మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ అష్టావింశః సర్గలో పరశురాముడు శ్రీరాముడిని పరీక్షించడానికి వచ్చాడు. శివధనస్సు విరగడం విని, తన విష్ణు ధనస్సుతో శ్రీరాముడిని పరీక్షించాలని అనుకుంటాడు. శ్రీరాముడు ఆ ధనస్సును సునాయాసంగా ఎత్తి, తన శక్తిని ప్రదర్శిస్తాడు. పరశురాముడు శ్రీరాముని పరాక్రమాన్ని తెలుసుకుని, తన అహంకారాన్ని విడిచి వేస్తాడు. ఆ తర్వాత, శ్రీరాముడు నిజమైన విష్ణువు అవతారమని గుర్తించి, పరశురాముడు తన శస్త్రాలను సమర్పించి, అక్కడి నుండి నిష్క్రమిస్తాడు.
అస్త్రసంహారగ్రహణమ్
ప్రతిగృహ్య తతోఽస్త్రాణి ప్రహృష్టవదనః శుచిః |
గచ్ఛన్నేవ చ కాకుత్స్థో విశ్వామిత్రమథాబ్రవీత్ ||
1
గృహీతాస్త్రోఽస్మి భగవన్దురాధర్షః సురాసురైః |
అస్త్రాణాం త్వహమిచ్ఛామి సంహారం మునిపుంగవ ||
2
ఏవం బ్రువతి కాకుత్స్థే విశ్వామిత్రో మహామతిః |
సంహారం వ్యాజహారాథ ధృతిమాన్సువ్రతః శుచిః ||
3
సత్యవంతం సత్యకీర్తిం ధృష్టం రభసమేవ చ |
ప్రతిహారతరం నామ పరాఙ్ముఖమవాఙ్ముఖమ్ ||
4
లక్షాక్షవిషమౌ చైవ దృఢనాభ సునాభకౌ |
దశాక్షశతవక్త్రౌ చ దశశీర్షశతోదరౌ ||
5
పద్మనాభమహానాభౌ దుందునాభసునాభకౌ |
జ్యోతిషం కృశనం చైవ నైరాశ్యవిమలావుభౌ ||
6 [శకునం]
యోగంధరహరిద్రౌ చ దైత్యప్రమథనం తథా |
శుచిర్బాహుర్మహాబాహుర్నిష్కులిర్విరుచిస్తథా ||
7
సార్చిర్మాలీ ధృతిర్మాలీ వృత్తిమాన్రుచిరస్తథా |
పిత్ర్యం సౌమనసం చైవ విధూతమకరావుభౌ ||
8
కరవీరకరం చైవ ధనధాన్యౌ చ రాఘవ |
కామరూపం కామరుచిం మోహమావరణం తథా ||
9
జృంభకం సర్వనాభం చ సంతానవరణౌ తథా |
కృశాశ్వతనయాన్రామ భాస్వరాన్కామరూపిణః ||
10
ప్రతీచ్ఛ మమ భద్రం తే పాత్రభూతోఽసి రాఘవ |
బాఢమిత్యేవ కాకుత్స్థః ప్రహృష్టేనాంతరాత్మనా ||
11
దివ్యభాస్వరదేహాశ్చ మూర్తిమంతః సుఖప్రదాః |
కేచిదంగారసదృశాః కేచిద్ధూమోపమాస్తథా ||
12
చంద్రార్కసదృశాః కేచిత్ప్రహ్వాంజలిపుటాస్తథా |
రామం ప్రాంజలయో భూత్వాబ్రువన్మధురభాషిణః ||
13
ఇమే స్మ నరశార్దూల శాధి కిం కరవామ తే |
మానసాః కార్యకాలేషు సాహాయ్యం మే కరిష్యథ ||
14
గమ్యతామితి తానాహ యథేష్టం రఘునందనః |
అథ తే రామమామంత్ర్య కృత్వా చాపి ప్రదక్షిణమ్ ||
15
ఏవమస్త్వితి కాకుత్స్థముక్త్వా జగ్ముర్యథాగతమ్ |
స చ తాన్రాఘవో జ్ఞాత్వా విశ్వామిత్రం మహామునిమ్ ||
16
గచ్ఛన్నేవాథ మధురం శ్లక్ష్ణం వచనమబ్రవీత్ |
కిం న్వేతన్మేఘసంకాశం పర్వతస్యావిదూరతః ||
17
వృక్షషండమితో భాతి పరం కౌతూహలం హి మే |
దర్శనీయం మృగాకీర్ణం మనోహరమతీవ చ ||
18
నానాప్రకారైః శకునైర్వల్గునాదైరలంకృతమ్ |
నిఃసృతాః స్మ మునిశ్రేష్ఠ కాంతారాద్రోమహర్షణాత్ ||
19
అనయా త్వవగచ్ఛామి దేశస్య సుఖవత్తయా |
సర్వం మే శంస భగవన్కస్యాశ్రమపదం త్విదమ్ ||
20
సంప్రాప్తా యత్ర తే పాపా బ్రహ్మఘ్నా దుష్టచారిణః |
తవ యజ్ఞస్య విఘ్నాయ దురాత్మానో మహామునే ||
21
భగవంస్తస్య కో దేశః సా యత్ర తవ యాజ్ఞికీ |
రక్షితవ్యా క్రియా బ్రహ్మన్మయా వధ్యాశ్చ రాక్షసాః |
ఏతత్సర్వం మునిశ్రేష్ఠ శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో ||
22
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే అష్టావింశః సర్గః ||
Balakanda Sarga 28 Meaning In Telugu
ఆ ప్రకారంగా విశ్వామిత్రుని వెంట నడుస్తున్న రాముడు మార్గ మధ్యంలో ఆయనను చూచి ఇలా అన్నాడు.
“ఓ మహర్షీ! తమరు నాకు ఎన్నో అస్త్రములను ఉపదేశించారు. ఇప్పుడు నేను దేవతలకు, రాక్షసులకు అజేయుడనయ్యాను. కాని వాటికి ఉపసంహారము కూడా తెలియజేస్తే బాగుంటుంది కదా!” అని అడిగాడు.
అస్త్రములను ఉపసంహరించడం అంటే ఒక సారి వేసిన అస్త్రమును, టార్గెట్ ను ఢీకొట్టక ముందే వెనుకకు తీసుకోడం. ఆ రోజుల్లో అస్త్రము వేసే శక్తి దానిని ఉపసంహరించే శక్తి రెండూ ఉండేవి. నేటి రోజుల్లో తుపాకీ గానీ, పిస్టల్ గానీ, పెద్ద పెద్ద మిసైల్సు కానీ ఒకసారి ప్రయోగిస్తే, ఇంతే సంగతులు… ఇంక వెనకకు తిరిగి రావు. టార్గెట్ను ధ్వంసంచేస్తాయి. అదీ నేటి అస్త్ర శక్తి.).
ఆ మాటలకు సంతోషించాడు విశ్వామిత్రుడు. రామునికి తాను ఉపదేశించిన అన్ని అస్త్రములకు ఉపసంహారము కూడా ఉపదేశించాడు.
అంతే కాకుండా, పూర్వము భృశాశ్వుని చే సృష్టింపబడిన అస్త్రములు అన్నిటినీ రామునికి ఉపదేశించాడు. ఆ అస్త్రముల పేర్లు వాల్మీకి 7 శ్లోకములలో చెప్పాడు. ఆ అస్త్రముల పేర్లు ఏవంటే……
సత్యవంతము, సత్యకీర్తి, ధృష్టము, రభసము, ప్రతిహారతరము, పరాఙ్ముఖము, అవాఙ్ముఖము, లక్షాక్షము, విషమము, ధృఢనాభము, మహానాభము, దుందునాభము, సునాభము, జ్యోతిషము, కృశనము, నైరాశ్యము, విమలము, యోగంధరము, హరిద్రము, దైత్యము, ప్రశమనము, సార్చిర్మాలి, ధృతి, మాలి, వృత్తిమంతము, రుచిరము, పితృసౌమనసము, విధూతము, మకరము, కరవీరకరము, ధనము, ధాన్యము, కామరూపము, కామరుచి, మోహము, ఆవరణము, జృంభకము, సర్వనాభము, సంతానము, వరణము.
(వీటి పేర్లు చూస్తుంటే ఇవి మానవుల లక్షణములు, ఉదాహరణకు… మోహము, రుచిరము, విమలము; ఇంకా మానవులకు ఉన్న సంపదలు ఉదా: సంతానము, కొన్ని శాస్త్రములు ఉదా: జ్యోతిషము. ఇలాగా అస్త్రములు అంటే కేవలము ఆయుధములు అనే కాదు శాస్త్రములు, లక్షణములు వాటి ఆవశ్యకత అని అర్థం స్ఫురిస్తూ ఉంది.)
రాముడు ఆ అస్త్రములను సంతోషంతో తీసుకున్నాడు. ఆ అస్త్రదేవతలు అందరూ రాముని ముందు నిలిచి ఆయన ఆజ్ఞ కోసరం ఎదురు చూచారు. రాముడు వారిని మనసులో నిలుపుకొని తాను కోరినపుడు రమ్మని పంపివేసాడు. ఆ అస్త్రదేవతలు అందరూ రామునికి ప్రదక్షిణ పూర్వక నమస్వారము చేసి వెళ్లిపోయారు.
తరువాత రాముడు విశ్వామిత్రుని వెంట నడుస్తున్నాడు. వారికి ఒక ఆశ్రమము కనపడింది. ఆ ఆశ్రమము మంచి ఫలవృక్షములతోనూ, పూల తీగలతోనూ, అత్యంత మనోరంజకంగా ఉంది. విశ్వామిత్రుని వెంట నడుచుచూ రాముడు ఇలా అన్నాడు.
“ఓ మహర్షీ! ఈ ప్రదేశము చాలా మనోహరముగా ఉంది. మనము ఆ రాక్షస ప్రాంతము వదిలి పెట్టినాము అనుకుంటాను. ఇంత మనోహరముగా ఉన్న ఈ ఆశ్రమము ఎవరిది? వివరించండి. ఇంతకూ తమరి ఆశ్రమము ఎక్కడ ఉంది. మీరు యజ్ఞము ఎక్కడ చేస్తున్నారు. రాక్షసులు మీ యాగమును ఎక్కడ పాడుచేస్తున్నారు. నేను తమరి యాగమును ఎక్కడ ఉండి రక్షించాలి. నేను ఆ రాక్షసులను ఎక్కడ ఉండి చంపాలి. వీటి గురించి నాకు వివరంగా చెప్పండి” అని అడిగాడు రాముడు.
(ఇప్పటి దాకా రాముడు చెప్పిన పని చేస్తున్నాడు, ఇచ్చినవి (అస్త్రములు) పుచ్చుకుంటున్నాడు. కానీ నోరు మెదప లేదు. ఇప్పుడు ఒక ఆర్మీ మేజర్ అడిగినట్టు తాను నెరవేర్చవలసిన మిషన్ గురించి వివరాలు అడుగుతున్నాడు. గమనించండి.)
అప్పుడు విశ్వామిత్రుడు రామునితో ఇలా చెప్పసాగాడు.
వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవై ఎనిమిదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్
బాలకాండ ఏకోనత్రింశః సర్గః (29) >>