Balakanda Sarga 3 In Telugu – బాలకాండ తృతీయః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండంలో మూడవ సర్గంలో, రాజ్యాభిషేకం సంబంధించిన వివరాలు వివరించబడుతున్నాయి. రాజు దశరథుడు అయోధ్యలో రాజ్యాభిషేకం చేసుకున్నాడు మరియు అది ఎలా జరిగిందో చెప్పబడుతుంది. అయోధ్యలో ఉన్నవారు విచారించి, సంతోషపడుతున్నారు. రాజరాజు దశరథుడు రాజాభిషేకం కొన్ని అద్భుత సమాచారాలతో ప్రారంభించారు. అయోధ్య నగరం సంపూర్ణం ఉల్లాసంగా అభివృద్ధి చేసుకుంది.

కావ్యసంక్షేపః

శ్రుత్వా వస్తు సమగ్రం తద్ధర్మాత్మా ధర్మసంహితమ్ |
వ్యక్తమన్వేషతే భూయో యద్వృత్తం తస్య ధీమతః ||

1

ఉపస్పృస్యోదకం సమ్యఙ్మునిః స్థిత్వా కృతాంజలిః |
ప్రాచీనాగ్రేషు దర్భేషు ధర్మేణాన్వీక్షతే గతిమ్ ||

2

రామలక్ష్మణసీతాభీ రాజ్ఞా దశరథేన చ |
సభార్యేణ సరాష్ట్రేణ యత్ప్రాప్తం తత్ర తత్త్వతః ||

3

హసితం భాషితం చైవ గతిర్యా యచ్చ చేష్టితమ్ |
తత్సర్వం ధర్మవీర్యేణ యథావత్సంప్రపశ్యతి ||

4

స్త్రీతృతీయేన చ తథా యత్ప్రాప్తం చరతా వనే |
సత్యసంధేన రామేణ తత్సర్వం చాన్వవేక్షితమ్ ||

5

తతః పశ్యతి ధర్మాత్మా తత్సర్వం యోగమాస్థితః |
పురా యత్తత్ర నిర్వృత్తం పాణావామలకం యథా ||

6

తత్సర్వం తాత్త్వతో దృష్ట్వా ధర్మేణ స మహాద్యుతిః |
అభిరామస్య రామస్య చరితం కర్తుముద్యతః ||

7

కామార్థగుణసంయుక్తం ధర్మార్థగుణవిస్తరమ్ |
సముద్రమివ రత్నాఢ్యం సర్వశ్రుతిమనోహరమ్ ||

8

స యథా కథితం పూర్వం నారదేన మహర్షిణా |
రఘునాథస్య చరితం చకార భగవానృషిః ||

9 [వంశస్య]

జన్మ రామస్య సుమహద్వీర్యం సర్వానుకూలతామ్ |
లోకస్య ప్రియతాం క్షాంతిం సౌమ్యతాం సత్యశీలతామ్ ||

10

నానాచిత్రకథాశ్చాన్యా విశ్వామిత్రసమాగమే |
జానక్యాశ్చ వివాహం చ ధనుషశ్చ విభేదనమ్ ||

11

రామరామవివాదం చ గుణాన్దాశరథేస్తథా |
తథా రామాభిషేకం చ కైకేయ్యా దుష్టభావతామ్ ||

12

విఘాతం చాభిషేకస్య రామస్య చ వివాసనమ్ |
రాజ్ఞః శోకవిలాపం చ పరలోకస్య చాశ్రయమ్ ||

13

ప్రకృతీనాం విషాదం చ ప్రకృతీనాం విసర్జనమ్ |
నిషాదాధిపసంవాదం సూతోపావర్తనం తథా ||

14

గంగాయాశ్చాపి సంతారం భరద్వాజస్య దర్శనమ్ |
భరద్వాజాభ్యనుజ్ఞానాచ్చిత్రకూటస్య దర్శనమ్ ||

15

వాస్తుకర్మ వివేశం చ భరతాగమనం తథా |
ప్రసాదనం చ రామస్య పితుశ్చ సలిలక్రియామ్ ||

16

పాదుకాగ్ర్యాభిషేకం చ నందిగ్రామనివాసనమ్ |
దండకారణ్యగమనం విరాధస్య వధం తథా ||

17

దర్శనం శరభంగస్య సుతీక్ష్ణేనాపి సంగతిమ్ |
అనసూయానమస్యాం చ అంగరాగస్య చార్పణమ్ ||

18

అగస్త్యదర్శనం చైవ జటాయోరభిసంగమమ్ |
పంచవట్యాశ్చ గమనం శూర్పణఖ్యాశ్చ దర్శనమ్ ||

19

శూర్పణఖ్యాశ్చ సంవాదం విరూపకరణం తథా |
వధం ఖరత్రిశిరసోరుత్థానం రావణస్య చ ||

20

మారీచస్య వధం చైవ వైదేహ్యా హరణం తథా |
రాఘవస్య విలాపం చ గృధ్రరాజనిబర్హణమ్ ||

21

కబంధదర్శనం చైవ పంపాయాశ్చాపి దర్శనమ్ |
శబరీ దర్శనం చైవ హనూమద్దర్శనం తథా |
విలాపం చైవ పంపాయం రాఘవస్య మహాత్మనః ||

22

ఋశ్యమూకస్య గమనం సుగ్రీవేణ సమాగమమ్ |
ప్రత్యయోత్పాదనం సఖ్యం వాలిసుగ్రీవవిగ్రహమ్ ||

23

వాలిప్రమథనం చైవ సుగీవప్రతిపాదనమ్ |
తారావిలాపం సమయం వర్షరాత్రనివాసనమ్ ||

24

కోపం రాఘవసింహస్య బలానాముపసంగ్రహమ్ |
దిశః ప్రస్థాపనం చైవ పృథివ్యాశ్చ నివేదనమ్ ||

25

అంగులీయకదానం చ ఋక్షస్య బిలదర్శనమ్ |
ప్రాయోపవేశనం చాపి సంపాతేశ్చైవ దర్శనమ్ ||

26

పర్వతారోహణం చైవ సాగరస్య చ లంఘనమ్ |
సముద్రవచనాచ్చైవ మైనాకస్యాపి దర్శనమ్ ||

27

[రాక్షసీతర్జనం చైవ ఛాయాగ్రాహస్య దర్శనమ్ |
సింహికాయాశ్చ నిధనం లంకామలయదర్శనమ్ |
రాత్రౌ లంకాప్రవేశం చ ఏకస్యాపి విచింతనమ్ ||

28

దర్శనం రావణస్యాపి పుష్పకస్య చ దర్శనమ్ |
ఆపానభూమిగమనమవరోధస్య దర్శనమ్ ||

29

అశోకవనికాయానం సీతాయాశ్చాపి దర్శనమ్ |
రాక్షసీతర్జనం చైవ త్రిజటాస్వప్నదర్శనమ్ ||

30

అభిజ్ఞానప్రదానం చ సీతాయాశ్చాభిభాషణమ్ |
మణిప్రదానం సీతాయాః వృక్షభంగం తథైవ చ ||

31

రాక్షసీవిద్రవం చైవ కింకరాణాం నిబర్హణమ్ |
గ్రహణం వాయుసూనోశ్చ లంకాదాహాభిగర్జనమ్ ||

32

ప్రతిప్లవనమేవాథ మధూనాం హరణం తథా |
రాఘవాశ్వాసనం చైవ మణినిర్యాతనం తథా ||

33

సంగమం చ సముద్రేణ నలసేతోశ్చ బంధనమ్ |
ప్రతారం చ సముద్రస్య రాత్రౌ లంకావరోధనమ్ ||

34

విభీషణేన సంసర్గం వధోపాయనివేదనమ్ |
కుంభకర్ణస్య నిధనం మేఘనాదనిబర్హణమ్ ||

35

రావణస్య వినాశం చ సీతావాప్తిమరేః పురే |
విభీషణాభిషేకం చ పుష్పకస్య నివేదనమ్ ||

36

అయోధ్యాయాశ్చ గమనం భరతేన సమాగమమ్ |
రామాభిషేకాభ్యుదయం సర్వసైన్యవిసర్జనమ్ ||

37

స్వరాష్ట్రరంజనం చైవ వైదేహ్యాశ్చ విసర్జనమ్ |
అనాగతం చ యత్కించిద్రామస్య వసుధాతలే |
తచ్చకారోత్తరే కావ్యే వాల్మీకిర్భగవానృషిః ||

38

Balakanda Sarga 3 Meaning In Telugu

తనకు నారద మహర్షి చెప్పిన రామ కధ సమగ్రమైనదా లేక ఇంకా అధికంగా ఏమైనా ఉన్నదా అని వాల్మీకి మహర్షి ఆలోచిం చాడు. తరువాత వాల్మీకి మహర్షి ఆచమనం చేసాడు. తూర్పు దిక్కుగా ముఖం పెట్టి ధర్భాసనం మీద కూర్చున్నాడు. శ్రీరాముడిని మనసులో ధ్యానించాడు. నమస్కరించాడు. తన తపోబలంతో ఆలోచించాడు.

దశరథుడు, శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు ఏమేమి చేసారో, ఏమేమి మనసులో అనుకున్నారో, ఆలోచించారో, రాముడు సీత ఏకాంతంగా ఉన్నప్పుడు ఏమేమి చేసారో, ఏమేమి మాట్లాడుకున్నారో, ఎలా నవ్వుకున్నారో, ఏ ఏ దారుల వెంట నడిచారో, ఎక్కడెక్కడ నివసించారో, రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురూ అడవులలో ఎక్కడెక్కడ తిరిగారో ఎక్కడెక్కడ నివసించారో, ఆ విషయముల నన్నింటినీ ఆమూలాగ్రంగా, యధాతథంగా తన యోగదృష్టితో చూచాడు వాల్మీకి. అన్ని విషయములను స్పష్టంగా తెలుసుకున్నాడు.

మహాతపస్వి అయిన వాల్మీకికి రామ చరిత్ర అంతా కరతలామలకము అంటే చేతిలో ఉసిరిక కాయ మాదిరి స్పష్టంగా కనపడింది. ఆ ప్రకారంగా మహా తపస్వి అయిన వాల్మీకి రామ చరిత్రను దర్శించిన తరువాత, తాను చూచినది చూచినట్టు, నాలుగు పురుషార్థములు అయిన ధర్మార్థకామ మోక్షములలో, ధర్మము ఎక్కువ ప్రకాశించేటట్టు, మిగిలిన పురుషార్థములు కూడా కూడి ఉండే టట్టు, నారదుడు చెప్పిన విషయములు అన్నీ పొందుపరిచి, అందరికీ వినడానికి మనోహరంగా ఉండేటట్టు, రఘువంశ చరిత్ర అయిన రామాయణ మహా కావ్యమును రచించాడు.

ఆ రామాయణ మహా కావ్యములో రాముని జననము, ఆయన ధర్మనిరతి, పరాక్రమము, ఓర్పు గుణము, రాముని సౌందర్యము సత్యశీలత అన్నీ మధురంగా వర్ణించాడు వాల్మీకి. రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షితో అడవులలో వెళుతున్నప్పుడు చెప్పిన అనేక కధలు, గాధలు, శివధనుర్భంగము, సీతా స్వయంవరము మనోహరంగా కళ్లకు కట్టినట్టు రచించాడు. తరువాత పరశురామునితో రాముని వాగ్వివాదము, రాముని యౌవరాజ్య పట్టాభిషేక సన్నాహములు, కైకేయి వరములు కోరడం, రాముడు వనములకు పోవడం, దశరధుని నిర్మాణము, రాముడు అడవులకు పోతుంటే అయోధ్య ప్రజలు దు:ఖించడం, రాముడు వారిని ఓదార్చి పంపివేయడం;

గంగానదిని దాటడం, గుహునితో రాముడు మాట్లాడటం, తన సారధి అయిన సుమంతుని రథము తీసుకొని వెనుకకు మరలు మనడం, సీతారామ లక్ష్మణులు భరద్వాజ ఆశ్రమం చేరుకోడం, ఆయన ఆదేశాను సారం చిత్రకూటమునకు వెళ్లడం, చిత్రకూటములో పర్ణశాల నిర్మించుకొని ఉండటం, ఇంతలో భరతుడు వచ్చి రాముని తిరిగి రాజ్యము స్వీకరించమని ప్రార్థించడం, రాముడు నిరాకరించడం,

రాముడు తన తండ్రి మరణ వార్త విని దు:ఖించడం, తండ్రికి అంత్యక్రియలు జరిపించడం, తనపాదుకలను భరతునికి ఇవ్వడం, భరతుడు రాముని పాదుకలను తీసుకొని వెళ్లి నంది గ్రామములో నివసించడం, అక్కడే రామ పాదుకలకు పట్టాభిషేకం చేసి రాముని బదులు తాను రాజ్యపాలన సాగించడం,

తరువాత సీతారామలక్ష్మణులు దండకారణ్యము వెళ్లడం, అక్కడ విరాధుడు మొదలగు రాక్షసులను వధించడం, శరభంగుడు, సుతీక్షుడు మొదలగు మహాఋషుల దర్శనం చేసుకోవడం, సీత అనసూయ తో మాట్లాడటం, అనసూయ సీతకు ఒంటికి పూసుకొనే లేపనము ఇవ్వడం, తరువాత రామలక్ష్మణులు శూర్పణఖను చూడటం, ఆమెను విరూపిగా చెయ్యడం, ఖరుడు మొదలగురాక్షసులను సంహరించడం.

ఈ విషయాలన్నీ రావణునికి తెలియడం, రావణుడు మారీచుని సాయంకోరడం, మారీచుడు నిరాకరించడం, తుదకు ఆంగీక రించడం, రాముడు మారీచుని చంపడం, రావణుడు పర్ణశాలలో ఒంటరిగా ఉన్న సీతను అపహరించడం, రాముడు సీత కోసరం శోకించడం, కబంధుని చూడటం, పంపాసరస్సువద్దకు వెళ్లడం, శబరిని కలుసుకోవడం, అక్కడనుండి ఋష్యమూక పర్వత ప్రాంతమునకు వెళ్లడం, హనుమంతుడు రాముని కలవడం,

రామ సుగ్రీవుల మైత్రి, వాలి సుగ్రీవుల యుద్ధము, వాలి వధ, వాలి కోసరం తార విలపించడం, రాముడు సుగ్రీవునకు కిష్కింధా రాజ్యము ఇవ్వడం, సీతను వెదకడానికి సాయం చేస్తానని సుగ్రీవుడు అంగీకరించడం, కాని సుగ్రీవుడు మాట తప్పడంతో రామునికి కోపం రావడం, అది తెలిసి సుగ్రీవుడు వానరులను నలుదిక్కులకు సీతను వెదకడానికి పంపడం, సుగ్రీవుడు భారతదేశమును గురించి వానరులకు వర్ణించడం, రాముడు హనుమంతునికి తన ఆనవాలుగా ఉంగరము ఇవ్వడం.

హనుమంతుడు సాగరమును లంఘించడం, మధ్యలో మైనాకుని చూడటం, సింహికను చంపడం, లంకా నగరము దగ్గర ఉన్న పర్వతమును చూడటం, రాత్రియందు హనుమంతుడు లంకానగరము ప్రవేశించడం, సీతను వెదుకుతూ పుష్పక విమానములో ప్రవేశించడం, రావణుని అంతఃపుర దర్శనం, తరువాత హనుమంతుడు అశోక వనములో ఉన్న సీతను చూడటం, ఆమెకు ఆనవాలుగా రాముడు ఇచ్చిన ఉంగరము ఇవ్వడం, సీతను రాక్షస స్త్రీలు భయపెట్టడం, త్రిజటకు వచ్చిన స్వప్నవృత్తాంతము, హనుమంతుడు రాక్షస స్త్రీలను భయపెట్టడం, అశోక వనమును నాశనం చెయ్యడం, ఇంద్రజిత్తుకు పట్టుబడటం, లంకాదహనము,

హనుమంతుడు సముద్రమును దాటి కిష్కింధకు రావడం, దారిలో మధువనమును నాశనం చేయడం, రామునికి సీతను చూచాను అనిచెప్పడం, సీత ఇచ్చిన చూడామణిని ఆనవాలుగా సమర్పించడం, రాముడు సుగ్రీవుడు వానర సేనతో సముద్రము వద్దకు చేరుకోవడం, నీలుని సాయంతో సేతువును నిర్మించడం, లంకా నగరం చేరుకోవడం,

లంకానగర ముట్టడి, రావణుని తమ్ముడు విభీషణునితో మైత్రి, విభీషణుడు రావణుని ఎలా వధించాలో చెప్పడం, యుద్ధములో కుంభకర్ణుడు, మేఘనాధుడు మరణించడం, రామరావణ యుద్ధము, రావణ వధ, సీతను స్వీకరిం చడం, విభీషణుని లంకకు పట్టాభిషిక్తుని చేయడం, సీతా సమేతుడై రాముడు పుష్పకవిమానములో అయోధ్యకు తిరిగి రావడం, రామ పట్టాభిషేకము, వానర సైన్యమును వారి వారి స్థావరములకు పంపివేయడం, రామరాజ్యవర్ణన, లోకాప నిందకు వెరిచి తిరిగి సీతను అడవులలో వదిలిపెట్టడం వరకూ వాల్మీకి రామాయణ మహాకావ్యంలో రచించాడు. తరువాత జరుగబోవు విషయములను వాల్మీకి ఉత్తర కావ్యములో రచించాడు.

ఇది వాల్మీకి విరచిత
శ్రీమద్రామాయణ మహాకావ్యములో
బాలకాండలో మూడవ సర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

బాలకాండ చతుర్థః సర్గః (4) >>

Leave a Comment