మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ షట్షష్టితమః సర్గలో, విష్వామిత్రుడు రాక్షసుల నుంచి యజ్ఞాన్ని రక్షించేందుకు రాముడిని తనతో పంపమని దశరథునిని కోరుతాడు. తొలుత దశరథుడు భావోద్వేగంతో అంగీకరించకపోయినప్పటికీ, విష్వామిత్రుడి వాదనలతో పాటు గురువుల సలహా తీసుకొని, రాముడిని విష్వామిత్రుడితో పంపడానికి ఒప్పుకుంటాడు.
|| ధనుఃప్రసంగః ||
తతః ప్రభాతే విమలే కృతకర్మా నరాధిపః |
విశ్వామిత్రం మహాత్మానమాజుహావ సరాఘవమ్ ||
1
తమర్చయిత్వా ధర్మాత్మా శాస్త్రదృష్టేన కర్మణా |
రాఘవౌ చ మహాత్మానౌ తదా వాక్యమువాచ హ ||
2
భగవన్ స్వాగతం తేఽస్తు కిం కరోమి తవానఘ |
భవానాజ్ఞాపయతు మామాజ్ఞాప్యో భవతా హ్యహమ్ ||
3
ఏవముక్తః స ధర్మాత్మా జనకేన మహాత్మనా |
ప్రత్యువాచ మునిర్వీరం వాక్యం వాక్యవిశారదః ||
4
పుత్రౌ దశరథస్యేమౌ క్షత్రియౌ లోకవిశ్రుతౌ |
ద్రష్టుకామౌ ధనుఃశ్రేష్ఠం యదేతత్త్వయి తిష్ఠతి ||
5
ఏతద్దర్శయ భద్రం తే కృతకామౌ నృపాత్మజౌ |
దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యతః ||
6
ఏవముక్తస్తు జనకః ప్రత్యువాచ మహామునిమ్ |
శ్రూయతామస్య ధనుషో యదర్థమిహ తిష్ఠతి ||
7
దేవరాత ఇతి ఖ్యాతో నిమేః షష్ఠో మహీపతిః |
న్యాసోఽయం తస్య భగవన్హస్తే దత్తో మహాత్మనా ||
8
దక్షయజ్ఞవధే పూర్వం ధనురాయమ్య వీర్యవాన్ |
రుద్రస్తు త్రిదశాన్రోషాత్సలీలమిదమబ్రవీత్ ||
9
యస్మాద్భాగార్థినో భాగాన్నాకల్పయత మే సురాః |
వరాంగాణి మహార్హాణి ధనుషా శాతయామి వః ||
10
తతో విమనసః సర్వే దేవా వై మునిపుంగవ |
ప్రసాదయంతి దేవేశం తేషాం ప్రీతోఽభవద్భవః ||
11
ప్రీతియుక్తః స సర్వేషాం దదౌ తేషాం మహాత్మనామ్ |
తదేతద్దేవదేవస్య ధనూరత్నం మహాత్మనః ||
12
న్యాసభూతం తదా న్యస్తమస్మాకం పూర్వకే విభో |
అథ మే కృషతః క్షేత్రం లాంగలాదుత్థితా తతః ||
13 [మయా]
క్షేత్రం శోధయతా లబ్ధ్వా నామ్నా సీతేతి విశ్రుతా |
భూతలాదుత్థితా సా తు వ్యవర్ధత మమాత్మజా ||
14
వీర్యశుల్కేతి మే కన్యా స్థాపితేయమయోనిజా |
భూతలాదుత్థితాం తాం తు వర్ధమానాం మమాత్మజామ్ ||
15
వరయామాసురాగమ్య రాజానో మునిపుంగవ |
తేషాం వరయతాం కన్యాం సర్వేషాం పృథివీక్షితామ్ ||
16
వీర్యశుల్కేతి భగవన్న దదామి సుతామహమ్ |
తతః సర్వే నృపతయః సమేత్య మునిపుంగవ ||
17
మిథిలామభ్యుపాగమ్య వీర్యజిజ్ఞాసవస్తదా |
తేషాం జిజ్ఞాసమానానాం వీర్యం ధనురుపాహృతమ్ ||
18
న శేకుర్గ్రహణే తస్య ధనుషస్తోలనేఽపి వా |
తేషాం వీర్యవతాం వీర్యమల్పం జ్ఞాత్వా మహామునే ||
19
ప్రత్యాఖ్యాతా నృపతయస్తన్నిబోధ తపోధన |
తతః పరమకోపేన రాజానో మునిపుంగవ ||
20
న్యరుంధన్మిథిలాం సర్వే వీర్యసందేహమాగతాః |
ఆత్మానమవధూతం తే విజ్ఞాయ నృపపుంగవాః ||
21
రోషేణ మహతాఽఽవిష్టాః పీడయన్మిథిలాం పురీమ్ |
తతః సంవత్సరే పూర్ణే క్షయం యాతాని సర్వశః ||
22
సాధనాని మునిశ్రేష్ఠ తతోఽహం భృశదుఃఖితః |
తతో దేవగణాన్సర్వాన్ స్తపసాహం ప్రసాదయమ్ ||
23
దదుశ్చ పరమప్రీతాశ్చతురంగబలం సురాః |
తతో భగ్నా నృపతయో హన్యమానా దిశో యయుః ||
24
అవీర్యా వీర్యసందిగ్ధాః సామాత్యాః పాపకారిణః |
తదేతన్మునిశార్దూల ధనుః పరమభాస్వరమ్ ||
25
రామలక్ష్మణయోశ్చాపి దర్శయిష్యామి సువ్రత |
యద్యస్య ధనుషో రామః కుర్యాదారోపణం మునే |
సుతామయోనిజాం సీతాం దద్యాం దాశరథేరహమ్ ||
26
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే షట్షష్ఠితమః సర్గః ||
Balakanda Sarga 66 Meaning In Telugu
మరునాడు ఉదయం జనకమహారాజు కాలకృత్యములను తీర్చుకొనని విశ్వామిత్రుని వద్దకు వెళ్లాడు. విశ్వామిత్రుని, రామ లక్ష్మణులను, వారితో వచ్చిన ఋషులను తన భవనమునకు తీసుకొని వచ్చాడు. విశ్వామిత్రునికి పూజలు చేసాడు.
“ఓ విశ్వామిత్ర మహర్షీ! రామలక్ష్మణులారా! మీకు ఇదే మా స్వాగతం. నేను మీ ఆజ్ఞాబద్ధుడను. తమరికి ఏమి కావాలో నన్ను ఆజ్ఞాపించండి. తక్షణమే నెరవేరుస్తాను.” అని పలికాడు జనకుడు.
“ఓ జనకమహారాజా! నీ వినయవిధేయతలు అత్యంత ప్రశంసనీయములు. వీరు ఇరువురు అయోధ్య చక్రవర్తి దశరథి “మహారాజు పుత్రులు. వీరు నీ వద్ద ఉన్న శ్రేష్టమైన ధనుస్సును చూడాలని అనుకుంటున్నారు. కాబట్టి నీవు వారికి ఆ ధనుస్సు చూపించు. వారు ఆ ధనుస్సును చూచి అయోధ్యకు తిరిగి వెళ్లిపోతారు.” అని అన్నాడు.
అప్పుడు జనకుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. “ఓ విశ్వామిత్ర మహర్షీ! వారికి ఆ ధనుస్సును చూపించే ముందు ఆ ధనుస్సు గురించి వివరిస్తాను. ఆ ధనుస్సు శివధనుస్సు. పూర్వము దక్షయజ్ఞ సమయములో రుద్రుడు తనకు యజ్ఞములో హవిర్భాగమును ఇవ్వనందుకు ఈ శివధనుస్సును ధరించి దేవతలందరి శిరస్సులను ఖండించడానికి పూనుకున్నాడు. అప్పుడు దేవతలు అందరూ ఈశ్వరుని ప్రార్థించారు. ఈశ్వరుడు దేవతలను క్షమించాడు. అప్పుడు తాను ఎత్తిన శివధనుస్సును ఎక్కడ ఉంచాలా అని ఆలోచించి, పరమశివుడు ఆ ధనుస్సును నిమి చక్రవర్తి వంశంలో ఆరవ వాడైన దేవ రాతుని వద్ద ఉంచాడు. ఆ దేవరాతుడు మా పూర్వీకుడు. ఆ ప్రకారంగా ఈ శివధనుస్సు మా భవనంలో ఉన్న పూజా మందిరంలో వంశపారంపర్యంగా పూజలందుకుంటూ ఉంది.
తరువాత నేను ఒక సారి యజ్ఞము చేయ సంకల్పించాను. యజ్ఞశాల నిర్మించడానికి భూమిని దున్నుతున్నాను. అప్పుడు నాగేటి చాలులో నాకు ఒక కన్య దొరికింది. ఆమె పేరు సీత. అయోనిజ. (మానవ యోని నుండి జన్మించనిది).
సీతకు యుక్తవయసువచ్చినది. ఆమెను వివాహమాడటానికి ఎందరో రాజకుమారులు ప్రయత్నించారు. కాని సీతను వివాహమాడే వాడు అత్యంత పరాక్రమ వంతుడు అయి ఉండాలని నేను ఒక నియమం పెట్టాను. సీతను “వీర్యశుల్క” గా ప్రకటించాను. (అనగా సీతను వివాహమాడాలంటే వీరత్వమును శుల్కముగా ఇవ్వాలి).
సీతను వివాహ మాడటానికి మిథిలకు వచ్చిన రాకుమారులకు నేను ఈ ధనుస్సును చూపించి దానిని ఎక్కు పెట్టమన్నాను. వారందరిలో ఏ ఒక్కరు కూడా ఈ ధనుస్సును కనీసం కదల్చలేక పోయారు. అందుకని నేను ఎవరికీ సీతను ఇచ్చి వివాహము చేయలేదు.
ఓ మహర్షీ! నేను నా కుమార్తె సీతను వీర్య శుల్వగా ప్రకటించి, వారికి అలవి కాని పరీక్ష పెట్టి, సీతను ఇచ్చి వివాహము చేయలేదని, ఆ రాజకుమారులందరూ నా మీద కోపగించారు. నా మీదకు యుద్ధానికి వచ్చారు. మిథిలను ముట్టడించారు. నా వద్ద ఉన్న సైన్యముతో వారిని ఎదిరించలేకపోయాను.
ఆ విధంగా ఒక సంవత్సరము గడిచింది. మిథిలానగరములో ఉన్న అత్యవసర వస్తువులు, ధాన్యములు తరిగిపోయాయి. ప్రజలు ఆహారము కోసరము అలమటిస్తున్నారు. అప్పుడు నేను తపస్సుచేసి దేవతలను ప్రార్థించాను. దేవతలు నా ప్రార్థనను మన్నించి నాకు సైన్యమును సమకూర్చారు. నేను దేవతలు సమకూర్చిన సైన్యముతో ఆ రాజులను ఓడించి పారద్రోలాను. దేవతా సైన్యము ధాటికి తట్టుకోలేక శత్రురాజులు తలొక దిక్కు, పారిపోయారు.
ఓ విశ్వామిత్ర మహర్షీ! ఇదీ ఈ ధనుస్సు వృత్తాంతము. నేను శివధనుస్సును రామలక్ష్మణులకు చూపిస్తాను. రాముడు ఆ ధనుస్సును ఎక్కుపెట్టగలిగితే అన్న మాట ప్రకారము నేను నా కుమార్తె సీతను రామునికి ఇచ్చి వివాహము జరిపిస్తాను.” అని అన్నాడు జనకుడు.
శ్రీమద్రామాయణము
బాలకాండము అరవైఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.