రవౌ |
రాజ్ఞః పుత్రా మహాత్మానశ్చత్వారో జజ్ఞిరే పృథక్ ||

15

గుణవంతోఽనురూపాశ్చ రుచ్యా ప్రోష్ఠపదోపమాః |
జగుః కలం చ గంధర్వా ననృతుశ్చాప్సరోగణాః ||

16

దేవదుందుభయో నేదుః పుష్పవృష్టిశ్చ ఖాచ్చ్యుతా |
ఉత్సవశ్చ మహానాసీదయోధ్యాయాం జనాకులః ||

17

రథ్యాశ్చ జనసంబాధా నటనర్తకసంకులాః |
గాయనైశ్చ విరావిణ్యో వాదకైశ్చ తథాఽపరైః ||

18

[* విరేజుర్విపులాస్తత్ర సర్వ రత్న సమన్వితాః | *]
ప్రదేయాంశ్చ దదౌ రాజా సూతమాగధవందినామ్ |
బ్రాహ్మణేభ్యో దదౌ విత్తం గోధనాని సహస్రశః ||

19

అతీత్యైకాదశాహం తు నామకర్మ తథాఽకరోత్ |
జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకయీసుతమ్ ||

20

సౌమిత్రిం లక్ష్మణమితి శత్రుఘ్నమపరం తథా |
వసిష్ఠః పరమప్రీతో నామాని కృతవాంస్తదా ||

21

బ్రాహ్మణాన్భోజయామాస పౌరజానపదానపి |
అదదద్బ్రాహ్మణానాం చ రత్నౌఘమమితం బహు ||

22

తేషాం జన్మక్రియాదీని సర్వకర్మాణ్యకారయత్ |
తేషాం కేతురివ జ్యేష్ఠో రామో రతికరః పితుః ||

23

బభూవ భూయో భూతానాం స్వయంభూరివ సంమతః |
సర్వే వేదవిదః శూరాః సర్వే లోకహితే రతాః ||

24

సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః |
తేషామపి మహాతేజా రామః సత్యపరాక్రమః ||

25

ఇష్టః సర్వస్య లోకస్య శశాంక ఇవ నిర్మలః |
గజస్కంధేఽశ్వపృష్టే చ రథచర్యాసు సంమతః ||

26

ధనుర్వేదే చ నిరతః పితృశుశ్రూషణే రతః |
బాల్యాత్ప్రభృతి సుస్నిగ్ధో లక్ష్మణో లక్ష్మివర్ధనః ||

27

రామస్య లోకరామస్య భ్రాతుర్జ్యేష్ఠస్య నిత్యశః |
సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః ||

28

లక్ష్మణో లక్ష్మిసంపన్నో బహిఃప్రాణ ఇవాపరః |
న చ తేన వినా నిద్రాం లభతే పురుషోత్తమః ||

29

మృష్టమన్నముపానీతమశ్నాతి న హి తం వినా |
యదా హి హయమారూఢో మృగయాం యాతి రాఘవః ||

30

తదైనం పృష్ఠతోఽభ్యేతి సధనుః పరిపాలయన్ |
భరతస్యాపి శత్రుఘ్నో లక్ష్మణావరజో హి సః ||

31

ప్రాణైః ప్రియతరో నిత్యం తస్య చాసీత్తథా ప్రియః |
స చతుర్భిర్మహాభాగైః పుత్రైర్దశరథః ప్రియైః ||

32

బభూవ పరమప్రీతో వేదైరివ పితామహః |
తే యదా జ్ఞానసంపన్నాః సర్వే సముదితా గుణైః ||

33

హ్రీమంతః కీర్తిమంతశ్చ సర్వజ్ఞా దీర్ఘదర్శినః |
తేషామేవం ప్రభావానాం సర్వేషాం దీప్తతేజసామ్ ||

34

పితా దశరథో హృష్టో బ్రహ్మా లోకాధిపో యథా |
తే చాపి మనుజవ్యాఘ్రా వైదికాధ్యయనే రతాః ||

35

పితృశుశ్రూషణరతా ధనుర్వేదే చ నిష్ఠితాః |
అథ రాజా దశరథస్తేషాం దారక్రియాం ప్రతి ||

36

చింతయామాస ధర్మాత్మా సోపాధ్యాయః సబాంధవః |
తస్య చింతయమానస్య మంత్రిమధ్యే మహాత్మనః ||

37

అభ్యాగచ్ఛన్మహాతేజా విశ్వామిత్రో మహామునిః |
స రాజ్ఞో దర్శనాకాంక్షీ ద్వారాధ్యక్షానువాచ హ ||

38

శీఘ్రమాఖ్యాత మాం ప్రాప్తం కౌశికం గాధినః సుతమ్ |
తచ్ఛ్రుత్వా వచనం త్రాసాద్రాజ్ఞో వేశ్మ ప్రదుద్రువుః ||

39

సంభ్రాంతమనసః సర్వే తేన వాక్యేన చోదితాః |
తే గత్వా రాజభవనం విశ్వామిత్రమృషిం తదా ||

40

ప్రాప్తమావేదయామాసుర్నృపాయైక్ష్వాకవే తదా |
తేషాం తద్వచనం శ్రుత్వా సపురోధాః సమాహితః ||

41

ప్రత్యుజ్జగామ తం హృష్టో బ్రహ్మాణమివ వాసవః |
తం దృష్ట్వా జ్వలితం దీప్త్యా తాపసం సంశితవ్రతమ్ ||

42

ప్రహృష్టవదనో రాజా తతోఽర్ఘ్యం సముపాహరత్ |
స రాజ్ఞః ప్రతిగృహ్యార్ఘ్యం శాస్త్రదృష్టేన కర్మణా ||

43

కుశలం చావ్యయం చైవ పర్యపృచ్ఛన్నరాధిపమ్ |
పురే కోశే జనపదే బాంధవేషు సుహృత్సు చ ||

44

కుశలం కౌశికో రాజ్ఞః పర్యపృచ్ఛత్సుధార్మికః |
అపి తే సన్నతాః సర్వే సామంతా రిపవో జితాః ||

45

దైవం చ మానుషం చాపి కర్మ తే సాధ్వనుష్ఠితమ్ |
వసిష్ఠం చ సమాగమ్య కుశలం మునిపుంగవః ||

46

ఋషీంశ్చాన్యాన్యథాన్యాయం మహాభాగానువాచ హ |
తే సర్వే హృష్టమనసస్తస్య రాజ్ఞో నివేశనమ్ ||

47

వివిశుః పూజితాస్తత్ర నిషేదుశ్చ యథార్హతః |
అథ హృష్టమనా రాజా విశ్వామిత్రం మహామునిమ్ ||

48

ఉవాచ పరమోదారో హృష్టస్తమభిపూజయన్ |
యథాఽమృతస్య సంప్రాప్తిర్యథా వర్షమనూదకే ||

49

యథా సదృశదారేషు పుత్రజన్మాప్రజస్య వై |
ప్రనష్టస్య యథా లాభో యథా హర్షో మహోదయే ||

50

తథైవాగమనం మన్యే స్వాగతం తే మహామునే |
కం చ తే పరమం కామం కరోమి కిము హర్షితః ||

51

పాత్రభూతోఽసి మే బ్రహ్మన్దిష్ట్యా ప్రాప్తోఽసి ధార్మిక |
అద్య మే సఫలం జన్మ జీవితం చ సుజీవితమ్ ||

52

[* యస్మాద్విప్రేంద్రమద్రాక్షం సుప్రభాతా నిశా మమ | *]
పూర్వం రాజర్షిశబ్దేన తపసా ద్యోతితప్రభః |
బ్రహ్మర్షిత్వమనుప్రాప్తః పూజ్యోఽసి బహుధా మయా ||

53

తదద్భుతమిదం బ్రహ్మన్ పవిత్రం పరమం మమ |
శుభక్షేత్రగతశ్చాహం తవ సందర్శనాత్ప్రభో ||

54

బ్రూహి యత్ప్రార్థితం తుభ్యం కార్యమాగమనం ప్రతి |
ఇచ్ఛామ్యనుగృహీతోఽహం త్వదర్థపరివృద్ధయే ||

55

కార్యస్య న విమర్శం చ గంతుమర్హసి కౌశిక |
కర్తా చాహమశేషేణ దైవతం హి భవాన్మమ ||

56

మమ చాయమనుప్రాప్తో మహానభ్యుదయో ద్విజ |
తవాగమనజః కృత్స్నో ధర్మశ్చానుత్తమో మమ ||

57

ఇతి హృదయసుఖం నిశమ్య వాక్యం
శ్రుతిసుఖమాత్మవతా వినీతముక్తమ్ |
ప్రథితగుణయశా గుణైర్విశిష్టః
పరమ ఋషిః పరమం జగామ హర్షమ్ ||

58

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే అష్టాదశః సర్గః ||

Balakanda Sarga 18 Meaning In Telugu

దశరథుడు తలపెట్టిన అశ్వమేధ యాగము, పుత్రుల కొరకు చేసిన యాగము పూర్తి అయ్యాయి. తమ తమ హవిర్భాగములను తీసుకొని దేవతలు తమ తమ స్థానములకు వెళ్లిపోయారు. పత్నీ సమేతంగా అయోధ్యా నగరంలో ప్రవేశించాడు. తరువాత ఋష్య శృంగుడు తన భార్య శాంతతోనూ, రోమపాదుని తోనూ అంగదేశము నకు వెళ్లిపోయాడు. అందరూ తమ తమ స్థానములకు వెళ్లిపోయిన తరువాత దశరథుడు పుత్రోదయం కొరకు ఎదురు చూస్తున్నాడు.

యజ్ఞము పూర్తి అయి ఒక సంవత్సరము గడిచింది. మరలా చైత్రమాసము వచ్చింది. వసంత ఋతువులో, చైత్రమాసములో, పునర్వసు నక్షత్రము నాడు, నవమి తిథి యందు, ఐదు గ్రహములు ఉచ్ఛ స్థానములో ఉండగా, కర్కాటక లగ్నమందు, కౌసల్యాదేవి గర్భవాసమున, సర్వలక్షణ సమన్వితుడు, సకల లోకములచే పూజింప తగినవాడు, విష్ణువు యొక్క ప్రథమ అంశ ఐన వాడు, మహాభాగుడు, ఇక్ష్వాకు వంశ వర్ధనుడు అయిన రాముడు జన్మించాడు.

విష్ణువులో నాల్గవభాగము అయిన వాడు, సత్యవంతుడు, పరాక్రమ వంతుడు, సకల సద్గుణ సంపన్నుడు అగు భరతుడు పుష్యమీ నక్షత్రంలో మీన లగ్నంలో కైకేయీ గర్భ వాసమున జన్మించాడు.

సర్వ అస్త్ర కుశలురు, వీరులు, విష్ణువులో నాలుగవ వంతు అంశ కలవారు అయిన లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేషా నక్షత్రంలో, కర్కాటక లగ్నంలో సుమిత్రా గర్భ వాసాన జన్మించారు.

ఆ ప్రకారంగా దశరథునకు ముగ్గురు భార్యల యందు నలుగురు కుమారులు జన్మించారు. ఆ సమయంలో గంధర్వులు గానం చేసారు. దేవ దుందుభులు మోగాయి. అయోధ్యలో సంబరాలు మిన్నుముట్టాయి. దశరథుడు ఎన్నో దాన ధర్మాలు చేసాడు. పారితోషికాలు ఇచ్చాడు.

పదకొండవ రోజున నామకరణ మహోత్సవము జరిగింది. జ్యేష్ట పుత్రునకు రాముడు అనీ, తరువాత పుట్టిన కైకేయి సుతునకు భరతుడు అనీ, తరువాత పుట్టిన సుమిత్రా నందనులకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అనీ కుల గురువు, పురోహితుడు అయిన వసిష్టుడు నామకరణం చేసాడు. ఆ నామకరణ సందర్భంలో దశరథుడు బ్రాహ్మణులకు, అయోధ్యా పౌరులకు, జానపదులకు, సంతర్పణలు చేసాడు. వారికి ఎన్నో కానుకలు, దక్షిణలు ఇచ్చాడు.

తరువాత దశరథుడు తన కుమారులకు నామకరణము తరువాత జరిగే అన్ని సంస్కారములు యధావిధిగా అత్యంత వైభవంగా జరిపించాడు.

దశరధుని కుమారులందరిలోకి రాముడు చుక్కల్లో చంద్రుని వలె దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు. రాకుమారులందరూ అన్ని విద్యలు అవలీలగా నేర్చుకుంటున్నారు. రాముడు గజములు, అశ్వములు, రథముల మీద ఎక్కియుద్ధము చేయుటలో నేర్పు సంపాదించాడు. రాముడు ధనుర్వేదము నందు ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. అలాగే తండ్రి ఎడల ఎనలేని భక్తి శ్రద్ధలు చూపేవాడు. తండ్రికి సేవ చెయ్యడంలో ఎంతో ఆసక్తి కనపరిచేవాడు రాముడు.

రాముడు ఇలా ఉంటే లక్ష్మణుడికి అన్న రాముడు అంటే ఎనలేని ప్రేమ. రాముని విడిచి పెట్టి క్షణం కూడా ఉండే వాడు కాదు. చూచేవాళ్లకు ఇద్దరి శరీరములు వేరు కానీ, ప్రాణము ఒకటే అన్నట్టు ఉండేవాళ్లు. అలాగే రాముడు కూడా లక్ష్మణుని చూడంది ఒక్క క్షణం కూడా ఉండలేడు. రాత్రిళ్లు కూడా లక్ష్మణుడు పక్కన లేనిది నిద్రపోయేవాడు కాదు. ఆహార, నిద్రా, విహారలలో రాముడు లక్ష్మణుని విడిచి ఉండేవాడు కాదు. రాముడు వేటకు వెళితే లక్ష్మణుడు ధనుస్సు చేత పట్టుకొని అన్న వెంట రక్షణగా వెళ్లేవాడు.

రామ లక్ష్మణులు ఇలా ఉంటే, భరత శత్రుఘ్నులు కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవారు. ఒకరి మీద ఒకరు ప్రేమానురాగాలు కలిగిన నలుగురు కుమారులను చూచుకొని దశరథుడు పొంగిపోయేవాడు. నా కన్న అదృష్టవంతుడు ముల్లోకాలలో లేడని సంబరపడిపోయేవాడు దశరథుడు.

ఇంతలో రామలక్ష్మణభరతశత్రుఘ్నులకు వివాహ వయస్సు వచ్చింది. నలుగురికీ వివాహములు చేయవలెనని సంకల్పించాడు దశరథుడు. పురోహితులతోనూ, బంధుమిత్రులతోనూ ఆలోచిస్తున్నాడు.

ఇది ఇలా ఉండగా, ఒక రోజు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చాడు. విశ్వామిత్ర మహర్షి రాకను తెలుసుకొన్న దశరథుడు తన భార్యలతో సహా ఆయనకు ఎదురు వెళ్లి ఆయనను సాదరంగా ఆహ్వానించాడు. అర్ఘ్య పాద్యములు ఇచ్చి సత్కరించాడు. ఉచితాసనము మీద ఆసీనుని చేసాడు.

“ఓ దశరథ మహారాజా! నీ రాజ్యములో ప్రజలందరూ క్షేమమే కదా! నీ మిత్రులు బంధువులు క్షేమంగా ఉన్నారు కదా! నీ ధనాగారము సమృద్ధిగా ఉన్నదా! నీ సామంత రాజులు నీకు అణిగి మణిగి ఉన్నారు కదా! నీకు శత్రుభయము లేదు కదా! నీవు దేవతలకు ప్రీతిగా యజ్ఞ యాగములు చేయుచున్నావా! ” అని అడిగాడు. తరువాత దశరథుని ఆస్థానములో ఉన్న వసిష్టుని మిగిలిన ఋషులను కుశల ప్రశ్నలు వేసాడు. అందరి క్షేమ సమాచారములు తెలుసుకొన్నాడు విశ్యామిత్రుడు.

” ఓ విశ్వామిత్ర మహర్షీ! నీరాకతో మా మందిరము పావనమైనది. తమరి దయ వలన అందరమూ క్షేమముగా ఉన్నాము. తమరు రాజర్షులు, బ్రహ్మర్షులు. మాకు అత్యంత పూజనీయులు. తమరి రాకకు కారణమేమి! సెలవివ్వండి! అది ఎంతటి క్లిష్టతరమైన కార్మము అయినను నెరవేరుస్తాను. ఎందుకంటే తమరు నాకు దైవ సమానులు.” అని వినయంగా అడిగాడు దశరథుడు.

దశరథుడు పలికిన మాటలు వినిన విశ్యామిత్రుడు ఎంతో సంతోషించాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పదునెనిమిదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్

బాలకాండ ఏకోనవింశః సర్గః (19) >>

Leave a Comment