Kishkindha Kanda Sarga 14 In Telugu – కిష్కింధాకాండ చతుర్దశః సర్గః

కిష్కింధాకాండ చతుర్దశః సర్గలో, సుగ్రీవుడు తన వానర సేనలను సీతను వెతకడానికి అన్ని దిక్కులలో పంపించడానికి ఏర్పాట్లు చేస్తాడు. హనుమంతుడు, జాంబవంతుడు, ఆంగదుడు వంటి ప్రముఖ వానరులు వివిధ దిశలలో తమ సేనలను నడిపిస్తారు. సుగ్రీవుడు ప్రత్యేకంగా హనుమంతుడిని పిలిచి, అతని శక్తి, ధైర్యం గురించి ప్రస్తావిస్తూ సీతను కనుగొనడంలో అతని పాత్ర ఎంత ముఖ్యమో వివరించి చెప్పతాడు. హనుమంతుడు, సీతా దేవిని కనుగొనడంలో తన సమర్పణను ప్రదర్శిస్తాడు. ఈ సర్గలో, వానరులు తమ లక్ష్యాన్ని సాధించడానికి తమ శక్తి, నైపుణ్యాలను ఎలా ఉపయోగిస్తున్నారో చూడవచ్చు.

సుగ్రీవగర్జనమ్

సర్వే తే త్వరితం గత్వా కిష్కింధాం వాలిపాలితామ్ |
వృక్షైరాత్మానమావృత్య వ్యతిష్ఠన్ గహనే వనే || ౧ ||

విసార్య సర్వతో దృష్టిం కాననే కాననప్రియః | [విచార్య]
సుగ్రీవో విపులగ్రీవః క్రోధమాహారయద్భృశమ్ || ౨ ||

తతః స నినదం ఘోరం కృత్వా యుద్ధాయ చాహ్వయత్ ||
పరివారైః పరివృతో నాదైర్భిందన్నివాంబరమ్ || ౩ ||

గర్జన్నివ మహామేఘో వాయువేగపురస్సరః |
అథ బాలార్కసదృశో దృప్తసింహగతిస్తదా || ౪ ||

దృష్ట్వా రామం క్రియాదక్షం సుగ్రీవో వాక్యమబ్రవీత్ |
హరివాగురయా వ్యాప్తాం తప్తకాంచనతోరణామ్ || ౫ ||

ప్రాప్తః స్మ ధ్వజయంత్రాఢ్యాం కిష్కింధాం వాలినః పురీమ్ |
ప్రతిజ్ఞా యా త్వయా వీర కృతా వాలివధే పురా || ౬ ||

సఫలాం తాం కురు క్షిప్రం లతాం కాల ఇవాగతః |
ఏవముక్తస్తు ధర్మాత్మా సుగ్రీవేణ స రాఘవః || ౭ ||

తమథోవాచ సుగ్రీవం వచనం శత్రుసూదనః |
కృతాభిజ్ఞానచిహ్నస్త్వమనయా గజసాహ్వయా || ౮ ||

లక్ష్మణేన సముత్పాట్య యైషా కంఠే కృతా తవ |
శోభసే హ్యధికం వీర లతయా కంఠసక్తయా || ౯ ||

విపరీత ఇవాకాశే సూర్యో నక్షత్రమాలయా |
అద్య వాలిసముత్థం తే భయం వైరం చ వానర || ౧౦ ||

ఏకేనాహం ప్రమోక్ష్యామి బాణమోక్షేణ సంయుగే |
మమ దర్శయ సుగ్రీవ వైరిణం భ్రాతృరూపిణమ్ || ౧౧ ||

వాలీ వినిహతో యావద్వనే పాంసుషు వేష్టతే |
యది దృష్టిపథం ప్రాప్తో జీవన్ స వినివర్తతే || ౧౨ ||

తతో దోషేణ మా గచ్ఛేత్ సద్యో గర్హేచ్చ మా భవాన్ |
ప్రత్యక్షం సప్త తే సాలా మయా బాణేన దారితాః || ౧౩ ||

తేనావేహి బలేనాద్య వాలినం నిహతం మయా |
అనృతం నోక్తపూర్వం మే వీర కృచ్ఛ్రేఽపి తిష్ఠతా || ౧౪ ||

ధర్మలోభపరీతేన న చ వక్ష్యే కథంచన |
సఫలాం చ కరిష్యామి ప్రతిజ్ఞాం జహి సంభ్రమమ్ || ౧౫ ||

ప్రసూతం కలమం క్షేత్రే వర్షేణేవ శతక్రతుః |
తదాహ్వాననిమిత్తం త్వం వాలినో హేమమాలినః || ౧౬ ||

సుగ్రీవ కురు తం శబ్దం నిష్పతేద్యేన వానరః |
జితకాశీ బలశ్లాఘీ త్వయా చాధర్షితః పురా || ౧౭ ||

నిష్పతిష్యత్యసంగేన వాలీ స ప్రియసంయుగః |
రిపూణాం ధర్షణం శూరా మర్షయంతి న సంయుగే || ౧౮ ||

జానంతస్తు స్వకం వీర్యం స్త్రీసమక్షం విశేషతః |
స తు రామవచః శ్రుత్వా సుగ్రీవో హేమపింగళః || ౧౯ ||

ననర్ద క్రూరనాదేన వినిర్భిందన్నివాంబరమ్ |
తస్య శబ్దేన విత్రస్తా గావో యాంతి హతప్రభాః || ౨౦ ||

రాజదోషపరామృష్టాః కులస్త్రియ ఇవాకులాః |
ద్రవంతి చ మృగాః శీఘ్రం భగ్నా ఇవ రణే హయాః |
పతంతి చ ఖగా భూమౌ క్షీణపుణ్యా ఇవ గ్రహాః || ౨౧ ||

తతః స జీమూతగణప్రణాదో
నాదం హ్యముంచత్త్వరయా ప్రతీతః |
సూర్యాత్మజః శౌర్యవివృద్ధతేజాః
సరిత్పతిర్వాఽనిలచంచలోర్మిః || ౨౨ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే చతుర్దశః సర్గః || ౧౪ ||

Kishkindha Kanda Sarga 14 Meaning In Telugu

అందరూ కిష్కింధా నగరము ప్రవేశించారు. సుగ్రీవుడు రామునితో ఇలా అన్నాడు.“రామా! ఇదే కిష్కింధా నగరము. ఇక్కడ ద్వారములు అన్నీ బంగారంతో నిర్మించారు. ఇక్కడ అనేక యంత్రములు అమర్చబడ్డాయి. వాలిని చంపడానికి తగిన కాలము సమీపించింది. నీవు దానిని సఫలం చేస్తావని ఆశిస్తున్నాను.” అని అన్నాడు అనుమానంగా అన్నాడు సుగ్రీవుడు. సుగ్రీవుని మనసులోని సందేహాన్ని గ్రహించాడు రాముడు. అతని మనసులోని సందేహ నివృత్తి కోసరం ఇలా అన్నాడు.

“సుగ్రీవా! ఈ సారి వాలిని గుర్తు పట్టడంలో పొరపాటు జరగదు. ఎందుకంటే నీ మెడలో ఉన్న గజమాల నువ్వు సుగ్రీవుడు అని తెలియజేస్తుంది. ఒకే ఒక బాణంతో నేను వాలిని చంపుతాను. నీవు నిశ్చింతగా ఉండు. ఈ సారి వాలి నా కంటబడి తప్పించుకుంటే, నువ్వు నన్ను తప్పు పట్టు. నన్ను నిందించు. నీ ఎదురుగానే కదా నేను ఏడు సాలవృక్షములను ఛేధించాను. ఈ వాలిని చంపడం పెద్ద కష్టమేమీ కాదు. నన్ను నమ్ము.

నేను ఎన్ని కష్టములలో ఉన్నా ఎప్పుడూ అసత్యము చెప్పలేదు. ఇక మీదట కూడా అసత్యము చెప్పను. చెప్పలేను. నేను నా ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటాను. ఇది సత్యము. నీలోని భయాన్ని వదిలిపెట్టు. ధైర్యంగా వాలితో యుద్ధం చెయ్యి. వాలిని యుద్ధానికి పిలువు. అతడు బయటకు వచ్చేట్టు చెయ్యి. నీవు యుద్ధమునకు పిలవగానే వాలి బయటకు వస్తాడు. ఎందుకంటే అతడు ఇప్పటి దాకా ఓటమి ఎరుగడు అని నువ్వే చెప్పావు కదా!

అతనికి తన బలము మీద పరాక్రమము మీద నమ్మకము ఎక్కువ. తనను తాను పొగుడుకుంటూ ఉంటాడు. కాబట్టి నీతో యుద్ధానికి వస్తాడు. నా చేతిలో చస్తాడు. మరొక విషయం. అతను ఇప్పుడు స్త్రీలతో కామభోగములు అనుభవిస్తూ ఉంటాడు. స్త్రీల మధ్య ఉన్న వాలి తనను ఎవడైనా ఎదిరిస్తే సహించలేడు. వెంటనే బయటకు వస్తాడు. కాబట్టి సుగ్రీవా! వాలిని యుద్ధానికి పిలువు.” అని అన్నాడు రాముడు సుగ్రీవునికి ధైర్యం చెబుతూ.

రాముడు పలికిన ధైర్యవచనాలకు సుగ్రీవుడు పొంగిపోయాడు. గట్టిగా గర్జించాడు. తొడ చరిచి వాలిని యుద్ధానికి పిలుస్తూ పెద్ద పెద్దగా రంకెలు వేసాడు. సుగ్రీవుడు అరుస్తున్న అరుపులకు, వేస్తున్న రంకెలకు, కిష్కింధ అదిరిపోయింది. వాలి బయటకు వచ్చేవరకూ సుగ్రీవుడు అలా అరుస్తూనే ఉన్నాడు.

శ్రీమద్రామాయణము కిష్కింధాకాండము
పదునాల్గవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

కిష్కింధాకాండ పంచదశః సర్గః (15) >>>

Leave a Comment