Balakanda Sarga 38 In Telugu – బాలకాండ అష్టత్రింశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ అష్టత్రింశః సర్గః: రామాయణంలోని బాలకాండలో అష్టత్రింశః సర్గః ఒక ప్రధాన భాగం. ఈ సర్గలో రాముడు మరియు లక్ష్మణుడు విశ్వామిత్రుడితో కలిసి జనక మహారాజు యజ్ఞానికి చేరుతారు. అక్కడ వారు శివుని ధనుస్సును (ధనుర్బాణాన్ని) దర్శిస్తారు. జనకుడు, శివుని వును ఎవరైతే విరిచివేస్తారో, ఆ వ్యక్తికి తన కుమార్తె సీతను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తాడు.

సగరపుత్రజన్మ

తాం కథాం కౌశికో రామే నివేద్య మధురాక్షరమ్ |
పునరేవాపరం వాక్యం కాకుత్స్థమిదమబ్రవీత్ ||

1

అయోధ్యాధిపతిః శూరః పూర్వమాసీన్నరాధిపః |
సగరో నామ ధర్మాత్మా ప్రజాకామః స చాప్రజాః ||

2

వైదర్భదుహితా రామ కేశినీ నామ నామతః |
జ్యేష్ఠా సగరపత్నీ సా ధర్మిష్ఠా సత్యవాదినీ ||

3

అరిష్టనేమిదుహితా రూపేణాప్రతిమా భువి |
ద్వితీయా సగరస్యాసీత్పత్నీ సుమతిసంజ్ఞితా ||

4

తాభ్యాం సహ తదా రాజా పత్నీభ్యాం తప్తవాంస్తపః |
హిమవంతం సమాసాద్య భృగుప్రస్రవణే గిరౌ ||

5

అథ వర్షశతే పూర్ణే తపసాఽఽరాధితో మునిః |
సగరాయ వరం ప్రాదాద్భృగుః సత్యవతాం వరః ||

6

అపత్యలాభః సుమహాన్భవిష్యతి తవానఘ |
కీర్తిం చాప్రతిమాం లోకే ప్రాప్స్యసే పురుషర్షభ ||

7

ఏకా జనయితా తాత పుత్రం వంశకరం తవ |
షష్టిం పుత్రసహస్రాణి అపరా జనయిష్యతి ||

8

భాషమాణం మహాత్మానం రాజపుత్ర్యౌ ప్రసాద్య తమ్ |
ఊచతుః పరమప్రీతే కృతాంజలిపుటే తదా ||

9

ఏకః కస్యాః సుతో బ్రహ్మన్కా బహూన్జనయిష్యతి |
శ్రోతుమిచ్ఛావహే బ్రహ్మన్సత్యమస్తు వచస్తవ ||

10

తయోస్తద్వచనం శ్రుత్వా భృగుః పరమధార్మికః |
ఉవాచ పరమాం వాణీం స్వచ్ఛందోఽత్ర విధీయతామ్ ||

11

ఏకో వంశకరో వాఽస్తు బహవో వా మహాబలాః |
కీర్తిమంతో మహోత్సాహాః కా వా కం వరమిచ్ఛతి ||

12

మునేస్తు వచనం శ్రుత్వా కేశినీ రఘునందన |
పుత్రం వంశకరం రామ జగ్రాహ నృపసన్నిధౌ ||

13

షష్టిం పుత్రసహస్రాణి సుపర్ణభగినీ తదా |
మహోత్సాహాన్కీర్తిమతో జగ్రాహ సుమతిః సుతాన్ ||

14

ప్రదక్షిణమృషిం కృత్వా శిరసాఽభిప్రణమ్య చ |
జగామ స్వపురం రాజా సభార్యో రఘునందన ||

15

అథ కాలే గతే తస్మిన్ జ్యేష్ఠా పుత్రం వ్యజాయత |
అసమంజ ఇతి ఖ్యాతం కేశినీ సగరాత్మజమ్ ||

16

సుమతిస్తు నరవ్యాఘ్ర గర్భతుంబం వ్యజాయత |
షష్టిః పుత్రాః సహస్రాణి తుంబభేదాద్వినిస్సృతాః ||

17

ఘృతపూర్ణేషు కుంభేషు ధాత్ర్యస్తాన్సమవర్ధయన్ |
కాలేన మహతా సర్వే యౌవనం ప్రతిపేదిరే ||

18

అథ దీర్ఘేణ కాలేన రూపయౌవనశాలినః |
షష్టిః పుత్రసహస్రాణి సగరస్యాభవంస్తదా ||

19

స చ జ్యేష్ఠో నరశ్రేష్ఠః సగరస్యాత్మసంభవః |
బాలాన్గృహీత్వా తు జలే సరయ్వా రఘునందన ||

20

ప్రక్షిప్య ప్రహసన్నిత్యం మజ్జతస్తాన్నిరీక్ష్య వై |
ఏవం పాపసమాచారః సజ్జనప్రతిబాధకః ||

21

పౌరాణామహితే యుక్తః పుత్రో నిర్వాసితః పురాత్ |
తస్య పుత్రోంశుమాన్నామ అసమంజస్య వీర్యవాన్ ||

22

సమ్మతః సర్వలోకస్య సర్వస్యాపి ప్రియం వదః |
తతః కాలేన మహతా మతిః సమభిజాయత |
సగరస్య నరశ్రేష్ఠ యజేయమితి నిశ్చితా ||

23

స కృత్వా నిశ్చయం రామ సోపాధ్యాయగణస్తదా |
యజ్ఞకర్మణి వేదజ్ఞో యష్టుం సముపచక్రమే ||

24

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే అష్టత్రింశః సర్గః ||

Balakanda Sarga 38 Meaning In Telugu

” ఓ రామా! ఇప్పుడు నీకు సగరుడి కధ చెబుతాను విను. పూర్వము అయోధ్యా నగరమును సగరుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు.ఆయనకు పుత్ర సంతానము లేదు. విదర్భ రాజు కుమారి కేశిని అతని మొదటి భార్య.. సుమతి ఆయన రెండవ భార్య..

పుత్ర సంతానము కొరకు సగరుడు ఇద్దరు భార్యలతో సహా హిమవత్పర్వతమునకు పోయి అక్కడ భృగుప్రస్రవణము అనే పర్వతము మీద నూరు సంవత్సరముల పాటు తపస్సు చేసారు. వారి తపస్సునకు మెచ్చిన భృగు మహర్షి వారికి పుత్ర సంతానము ప్రసాదించాడు.

“ఓ సగర చక్రవర్తీ! నీకు ఒక భార్య యందు ఒక కుమారుడు, మరొక భార్య యందు అరవైవేల మంది కుమారులు జన్మిస్తారు.” అని వరము ఇచ్చాడు. వారు ఎంతో సంతోషించారు.

కాని వారికి ఒక సందేహము కలిగింది. ” ఓ మహర్షీ! మాలో ఎవరికి ఒక పుత్రుడు కలుగుతాడు.” అని అడిగారు.

“ఆ విషయం మీలో మీరే తేల్చుకోండి.” అని అన్నాడు.

భృగుమహర్షి

అప్పుడు కేశిని ” ఓ మహర్షి! నాకు వంశము నిలిపే ఒక కుమారుని ప్రసాదించండి.” అని కోరుకుంది.
రెండవ భార్య సుమతి “నాకు 60,000 వేల మంది కుమారులను ప్రసాదించండి.” అని కోరుకుంది.

భృగుమహర్షి వారిని ఆ ప్రకారము అనుగ్రహించాడు. భృగుమహర్షికి నమస్కరించి అయోధ్యకు తిరిగి వచ్చారు. కాలక్రమేణా ఇరువురు గర్భములు ధరించారు. పెద్ద భార్య కేశిని అసమంజుడు అనే కుమారుని ప్రసవించింది. రెండవ భార్య ఒక పెద్ద పిండమును ప్రసవించింది. అది పగిలి అందులో నుండి 60,000 మంది పుత్రులు జన్మించారు. వారందరూ పెరిగి పెద్ద వారు అయ్యారు.

వారందరూ ఆటలు ఆడుతు ఉండగా పెద్దవాడు మిగిలిన వారిని నీటిలో ముంచి, వారు అరిచి కేకలు పెడుతుంటే, ఆనందించేవాడు. అనేక రకములైన పాప కార్యములను చేయుతూ జనులను బాధ పెడుతూ ఉండేవాడు. వాడి బాధ పడలేక సగరుడు అసమంజుని రాజ్యమునుండి వెళ్లగొట్టాడు. ఆ అసమంజుని పుత్రుడు అంశు మంతుడు. అతడు తండ్రి మాదిరి కాకుండా ఎంతో ధార్మికుడు. సజ్జనుడు. అందరూ అతను అంటే ఇష్టపడేవారు.

కొంత కాలము తరువాత సగరుడు ఒక యజ్ఞమే చేయ సంకల్పించాడు. పురోహితులను, ఋత్తిక్కులను సంప్రదించాడు. యజ్ఞమునకు కావలసిన సంభారములు సమకూర్చుకున్నాడు. యజ్ఞము చేయ పూనుకున్నాడు.

శ్రీమద్రామాయణము
బాల కాండ ముప్పది ఎనిమిదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

బాలకాండ ఏకోనచత్వారింశః సర్గః (39) >>

Leave a Comment