Aranya Kanda Sarga 50 In Telugu – అరణ్యకాండ పంచాశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. వాల్మీకి రామాయణం అరణ్యకాండలో 50వ సర్గలో, రాముడు పంపా సరస్సు వద్ద చేరుకుని దాని అందాన్ని ఆస్వాదిస్తాడు. సరస్సు చుట్టూ ప్రకృతి అందాన్ని చూసి సీతను మిస్ అవుతూ, ఆమె లేని బాధను అనుభవిస్తాడు. సీత కోసం తపిస్తున్న రాముడు, సరస్సు నావులా భావించి తన బాధను లక్ష్మణునికి పంచుకుంటాడు.

జటాయురభియోగః

తం శబ్దమవసుప్తస్తు జటాయురథ శుశ్రువే |
నిరీక్ష్య రావణం క్షిప్రం వైదేహీం చ దదర్శ సః ||

1

తతః పర్వతకూటాభస్తీక్ష్ణతుండః ఖగోత్తమః |
వనస్పతిగతః శ్రీమాన్ వ్యాజహార శుభాం గిరమ్ ||

2

దశగ్రీవ స్థితో ధర్మే పురాణే సత్యసంశ్రయః |
జటాయుర్నామ నామ్నాఽహం గృధ్రరాజో మహాబలః ||

3

రాజా సర్వస్య లోకస్య మహేంద్రవరుణోపమః |
లోకానాం చ హితే యుక్తో రామో దశరథాత్మజః ||

4

తస్యైషా లోకనాథస్య ధర్మపత్నీ యశస్వినీ |
సీతా నామ వరారోహా యాం త్వం హర్తుమిహేచ్ఛసి ||

5

కథం రాజా స్థితో ధర్మే పరదారాన్ పరామృశేత్ |
రక్షణీయా విశేషేణ రాజదారా మహాబలః ||

6

నివర్తయ మతిం నీచాం పరదారాభిమర్శనాత్ |
న తత్ సమాచరేద్ధీరో యత్పరోఽస్య విగర్హయేత్ ||

7

యథాఽఽత్మనస్తథాన్యేషాం దారా రక్ష్యా విపశ్చితా |
ధర్మమర్థం చ కామం చ శిష్టాః శాస్త్రేష్వనాగతమ్ ||

8

వ్యవస్యంతి న రాజానో ధర్మం పౌలస్త్యనందన |
రాజా ధర్మశ్చ కామశ్చ ద్రవ్యాణాం చోత్తమో నిధిః ||

9

ధర్మః శుభం వా పాపం వా రాజమూలం ప్రవర్తతే |
పాపస్వభావశ్చపలః కథం త్వం రక్షసాం వర ||

10

ఐశ్వర్యమభిసంప్రాప్తో విమానమివ దుష్కృతిః |
కామం స్వభావో యో యస్య న శక్యః పరిమార్జితుమ్ ||

11

న హి దుష్టాత్మనామార్యమావసత్యాలయే చిరమ్ |
విషయే వా పురే వా తే యదా రామో మహాబలః ||

12

నాపరాధ్యతి ధర్మాత్మా కథం తస్యాపరాధ్యసి |
యది శూర్పణఖాహేతోర్జస్థానగతః ఖరః ||

13

అతివృత్తో హతః పూర్వం రామేణాక్లిష్టకర్మణా |
అత్ర బ్రూహి యథాతత్త్వం కో రామస్య వ్యతిక్రమః ||

14

యస్య త్వం లోకనాథస్య భార్యాం హృత్వా గమిష్యసి |
క్షిప్రం విసృజ వైదహీం మా త్వా ఘోరేణ చక్షుషా ||

15

దహేద్దహనభూతేన వృత్రమింద్రాశనిర్యథా |
సర్పమాశీవిషం బద్ధ్వా వస్త్రాంతే నావబుద్ధ్యసే ||

16

గ్రీవాయాం ప్రతిముక్తం చ కాలపాశం న పశ్యసి |
స భారః సౌమ్య భర్తవ్యో యో నరం నావసాదయేత్ ||

17

తదన్నమపి భోక్తవ్యం జీర్యతే యదనామయమ్ |
యత్కృత్వా న భవేద్ధర్మో న కీర్తిర్న యశో భువి ||

18

శరీరస్య భవేత్ ఖేదః కస్తత్కర్మ సమాచరేత్ |
షష్టిర్వర్షసహస్రాణి మమ జాతస్య రావణ ||

19

పితృపైతామహం రాజ్యం యథావదనుతిష్ఠతః |
వృద్ధోఽహం త్వం యువా ధన్వీ సశరః కవచీ రథీ ||

20

తథాఽప్యాదాయ వైదేహీం కుశలీ న గమిష్యసి |
న శక్తస్త్వం బలాద్ధర్తుం వైదేహీం మమ పశ్యతః ||

21

హేతుభిర్న్యాయసంయుక్తైర్ధ్రువాం వేదశ్రుతీమివ |
యుధ్యస్వ యది శూరోఽసి ముహూర్తం తిష్ఠ రావణ ||

22

శయిష్యసే హతో భూమౌ యథా పూర్వం ఖరస్తథా |
అసకృత్సంయుగే యేన నిహతా దైత్యదానవాః ||

23

న చిరాచ్చీరవాసాస్త్వాం రామో యుధి వధిష్యతి |
కిం ను శక్యం మయా కర్తుం గతౌ దూరం నృపాత్మజౌ ||

24

క్షిప్రం త్వం నశ్యసే నీచ తయోర్భీతో న సంశయః |
న హి మే జీవమానస్య నయిష్యసి శుభామిమామ్ ||

25

సీతాం కమలపత్రాక్షీం రామస్య మహిషీం ప్రియామ్ |
అవశ్యం తు మయా కార్యం ప్రియం తస్య మహాత్మనః ||

26

జీవితేనాపి రామస్య తథా దశరథస్య చ |
తిష్ఠ తిష్ఠ దశగ్రీవ ముహూర్తం పశ్య రావణ ||

27

యుద్ధాతిథ్యం ప్రదాస్యామి యథాప్రాణం నిశాచర |
వృంతాదివ ఫలం త్వాం తు పాతయేయం రథోత్తమాత్ ||

28

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే పంచాశః సర్గః ||

Aranya Kanda Sarga 50 Meaning In Telugu

రావణుడు సీతను అపహరించుకొని వెళ్లే సమయంలో జటాయువు ఒక వట వృక్షము మీద నిద్రపోతున్నాడు. సీత అరుపులు, రావణుని హుంకారములు విని జటాయువు నిద్రలేచాడు. జటాయువుకు ఏం జరుగుతుందో అర్థం అయింది. వెంటనే ఎగురుతూ పోయి రావణుని రథం మీద వాలాడు. రాముడు తన రథం ఆపాడు. అప్పుడు జటాయువు రావణునితో ఇలా అన్నాడు.

“రావణా! నేను నిత్యసత్యవ్రతుడను. నా పేరుజటాయువు. నేను గరుడ వంశజుడను. మహా బలిశాలిని. రాముడు అయోధ్యాధి పతి దశరథుని కుమారుడు. ముల్లోకములచేత పూజింపబడేవాడు. ఈమె రాముని భార్య పేరు సీత.

నీవు ధర్మమార్గంలో పయనించే మహారాజువు. అటువంట “నీవు ఇతరుల భార్యలను అపహరించ వచ్చునా! ముఖ్యముగా సాటి రాజుల భార్యలను గౌరవించాలి. ఆపదలలో ఉంటే రక్షించాలి కానీ, నీ లాగా అపహరించకూడదు. అదే లోక ధర్మము. కాబట్టి ఇతరుల భార్యల మీద ఉన్న నీ కోరికను మానుకో. ఇది నీ వంటి ధర్మాత్ములు చేయదగ్గపనికాదు. నీ భార్యను ఇతరులు అపహరిస్తుంటే నువ్వు ఎలా రక్షించుకుంటావో, అలాగే ఇతరుల భార్యలను ఎవరైనా అపహరిస్తుంటే నువ్వు రక్షించాలి. కానీ, నువ్వే ఇతరుల భార్యలను అపహరించడం తప్పు కదా! అలాంటి తప్పు చేయకు. ఇతరులు నిన్ను నిందించే పని చేయడం తప్పు కదా!

రావణా! సామాన్యులు ధర్మము, అర్థము, కామము వీటి ఆచరణలో సందేహము కలిగినపుడు, రాజు ఏం చేస్తాడో దానినే అనుసరిస్తారు. కాబట్టి రాజు తన ప్రజలకు ఆదర్శప్రాయుడుగా ఉండాలి. అటువంటి రాజువైన నీవే ఇటువంటి నిందార్హమైన పని చేస్తే, నీ ప్రజలు ఎవరిని అనుసరించాలి. ఆలోచించు.

ఓ రాక్షస రాజా! నీవు నిరంతర పరకాంతాబిలాషివే. చపలచిత్తుడివే. నీకు రాజ్యాధికారము, లంకాధిపత్యము ఎలా లభించింది అని సందేహముగా ఉంది. దీనిని బట్టి చూడ నీది దుష్టస్వభావము అని స్పష్టంగా తెలుస్తూ ఉంది. నీకు పుణ్యకార్యములు చేయడం తెలిసినట్టు లేదు. అందుకే పాపపు పనులలో నిమగ్నుడవై ఉన్నావు.

పోనీ, నీకు ఎవరైనా అపకారము చేస్తే వారికి అపకారం చేయడం లోక ధర్మము. ఎక్కడో అరణ్యములో ఆకులు అలములు తింటూ కాలం గడుపుతున్న రాముడు, లంకలో ఉన్న నీకు ఎలాంటి అపకారమూ చేయలేదే? అటువంటప్పుడు నీవు రాముని భార్యను ఎందుకు అపహరిస్తున్నావు? అతని పట్ల ఎందుకు అపరాధము చేస్తున్నావు?

నీ సోదరులు ఖరుని దూషణుని చంపాడు అని కదా నీ వాదన. కాని వారిని ఎందుకు చంపాడు. శూర్పణఖ పోయి, వారిని రాముని మీదికి యుద్ధానికి పురికొల్పింది. రాముడు ఒక్కడు. వారు 14,000 మంది. రాముడు ఏం చేస్తాడు. యుద్ధం చేసాడు. యుద్ధంలో వారు చచ్చారు. అందులో రాముని తప్పు ఏముంది? రాముడు మీ మీదికి యుద్ధానికి కాలు దువ్వలేదు కదా! మరి ఎందుకు రాముని భార్యను అపహరిస్తున్నావు. కాబట్టి వెంటనే సీతను వదిలిపెట్టు. లేకపోతే రాముని బాణములకు ఆహుతి అవుతావు. ఈ సీతాపహరణంతో నీవు త్రాచుపామును కొంగున కట్టుకొని తిరుగు తున్నావు. నీ మెడకు చుట్టుకొని ఉన్న కాలపాశమును నీవు గుర్తించడం లేదు.

ఓ రావణా! సాధారణంగా మనకు అలవి అయిన పనులే మనం చేయాలి. మనకు జీర్ణం అయ్యే పదార్థాలే మనం తినాలి. అలాగే ధర్మవిరుద్ధమైనవి, అపకీర్తిని తెచ్చిపెట్టేవి అయిన పనులు మనం చేయకూడదు కదా! రావణా! నా సంగతి నీకు తెలుసుగా! నేను పుట్టి 60,000 సంవత్సరములు అయింది. నేను వృద్ధుడను. కాని నీవు యువకుడవు. నేను నిరాయుధుడను. నీవు సాయుధుడవు. అయినా నేను నిన్ను సీతను తీసుకొని పోనీయను. అడ్డుకుంటాను. నా ఉండగా నీవు సీతను తీసుకొని పోవడానికి వీలు లేదు. నీవు శూరుడవు అయితే నాతో యుద్ధం చెయ్యి. నిన్ను ఖరుడు పోయిన చోటికే పంపుతాను.

నీవు ఎంతో మందిని చంపి ఉంటావు. కానీ ఇప్పుడు రాముడు నిన్ను చంపగలడు. రాముడు లక్ష్మణుడు ఇక్కడ ఉంటే నీ మరణం ఈ క్షణము సంభవించి ఉండేది. వాళ్లు ఇక్కడ లేకపోబట్టి బతికిపోయావు. చేతనైతే వారు వచ్చేదాకా ఉండి వారితో యుద్ధం చెయ్యి అంతేగానీ, వారు లేనప్పుడు సీతను అపహరించడం వీరత్వము అనిపించుకోదు.

నేను జీవించి ఉండగా నీవు సీతను తీసుకొని ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేవు. నా ప్రాణాలు ఒడ్డి అయిన సరే నేను సీతను కాపాడతాను. రా! నాతో యుద్ధానికి రా! నిన్ను ఈ క్షణమే నీ రథం నుండి కిందకు పడదోస్తాను.” అని వీరోచితంగా పలికాడు జటాయువు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఏబదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్థాం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ ఏకపంచాశః సర్గః (51) >>

Leave a Comment