మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ద్విసప్తతితమః సర్గ రామాయణంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో ఖర, దూషణ, త్రిశిర అనే రాక్షసులు రాముడిని సమర్థించడానికి రావణుడి ఆజ్ఞలను అనుసరిస్తారు. రాక్షసులు భారీ సైన్యంతో రాముడిపై దాడి చేస్తారు. రాముడు తన ధైర్యం, శక్తితో ఆ రాక్షసులను ఎదుర్కొని, వారిని నాశనం చేస్తాడు. రాముడి ముఖంలో ధర్మం, సత్యం ప్రతిఫలిస్తాయి. ఖర, దూషణ, త్రిశిర రాక్షసులను సంహరించడంతో రాముడి పరాక్రమం, ధర్మపాలన మరింత వెలుగులోకి వస్తాయి.
సీతాధిగమోపాయః
ఏవముక్తౌ తు తౌ వీరౌ కబంధేన నరేశ్వరౌ |
గిరిప్రదరమాసాద్య పావకం విససర్జతుః ||
1
లక్ష్మణస్తు మహోల్కాభిర్జ్వలితాభిః సమంతతః |
చితామాదీపయామాస సా ప్రజజ్వాల సర్వతః ||
2
తచ్ఛరీరం కబంధస్య ఘృతపిండోపమం మహత్ |
మేదసా పచ్యమానస్య మందం దహతి పావకః ||
3
స విధూయ చితామాశు విధూమోఽగ్నిరివోత్థితః |
అరజే వాససీ బిభ్రన్మాలాం దివ్యాం మహాబలః ||
4
తతశ్చితాయా వేగేన భాస్వరో విమలాంబరః |
ఉత్పపాతాశు సంహృష్టః సర్వప్రత్యంగభూషణః ||
5
విమానే భాస్వరే తిష్ఠన్ హంసయుక్తే యశస్కరే |
ప్రభయా చ మహాతేజా దిశో దశ విరాజయన్ ||
6
సోఽంతరిక్షగతో రామం కబంధో వాక్యమబ్రవీత్ |
శృణు రాఘవ తత్త్వేన యథా సీతామవాప్స్యసి ||
7
రామ షడ్యుక్తయో లోకే యాభిః సర్వం విమృశ్యతే |
పరిమృష్టో దశాంతేన దశాభాగేన సేవ్యతే ||
8
దశాభాగగతో హీనస్త్వం హి రామ సలక్ష్మణః |
యత్కృతే వ్యసనం ప్రాప్తం త్వయా దారప్రధర్షణమ్ ||
9
తదవశ్యం త్వయా కార్యః స సుహృత్సుహృదాం వర |
అకృత్వా హి న తే సిద్ధిమహం పశ్యామి చింతయన్ ||
10
శ్రూయతాం రామ వక్ష్యామి సుగ్రీవో నామ వానరః |
భ్రాత్రా నిరస్తః క్రుద్ధేన వాలినా శక్రసూనునా ||
11
ఋశ్యమూకే గిరివరే పంపాపర్యంతశోభితే |
నివసత్యాత్మవాన్ వీరశ్చతుర్భిః సహ వానరైః ||
12
వానరేంద్రో మహావీర్యస్తేజోవానమితప్రభః |
సత్యసంధో వినీతశ్చ ధృతిమాన్ మతిమాన్ మహాన్ ||
13
దక్షః ప్రగల్భో ద్యుతిమాన్ మహాబలపరాక్రమః |
భ్రాత్రా వివాసితో రామ రాజ్యహేతోర్మహాబలః ||
14
స తే సహాయో మిత్రం చ సీతాయాః పరిమార్గణే |
భవిష్యతి హి తే రామ మా చ శోకే మనః కృథాః ||
15
భవితవ్యం హి యచ్చాపి న తచ్ఛక్యమిహాన్యథా |
కర్తుమిక్ష్వాకుశార్దూల కాలో హి దురతిక్రమః ||
16
గచ్ఛ శీఘ్రమితో రామ సుగ్రీవం తం మహాబలమ్ |
వయస్యం తం కురు క్షిప్రమితో గత్వాద్య రాఘవ ||
17
అద్రోహాయ సమాగమ్య దీప్యమానే విభావసౌ |
స చ తే నావమంతవ్యః సుగ్రీవో వానరాధిపః ||
18
కృతజ్ఞః కామరూపీ చ సహాయార్థీ చ వీర్యవాన్ |
శక్తౌ హ్యద్య యువాం కర్తుం కార్యం తస్య చికీర్షితమ్ ||
19
కృతార్థో వాఽకృతార్థో వా కృత్యం తవ కరిష్యతి |
స ఋక్షరజసః పుత్రః పంపామటతి శంకితః ||
20
భాస్కరస్యౌరసః పుత్రో వాలినా కృతకిల్బిషః |
సన్నిధాయాయుధం క్షిప్రమృశ్యమూకాలయం కపిమ్ ||
21
కురు రాఘవ సత్యేన వయస్యం వనచారిణమ్ |
స హి స్థానాని సర్వాణి కార్త్స్న్యేన కపికుంజరః ||
22
నరమాంసాశినాం లోకే నైపుణ్యాదధిగచ్ఛతి |
న తస్యావిదితం లోకే కించిదస్తి హి రాఘవ ||
23
యావత్సూర్యః ప్రతపతి సహస్రాంశురరిందమ |
స నదీర్విపులాఞ్ఛైలాన్ గిరిదుర్గాణి కందరాన్ ||
24
అన్వీక్ష్య వానరైః సార్ధం పత్నీం తేఽధిగమిష్యతి |
వానరాంశ్చ మహాకాయాన్ ప్రేషయిష్యతి రాఘవ ||
25
దిశో విచేతుం తాం సీతాం త్వద్వియోగేన శోచతీమ్ |
స జ్ఞాస్యతి వరారోహాం నిర్మలాం రావణాలయే ||
26
స మేరుశృంగాగ్రగతామనిందితాం
ప్రవిశ్య పాతాలతలేఽపి వాశ్రితామ్ |
ప్లవంగమానాం ప్రవరస్తవ ప్రియాం
నిహత్య రక్షాంసి పునః ప్రదాస్యతి ||
27
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే ద్విసప్తతితమః సర్గః ||
Aranya Kanda Sarga 72 Meaning In Telugu
తరువాత రామలక్ష్మణులు కబంధుని శరీరమును పెద్ద లోయ లోకి తోసి నిప్పుపెట్టారు. కబంధుని శరీరము పూర్తిగా కాలిపోగానే, ఆ చితిలోనుండి దివ్యమైన వస్త్రములను ధరించిన ఒక దివ్యపురుషుడు బయటకు వచ్చాడు.
“రామా! నీకు సీత ఎలా దొరుకుతుందో చెబుతాను విను. ప్రస్తుతము నీవు సీతా వియోగముతో, రాజ్యము పోగొట్టుకొని బాధపడుతున్నావు. నీ లాగానే రాజ్యము పోగొట్టుకొని, భార్యను పోగొట్టుకొని బాధపడుతున్న వానితో నీవు స్నేహం చెయ్యి. నీకు లాభం కలుగుతుంది. ప్రస్తుతము నీకు అటువంటి మిత్రునితో స్నేహము అవసరము. వాని వలన నీవు మిత్రలాభమును పొందుతావు.
వాలి, సుగ్రీవుడు అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. వారు వానరులు. అందులో వాలి సుగ్రీవుని భార్యను అపహరించి, సుగ్రీవుని రాజ్యమునుండి వెళ్ల గొట్టాడు. ప్రస్తుతము ఆ సుగ్రీవుడు పంపానదీ తీరములో ఉన్న ఋష్యమూక పర్వతము మీద తన అనుచరులతో నివసిస్తున్నాడు. సుగ్రీవునితో పాటు ఇంకా నలుగురు వానరులు ఉన్నారు. సుగ్రీవుడు మహా పరాక్రమ వంతుడు, సత్యవంతుడు, వినయము కలవాడు. మంచి ధైర్యముకలవాడు. దానికి తోడు మంచి బుద్ధిమంతుడు. కాని కాలము కలిసి రాక, వాలి చేత సుగ్రీవుడు రాజ్యము నుండి బయటకు వెళ్లగొట్టబడ్డాడు. నీలాగే భార్యను, రాజ్యమును పోగొట్టుకొన్న సుగ్రీవుడు సీతను వెదకడంలో నీకు సాయం చెయ్యగలడు. నీవు సుగ్రీవునితో మైత్రి చెయ్యి నీకు శుభం కలుగుతుంది.
రామా! సీత కోసరము నీవు శోకింపరాదు. కాలమును ఎవరూ అతిక్రమించలేరు. ఏ కాలానికి ఏది జరగాలలో అది జరిగితీరుతుంది. నువ్వు దేనినీ ఆపలేవు. కాబట్టి నీవు వెంటనే సుగ్రీవుని వద్దకు పోయి అగ్ని సాక్షిగా అతనితో మైత్రి చేసుకో. అతడు వానరుడు కదా నాకేం సాయం చేస్తాడులే అని అనుకోకు. అతనిని అవమా నించకు. ప్రస్తుతము అతనికి ఇతరుల సాయం కావాలి. నీవు అతనికి సాయం చేస్తే అతడు నీకు సాయం చేస్తాడు. ఒకవేళ నీవు అతనికి సాయం చెయ్యలేకపోయినా, అతడు నీకు సాయం చెయ్య గలడు.
ఇంక సుగ్రీవుని గురించి చెబుతాను విను. సుగ్రీవుడు సూర్యునికి ఒక వివాహిత అయిన వానర స్త్రీ వలన జన్మించాడు. వాలికి భయపడి ఋష్యమూక పర్వతము మీద దాక్కుని ఉన్నాడు.
సుగ్రీవునకు ఈ లోకములో ఉన్న రాక్షసుల స్థావరములు అన్నీ బాగా తెలుసు. ఈ లోకంలో సూర్యుని కిరణములు ఎంతవరకూ ప్రసరిస్తాయో అంతమేరా సుగ్రీవునకు తెలుసు. అతడు వానరులను పంపి సీత జాడ తెలుసుకోగల సమర్థుడు.
కాబట్టి సుగ్రీవునితో స్నేహం చెయ్యి. నీభార్య సీత మేరుపర్వతము మీద ఉన్నా, పాతాళములో ఉన్నా వెతికి తీసుకురాగల శక్తి ఉన్నవాడు సుగ్రీవుడు” అని పలికాడు కబంధుడు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము డెబ్బది రెండవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
అరణ్యకాండ త్రిసప్తతితమః సర్గః (73) >>