మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “కవచాలు” ఒక భావాల సంవద్ధత, మరియు మన సాహిత్య పరంగా అద్భుతమైన, అత్యుత్క్రాంత ఆలోచనల ప్రకటనల స్థలము. కవచాలు మనకి ఎంతో ప్రశాంతత మరియు, ఉల్లాసాన్ని కలిగి స్థాయి. దేవుని యందు భక్తి భావములు కలిగి శ్రద్ధతో మనసా వాచా ఆయనను స్తుతించినచో మంచి జరుగునని ఈ కవచాలను ఆలపిస్తారు. ఒక్కొక దేవునికి ఒక్కొక్క కవచం అన్నట్టుగా… కవచముల గురించి క్లుప్తంగా ఈ క్రింద ఇచ్చిన లింకుల నందు ఇవ్వబడినది. అవి ఏమిటో తెలుసుకుందాం…
శ్రీ హనుమత్ కవచం
అస్యశ్రీహనుమత్కవచస్తోత్ర మహామంత్రస్య వశిష్ట! ఋషిః అనుష్టుప్ ఛందః – శ్రీ హనుమాన్ దేవతా – మారుతాత్మజ ఇతి బీజం – అంజనాసూను రితి శక్తిః – వాయుపుత్ర కీలకం – శ్రీ మనుమత్ప్రసాధసిధ్యర్ధే జపే వినియోగః॥
ధ్యానం
శ్లో॥ ఉల్లంఘ్య సింధో స్సలిలం సలీలం
యశ్శోకవహ్నిం జనకాత్మజాయ :
ఆదాయతే నైవ దదాహ లంకాం
నమామి తం ప్రాజలి రాంజనేయం||
మనుః
శ్లో॥ పాదౌ వాయసుతః పాతు రామదూత స్తదంగుళీ:
గుల్ఫౌ హరీశ్వరః పాతు జంఘే చార్జవలంఘనః
జానునీ మారుతిః పాతు ఊరూ పా త్వసురాంతకః
గుహ్యం వజ్రతనుః పాతు జఘనం తు జగద్ధితః
ఆంజనేయః కటిం పాతు నాభిం సౌమిత్రిజీవనం:
ఉదరం పాతు హృద్దేహి హృదయం చ మహాబలః |
వక్షో వాలాయుధః పాతుస్తనౌ చా మితవిక్రమః
పార్శ్వౌ జితేంద్రియః పాతు బాహూ సుగ్రీవమంత్రకృత్
కరావక్షజయీ పాతు హనుమాం శ్చతదంగుళీః
పృష్ఠం భవిష్యద్రృహా చ స్కంధౌ మతిమతాం వరః
కంఠం పాతు కపిశ్రేష్టోముఖం రావణ దర్పహా
వక్త్రంచ వక్త్రు ప్రవణో నేత్రే దేవగణస్తుతః
బ్రహ్మాస్తసన్మానకరో భ్రువౌ మే పాతు సర్వదా
కామరూపః కపోలే మే ఫాలం వజ్రనభోవతు
శిరో మే పాతు సతతం జానకీ శోకనాశనః
శ్రీరామభక్త ప్రవరః పాతు సర్వ కళేబరం
మా మహ్ని పాతు సర్వజ్ఞ పాతు రాత్రే మహాయశాః
వివస్వదంతేవాసీచ సంధ్యయోః పాతు సర్వదా
బ్రహ్మాది దేవతాదత్త వరః పాతు నిరంతరం
య ఇదం కవచం నిత్యం పఠేచ్చ శృణుయా న్నరః
దీర్ఘమాయు రవాప్నోతి బలం దృష్టించ విందతి
పాదాక్రాంతా భవిష్యంతి పఠత స్తన్య శత్రవః
స్థిరాం మకీర్తి మారోగ్యం లభతే శాశ్వతం సుఖం
ఇతి నిగదిత వాక్యవృత్త తుభ్యం
సకలమపి స్వయ మాంజనేయ వృత్తం
అపి జని జనరక్షణైక దీక్షా
వశగతదీయ మహామను ప్రభావః ॥
ఈ కవచమును పైన చెప్పినవిధిగా ప్రతి నిత్యము పఠించినచో సర్వరోగములు, సర్వ శత్రుబయములు తప్పక శమించును. ఇది పూర్వము శ్రీరామునకు వశిష్ఠముని యుపదేశించిన అత్యద్భుత కవచము. ఇది పరాశరసంహితనుండి గ్రహింపబడింది.
ఓమ్ శ్రీ సీతారామంజనేయాయ నమః
మరిన్ని కవచాలు