మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ హనుమాన్ పూజా విదానం గురించి తెలుసుకుందాం.
శ్రీ హనుమాన్ పూజా విధానం
పూ || తిధౌ || గో ॥ నా ॥ మమ శరీర ఆవాహిత గర్భస్థిత సమస్త భూత ప్రేత పిశాచాది సర్వబాధా నివృత్తర్ధ్యం, దుష్టస్థాన స్థితా యే యే గ్రహాః తద్దోష పరిహారార్ధం శ్రీ హనుమత్పూజా ప్రదక్షిణాని కరిష్యే ॥ తదాదౌ నిర్విఘ్న పరిసమాప్తర్థ్యం గణాధిపతి పూజాం కరిష్యే ॥ అథ హనుమత్పూజా విధిః॥
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రమ్గురించి తెలుసుకుందాం…
ఈవిధముగ రామభక్తుడగు హనుమంతుని నామ సహస్రమును రెండు సార్లు గాని, మూడు సార్లు గాని ప్రతిదినము శ్రద్ధతో పఠించువారలకును, పఠింపచేయు వారలకును, సర్వకార్యములు సిద్ధించును. దేవీ! మోక్షార్ధి పైసహస్రనామములను బరించినయెడల మోక్షమును బొందును. కాముకుడు తన కోరికను దీర్చుకొనును. విద్యార్థిగనున్న వాడు హనుమత్సహస్రనామ పారాయణముచే విద్యలను పొందును. మనస్సులో వాంఛలు గలవాడు పఠించుటచే వాంఛాసిద్ధి నొందును. ధర్మార్థియగునతడు పఠించుటచే అక్షయమైన ధర్మమును పొందును. పుత్రాగ్ని యగువాడు పఠించినచో పుత్రప్రాప్తి గలవాడగును. క్షేత్రకాముడు క్షేత్రమును, పశుకాముడు పశువులను బొందును. సహస్రనామ పఠనముచే దుస్స్వప్నములు నశించును. మణియు సమస్త దుఃఖములు తొలగును. సకల సంపదలు వృద్ధినొందును. అశ్వత్థ మూలమునందు గూర్చుండి పై సహస్రనామములను బరించువారలకు శత్రుక్షయమగును. శత్రుభయము నొసగును. త్రికాలముల యందు బఠించువారలకు కార్యసిద్ధి కరతలామలకమై యుండును.
రవివారమున రాత్రి మధ్యభాగమున దశావర్తముగ పఠించినచో సర్వార్ధసిద్ధిని బొందును. మంగళవారమున తెల్లవారు సమయమున పఠించినచో సార్వభౌముడగును. ఆదివారము జిల్లేడు చెట్టు మొదట నుండి పై సహస్ర నామములను పఠించినచో దీర్ఘాయుష్మంతుడును, పుత్రవంతుడును జయముగలవాడు నగును. బ్రాహ్మీముహూర్తమున లేచి దీనిని పఠించిన వారలకు సమస్తమయిన యభీష్టములు సిద్ధించును. యుద్ధము చేయుచున్న వారలు పఠించినచో శత్రువులు పారిపోవుదురు. మరియు గ్రహబాధలు తొలగును. సహస్రనామ పారాయణము వలన జ్వరాపస్మార పాండుక్షయాది సర్వరోగములు నివారణమగును. ఇంతియే కాక హనుమదను గ్రహములు సర్వసౌఖ్యములు గలుగును. సర్వము సిద్ధించును. సర్వ కామములు ఫలించును.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ ఆంజనేయ అష్టోత్తర శతనామావళిఃగురించి తెలుసుకుందాం…
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ రామ అష్టోత్తర శతనామావళిఃగురించి తెలుసుకుందాం…
శ్రీ రామ అష్టోత్తర శతనామావళి
ప్రతి నామమునకు ముందుగా ఓమ్ అని చదువుకొనవలయును
ఓమ్ శ్రీరామాయ నమః
రామభద్రాయ నమః
రామచంద్రాయ నమః
రాజీవలోచనాయ నమః
శ్రీమతే నమః
రాజేంద్రాయ నమః
రఘుపుంగవాయ నమః
జానకీవల్లభాయ నమః
జైత్రాయనమః
జితామిత్రాయ నమః
జనార్ధనాయ నమః
విశ్వామిత్ర ప్రియాయ నమః
దాంతాయ నమః
శరణత్రాణతత్పరాయ నమః
వాలి ప్రమథనాయ నమః
వాగ్మినే నమః
సత్యవాచే నమః
సత్యవిక్రమాయ నమః
సత్యవ్రతాయ నమః
వ్రత ధరాయ నమః
సదాహనుమదాశ్రితాయ నమః
కౌసలేయాయ నమః
ఖరధ్వంసినే నమః
విరాధవధ పండితాయ నమః
విభీషణ పరిత్రాత్రే నమః
దశగ్రీవశిరోహరాయ నమః
సప్త తాళ ప్రభేత్రే నమః
వేదాంతసారాయ నమః
వేదాత్మనే నమః
భవరోగస్యభేషజాయ నమః
దూషణశిరోహంత్రే నమః
త్రిమూర్తయే నమః
త్రిగుణాత్మకాయ నమః
త్రివిక్రమాయ నమః
త్రిలోకాత్మనే నమః
పుణ్యచారిత్రకీర్తనాయ నమః
త్రిలోకరక్షకాయ నమః
ధన్వినే నమః
దండకారణ్యపుణ్యకృతే నమః
అహల్యాశాపశమనాయ నమః
పితృభక్తాయ నమః
వరప్రదాయ నమః
జితక్రోధాయ నమః
జితమిత్రాయ నమః
జనార్ధనాయ నమః
ఋక్షవానరసంఘాతినే నమః
చిత్రకూట సమాశ్రయాయ నమః
జయంత త్రాణతత్పరాయ నమః
సుమిత్రాపుత్ర సేవితాయ నమః
సర్వదేవాదిదేవాయ నమః
సదావానర సేవితాయ నమః
మాయామారీచహంత్రే నమః
హర కోదండఖండనాయ నమః
మహాభోగాయ నమః
జామదగ్న్యమహాదర్పదళనాయ నమః
తాటకాంతకాయ నమః
సౌమ్యాయ నమః బ్రహ్మణ్యాయ నమః
మునిసంస్తుతాయ నమః
మహాయోగినే నమః
మహోదారాయ నమః
సుగ్రీవేప్సితరాజ్యదాయ నమః
సర్వపుణ్యాధిక ఫలాయ నమః
స్మృతసర్వాఘనాశనాయ నమః
ఆదిపురుషాయ నమః
మహాపురుషాయ నమః
పురాణపురుషస్తుతాయ నమః
పుణ్యోదయాయ నమః
దయాసారాయ నమః
పురాణపురుషోత్తమాయ నమః
స్మిత వక్రాయ నమః
హరయే నమః
సుందరాయ నమః
అనంత గుణగంభీరాయ నమః
సీతవాసనే నమః
మాయామానుషచారిత్రాయ నమః
సేతుకృతే నమః
మితభాషిణే నమః
పూర్వభాషిణే నమః
రాఘవాయ నమః
సస్వతీర్ధమయాయ నమః
మహాభుజాయ నమః
సర్వదేవస్తుత్యాయ నమః
సర్వయాజ్జాధిపాయ నమః
యజ్వినే నమః
జరామరణవర్జితాయ నమః
శివలింగప్రతిష్ఠాత్రే నమః
సర్వాభరణ భూషితాయ నమః
పరమాత్మనే నమః
పరబ్రహ్మాణే నమః
సచ్చిదానంద విగ్రహాయ నమః
పరస్మై జ్యోతిషే నమః
పరస్యైధామ్నే నమః
పరాకాశాయ నమః
పరాత్పరాయ నమః
పరేశాయ నమః
పారగాయ నమః
పారాయ నమః
శ్యామాంగాయ నమః
శూరాయ నమః
ధీరోదాత్త గుణాశ్రయాయ నమః
ధనర్ధరాయ నమః
మహాదేవాదిపూజితాయ నమః
జితరాశయ నమః
సర్వ దేవాత్మకాయ నమః
శివాయ నమః
శ్రీ సీతాలక్ష్మణ హనుమత్సరివార సమేత శ్రీ రామ చంద్రాయ నమః
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “కవచాలు” ఒక భావాల సంవద్ధత, మరియు మన సాహిత్య పరంగా అద్భుతమైన, అత్యుత్క్రాంత ఆలోచనల ప్రకటనల స్థలము. కవచాలు మనకి ఎంతో ప్రశాంతత మరియు, ఉల్లాసాన్ని కలిగి స్థాయి. దేవుని యందు భక్తి భావములు కలిగి శ్రద్ధతో మనసా వాచా ఆయనను స్తుతించినచో మంచి జరుగునని ఈ కవచాలను ఆలపిస్తారు. ఒక్కొక దేవునికి ఒక్కొక్క కవచం అన్నట్టుగా… కవచముల గురించి క్లుప్తంగా ఈ క్రింద ఇచ్చిన లింకుల నందు ఇవ్వబడినది. అవి ఏమిటో తెలుసుకుందాం…
ఈ కవచమును పైన చెప్పినవిధిగా ప్రతి నిత్యము పఠించినచో సర్వరోగములు, సర్వ శత్రుబయములు తప్పక శమించును. ఇది పూర్వము శ్రీరామునకు వశిష్ఠముని యుపదేశించిన అత్యద్భుత కవచము. ఇది పరాశరసంహితనుండి గ్రహింపబడింది.