మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని పంచవింశః సర్గలో, విశ్వామిత్ర మహర్షి తాటాకా అనే రాక్షసుడి పుట్టుక, వివాహం మరియు శాపాన్ని వివరిస్తాడు మరియు ఆమె సమాజం పట్ల క్రూరంగా ప్రవర్తించే స్త్రీని చంపడానికి ఎటువంటి సంకోచం లేకుండా ఆమె ముప్పును తొలగించమని రాముడిని కోరింది.
తాటకావృత్తాంతః
అథ తస్యాప్రమేయస్య మునేర్వచనముత్తమమ్ |
శ్రుత్వా పురుషశార్దూలః ప్రత్యువాచ శుభాం గిరమ్ ||
1
అల్పవీర్యా యదా యక్షాః శ్రూయంతే మునిపుంగవ |
కథం నాగసహస్రస్య ధారయత్యబలా బలమ్ ||
2
తస్య తద్వచనం శ్రుత్వా రాఘవస్య మహాత్మనః |
[* హర్షయన్ శ్లక్ష్ణయా వాచా సలక్ష్మణమరిందమమ్ | *]
విశ్వామిత్రోఽబ్రవీద్వాక్యం శృణు యేన బలోత్తరా ||
3
వరదానకృతం వీర్యం ధారయత్యబలా బలమ్ |
పూర్వమాసీన్మహాయక్షః సుకేతుర్నామ వీర్యవాన్ ||
4
అనపత్యః శుభాచారః స చ తేపే మహత్తపః |
పితామహస్తు సుప్రీతస్తస్య యక్షపతేస్తదా ||
5
కన్యారత్నం దదౌ రామ తాటకాం నామ నామతః |
బలం నాగసహస్రస్య దదౌ చాస్యాః పితామహః ||
6
న త్వేవ పుత్రం యక్షాయ దదౌ బ్రహ్మా మహాయశాః |
తాం తు జాతాం వివర్ధంతీం రూపయౌవనశాలినీమ్ ||
7
జంభపుత్రాయ సుందాయ దదౌ భార్యాం యశస్వినీమ్ |
కస్యచిత్త్వథ కాలస్య యక్షీ పుత్రం వ్యజాయత ||
8
మారీచం నామ దుర్ధర్షం యః శాపాద్రాక్షసోఽభవత్ |
సుందే తు నిహతే రామ సాగస్త్యం మునిపుంగవమ్ ||
9
తాటకా సహ పుత్రేణ ప్రధర్షయితుమిచ్ఛతి |
భక్షార్థం జాతసంరంభా గర్జంతీ సాఽభ్యధావత ||
10
ఆపతంతీం తు తాం దృష్ట్వా అగస్త్యో భగవానృషిః |
రాక్షసత్వం భజస్వేతి మారీచం వ్యాజహార సః ||
11
అగస్త్యః పరమక్రుద్ధస్తాటకామపి శప్తవాన్ |
పురుషాదీ మహాయక్షీ విరూపా వికృతాననా ||
12
ఇదం రూపం విహాయాథ దారుణం రూపమస్తు తే |
సైషా శాపకృతామర్షా తాటకా క్రోధమూర్ఛితా ||
13
దేశముత్సాదయత్యేనమగస్త్యచరితం శుభమ్ |
ఏనాం రాఘవ దుర్వృత్తాం యక్షీం పరమదారుణామ్ ||
14
గోబ్రాహ్మణహితార్థాయ జహి దుష్టపరాక్రమామ్ |
న హ్యేనాం శాపసంస్పృష్టాం కశ్చిదుత్సహతే పుమాన్ ||
15
నిహంతుం త్రిషు లోకేషు త్వామృతే రఘునందన |
న హి తే స్త్రీవధకృతే ఘృణా కార్యా నరోత్తమ ||
16
చాతుర్వర్ణ్యహితార్థాయ కర్తవ్యం రాజసూనునా |
నృశంసమనృశంసం వా ప్రజారక్షణకారణాత్ ||
17
పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా |
రాజ్యభారనియుక్తానామేష ధర్మః సనాతనః ||
18
అధర్మ్యాం జహి కాకుత్స్థ ధర్మో హ్యస్యా న విద్యతే |
శ్రూయతే హి పురా శక్రో విరోచనసుతాం నృప ||
19
పృథివీం హంతుమిచ్ఛంతీం మంథరామభ్యసూదయత్ |
విష్ణునా చ పురా రామ భృగుపత్నీ దృఢవ్రతా ||
20
అనింద్రం లోకమిచ్ఛంతీ కావ్యమాతా నిషూదితా |
ఏతైరన్యైశ్చ బహుభీ రాజపుత్ర మహాత్మభిః ||
21
అధర్మనిరతా నార్యో హతాః పురుషసత్తమైః |
తస్మాదేనాం ఘృణాం త్యక్త్వా జహి మచ్ఛాసనాన్నృప ||
22
విశ్వామిత్రుని మాటలు శ్రద్ధగా విన్న రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు.
” ఓ మునిపుంగవా! సాధారణంగా యక్షులు తక్కువ బలం కలవారు అంటారు కదా. యక్షిణి అయిన తాటకకు అంత బలం, వీరత్వము ఎలా వచ్చింది.” అని అడిగాడు.
దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. “ఓ రామా! పూర్వము సుకేతుడు అనే బలవంతుడు అయిన యక్షుడు ఉండేవాడు. అతనికి సంతానము లేదు. సంతానము కొరకు అతడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసాడు. సుకేతుడికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏమి వరము కావాలో కోరుకో అని అడిగాడు. ఆ యక్షుడు సంతానము కావాలి అని అడిగాడు. బ్రహ్మదేవుడు వేయి ఏనుగుల బలవంతురాలైన కుమార్తెను ప్రసాదించాడు కాని పుత్ర సంతానము మాత్రము ఇవ్వలేదు. ఆమె పేరు తాటక.
తాటక పెరిగి పెద్దది అయింది. సుకేతుడు తన కుమార్తె తాటకను సుందుడు అనే వాడికి ఇచ్చి వివాహం చేసాడు. సుందుడికి, తాటకకు మహా బలవంతుడు అయిన మారీచుడు అనే కుమారుడు జన్మించాడు.
అగస్త్యుని శాపము వలన సుందుడు మరణించాడు. అప్పుడు తాటక, మారీచుడు ఇద్దరూ కలిసి అగస్త్యుని చంపి తినడానికి అతని మీదికి వెళ్లారు.అప్పుడు అగస్త్యుడు మారీచుని “నీవు రాక్షసుడివి కా!” అని శపించాడు. తాటకను “నీవు వికృత రూపంతో, భయంకరంగా మనుష్యులను చంపి తింటూ, జీవించు” అని శపించాడు. అప్పటి నుండి తాటక అగస్యుడు సంచరించిన ఈ వనమును నాశనం చేయసాగింది.
ఓ రామా! తాటక స్త్రీ అని సంకోచించ వద్దు. ఆమె దుర్మార్గురాలు. లోకకంటకు రాలు. మునులను, బ్రాహ్మణులను రక్షించుటకు ఆమె సంహరించు. ఈమెకు ఉన్న వరములు, శాపములు వలన ఈమెను నీవు తప్ప వేరెవ్వరూ సంహరించలేరు.
లోకము యొక్క హితము కోరి రాజు స్త్రీ, పురుష బేధము లేకుండా ఎవరినైనా సంహరించవచ్చును. రాజు ప్రజలను రక్షించ డానికి చేసే పని పాపము అయినా సరే రాజుకు ఆపాపము అంటదు. ఇది రాజ్యపాలనలో ముఖ్యసూత్రము. ధర్మానికి విరుద్ధంగా, ప్రజలకు కంటకంగా పరిణమించిన తాటకను సంహరించడం పాపము కాదు.
పూర్వము విరోచనుని కుమార్తె, భూదేవిని చంపబోయింది. అప్పుడు దేవేంద్రుడు ఆమెను చంపాడు. పూర్వము శుక్రాచార్యుని తల్లి, లోకములో ఇంద్రుడు ఉండకూడదు, అనే కోరికతో తీవ్రంగా తపస్సుచేసింది. ధర్మ విరుద్ధమైన ఆమె తపస్సును భగ్నం చేసి ఆమెను చంపాడు విష్ణువు.
ఓ రామా! వీరే కాదు. ధర్మవిరుద్ధంగా ప్రవర్తించిన స్త్రీలను ఎందరినో చంపారు. కాబట్టి నీవు కూడా స్త్రీ అని సంకోచించక తాటకను సంహరించు.” అని అన్నాడు విశ్వామిత్రుడు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవై ఐదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.
బాలకాండ షడ్వింశః సర్గః (26) >>