పప్లవాదిసృష్టిః
కామధేనుం వసిష్ఠోఽపి యదా న త్యజతే మునిః |
తదాస్య శబలాం రామ విశ్వామిత్రోఽన్వకర్షత ||
1
నీయమానా తు శబలా రామ రాజ్ఞా మహాత్మనా |
దుఃఖితా చింతయామాస రుదంతీ శోకకర్శితా ||
2
పరిత్యక్తా వసిష్ఠేన కిమహం సుమహాత్మనా |
యాఽహం రాజభటైర్దీనా హ్రియేయ భృశదుఃఖితా ||
3
కిం మయాఽపకృతం తస్య మహర్షేర్భావితాత్మనః |
యన్మామనాగసం భక్తామిష్టాం త్యజతి ధార్మికః ||
4
ఇతి సా చింతయిత్వా తు వినిఃశ్వస్య పునః పునః |
నిర్ధూయ తాంస్తదా భృత్యాన్ శతశః శత్రుసూదన ||
5
జగామానిలవేగేన పాదమూలం మహాత్మనః |
శబలా సా రుదంతీ చ క్రోశంతీ చేదమబ్రవీత్ ||
6
వసిష్ఠస్యాగ్రతః స్థిత్వా మేఘదుందుభిరావణీ | [రుదంతీ మేఘనిఃస్వనా]
భగవన్కిం పరిత్యక్తా త్వయాఽహం బ్రహ్మణః సుత ||
7
యస్మాద్రాజభటా మాం హి నయంతే త్వత్సకాశతః |
ఏవముక్తస్తు బ్రహ్మర్షిరిదం వచనమబ్రవీత్ ||
8
శోకసంతప్తహృదయాం స్వసారమివ దుఃఖితామ్ |
న త్వాం త్యజామి శబలే నాపి మేఽపకృతం త్వయా ||
9
ఏష త్వాం నయతే రాజా బలాన్మత్తో మహాబలః |
న హి తుల్యం బలం మహ్యం రాజా త్వద్య విశేషతః ||
10
బలీ రాజా క్షత్రియశ్చ పృథివ్యాః పతిరేవ చ |
ఇయమక్షౌహిణీ పూర్ణా సవాజిరథాసంకులా ||
11
హస్తిధ్వజసమాకీర్ణా తేనాసౌ బలవత్తరః |
ఏవముక్తా వసిష్ఠేన ప్రత్యువాచ వినీతవత్ ||
12
వచనం వచనజ్ఞా సా బ్రహ్మర్షిమమితప్రభమ్ |
న బలం క్షత్రియస్యాహుర్బ్రాహ్మణో బలవత్తరః ||
13
బ్రహ్మన్బ్రహ్మబలం దివ్యం క్షత్రాత్తు బలవత్తరమ్ |
అప్రమేయబలం తుభ్యం న త్వయా బలవత్తరః ||
14
విశ్వామిత్రో మహావీర్యస్తేజస్తవ దురాసదమ్ |
నియుంక్ష్వ మాం మహాతేజ త్వద్బ్రహ్మబలసంభృతామ్ ||
15
తస్య దర్పబలం యత్తన్నాశయామి దురాత్మనః |
ఇత్యుక్తస్తు తయా రామ వసిష్ఠస్తు మహాయశాః ||
16
సృజస్వేతి తదోవాచ బలం పరబలారుజమ్ |
తస్య తద్వచనం శ్రుత్వా సురభిః సాసృజత్తదా ||
17
తస్యా హుంభారవోత్సృష్టాః పప్లవాః శతశో నృప |
నాశయంతి బలం సర్వం విశ్వామిత్రస్య పశ్యతః ||
18
బలం భగ్నం తతో దృష్ట్వా రథేనాక్రమ్య కౌశికః |
స రాజా పరమక్రుద్ధో రోషవిస్ఫారితేక్షణః ||
19 [క్రోధ]
పప్లవాన్నాశయామాస శస్త్రైరుచ్చావచైరపి |
విశ్వామిత్రార్దితాన్దృష్ట్వా పప్లవాన్ శతశస్తదా ||
20
భూయ ఏవాసృజత్కోపాచ్ఛకాన్యవనమిశ్రితాన్ |
తైరాసీత్సంవృతా భూమిః శకైర్యవనమిశ్రితైః ||
21
ప్రభావద్భిర్మహావీర్యైర్హేమకింజల్కసన్నిభైః |
దీర్ఘాసిపట్టిశధరైర్హేమవర్ణాంబరావృతైః ||
22
నిర్దగ్ధం తద్బలం సర్వం ప్రదీప్తైరివ పావకైః |
తతోఽస్త్రాణి మహాతేజా విశ్వామిత్రో ముమోచ హ |
తైస్తైర్యవనకాంభోజాః పప్లవాశ్చాకులీకృతాః ||
23
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే చతుఃపంచాశః సర్గః ||
Balakanda Sarga 54 Meaning In Telugu
ఈ ప్రకారంగా వసిష్ఠుడు కామధేనువు ఇవ్వడానికి ఎంతకూ ఒప్పుకోలేదు. అందుకని విశ్వామిత్రుడు తన పరివారంతో ఆ కామ ధేనువును బలవంతంగా లాక్కొని పోతున్నాడు.
ఈ దుశ్చర్యకు ఆ కామధేనువు దీనంగా ఏడిచింది. తనలో తాను ఇలా అనుకొంది. “ఇదేమిటి. ఈ రాజు నన్ను బలవంతంగా లాక్కొని పోతున్నాడు. ఇంతకాలము నేను వసిస్థుని వద్ద ఉన్నాను కదా. వసిష్ఠుడు నన్ను విడిచి పెట్టినాడా! లేక పోతే ఈ మహారాజు నన్ను ఇలా ఎందుకు బలవంతంగా తీసుకొని పోతాడు. ఈ మహర్షికి నేను ఏమి అపకారం చేసాను. ఇంతకాలము మహర్షికి ఇష్టమైన పనులే చేసాను కదా. ఈ రోజుకూడా వసిష్ఠుని ఆదేశానుసారము ఈ మహారాజుకు విందు భోజనము సమకూర్చాను కదా! మరి ఎందుకు నన్ను వదిలివేసాడు. ఆయననే అడుగుతాను.” అని తనలో తాను అనుకుంది.
వెంటనే ఒక్కసారి హుంకరించింది. తనను పట్టుకొన్న భటులను విదిల్చి కొట్టింది. పరుగుపరుగున వసిష్ఠుని వద్దకు వెళ్లింది. ఏడుస్తూ వసిష్ఠునితో ఇలా పలికింది.
‘ ఓ బ్రహ్మర్షీ! దుర్మార్గులైన రాజ భటులు నన్ను నీ వద్దనుండి లాక్కొని పోతున్నారు. నన్ను వారికి ఇచ్చేసావా. నేను ఏం అపరాధము చేసానని నన్ను వాళ్లకి ఇచ్చావు.” అని అడిగింది కామధేనువు.
ఆ మాటలు విన్న వసిష్ఠుని హృదయం తల్లడిల్లిపోయింది. తాను కూడా దు:ఖించాడు. ఆ కామధేనువుతో వసిష్ఠుడు ఇలాఅన్నాడు.
“ఓ కామధేనువా! నేను నిన్ను విడవలేదు. నువ్వు ఏ అపరాధమూ చెయ్యలేదు. నువ్వు నాకు ఏ అపకారమూ చెయ్యలేదు. బలవంతుడైన ఆ రాజు నిన్ను బలవంతంగా నా వద్దనుండి తీసుకొని పోతున్నాడు. నా వంటి వాడు బలవంతుడైన ఆ రాజుతో ఎలా పోరాడ గలడు. అతడు ఈ ప్రాంతమునకు రాజు. పరాక్రమవంతుడైన క్షత్రియుడు. ఆయన వద్ద అశ్వములు, ఏనుగులు, సైన్యము ఉన్నాయి. దాదాపు ఆ రాజు వద్ద ఒక అక్షౌహిణి సైన్యము ఉంది. కాబట్టి అతడు నా కంటే ఎంతో బలవంతుడు. ఆయనను నేను ఎలా ఎదుర్కోను. నిన్ను ఎలా రక్షించుకోను. ” అని అన్నాడు వసిష్ఠుడు.
“ఓ బ్రహ్మర్షీ! విశ్వామిత్రునిది క్షత్రియ బలము. నీకు ఉన్న బ్రహ్మ బలమునకు అది సాటి రాదు. అతని కన్నా నీవే బలవంతుడివి. నీ తేజస్సు ముందర ఆ రాజు క్షణకాలము కూడా నిలువలేడు. ఓ మహర్షీ! నీ ‘బ్రహ్మ బలంతో నన్ను ఆజ్ఞాపించు. అతని సైన్యమును సర్వనాశనము చేస్తాను.” అని పలికింది కామధేనువు.
వెంటనే వసిష్ఠుడు పైకి లేచాడు. “ఓ కామధేనువూ! నీవు ఆ రాజుకు దీటైన సైన్యమును సృష్టించు.” అని ఆజ్ఞాపించాడు.
మహాఋషి ఆజ్ఞమేరకు కామధేనువు ఒక్కసారి అంబా అని హుంకరించింది. ఆ హుంకారము నుండి అపారమైన సేనలను సృష్టింపబడ్డాయి. ఆ సేనలు విశ్వామిత్రుని సేనలమీద పడి వారిని ఓడించాయి. తరిమికొట్టాయి.
తన కళ్ల ఎదుటే తన సైన్యము నాశనం కావడం చూచాడు విశ్వామిత్రుడు. తానే స్వయంగా రథం ఎక్కాడు. కామధేనువు సృష్టించిన సేనలను ఎదుర్కొన్నాడు. ఆ సేనలను నాశనం చేసాడు.
ఇది చూచింది కామధేనువు. కోపంతో ఊగిపోయింది. మరలా అపారమైన సేనలను సృష్టించింది. ఆ సేనలు విశ్వామిత్రుని సేనలను సర్వనాశనం చేసాయి. అది చూచిన విశ్వామిత్రుడు దివ్యాస్త్రములను ప్రయోగించి కామధేనువు సృష్టించిన సేనలను చెల్లాచెదరు చేసాడు.
శ్రీమద్రామాయణము
బాలకాండము యాభైనాల్గవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
బాలకాండ పంచపంచాశః సర్గః (55) >>