మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు, మన పెద్దవాళ్ళు తెలుగులో నేటి తరానికి అందించిన సూక్తులు మీ అందరికోసం… ఈ బ్లాగ్ లో వున్నా సూక్తులు మీ భవిష్యత్తుకి ఉపయోగపడతాయని ఆసిస్తూ… మీ భక్తివేద్.కం.
సూక్తులు
- నేనిక త్రాగనని ఒట్టు పెట్టుకుని త్రాగే గ్లాసు పగులగొట్టాను కానీ పగిలిన ఆ గ్లాసు ముక్కులు పక్కున నవ్వినవి నా చేతిలో మరో నిండు గ్లాసును చూసి.
- జీవితంలో కష్టాలు భరించలేక చావును కోరుకున్నాను మృత్యువొచ్చి ముంగిట నిలిస్తేకానీ అర్ధం కాలేదు చావడమెంత కష్టమో !
- నడిరోడ్డులో నడిచే స్వేచ్ఛాజీవీ నీ వెనుక వచ్చే స్కూటరువాడు నీలాగే స్వేచ్ఛను కోరుకుంటే నీ నడ్డి విరుగుతుంది భాయీ !
- అష్ట ఐశ్వర్యములున్నా అనంతమైన శక్తి సామర్థ్యములున్నా అంతః కరణశుద్ధి లేకపోతే శృంగభంగము తప్పదన్నా.
- ధన ధాన్యములు సంపాదించి ధనాగారములు నింపు పెద్దలు చేయరు దానధర్మములు చేసెదరు పెద్ద పెద్ద వాగ్దానాలు.
- ప్రాణం పోతున్న జీవికి గంగా జలమిచ్చి పుణ్యం కట్టుకోవాలనుకుంటున్నారు పాపం ! బ్రతికుండగా గ్రుక్కెడు మంచినీళ్ళిచ్చిన పాపాన పోలేదీ పుణ్యాత్ములు !
- ఎక్కడెక్కడో పడుతున్న వర్షం అదేమి చిత్రమో నా పెరట్లో పడుదు ఎవరెవరినో వరిస్తున్న అదృష్ట దేవత నా అదృష్టమేమో నన్ను వరించడు !
- ఇరవై యేళ్ళ కుర్రాడొకడు అరవైయేళ్ళ అరిందలా మాట్లాడుతుంటే అరవైయేళ్ళ ముసిలాడొకడు పదేళ్ళ పసివాడిలా ప్రవర్తిస్తుంటాడు!
- ప్రపంచంలో అందరూ హాయిగా బ్రతుకుతున్నారు కానీ, నీ వొక్కడివే సమస్యలతో సతమతమౌతున్నావా? పైకి డాబుసరిగా కనపడే కొందరు బాబుకు ఎన్ని సమస్యలో నీకు తెలిస్తే నీ గుండే ఆగిపోతుంది.
- ఆకలి అవుతుందని అడ్డంగా తింటే అనారోగ్యం చేసి ఆస్పత్రిపాలు అవుతావు బాగా దప్పిక అయితే కొన్ని మంచినీళ్ళు త్రాగాలి కానీ బావిలో దూకితే ప్రాణమే పోతుంది.
- పది రూకలిచ్చి పదిసార్లు చెప్పుకుంటారు దానం చేసే విధానంలోని ప్రథమ సూత్రం తెలియదు కాబోలు కుడి చేయి చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదని !
- అయినా వాడి కొరకు కానివాడిని కష్టాలపాలు చేయకండి ఒకడి బాగు కొరకు మరొకడి భవిష్యత్తును బలి చేయకండి.
- ఆడపిల్లల నల్లరి పెట్టే అల్పసంతోషి ! ఆ అమ్మాయి సాహసిస్తే నీ చెంప చెళ్లుమంటుంది పోలీసువాడు చూస్తే నీ వీపు బ్రద్దలవుతుంది.
- అందరికీ అన్నం పెట్టేది ఆ అదృశ్యశక్తే అయినా మధ్య దళారీలు సగం జనాభాను మలమల మాడ్చేస్తున్నారు అన్నం పెట్టే పని కూడా యీ పాపిష్టి మనుషుల చేతుల్లోనే వుంటే మొత్తం జనాభాను మాడ్చి చంపగల రేమో !
- ఈ స్వార్ధ భరిత ప్రపంచంలో ఎవరికి ఎవరు అవుతారు? ఎవరిని నమ్మి దగ్గరకు తీస్తామో వారే మోసం చేస్తున్నారు
- ఒక్క భార్య వున్న మగధీరుడే వందసార్లు పెళ్లాం గడ్డం పట్టుకుంటుంటే అష్టభార్యలున్న కృష్ణుడు ఒకసారి సత్యభామ కాలు పట్టుకుంటే తప్పా?
- నీవు పుట్టిన గడ్డమీద ఓ మంచిపని చేసి వెళ్ళిపో నానాగడ్డి కరిచి సంపాదించినా అది విడిచివెళ్ళే రోజు రాకతప్పడెలాగో !
- ఆ జన్మలో సహగమనం చేసిన సహ ధర్మచారణి ఋణం ఈ జన్మలో తీర్చుకుంటున్నాడు కాబోలు అగ్ని సాక్షిగా పెళ్ళాడిన సతిని అగ్నికాహుతి చేసి !
- ఎవడో అన్యాయం చేశాడని ఏడిస్తే ఏం లాభం ? చరాచర జగత్తును సృష్టించిన మహానుభావుడే నరరూప రాక్షసులను సృష్టించి తమాషా చూస్తుంటే !
- మనిషి ముందర ఓ తీయని మాట మనిషి వెనుక ఓ ఘాటు పోటు ఈ మాటలే ఈటెలై నీ భరతం పడే పుట్టగతులుండవు భారత పుత్రా !
- విద్యార్థులను హద్దులో పెట్టలేడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేడు ఇలాంటి గురువు మరి ఎలాంటి శిష్యులను తయారు చేయగలడు?
- ఆరు పదులు నిండిన అతను పెద్దగా సాధించిన దేముంది? ఒక్క అడుగు ముందుకు వేస్తే రెండడుగులు వెనక్కి వేశాడు.
- అయినచోట – కానిచోట నోరు పారేసుకోవద్దు మిత్రమా ! నీ చుట్టూ నీవాళ్ళు తక్కువ నీవంటే గిట్టనివాళ్ళే ఎక్కువ.
- పిన్నవయసు లో చినిగిపోయిన బట్టలు వేసుకొని కొత్తపుస్తకాలు పట్టుకొని స్కూల్ కెళ్లే వాళ్ళం సింపుల్గా వయస్సు వచ్చిన తరువాత కొత్తబట్ట లేసుకొని చినిగిన పుస్తకాలు తీసుకొని కాలేజీ వెళ్తున్నాం స్టయిల్గా !
- క్రమం తప్పకుండా క్లబ్బు కెళ్ళడం చూసిని స్నేహితులు నన్ను మండలిస్తే నాలో నేనే నవ్వుకున్నాను. నేను స్వర్గానికి నిచ్చెన వేసుకుంటుంటే పాపం చూడలేక పోతున్నారేమోనని!