Ayodhya Kanda Sarga 81 In Telugu – అయోధ్యాకాండ ఏకాశీతితమః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ ఏకాశీతితమః సర్గ, “సభాస్తానమ్”, రామాయణంలోని ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో, భరతుడు తన అన్న రాముడు వనవాసానికి వెళ్లిన తరువాత, అయోధ్యను ఎలా పాలించాలో నిర్ణయించడానికి రాజసభలో సమావేశం నిర్వహిస్తాడు. భరతుడు, రాముడి పట్ల ఉన్న గాఢమైన ప్రేమను మరియు విధేయతను ప్రతిబింబిస్తూ, రాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి తనను తాను ప్రతినిధిగా ప్రకటిస్తాడు. ఈ సర్గలో, భరతుడు తన ధర్మాన్ని, భక్తిని, మరియు రాముడి పట్ల ఉన్న విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తూ, ప్రజలతో పాటు తన సామంతులను మరియు రాజకుటుంబాన్ని చర్చించుకుంటాడు. ఈ సంఘటన భరతుడి వినయం, విధేయత, మరియు నిస్వార్థతను హృదయానికి హత్తుకునేలా చూపుతుంది.

సభాస్తానమ్

తతో నాందీముఖీం రాత్రిం భరతం సూతమాగధాః |
తుష్టువుర్వాగ్విశేషజ్ఞాః స్తవైః మంగళసంహితైః ||

1

సువర్ణ కోణాభిహతః ప్రాణదద్యామదుందుభిః |
దధ్ముః శంఖాంశ్చ శతశో నాదాంశ్చోచ్చావచస్వరాన్ ||

2

స తూర్యఘోషః సుమహాన్ దివమాపూరయన్నివ |
భరతం శోకసంతప్తం భూయః శోకైరరంధ్రయత్ ||

3

తతః ప్రబుద్ధో భరతస్తం ఘోషం సంనివర్త్య చ |
నాహం రాజేతి చాప్యుక్త్వా శత్రుఘ్నమిదమబ్రవీత్ ||

4

పశ్య శత్రుఘ్న కైకేయ్యా లోకస్యాపకృతం మహత్ |
విసృజ్య మయి దుఃఖాని రాజా దశరథో గతః ||

5

తస్యైషా ధర్మరాజస్య ధర్మమూలా మహాత్మనః |
పరిభ్రమతి రాజశ్రీః నౌరివాకర్ణికా జలే ||

6

యో హి నః సుమహాన్నాథః సోఽపి ప్రవ్రాజితో వనమ్ |
అనయా ధర్మముత్సృజ్య మాత్రా మే రాఘవః స్వయమ్ ||

7

ఇత్యేవం భరతం ప్రేక్ష్య విలపంతం విచేతనమ్ |
కృపణం రురుదుః సర్వాః సస్వరం యోషితస్తదా ||

8

తథా తస్మిన్విలపతి వసిష్ఠో రాజధర్మవిత్ |
సభామిక్ష్వాకునాథస్య ప్రవివేశ మహాయశాః ||

9

శాతకుంభమయీం రమ్యాం మణిరత్నసమాకులామ్ |
సుధర్మామివ ధర్మాత్మా సగణః ప్రత్యపద్యత ||

10

స కాంచనమయం పీఠం సుఖాస్తరణసంవృతమ్ |
అధ్యాస్త సర్వవేదజ్ఞో దూతాననుశశాస చ ||

11

బ్రాహ్మణాన్ క్షత్రియాన్ వైశ్యాన్ అమాత్యాన్ గణవల్లభాన్ |
క్షిప్రమానయతావ్యగ్రాః కృత్యమాత్యయికం హి నః ||

12

సరాజభృత్యం శత్రుఘ్నం భరతం చ యశస్వినమ్ |
యుధాజితం సుమంత్రం చ యే చ తత్ర హితా జనాః ||

13

తతః హలహలాశబ్దో మహాన్సముదపద్యత |
రథైరశ్వైః గజైశ్చాపి జనానాముపగచ్ఛతామ్ ||

14

తతః భరతమాయాంతం శతక్రతుమివామరాః |
ప్రత్యనందన్ ప్రకృతయో యథా దశరథం తథా ||

15

హ్రదైవ తిమినాగసంవృతః
స్తిమితజలో మణిశంఖశర్కరః |
దశరథసుతశోభితా సభా
సదశరథేవ బభౌ యథా పురా ||

16

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకాశీతితమః సర్గః ||

Ayodhya Kanda Sarga Meaning 81 In Telugu

దశరథుడు చనిపోయి 13 రోజులు గడిచిపోయాయి. కర్మకాండలు అన్నీ పూర్తి అయ్యాయి. శోకదినములు గడిచిపోయాయి. 14వరోజున రాచరిక లాంఛనాలు ప్రారంభం అయ్యాయి. తెల్లవారు జామునే వందిమాగథులు భరతుని స్తోత్రం చేస్తున్నారు. దుందుభులు మ్రోగిస్తున్నారు. మంగళవాద్యములు మోగుతున్నాయి. వేశ్యలు నృత్యం చేస్తున్నారు. అంతా కాబోయే మహారాజు భరతుని మేలుకొలుపు తున్నారు. కాని ఈ రాజలాంఛనాలు అన్నీ భరతునికి చికాకు పుట్టించాయి. అతనికి ఇంకా దుఃఖము ఎక్కువ అయింది.

“ఆపండి. నేను రాజును కాను.” అని గట్టిగా అరిచాడు.

అన్నీ ఆగిపోయాయి. భరతుడు శత్రుఘ్నుని చూచి ఇలా అన్నాడు.

“శత్రుఘ్నా! చూచావా. కైక వలన ఎంతటి అనర్ధము వాటిల్లిందో. మహారాజు రాజ్యభారము నా మీద మోపి తాను హాయిగా స్వర్గసుఖములు అనుభవిస్తున్నాడు. ఈ కష్టములు అన్నీ నాకు వదిలి రాముడు హాయిగా వనవిహారము చేస్తున్నాడు. నేను ఒంటరిగా మిగిలిపోయాను.’ అని రోదిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే వసిష్ఠుడు రాజసభను ఏర్పాటు చేసాడు. అయోధ్యలో ఉన్న అన్ని కులముల వారినీ, అమాత్యులనూ, పురప్రముఖులను, గణాధ్యక్షులను, సభకు ఆహ్వానించాడు. వారందరూ సభలో తమ తమ ఆసనములమీద కూర్చున్నారు. తరువాత వసిష్ఠుడు భరతుని, శత్రుఘ్నుని, యుధాజిత్తును, సుమంత్రుని తీసుకొని రమ్మని భృత్యులను పంపించాడు. భరతుడు, శత్రుఘ్ను సమేతంగా వచ్చిసభలో కూర్చున్నాడు. భరతుడు రాగానే అందరూ లేచి ఆయనకు అభివాదములు తెలియ జేసారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఎనుబది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ ద్వ్యశీతితమః సర్గః (82) >>

Leave a Comment