కిష్కింధాకాండ త్రయోవింశః సర్గంలో, వాలిని రాముడు బాణంతో చంపిన తర్వాత సుగ్రీవుడు ఎంతో బాధ పడతాడు. వాలి చివరి శ్వాసలు తీసుకుంటూ రాముడితో మాట్లాడి, సుగ్రీవుని రక్షించమని అభ్యర్థిస్తాడు. రాముడు వాలికి సంతాపం తెలియజేసి, సుగ్రీవుని రాజ్యాన్ని పొందడం సరియైనదని చెప్పి అతనిని ఆత్మస్థైర్యంతో నిలిపి, అతని కర్తవ్యం నిర్వర్తించమని సలహా ఇస్తాడు. వాలిని అంజనాదేవి (తార) కన్నీళ్లు పెట్టుకొని బాధ పడుతుంది. వాలి చివరగా రాముని క్షమాపణ కోరతాడు, అప్పుడు రాముడు వాలిని శాంతినిచ్చి, సుగ్రీవుని రాజుగా నియమించడానికి ఏర్పాట్లు చేయడం మొదలుపెడతాడు.
అంగదాభివాదనమ్
తతః సముపజిఘ్రంతీ కపిరాజస్య తన్ముఖమ్ |
పతిం లోకాచ్చ్యుతం తారా మృతం వచనమబ్రవీత్ || ౧ ||
శేషే త్వం విషమే దుఃఖమనుక్త్వా వచనం మమ |
ఉపలోపచితే వీర సుదుఃఖే వసుధాతలే || ౨ ||
మత్తః ప్రియతరా నూనం వానరేంద్ర మహీ తవ |
శేషే హి తాం పరిష్వజ్య మాం చ న ప్రతిభాషసే || ౩ ||
సుగ్రీవస్య వశం ప్రాప్తో విధిరేష భవత్యహో |
సుగ్రీవ ఏవ విక్రాంతో వీర సాహసికప్రియ || ౪ ||
ఋక్షవానరముఖ్యాస్త్వాం బలినః పర్యుపాసతే |
ఏషాం విలపితం కృచ్ఛ్రమంగదస్య చ శోచతః || ౫ ||
మమ చేమాం గిరం శ్రుత్వా కిం త్వం న ప్రతిబుధ్యసే |
ఇదం తద్వీరశయనం యత్ర శేషే హతో యుధి || ౬ ||
శాయితా నిహతా యత్ర త్వయైవ రిపవః పురా |
విశుద్ధసత్త్వాభిజన ప్రియయుద్ధ మమ ప్రియ || ౭ ||
మామనాథాం విహాయైకాం గతస్త్వమసి మానద |
శూరాయ న ప్రదాతవ్యా కన్యా ఖలు విపశ్చితా || ౮ ||
శూరభార్యాం హతాం పశ్య సద్యో మాం విధవాం కృతామ్ |
అవభగ్నశ్చ మే మానో భగ్నా మే శాశ్వతీ గతిః || ౯ ||
అగాధే చ నిమగ్నాఽస్మి విపులే శోకసాగరే |
అశ్మసారమయం నూనమిదం మే హృదయం దృఢమ్ || ౧౦ ||
భర్తారం నిహతం దృష్ట్వా యన్నాద్య శతధా గతమ్ |
సుహృచ్చైవ హి భర్తా చ ప్రకృత్యా మమ చ ప్రియః || ౧౧ ||
ఆహవే చ పరాక్రాంతః శూరః పంచత్వమాగతః |
పతిహీనా తు యా నారీ కామం భవతు పుత్రిణీ || ౧౨ ||
ధనధాన్యైః సుపూర్ణాపి విధవేత్యుచ్యతే జనైః |
స్వగాత్రప్రభవే వీర శేషే రుధిరమండలే || ౧౩ ||
కృమిరాగపరిస్తోమే త్వమాత్మశయనే యథా |
రేణుశోణితసంవీతం గాత్రం తవ సమంతతః || ౧౪ ||
పరిరబ్ధుం న శక్నోమి భుజాభ్యాం ప్లవగర్షభ |
కృతకృత్యోఽద్య సుగ్రీవో వైరేఽస్మిన్నతిదారుణే || ౧౫ ||
యస్య రామవిముక్తేన హృతమేకేషుణా భయమ్ |
శరేణ హృది లగ్నేన గాత్రసంస్పర్శనే తవ || ౧౬ ||
వార్యామి త్వాం నిరీక్షంతీ త్వయి పంచత్వమాగతే |
ఉద్బబర్హ శరం నీలస్తస్య గాత్రగతం తదా || ౧౭ ||
గిరిగహ్వరసంలీనం దీప్తమాశీవిషం యథా |
తస్య నిష్కృష్యమాణస్య బాణస్య చ బభౌ ద్యుతిః || ౧౮ ||
అస్తమస్తకసంరుద్ధో రశ్మిర్దినకరాదివ |
పేతుః క్షతజధారాస్తు వ్రణేభ్యస్తస్య సర్వశః || ౧౯ ||
తామ్రగైరికసంపృక్తా ధారా ఇవ ధరాధరాత్ |
అవకీర్ణం విమార్జంతీ భర్తారం రణరేణునా || ౨౦ ||
ఆస్రైర్నయనజైః శూరం సిషేచాస్త్రసమాహతమ్ |
రుధిరోక్షితసర్వాంగం దృష్ట్వా వినిహతం పతిమ్ || ౨౧ ||
ఉవాచ తారా పింగాక్షం పుత్రమంగదమంగనా |
అవస్థాం పశ్చిమాం పశ్య పితుః పుత్ర సుదారుణామ్ || ౨౨ ||
సంప్రసక్తస్య వైరస్య గతోఽంతః పాపకర్మణా |
బాలసూర్యోదయతనుం ప్రయాంతం యమసాదనమ్ || ౨౩ ||
అభివాదయ రాజానం పితరం పుత్ర మానదమ్ |
ఏవముక్తః సముత్థాయ జగ్రాహ చరణౌ పితుః || ౨౪ ||
భుజాభ్యాం పీనవృత్తాభ్యామంగదోఽహమితి బ్రువన్ |
అభివాదయమానం త్వామంగదం త్వం యథా పురా || ౨౫ ||
దీర్ఘాయుర్భవ పుత్రేతి కిమర్థం నాభిభాషసే |
అహం పుత్రసహాయా త్వాముపాసే గతచేతనమ్ || ౨౬ ||
సింహేన నిహతం సద్యో గౌః సవత్సేవ గోవృషమ్ |
ఇష్ట్వా సంగ్రామయజ్ఞేన రామప్రహరణాంభసి || ౨౭ ||
అస్మిన్నవభృథే స్నాతః కథం పత్న్యా మయా వినా |
యా దత్తా దేవరాజేన తవ తుష్టేన సంయుగే || ౨౮ ||
శాతకుంభమయీం మాలాం తాం తే పశ్యామి నేహ కిమ్ |
రాజశ్రీర్న జహాతి త్వాం గతాసుమపి మానద |
సూర్యస్యావర్తమానస్య శైలరాజమివ ప్రభా || ౨౯ ||
న మే వచః పథ్యమిదం త్వయా కృతం
న చాస్మి శక్తా వినివారణే తవ |
హతా సపుత్రాఽస్మి హతేన సంయుగే
సహ త్వయా శ్రీర్విజహాతి మామిహ || ౩౦ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే త్రయోవింశః సర్గః || ౨౩ ||
Kishkindha Kanda Sarga 23 Meaning In Telugu
తార తన భర్త ముఖాన్ని చూస్తూ తట్టుకోలేక ఈ విధంగా విలపిస్తూ ఉంది. “నాధా! అర్థరాత్రి సుగ్రీవునితోయుద్ధానికి పోవద్దని నేను నీకు శతవిధాలా చెప్పాను. కానీ నీవు నా మాటను పెడచెవిని పెట్టావు. అందుకే నేను ఇక్కడే ఉన్నా భూదేవిని కౌగలించుకొని పడుకున్నావు. ముల్లోకాలను గడగడలాండిచి ఎవరికీ లొంగని నీవు, నీ తమ్ముడు, నీ కన్నా దుర్బలుడైన సుగ్రీవుని చేతిలో ఓడిపాయావా! ఎంత ఆశ్చర్యము.
నాధా! వానర నాయకులు, భల్లూకనాయకులు నిన్ను సేవించడానికి వచ్చారు. లే. వారిని ఆదరించు. వారితో మాట్లాడు. నీవు నీ శత్రువులను చంపి వారిని భూతల శయనము చెందేట్టు చేసావు. ఇప్పుడు నీవు కూడా నీశత్రువు చేతిలో చంపబడి భూతలము మీద శయనించి ఉన్నావా!
నాధా! నన్ను అనాధనుచేసి నీవు ఒంటరిగా వెళ్లిపోవడం నీకు న్యాయంగా ఉందా నాధా! ఈ లోకంలో బుద్ధి ఉన్న వాడు ఎవ్వడూ తన కుమార్తెను వీరుడికి, పరాక్రమవంతుడికి ఇవ్వకూడదు. ఎందుకంటే శూరుడి భార్యకు నా మాదిరి అకాల వైధవ్యము తప్పదుకదా! వారు శోక సముద్రములో మునిగి పోక తప్పదు కదా! నీ మరణము కనులారా చూచికూడా నా హృదయము బద్దలు కాలేదంటే, నా గుండె కటిక పాషాణముతో సమానము కదా!
నాధా! ఈ లోకంలో స్త్రీకి ఎన్ని సంపదలు ఉన్నా, ఎంత వైభవము ఉన్నా, భర్తలేకపోతే ఆమెను విధవ అనే అంటారు. అటువంటి వైధవ్యము నాకు సంప్రాప్తించింది. ఎలాభరించాలి! ఈ సమయంలో నిన్ను తనివిదీరా కౌగలించుకొని ఏడవకుండా నీ శరీరం రక్తసిక్తమయింది. సుగ్రీవుని ఆశలు నెరవేర్చిన ఈ రాముని బాణము ఇంకా నీ శరీరంలో ఎందుకు ?”అంటూ తార వాలి శరీరంలో నుండి రాముని ధనుస్సు వెడలిన బాణమును బయటకు లాగింది.
వాలి శరీరంనుండి రామ బాణమును బయటకు లాగగానే, ఆ గాయము నుండి రక్తం జలధార మాదిరి పైకి ఉబికింది. తార తన కళ్లనుండి నీరు కారుతుండగా వాలి గాయము నుండి స్రవించిన రక్తాన్ని తుడిచింది. తార తన కుమారుడు అంగదుని చూచి ఇలా అంది.
“నాయనా! అంగదా! నీ తండ్రిని కడసారి చూచి నమస్కారం చెయ్యి.” వెంటనే అంగదుడు పైకి లేచి తన తండ్రి వాలికి భక్తితో నమస్కారం చేసాడు. “నాధా! నేను తమరి కుమారుడు అంగదుడు పక్కనే కూర్చుని ఉన్నాము. తమరి కుమారుడు అంగదుడు నమస్కరించు చున్నాడు. ఆశీర్వదించండి” అని విలపించింది తార.
ఓనాధా! మీరు, మీ తమ్ముడు సుగ్రీవునితో యుద్ధము అనే యజ్ఞమును చేసి, మీ భార్యనైన నేను లేకుండానే, రక్తంతో అవభృధ స్నానం చేస్తున్నారా! (యజ్ఞము చేసిన తరువాత భార్యా భర్తలు కలిసి పవిత్రమైన అవభృధ స్నానము చేయడం ఆచారం. రాజసూయ యాగము అయిన తరువాత అవభృధ స్నానంతో పవిత్రమైన తనకురులను ఆ దుష్టుడు దుశ్శాసనుడు తాకాడని ద్రౌపది కోపంతో ఊగిపోయింది.)
నా మాట వినకుండా యుద్ధమనే యజ్ఞము చేసి ఒంటరిగా అవభృధ స్నానం చేసారా! నాధా! మరణించింది నీవు మాత్రమే కాదు. నేను, నా కుమారుడు అంగదుడు కూడా మరణించాము. జీవచ్ఛవాల మాదిరి మిగిలిపోయాము. నీవు మమ్ములను విడిచిపోయినట్టు మా ఐశ్వర్యము కూడా మమ్ములను విడిచి పెట్టి పోయింది.” అని ఏడుస్తూ ఉంది తార.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము ఇరువది మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.