Kishkindha Kanda Sarga 15 In Telugu – కిష్కింధాకాండ పంచదశః సర్గః

కిష్కింధాకాండ పంచదశః సర్గలో, సుగ్రీవుడు రామునితో సీతా దేవి శోధనకు సంబంధించిన ప్రణాళికలను చర్చిస్తాడు. వానరసేనలు వివిధ దిక్కులలో బయలుదేరి వెతకమని ఆజ్ఞలు పొందుతారు. హనుమంతుడు, జాంబవంతుడు, ఆంగదుడు వంటి వానరులు తమ సేనలతో కలిసి సీతను వెతికే ప్రయత్నంలో పాల్గొంటారు. ఈ సర్గలో, వానరులు అడవులు, పర్వతాలు, నదులు, సముద్రతీరాలను దాటి వెతకడం ప్రారంభిస్తారు. వారి శోధనలో సీతను కనుగొనడానికి అడ్డంకులను అధిగమించడం కోసం తమ బలాన్ని, ధైర్యాన్ని చూపిస్తారు. సీతను రక్షించి రామునికి తిరిగి తీసుకురావాలని సంకల్పంతో వానరులు తమ ప్రయత్నాన్ని మరింత కట్టుదిట్టంగా కొనసాగిస్తారు.

తారాహితోక్తిః

అథ తస్య నినాదం తు సుగ్రీవస్య మహాత్మనః |
శుశ్రావాంతఃపురగతో వాలీ భ్రాతురమర్షణః || ౧ ||

శ్రుత్వా తు తస్య నినదం సర్వభూతప్రకంపనమ్ |
మదశ్చైకపదే నష్టః క్రోధశ్చాపతితో మహాన్ || ౨ ||

స తు రోషపరీతాంగో వాలీ సంధ్యాతపప్రభః |
ఉపరక్త ఇవాదిత్యః సద్యో నిష్ప్రభతాం గతః || ౩ ||

వాలీ దంష్ట్రాకరాళస్తు క్రోధాద్దీప్తాగ్నిసన్నిభః |
భాత్యుత్పతితపద్మాభః సమృణాళ ఇవ హ్రదః || ౪ ||

శబ్దం దుర్మర్షణం శ్రుత్వా నిష్పపాత తతో హరిః |
వేగేన చరణన్యాసైర్దారయన్నివ మేదినీమ్ || ౫ ||

తం తు తారా పరిష్వజ్య స్నేహాద్దర్శితసౌహృదా |
ఉవాచ త్రస్తాసంభ్రాంతా హితోదర్కమిదం వచః || ౬ ||

సాధు క్రోధమిమం వీర నదీవేగమివాగతమ్ |
శయనాదుత్థితః కాల్యం త్యజ భుక్తామివ స్రజమ్ || ౭ ||

కాల్యమేతేన సంగ్రామం కరిష్యసి హరీశ్వర |
వీర తే శత్రుబాహుల్యం ఫల్గుతా వా న విద్యతే || ౮ ||

సహసా తవ నిష్క్రామో మమ తావన్న రోచతే |
శ్రూయతాం చాభిధాస్యామి యన్నిమిత్తం నివార్యసే || ౯ ||

పూర్వమాపతితః క్రోధాత్ స త్వామాహ్వయతే యుధి |
నిష్పత్య చ నిరస్తస్తే హన్యమానో దిశో గతః || ౧౦ ||

త్వయా తస్య నిరస్తస్య పీడితస్య విశేషతః |
ఇహైత్య పునరాహ్వానం శంకాం జనయతీవ మే || ౧౧ ||

దర్పశ్చ వ్యవసాయశ్చ యాదృశస్తస్య నర్దతః |
నినాదస్య చ సంరంభో నైతదల్పం హి కారణమ్ || ౧౨ ||

నాసహాయమహం మన్యే సుగ్రీవం తమిహాగతమ్ |
అవష్టబ్ధసహాయశ్చ యమాశ్రిత్యైష గర్జతి || ౧౩ ||

ప్రకృత్యా నిపుణశ్చైవ బుద్ధిమాంశ్చైవ వానరః |
అపరీక్షితవీర్యేణ సుగ్రీవః సహ నేష్యతి || ౧౪ ||

పూర్వమేవ మయా వీర శ్రుతం కథయతో వచః |
అంగదస్య కుమారస్య వక్ష్యామి త్వా హితం వచః || ౧౫ ||

అంగదస్తు కుమారోఽయం వనాంతముపనిర్గతః |
ప్రవృత్తిస్తేన కథితా చారైరాప్తైర్నివేదితా || ౧౬ ||

అయోధ్యాధిపతేః పుత్రో శూరో సమరదుర్జయౌ |
ఇక్ష్వాకూణాం కులే జాతౌ ప్రథితౌ రామలక్ష్మణౌ || ౧౭ ||

సుగ్రీవప్రియకామార్థం ప్రాప్తౌ తత్ర దురాసదౌ |
తవ భ్రాతుర్హి విఖ్యాతః సహాయో రణకర్కశః || ౧౮ ||

రామః పరబలామర్దీ యుగాంతాగ్నిరివోత్థితః |
నివాసవృక్షః సాధూనామాపన్నానాం పరా గతిః || ౧౯ ||

ఆర్తానాం సంశ్రయశ్చైవ యశసశ్చైకభాజనమ్ |
జ్ఞానవిజ్ఞానసంపన్నో నిదేశే నిరతః పితుః || ౨౦ ||

ధాతూనామివ శైలేంద్రో గుణానామాకరో మహాన్ |
తత్క్షమం న విరోధస్తే సహ తేన మహాత్మనా || ౨౧ ||

దుర్జయేనాప్రమేయేన రామేణ రణకర్మసు |
శూర వక్ష్యామి తే కించిన్న చేచ్ఛామ్యభ్యసూయితుమ్ || ౨౨ ||

శ్రూయతాం క్రియతాం చైవ తవ వక్ష్యామి యద్ధితమ్ |
యౌవరాజ్యేన సుగ్రీవం తూర్ణం సాధ్వభిషేచయ || ౨౩ ||

విగ్రహం మా కృథా వీర భ్రాత్రా రాజన్ యవీయసా | [బలీయసా]
అహం హి తే క్షమం మన్యే తేన రామేణ సౌహృదమ్ || ౨౪ ||

సుగ్రీవేణ చ సంప్రీతిం వైరముత్సృజ్య దూరతః |
లాలనీయో హి తే భ్రాతా యవీయానేష వానరః || ౨౫ ||

తత్ర వా సన్నిహస్థో వా సర్వథా బంధురేవ తే |
న హి తేన సమం బంధుం భువి పశ్యామి కంచన || ౨౬ ||

దానమానాదిసత్కారైః కురుష్వ ప్రత్యనంతరమ్ |
వైరమేతత్సముత్సృజ్య తవ పార్శ్వే స తిష్ఠతు || ౨౭ ||

సుగ్రీవో విపులగ్రీవస్తవ బంధుః సదా మతః |
భ్రాతుః సౌహృదమాలంబ నాన్యా గితిరిహాస్తి తే || ౨౮ ||

యది తే మత్ప్రియం కార్యం యది చావైషి మాం హితామ్ |
యాచ్యమానః ప్రయత్నేన సాధు వాక్యం కురుష్వ మే || ౨౯ ||

ప్రసీద పథ్యం శృణు జల్పితం హి మే
న రోషమేవానువిధాతుమర్హసి |
క్షమో హి తే కోసలరాజసూనునా
న విగ్రహః శక్రసమానతేజసా || ౩౦ ||

తదా హి తారా హితమేవ వాక్యం
తం వాలినం పథ్యమిదం బభాషే |
న రోచతే తద్వచనం హి తస్య
కాలాభిపన్నస్య వినాశకాలే || ౩౧ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే పంచదశః సర్గః || ౧౫ ||

Kishkindha Kanda Sarga 15 Meaning In Telugu

ఉంది. ఆ సాయం ఎవరు, ఏ రూపంలో చేస్తున్నారో తెలియదు. ఇంతకూ సుగ్రీవునికి సాయం చేసే వాళ్లు ఎవరు? ఎక్కడ నుండి వచ్చారు? సుగ్రీవునికి సాయం చెయ్యాల్సిన అవసరం వారికి ఏముంది? బయట నుండి సాయం లేకుండా సుగ్రీవుడు ఇంతధైర్యంగా మరలా నీ మీదికి యుద్ధానికి కాలు దువ్వడు.

సుగ్రీవుడు బలవంతుడు కాకపోయినా బుద్ధిమంతుడు. నేర్పు కలవాడు. తనకు ఏ లాభమూ లేకుండా ఎవరితోనూ స్నేహం చెయ్యడు. ఇప్పుడు సుగ్రీవుడు ఎవరితో స్నేహం చేసాడో తెలుసుకోవడం అవసరం కదా! ఇటీవల మీ కుమారుడు అంగదుడు నాకు ఒక వార్త చెప్పాడు. దానిని ఇప్పుడు నీకు చెబుతున్నాను. మన సరిహద్దుల్లో కాపలా ఉండే గూఢచారులు అంగదునికి ఈ వార్త చెప్పారట.

అదేమిటంటే…… ఇక్ష్వాకు వంశములో పుట్టిన వారు, దశరథుని కుమారులు, రామ లక్ష్మణులు అనే పేరు గల వాళ్లు మన వనములో సంచరిస్తూ ఉన్నారట. వారితో సుగ్రీవునికి స్నేహం కలిసిందట. వారు సుగ్రీవుని కోరిక తీర్చడానికి ఒప్పుకున్నారట. ఇంక ఆ రాముడు ధనుస్సును ప్రయోగించడంలో గొప్ప నేర్పరి. బాణములను వేగంగా వేయగలడు. ఆ రాముడు ధర్మపరుడు. ఆపదలలో ఉన్నవారిని కాపాడే గుణం కలవాడు. మంచి లౌకిక జ్ఞానము శాస్త్రజ్ఞానము కలవాడు. తండ్రి ఆజ్ఞను పాలించేవాడు. రాముని యుద్ధంలో జయించడం అసాధ్యం అని తెలిసింది. అటువంటి వాడు ఇప్పుడు నీ సోదరుడు సుగ్రీవునికి సాయం చేస్తున్నాడట. కాబట్టి రామునితో నీకు విరోధము తగదు అని నా భావన. నీవు నా మీద కోపం తెచ్చుకోకపోతే నీకు ఒక విషయం చెబుతాను. సావధానంగా విను. నీకు తెలుసు.

సుగ్రీవుడు ఏ తప్పూ చేయలేదు. కాబట్టి నీ తమ్ముని ఆదరించు. అతని రాజ్యము అతనికి ఇవ్వు. సుగ్రీవునితో విరోధము మాను. నీవు సుగ్రీవునితోస్నేహం చేసుకుంటే, రాముడు కూడా నీకు స్నేహితుడు అవుతాడు. నాధా! సుగ్రీవుడు పరాయివాడు కాదు కదా! నీకు స్వంత తమ్ముడు. అతని మీద ప్రేమ చూపించాలి గానీ ద్వేషించకూడదు. ప్రస్తుతము నీకు నీ సోదరుడు సుగ్రీవునితో సంధి చేసుకొనడం తప్ప వేరు మార్గము లేదు. నేను నీ హితము కోరి ఈ మాటలు చెబుతున్నాను. నీవు నా భర్త కాబట్టి, నీ క్షేమమును నేను సదా కోరుతాను కాబట్టి చెబుతున్నాను. కోపము, ద్వేషము విడిచి పెట్టు. నా మాటవిను. సుగ్రీవునితో యుద్ధము మాను. ” అని తార తన భర్త వాలికి హితోపదేశము చేసింది. కాని తార మాటలు వాలికిరుచించలేదు.

(ఇది విదురుడు సుయోధనునికి హితము చెప్పినట్టు ఉంది కదా! వాలి– సుయోధనుడు. సుగ్రీవుడు– ధర్మరాజు. సుగ్రీవునితో రామునికి మైత్రి కుదిరింది. ధర్మరాజుతో కృష్ణునికి బంధుత్వతము మైత్రి రెండు ఉన్నాయి. ఇద్దరి మధ్యా రాజ్యము వలన తగాదా వచ్చింది. సుగ్రీవుని భార్యను వాలి అవమానిస్తే, ధర్మరాజు భార్యను సుయోధనుడు అవమానించాడు. వాలి సుగ్రీవుని అడవులకు తరిమితే, సుయోధనుడు ధర్మరాజును అడవులకు పంపాడు. అరణ్య వాసం తరువాత ధర్మరాజు యుద్ధం చేస్తే, అరణ్యవాసం తరువాత సుగ్రీవుడు వాలితో యుద్ధం చేసాడు. రాముని సాయంతో సుగ్రీవుడు వాలిని చంపితే, కృష్ణుడు చెప్పిన ఉపాయంతో భీముని చేతిలో సుయోధనుడు చచ్చాడు. కృష్ణుడు ఏ పక్కన ఉంటే అక్కడ జయం ఉంటుంది. రాముడు ఎక్కడ ఉంటే అక్కడ జయం ఉంటుంది. విదురుడు సుయోధనునితో సంధి చేసుకోమంటే, ఇక్కడ తార కూడా వాలిని సంధిచేసుకోమని చెప్పింది. యుగాలు మారినా, కధలు వేరైనా, ధర్మం ఒకటే. అదే కలియుగంలో చిన్న సామెత రూపంలో ఉంది. పోరు నష్టము పొందు లాభము.)

శ్రీమద్రామాయణము
కిష్కింధాకాండము పదునైదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

కిష్కింధాకాండ షోడశః సర్గః (16) >>>

Leave a Comment