Balakanda Sarga 56 In Telugu – బాలకాండ షట్పంచాశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ షట్పంచాశః సర్గః రామాయణంలో, ఈ సర్గలో రాముడు సీతతో కలిసి అయోధ్యకు చేరుకున్న తరువాత వారికి ఘన స్వాగతం లభిస్తుంది. దశరథ మహారాజు తన కుమారుల వివాహంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు తమ పత్నులతో సంతోషంగా జీవనం ప్రారంభిస్తారు. ప్రజలు రాముడు మరియు సీతను ఆదర్శ దంపతులుగా కీర్తిస్తారు.

|| బ్రహ్మతేజోబలమ్ ||

ఏవముక్తో వసిష్ఠేన విశ్వామిత్రో మహాబలః |
ఆగ్నేయమస్త్రముత్క్షిప్య తిష్ఠ తిష్ఠేతి చాబ్రవీత్ ||

1

బ్రహ్మదండం సముత్క్షిప్య కాలదండమివాపరమ్ |
వసిష్ఠో భగవాన్క్రోధాదిదం వచనమబ్రవీత్ ||

2

క్షత్రబంధో స్థితోఽస్మ్యేష యద్బలం తద్విదర్శయ |
నాశయామ్యద్య తే దర్పం శస్త్రస్య తవ గాధిజ ||

3

క్వ చ తే క్షత్రియబలం క్వ చ బ్రహ్మబలం మహత్ |
పశ్య బ్రహ్మబలం దివ్యం మమ క్షత్రియపాంసన ||

4

తస్యాస్త్రం గాధిపుత్రస్య ఘోరమాగ్నేయముద్యతమ్ |
బ్రహ్మదండేన తచ్ఛాంతమగ్నేర్వేగ ఇవాంభసా ||

5

వారుణం చైవ రౌద్రం చ ఐంద్రం పాశుపతం తథా |
ఐషీకం చాపి చిక్షేప కుపితో గాధినందనః ||

6

మానవం మోహనం చైవ గాంధర్వం స్వాపనం తథా |
జృంభణం మాదనం చైవ సంతాపనవిలాపనే ||

7

శోషణం దారణం చైవ వజ్రమస్త్రం సుదుర్జయమ్ |
బ్రహ్మపాశం కాలపాశం వారుణం పాశమేవ చ ||

8

పైనాకాస్త్రం చ దయితం శుష్కార్ద్రే అశనీ ఉభే |
దండాస్త్రమథ పైశాచం క్రౌంచమస్త్రం తథైవ చ ||

9

ధర్మచక్రం కాలచక్రం విష్ణుచక్రం తథైవ చ |
వాయవ్యం మథనం చైవ అస్త్రం హయశిరస్తథా ||

10

శక్తిద్వయం చ చిక్షేప కంకాలం ముసలం తథా |
వైద్యాధరం మహాస్త్రం చ కాలాస్త్రమథ దారుణమ్ ||

11

త్రిశూలమస్త్రం ఘోరం చ కాపాలమథ కంకణమ్ |
ఏతాన్యస్త్రాణి చిక్షేప సర్వాణి రఘునందన ||

12

వసిష్ఠే జపతాం శ్రేష్ఠే తదద్భుతమివాభవత్ |
తాని సర్వాణి దండేన గ్రసతే బ్రహ్మణః సుతః ||

13

తేషు శాంతేషు బ్రహ్మాస్త్రం క్షిప్తవాన్గాధినందనః |
తదస్త్రముద్యతం దృష్ట్వా దేవాః సాగ్నిపురోగమాః ||

14

దేవర్షయశ్చ సంభ్రాంతా గంధర్వాః సమహోరగాః |
త్రైలోక్యమాసీత్సంత్రస్తం బ్రహ్మాస్త్రే సముదీరితే ||

15

తదప్యస్త్రం మహాఘోరం బ్రాహ్మం బ్రాహ్మేణ తేజసా |
వసిష్ఠో గ్రసతే సర్వం బ్రహ్మదండేన రాఘవ ||

16

బ్రహ్మాస్త్రం గ్రసమానస్య వసిష్ఠస్య మహాత్మనః |
త్రైలోక్యమోహనం రౌద్రం రూపమాసీత్సుదారుణమ్ ||

17

రోమకూపేషు సర్వేషు వసిష్ఠస్య మహాత్మనః |
మరీచ్య ఇవ నిష్పేతురగ్నేర్ధూమాకులార్చిషః ||

18

ప్రాజ్వలద్బ్రహ్మదండశ్చ వసిష్ఠస్య కరోద్యతః |
విధూమ ఇవ కాలాగ్నిర్యమదండ ఇవాపరః ||

19

తతోఽస్తువన్మునిగణా వసిష్ఠం జపతాం వరమ్ |
అమేయం తే బలం బ్రహ్మంస్తేజో ధారయ తేజసా ||

20

నిగృహీతస్త్వయా బ్రహ్మన్విశ్వామిత్రో మహాతపాః |
ప్రసీద జపతాం శ్రేష్ఠ లోకాః సంతు గతవ్యథాః ||

21

ఏవముక్తో మహాతేజాః శమం చక్రే మహాతపాః |
విశ్వామిత్రోఽపి నికృతో వినిఃశ్వస్యేదమబ్రవీత్ ||

22

ధిగ్బలం క్షత్రియబలం బ్రహ్మతేజోబలం బలమ్ |
ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాణి హతాని మే ||

23

తదేతత్సమవేక్ష్యాహం ప్రసన్నేంద్రియమానసః |
తపో మహత్సమాస్థాస్యే యద్వై బ్రహ్మత్వకారణమ్ ||

24

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే షట్పంచాశః సర్గః ||

Balakanda Sarga 56 Meaning In Telugu

వసిష్ఠుడు రెండవ యమ దండము మాదిరి ప్రకాశిస్తున్న తన బ్రహ్మ దండము పట్టుకొని “ఓరి దుష్టుడా! నా బ్రహ్మ తేజస్సు ముందర నీ క్షత్రియ బలము అస్త్రశస్త్రములు క్షణకాలము కూడా నిలువ లేవు. నీ అస్త్రశస్త్రములను సర్వనాశనం చేస్తాను” అని విశ్వామిత్రుని ఎదురుగా నిలబడ్డాడు.

విశ్వామిత్రుడు వసిష్ఠుని లెక్క చెయ్యలేదు. వసిష్ఠునిమీద ఆగ్నేయాస్త్రము ప్రయోగించాడు. వసిష్టుని బ్రహ్మదండము ముందు ఆ ఆగ్నేయాస్త్రము నీటి ముందు అగ్ని మాదిరి శాంతించింది. వెనక్కు తిరిగి పోయింది. తరువాత విశ్వామిత్రుడు తాను మహాశివుని వలన పొందిన వారుణాస్త్రము, రుద్ర అస్త్రము, ఇంద్రాస్త్రము, పాశు పతాస్త్రము, ఇషీకాస్త్రము, మానవాస్త్రము, మోహనాస్త్రము, గాంధర్వాస్త్రము, స్వపనాస్త్రము, జృంభణాస్త్రము, మాదనాస్త్రము, సంతాపనాస్త్రము, విలాపనాస్త్రము, శోషణాస్త్రము, ధారణాస్త్రము, వజ్రాస్త్రము, బ్రహ్మపాశము, వరుణ పాశము, పైనాక, దైత అస్త్రములు, శుష్కము, అర్ధము, దారుణము మొదలగు అస్త్రములు, దండము, పైశాచము, క్రౌంచము అను అస్త్రములు, ధర్మ చక్రము, కాల చక్రము, విష్ణుచక్రములను, వాయవ్యాస్త్రము, మదనాస్త్రము, హయశిరోస్త్రము, కంకాళము, ముసలము అను ఆయుధములు, విద్యాధరము అనే మహాస్త్రము, కాలాస్త్రము, త్రిశూలము, కపాలాస్త్రము, కంకణాస్త్రము మొద చిత్ర విచిత్ర అస్త్రములను వసిష్ఠుని మీద ప్రయోగించాడు.

విశ్వామిత్రుడు ప్రయోగించిన ఆ అస్త్రములను అన్నింటినీ వసిస్థుని బ్రహ్మదండము అవలీలగా మింగేసింది. ఇంక విశ్వామిత్రుని వద్ద మిగిలింది బ్రహ్మాస్త్రము. దానిని కూడా వసిష్ఠుని మీద ప్రయో గించాడు విశ్వామిత్రుడు. ఆ బ్రహ్మాస్త్రము వినాశనాన్ని సృష్టించింది. లోకములు అన్నీ ఆ బ్రహ్మ అస్త్ర శక్తికి మండిపోతున్నాయి. ముల్లోకములు తల్లడిల్లిపోతున్నాయి.

దేవతలు, గంధర్వులు అందరూ వసిష్ఠుని వద్దకు వెళ్లారు. బ్రహ్మాస్త్రమును శాంతింపచేయమని ప్రార్థించారు. బ్రహ్మ తేజస్సు వెదజల్లుతున్న వసిష్టుని బ్రహ్మ దండము విశ్వామిత్రుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునుకూడా మింగేసింది. లోకాలు శాంతించాయి.

ఆ సమయంలో వసిష్ఠుడు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. వసిష్ఠుని దేహం నుండి అగ్ని జ్వాలలు వస్తున్నాయి. వసిష్ఠుని చేతిలోని బ్రహ్మ దండము యమ దండము మాదిరి ప్రజ్వరిల్లుతూ ఉంది. అప్పుడు దేవతలందరూ వసిష్ఠుని ఇలా ప్రార్థించారు.

” ఓ మహర్షీ! నీ బ్రహ్మ తేజస్సు అమోఘమైనది. బ్రహ్మాస్త్రము తేజస్సును నీ బ్రహ్మ తేజస్సులో ఐక్యము చేసుకో. నువ్వు శాంతించు. నీ దండమును శాంతింపచెయ్యి.” అని ప్రార్థించారు.

దేవతల ప్రార్థనను మన్నించ వసిష్ఠుడు శాంతించాడు. బ్రహ్మాస్త్రము వసిష్ఠుని బ్రహ్మతేజస్సులో లీనమైపోయింది.

ఇంత చేసిన విశ్వామిత్రునికి భంగపాటు మిగిలింది. అవమానభారంతో కుంగిపోయాడు. క్షాత్రము కన్నా బ్రహ్మ తేజస్సు గొప్పది అని తెలుసుకొన్నాడు.

“ఆహా! ఏమి ఆశ్చర్యము. వసిష్ఠుని బ్రహ్మ తేజస్సు ముందు నా అస్త్ర శస్త్రములు అన్నీ వృధా అయిపోయాయి. ఆయన బ్రహ్మ దండము నా అస్త్రములను అన్నీ మింగేసింది. కాబట్టి క్షాత్రము నిరుపయోగము. బ్రహ్మ తేజము కొరకు ప్రయత్నము చేస్తాను. మనస్సును ఇంద్రియము లను నిగ్రహిస్తాను. బ్రాహ్మణత్వము సిద్ధించడం కొరకు తీవ్రమైన తపస్సు చేస్తాను” అని అనుకొన్నాడు విశ్వామిత్రుడు.

శ్రీమద్రామాయణము
బాలకాండము యాభై ఆరవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

బాలకాండ సప్తపంచాశః సర్గః (57) >>

Leave a Comment