Balakanda Sarga 55 In Telugu – బాలకాండ పంచపంచాశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని పంచపంచాశః సర్గలో, విశ్వామిత్రుడు పరమశివుని దయతో క్షిపణులను పొందడం ద్వారా వశిష్ట ఆశ్రమాన్ని ధ్వంసం చేస్తాడు. విష్-మిల్కర్ పవిత్ర ఆవు, కామధేనుడు సృష్టించిన దళాలు విశ్వామిత్రుని సైన్యాన్ని మరియు అతని వంద మంది కుమారులను అంతమొందించినప్పుడు, అతను ఆగ్రహం చెందాడు మరియు అసాధారణమైన క్షిపణులను ప్రసాదించమని శివుడిని ప్రార్థించాడు. వాటిని పొందిన తరువాత, అతను మళ్ళీ వశిష్ట మహర్షి ఆశ్రమానికి వచ్చి దానిని పూర్తిగా నాశనం చేస్తాడు. అప్పుడు విపరీతమైన కోపంతో వశిష్ట మహర్షి విశ్వామిత్రుడిని ఎదుర్కోవడానికి తన బ్రహ్మ లాఠీని ఆశ్రయిస్తాడు.

విశ్వామిత్రధనుర్వేదాధిగమః

తతస్తానాకులాన్దృష్ట్వా విశ్వామిత్రాస్త్రమోహితాన్ |
వసిష్ఠశ్చోదయామాస కామధుక్సృజ యోగతః ||

1

తస్యా హుంభారవాజ్జాతాః కాంభోజా రవిసన్నిభాః |
ఊధసస్త్వథ సంజాతాః పప్లవాః శస్త్రపాణయః ||

2

యోనిదేశాచ్చ యవనాః శకృద్దేశాచ్ఛకాస్తథా |
రోమకూపేషు చ మ్లేచ్ఛా హారీతాః సకిరాతకాః ||

3

తైస్తైర్నిషూదితం సర్వం విశ్వామిత్రస్య తత్ క్షణాత్ |
సపదాతిగజం సాశ్వం సరథం రఘునందన ||

4

దృష్ట్వా నిషూదితం సైన్యం వసిష్ఠేన మహాత్మనా |
విశ్వామిత్రసుతానాం తు శతం నానావిధాయుధమ్ ||

5

అభ్యధావత్సుసంక్రుద్ధం వసిష్ఠం జపతాం వరమ్ |
హుంకారేణైవ తాన్సర్వాన్దదాహ భగవానృషిః ||

6

తే సాశ్వరథపాదాతా వసిష్ఠేన మహాత్మనా |
భస్మీకృతా ముహూర్తేన విశ్వామిత్రసుతాస్తదా ||

7

దృష్ట్వా వినాశితాన్పుత్రాన్బలం చ సుమహాయశాః |
సవ్రీడశ్చింతయావిష్టో విశ్వామిత్రోఽభవత్తదా ||

8

సముద్ర ఇవ నిర్వేగో భగ్నదంష్ట్ర ఇవోరగః |
ఉపరక్త ఇవాదిత్యః సద్యో నిష్ప్రభతాం గతః ||

9

హతపుత్రబలో దీనో లూనపక్ష ఇవ ద్విజః |
హతదర్పో హతోత్సాహో నిర్వేదం సమపద్యత ||

10

స పుత్రమేకం రాజ్యాయ పాలయేతి నియుజ్య చ |
పృథివీం క్షత్రధర్మేణ వనమేవాన్వపద్యత ||

11

స గత్వా హిమవత్పార్శ్వం కిన్నరోరగసేవితమ్ |
మహాదేవప్రసాదార్థం తపస్తేపే మహాతపాః ||

12

కేనచిత్త్వథ కాలేన దేవేశో వృషభధ్వజః |
దర్శయామాస వరదో విశ్వామిత్రం మహాబలమ్ ||

13

కిమర్థం తప్యసే రాజన్బ్రూహి యత్తే వివక్షితమ్ |
వరదోఽస్మి వరో యస్తే కాంక్షితః సోఽభిధీయతామ్ ||

14

ఏవముక్తస్తు దేవేన విశ్వామిత్రో మహాతపాః |
ప్రణిపత్య మహాదేవమిదం వచనమబ్రవీత్ ||

15

యది తుష్టో మహాదేవ ధనుర్వేదో మమానఘ |
సాంగోపాంగోపనిషదః సరహస్యః ప్రదీయతామ్ ||

16

యాని దేవేషు చాస్త్రాణి దానవేషు మహర్షిషు |
గంధర్వయక్షరక్షఃసు ప్రతిభాంతు మమానఘ ||

17

తవ ప్రసాదాద్భవతు దేవదేవ మమేప్సితమ్ |
ఏవమస్త్వితి దేవేశో వాక్యముక్త్వా గతస్తదా ||

18

ప్రాప్య చాస్త్రాణి రాజర్షిర్విశ్వామిత్రో మహాబలః | [దేవేశాత్]
దర్పేణ మహతా యుక్తో దర్పపూర్ణోఽభవత్తదా ||

19

వివర్ధమానో వీర్యేణ సముద్ర ఇవ పర్వణి |
హతమేవ తదా మేనే వసిష్ఠమృషిసత్తమమ్ ||

20

తతో గత్వాశ్రమపదం ముమోచాస్త్రాణి పార్థివః |
యైస్తత్తపోవనం సర్వం నిర్దగ్ధం చాస్త్రతేజసా ||

21

ఉదీర్యమాణమస్త్రం తద్విశ్వామిత్రస్య ధీమతః |
దృష్ట్వా విప్రద్రుతా భీతా మునయః శతశో దిశః ||

22

వసిష్ఠస్య చ యే శిష్యాస్తథైవ మృగపక్షిణః |
విద్రవంతి భయాద్భీతా నానాదిగ్భ్యః సహస్రశః ||

23

వసిష్ఠస్యాశ్రమపదం శూన్యమాసీన్మహాత్మనః |
ముహూర్తమివ నిఃశబ్దమాసీదీరిణసన్నిభమ్ ||

24

వదతో వై వసిష్ఠస్య మా భైరితి ముహుర్ముహుః |
నాశయామ్యద్య గాధేయం నీహారమివ భాస్కరః ||

25

ఏవముక్త్వా మహాతేజా వసిష్ఠో జపతాం వరః |
విశ్వామిత్రం తదా వాక్యం సరోషమిదమబ్రవీత్ ||

26

ఆశ్రమం చిరసంవృద్ధం యద్వినాశితవానసి |
దురాచారోసి యన్మూఢ తస్మాత్త్వం న భవిష్యసి ||

27

ఇత్యుక్త్వా పరమక్రుద్ధో దండముద్యమ్య సత్వరః |
విధూమమివ కాలాగ్నిం యమదండమివాపరమ్ ||

28

Balakanda Sarga 55 In Telugu Pdf With Meaning

కామధేనువు సృష్టించిన సేనలు విశ్వామితుని పరాక్రమమునకు చెల్లా చెదరు కావడం చూచాడు వసిష్ఠుడు.

“ఓ కామధేనువా! ఇంకా సేనలను సృష్టించు.” అని ఆదేశిం చాడు వసిష్ఠుడు. మరలా కామధేనువు అంబా అని అరిచింది. ఆ అంబారవము నుండి సూర్య తేజస్సుతో సమానమైన కాంభోజవీరులు పుట్టారు. ఆవు పొదుగు నుండి ఆయుధములు ఉద్భవించాయి. ఆవు కాళ్ల నుండి ప్లవులు అనే సేనలు, యోనినుండి యవనులు, గోమయమునుండి శకులు, ఆవు రోమకూపముల నుండి మ్లేచ్ఛులు పుట్టారు. వారందరూ ఒక్కుమ్మడిగా విజృంభించి విశ్వామిత్రుని సేనలను సర్వనాశనం చేసారు.

తమ సేనలు నాశనం కావడం చూచారు విశ్వామిత్రుని నూర్గురు కుమారులు. వారందరూ ఒక్కుమ్మడిగా వసిష్ఠుని మీదికి దుమికారు. వసిష్ఠుడు తన తపశ్శక్తితో వారిని తుదముట్టించాడు. తన కుమారులు, సైన్యము నాశనం కావడం కళ్లారా చూచాడు విశ్వామిత్రుడు. చాలా సేపు చింతించాడు, సిగ్గుపడ్డాడు. విశ్వామిత్రుని శౌర్యము, సాహసము, పరాక్రమము ఎందుకూ పనికిరాకుండా పోయూయి. కొడుకులను పోగొట్టుకున్న విశ్వామిత్రుడు రెక్కలు తెగిన పక్షిమాదిరి మిగిలిపోయాడు. తుదకు ఒక కుమారుడు బతికి ఉ న్నాడని తెలుసుకున్నాడు. వెంటనే ఆ కుమారునికి రాజ్యాభిషేకము చేసాడు. విశ్వామిత్రుడు సన్యసించి తపస్సు చేసుకోడానికి అడవులకు వెళ్లిపోయాడు.

విశ్వామిత్రుడు హిమాలయ పర్వతముల మీద ఈశ్వరుని గూర్చి తపస్సు చేసాడు. కొన్ని సంవత్సరములు గడిచాయి. విశ్వామిత్రుని తపస్సునకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. “ఓ రాజా! నీవు ఎందుకు ఇంతఘోర తపస్సు చేస్తున్నావు. నీకు ఏమి కావాలి. కోరుకో!” అని అడిగాడు.

“ఓ మహాదేవా! తమరు నాయందు దయయుంచి ధనుర్వేదమును, అందలి రహస్యములను, సాంగోపాంగముగా ఉ పదేశించండి. దేవతలకు, దానవులకు, మహర్షులకు, యక్ష, రాక్షస, గంధర్వ, కిన్నెర, కింపురుషులకు తెలిసిన అన్ని అస్త్రవిద్యలను నాకు ఉ పదేశించండి. ఆ విధంగా నన్ను అనుగ్రహించండి” అని ప్రార్థించాడు విశ్వామిత్రుడు.

విశ్వామిత్రుని కోరికకు నవ్వి “నీవు కోరిన విద్యలు అన్నీ నీకు ప్రసాదించాను.” అని వరం ఇచ్చాడు మహాశివుడు. మహాశివుడు అంతర్థానము అయ్యాడు.

విశ్వామిత్రుడు అజేయుడయ్యాడు. వెంటనే వసిష్ఠుని ఆశ్రమమునకు వెళ్లాడు. అతని ఆశ్రమమును సర్వనాశనం చేసాడు. అహం కారంతో అట్టహాసం చేసాడు. ఆశ్రమములోని మునులు అందరూ తలా ఒక దిక్కుగా పారిపోయారు. పక్షులు, జంతువులు కొన్నిచనిపోగా మరి కొన్నిపారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాయి.

“భయపడకండి. నేను విశ్వామిత్రుని ఎదిరిస్తాను. మిమ్ములను రక్షిస్తాను.” అని వసిష్ఠుడు అరుస్తున్నాడు. కాని ఎవరూ అతని మాట వినలేదు. అందరూ పారిపోయారు. వసిష్ఠుని ఆశ్రమము అంతా శ్మశానము మాదిరి మారిపోయింది.

విశ్వామిత్రుడు చేసిన మారణ కాండ చూచి వసిష్ఠుడు అతనితో ఇలా అన్నాడు. “ఓ విశ్వామిత్రా! నేనుఎంతో కాలంగా పెంచి పోషించిన జీవ జాలమును, వృద్ధిచేసిన ఆశ్రమమును క్షణ కాలంలో నాశనం చేసావు. నీకు భవిష్యత్తులేదు. నిన్ను నాశనం చేస్తాను.” అని తన దండమును చేతిలోకి తీసుకొని విశ్వామిత్రుని ఎదురుగా నిలబడ్డాడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము యాభై ఐదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ తత్సత్ తత్సత్.

బాలకాండ షట్పంచాశః సర్గః (56) >>

Leave a Comment