Balakanda Sarga 5 In Telugu – బాలకాండ పంచమః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని పంచమః సర్గలో రాముని జన్మవివరాలు వర్ణించబడ్డాయి. ఈ సర్గలో, రాముడు, లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నుడు అనే దశరథ మహారాజు యొక్క నాలుగు కుమారుల జన్మకథ చెప్పబడుతుంది. వశిష్ఠ మహర్షి యజ్ఞం నిర్వహించి దశరథుని మూడు భార్యలు కౌసల్య, కైకేయి, సుమిత్రలకు పాయసం ప్రసాదంగా ఇచ్చాడు. వారు ఈ పాయసాన్ని పూజగా స్వీకరించి, పవిత్రమైన సంతానాలను పొందారు. ఈ సర్గలో పిల్లల జన్మ సంభవాలు మరియు వారి బాల్యం ప్రధానాంశాలు. ఈ విభాగం రామాయణంలోని అత్యంత పుణ్యమైన ఘట్టాల్లో ఒకటిగా చెప్పబడుతుంది.

అయోధ్యావర్ణనా

సర్వా పూర్వమియం యేషామాసీత్కృత్స్నా వసుంధరా |
ప్రజపతిముపాదాయ నృపాణం జయశాలినామ్ ||

1

యేషాం స సగరో నామ సాగరో యేన ఖానితః |
షష్టిః పుత్రసహస్రాణి యం యాంతం పర్యవారయన్ ||

2

ఇక్ష్వాకూణామిదం తేషాం రాజ్ఞాం వంశే మహాత్మనామ్ |
మహదుత్పన్నమాఖ్యనం రామాయణమితి శ్రుతమ్ ||

3

తదిదం వర్తయిష్యామి సర్వం నిఖిలమాదితః |
ధర్మకామార్థసహితం శ్రోతవ్యమనసూయయా ||

4

కోసలో నామ ముదితః స్ఫీతో జనపదో మహాన్ |
నివిష్టః సరయూతీరే ప్రభూతధనధాన్యవాన్ ||

5

అయోధ్యా నామ నగరీ తత్రాసీల్లోకవిశ్రుతా |
మనునా మానవేంద్రేణ యా పురీ నిర్మితా స్వయమ్ ||

6

ఆయతా దశ చ ద్వే చ యోజనాని మహాపురీ |
శ్రీమతీ త్రీణి విస్తీర్ణా సువిభక్తామహాపథా ||

7

రాజమార్గేణ మహతా సువిభక్తేన శోభితా |
ముక్తపుష్పావకీర్ణేన జలసిక్తేన నిత్యశః ||

8

తాం తు రాజా దశరథో మహారాష్ట్రవివర్ధనః |
పురీమావాసయామాస దివం దేవపతిర్యథా ||

9

కవాటతోరణవతీం సువిభక్తాంతరాపణామ్ |
సర్వయంత్రాయుధవతీముపేతాం సర్వశిల్పిభిః ||

10

సూతమాగధసంబాధాం శ్రీమతీమతులప్రభామ్ |
ఉచ్చాట్టాలధ్వజవతీం శతఘ్నీశతసంకులామ్ ||

11

వధూనాటకసంఘైశ్చ సంయుక్తాం సర్వతః పురీమ్ |
ఉద్యానామ్రవణోపేతాం మహతీం సాలమేఖలామ్ ||

12

దుర్గగంభీరపరిఖాం దుర్గామన్యైర్దురాసదమ్ |
వాజివారణసంపూర్ణాం గోభిరుష్ట్రైః ఖరైస్తథా ||

13

సామంతరాజసంఘైశ్చ బలికర్మభిరావృతామ్ |
నానాదేశనివాసైశ్చ వణిగ్భిరుపశోభితామ్ ||

14

ప్రాసాదై రత్నవికృతైః పర్వతైరుపశోభితామ్ |
కూటాగారైశ్చ సంపూర్ణామింద్రస్యేవామరావతీమ్ ||

15

చిత్రామష్టాపదాకారాం వరనారీగణైర్యుతామ్ |
సర్వరత్నసమాకీర్ణాం విమానగృహశోభితామ్ ||

16

గృహగాఢామవిచ్ఛిద్రాం సమభూమౌ నివేశితామ్ |
శాలితండులసంపూర్ణామిక్షుదండరసోదకామ్ ||

17

దుందుభీభిర్మృదంగైశ్చ వీణాభిః పణవైస్తథా |
నాదితాం భృశమత్యర్థం పృథివ్యాం తామనుత్తమామ్ ||

18

విమానమివ సిద్ధానాం తపసాధిగతం దివి |
సునివేశితవేశ్మాంతాం నరోత్తమసమావృతామ్ ||

19

యే చ బాణైర్న విధ్యంతి వివిక్తమపరావరమ్ |
శబ్దవేధ్యం చ వితతం లఘుహస్తా విశారదాః ||

20

సింహవ్యాఘ్రవరాహాణాం మత్తానాం నర్దతాం వనే |
హంతారోనిశితైర్బాణైర్బలాద్బాహుబలైరపి ||

21

తాదృశానాం సహస్రైస్తామభిపూర్ణాం మహారథైః |
పురీమావాసయామాస రాజా దశరథస్తదా ||

22

తామగ్నిమద్భిర్గుణవద్భిరావృతాం
ద్విజోత్తమైర్వేదషడంగపారగైః |
సహస్రదైః సత్యరతైర్మహాత్మభి-
-ర్మహర్షికల్పైరృషిభిశ్చ కేవలైః ||

23

Balakanda 5 Sarga In Telugu Meaning

పూర్వము ఈ భూమినంతా ఎందరో మహారాజులు చక్రవర్తులు పరిపాలించారు. సగరుడు అనే మహారాజు సాగరమును త్రవ్వించాడు అని ప్రతీతి. సగరుడు త్రవ్వించాడు కాబట్టి దానికి సాగరము అని పేరు వచ్చింది అని నానుడి. సగరుడు ఇక్ష్వాకు వంశములోని వాడు. ఆ సగరునికి 60,000 మంది కుమారులు ఉండేవారు. ప్రస్తుతము మనము చదువుతున్న రామాయణము కూడా ఆ ఇక్ష్వాకు వంశ రాజుల చరిత్ర.

సరయూ నదీ తీరంలో కోసల దేశము ఉండేది. ఆ దేశము ఎల్లప్పుడూ ధనధాన్యములతో నిండి సంతుష్ఠులైన ప్రజలతో అలరారుతూ ఉండేది. ఆ నగరంలో ఎన్నో సాంస్కృతిక సంఘములు ఉండేవి. నటీనటులు ఉండేవారు. ఆ నగరంలో ఎన్నో ఉద్యానవనములు ఉండేవి. ఆ నగరము చుట్టు శత్రువులు రాకుండా ఎత్తైన ప్రాకారములు ఉండేవి. ఆ ప్రాకారము వెలుపల లోతైన అగడ్త ఉండేది.

ఆ నగరములో ఏనుగులు, గుర్రములు, ఒంటెలు, గాడిదలు సమృద్ధిగా ఉండేవి. ఆ నగరము ఎల్లప్పుడూ వర్తకమునకు వచ్చిన వర్తకులతోనూ, కప్పము కట్టడానికి వచ్చిన సామంత రాజులతోనూ కిటకిటలాడుతూ ఉండేది. ఆ నగరములో రాజగృహములు, ఎత్తైన మేడలు, క్రీడాశాలలు సమృద్ధిగా ఉండేవి. ఆ నగరము సమతల పదేశములో నిర్మింపబడినది. ఆ నగరములో గృహములు మొదలగు కట్టడములు పూర్తిగా కట్టబడి ఉన్నవి. వృధాగా ఏ ప్రదేశము వదిలి పెట్టబడలేదు.

ఆ నగరములో సంగీత వాద్య కచేరీలు ఎల్లప్పుడూ జరుగుతూ ఉండేవి. ఆ నగరంలో ఎంతో మంది యోధులు, వీరులు ఉండేవారు. వారు విలువిద్యలో సిద్ధహస్తులు. శబ్దవేది విద్యలో ప్రావీణ్యము సంపాదించినవారు.

(శబ్దవేది అంటే టార్గెట్ను చూడకుండా కేవలం ఆ టార్గెట్ నుండివెలువడే శబ్దమును విని టార్గెట్ను కొట్టడం.)

మానవులకు హాని చేయు క్రూర మృగములను ఆయుధములు ఉపయోగించికానీ, ఆయుధములు అందుబాటులో లేకుంటే ఒట్టి చేతులతో కానీ చంపగలిగిన బలపరాక్రమములు కలిగిన వారు అయోధ్యలో ఉండేవారు. అటువంటి సర్వలక్షణ సమన్వితమైన మహానగరమే అయోధ్య. కోసలదేశ రాజధాని.

అయోధ్యను రాజధానిగా చేసుకొని దశరధ మహారాజు కోసల దేశమును పరిపాలిస్తున్నాడు. ఆ నగరములో నాలుగు జాతులవారు నివసించేవారు. అందులో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అందరూ పరమ నిష్టాగరిష్ఠులు. ప్రతిరోజూ అగ్నిహోత్రము చేసేవారు. వారందరూ వేద వేదాంగములు చదివిన వారు. మంచి గుణములతో అలరారే వారు. నిత్యము అతిధులకు అన్నదానము చేసేవారు. ఎల్లప్పుడూ సత్యమునే పలికే వారు. మహాబుద్ధిమంతులు. అందరూ మహర్షుల మాదిరి స్వచ్ఛమైన జీవితమును గడుపుతున్నారు.

ఇది వాల్మీకి విరచిత
శ్రీమద్రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఐదవ సర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

బాలకాండ షష్ఠః సర్గః (6) >>

Leave a Comment