కిష్కింధాకాండంలో షోడశం సర్గం రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు మరియు వానర సేన కూడా ప్రణయ కలాపాలు చేస్తుంటారు. సుగ్రీవుడు మాటలతో అలంకరించబడి, వివాహ సంస్కారాలను పాలిస్తాడు. అయోధ్యలో రాజ్యాభిషేకం చేయడంతో శ్రీరాముడు వానర సేనల సహాయాన్ని అందించేందుకు ముందుగా, రాజకీయ సహాయాన్ని సుగ్రీవుడు మాత్రం అందించడంతో రాముని ప్రియుడు మరియు భక్తుడగా చూడగలడు.
వాలిసంహారః
తామేవం బ్రువతీం తారాం తారాధిపనిభాననామ్ |
వాలీ నిర్భర్త్సయామాస వచనం చేదమబ్రవీత్ || ౧ ||
గర్జతోఽస్య చ సంరంభం భ్రాతుః శత్రోర్విశేషతః |
మర్షయిష్యామ్యహం కేన కారణేన వరాననే || ౨ ||
అధర్షితానాం శూరాణాం సమరేష్వనివర్తినామ్ |
ధర్షణామర్షణం భీరు మరణాదతిరిచ్యతే || ౩ ||
సోఢుం న చ సమర్థోఽహం యుద్ధకామస్య సంయుగే |
సుగ్రీవస్య చ సంరంభం హీనగ్రీవస్య గర్జతః || ౪ ||
న చ కార్యో విషాదస్తే రాఘవం ప్రతి మత్కృతే |
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ కథం పాపం కరిష్యతి || ౫ ||
నివర్తస్వ సహ స్త్రీభిః కథం భూయోఽనుగచ్ఛసి |
సౌహృదం దర్శితం తారే మయి భక్తిః కృతా త్వయా || ౬ ||
ప్రతియోత్స్యామ్యహం గత్వా సుగ్రీవం జహి సంభ్రమమ్ |
దర్పమాత్రం వినేష్యామి న చ ప్రాణైర్విమోక్ష్యతే || ౭ ||
అహం హ్యాజిస్థితస్యాస్య కరిష్యామి యథేప్సితమ్ |
వృక్షైర్ముష్టిప్రహారైశ్చ పీడితః ప్రతియాస్యతి || ౮ ||
న మే గర్వితమాయస్తం సహిష్యతి దురాత్మవాన్ |
కృతం తారే సహాయత్వం సౌహృదం దర్శితం మయి || ౯ ||
శాపితాసి మమ ప్రాణైర్నివర్తస్వ జనేన చ |
అహం జిత్వా నివర్తిష్యే తమహం భ్రాతరం రణే || ౧౦ ||
తం తు తారా పరిష్వజ్య వాలినం ప్రియవాదినీ |
చకార రుదతీ మందం దక్షిణా సా ప్రదక్షిణమ్ || ౧౧ ||
తతః స్వస్త్యయనం కృత్వా మంత్రవద్విజయైషిణీ |
అంతఃపురం సహ స్త్రీభిః ప్రవిష్టా శోకమోహితా || ౧౨ ||
ప్రవిష్టాయాం తు తారాయాం సహ స్త్రీభిః స్వమాలయమ్ |
నగరాన్నిర్యయౌ క్రుద్ధో మహాసర్ప ఇవ శ్వసన్ || ౧౩ ||
స నిష్పత్య మహాతేజా వాలీ పరమరోషణః |
సర్వతశ్చారయన్ దృష్టిం శత్రుదర్శనకాంక్షయా || ౧౪ ||
స దదర్శ తతః శ్రీమాన్ సుగ్రీవం హేమపింగళమ్ |
సుసంవీతమవష్టబ్ధం దీప్యమానమివానలమ్ || ౧౫ ||
స తం దృష్ట్వా మహావీర్యం సుగ్రీవం పర్యవస్థితమ్ |
గాఢం పరిదధే వాసో వాలీ పరమరోషణః || ౧౬ ||
స వాలీ గాఢసంవీతో ముష్టిముద్యమ్య వీర్యవాన్ |
సుగ్రీవమేవాభిముఖో యయౌ యోద్ధుం కృతక్షణః || ౧౭ ||
శ్లిష్టముష్టిం సముద్యమ్య సంరబ్ధతరమాగతః |
సుగ్రీవోఽపి తముద్దిశ్య వాలినం హేమమాలినమ్ || ౧౮ ||
తం వాలీ క్రోధతామ్రాక్షః సుగ్రీవం రణపండితమ్ |
ఆపతంతం మహావేగమిదం వచనమబ్రవీత్ || ౧౯ ||
ఏష ముష్టిర్మయా బద్ధో గాఢః సన్నిహితాంగుళిః |
మయా వేగవిముక్తస్తే ప్రాణానాదాయ యాస్యతి || ౨౦ ||
ఏవముక్తస్తు సుగ్రీవః క్రుద్ధో వాలినమబ్రవీత్ |
తవ చైవ హరన్ ప్రాణాన్ ముష్టిః పతతు మూర్ధని || ౨౧ ||
తాడితస్తేన సంక్రుద్ధస్తమభిక్రమ్య వేగితః |
అభవచ్ఛోణితోద్గారీ సోత్పీడ ఇవ పర్వతః || ౨౨ ||
సుగ్రీవేణ తు నిస్సంగం సాలముత్పాట్య తేజసా |
గాత్రేష్వభిహతో వాలీ వజ్రేణేవ మహాగిరిః || ౨౩ ||
స తు వాలీ ప్రచలితః సాలతాడనవిహ్వలః |
గురుభారసమాక్రాంతో నౌసార్థ ఇవ సాగరే || ౨౪ ||
తౌ భీమబలవిక్రాంతౌ సుపర్ణసమవేగినౌ |
ప్రవృద్ధౌ ఘోరవపుషౌ చంద్రసూర్యావివాంబరే || ౨౫ ||
పరస్పరమమిత్రఘ్నౌ ఛిద్రాన్వేషణతత్పరౌ |
తతోఽవర్ధత వాలీ తు బలవీర్యసమన్వితః || ౨౬ ||
సూర్యపుత్రో మహావీర్యః సుగ్రీవః పరిహీయతే |
వాలినా భగ్నదర్పస్తు సుగ్రీవో మందవిక్రమః || ౨౭ ||
వాలినం ప్రతి సామర్షో దర్శయామాస రాఘవమ్ |
వృక్షైః సశాఖైః సశిఖైర్వజ్రకోటినిభైర్నఖైః || ౨౮ ||
ముష్టిభిర్జానుభిః పద్భిర్బాహుభిశ్చ పునః పునః |
తయోర్యుద్ధమభూద్ఘోరం వృత్రవాసవయోరివ || ౨౯ ||
తౌ శోణితాక్తౌ యుద్ధ్యేతాం వానరౌ వనచారిణౌ |
మేఘావివ మహాశబ్దైస్తర్జయానౌ పరస్పరమ్ || ౩౦ ||
హీయమానమథోఽపశ్యత్సుగ్రీవం వానరేశ్వరమ్ |
ప్రేక్షమాణం దిశశ్చైవ రాఘవః స ముహుర్ముహుః || ౩౧ ||
తతో రామో మహాతేజా ఆర్తం దృష్ట్వా హరీశ్వరమ్ |
శరం చ వీక్షతే వీరో వాలినో వధకారణాత్ || ౩౨ ||
తతో ధనుషి సంధాయ శరమాశీవిషోపమమ్ |
పూరయామాస తచ్చాపం కాలచక్రమివాంతకః || ౩౩ ||
తస్య జ్యాతలఘోషేణ త్రస్తాః పత్రరథేశ్వరాః |
ప్రదుద్రువుర్మృగాశ్చైవ యుగాంత ఇవ మోహితాః || ౩౪ ||
ముక్తస్తు వజ్రనిర్ఘోషః ప్రదీప్తాశనిసన్నిభః |
రాఘవేణ మహాబాణో వాలివక్షసి పాతితః || ౩౫ ||
తతస్తేన మహాతేజా వీర్యోత్సిక్తః కపీశ్వరః |
వేగేనాభిహతో వాలీ నిపపాత మహీతలే || ౩౬ ||
ఇంద్రధ్వజ ఇవోద్ధూతః పౌర్ణమాస్యాం మహీతేలే |
ఆశ్వయుక్సమయే మాసి గతశ్రీకో విచేతనః || ౩౭ ||
నరోత్తమః కాలయుగాంతకోపమం
శరోత్తమం కాంచనరూప్యభూషితమ్ |
ససర్జ దీప్తం తమమిత్రమర్దనం
సధూమమగ్నిం ముఖతో యథా హరః || ౩౮ ||
అథోక్షితః శోణితతోయవిస్రవైః
సుపుష్పితాశోక ఇవానలోద్ధతః |
విచేతనో వాసవసూనురాహవే
విభ్రంశితేంద్రధ్వజవత్క్షితిం గతః || ౩౯ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే షోడశః సర్గః || ౧౬ ||
Kishkindha Kanda Sarga 16 Meaning In Telugu
తార చెప్పిన మాటలు వాలి పెడచెవిని పెట్టాడు. తారను నాకు చెప్పేంత దానివా అని కసురుకున్నాడు. విదిలించి కొట్టాడు. పురుషాహంకారము అతని ఆలోచనా శక్తిని హరించి వేసింది.
“నా కన్నా బలహీనుడు నన్ను యుద్ధానికి రమ్మని పిలుస్తుంటే నేను ముందూ వెనకా ఆలోచిస్తూ కూర్చోవాలా! కుదరదు. నీవు భయస్తురాలవు. పిరికిదానికి. నా వంటి వీరుడు శూరుడు యుద్ధానికి వెనుదీయ్యడం కన్నా మరణించడం మేలు. శత్రువు యుద్ధానికి కాలు దువ్వుతుంటే, ఓర్పుతో ఉండటం మరణం కన్నా సహించరానిది. ఇంక రాముని గూర్చి నాకు భయం లేదు. నీవే అన్నావు కదా. రాముడు ధర్మాత్ముడు. ఆర్తజనులను రక్షించేవాడు అని.
అటువంటి రాముడు అధర్మానికి ఎలా ఒడిగడతాడు. సుగ్రీవుని కోసరం పాపం ఎలా చేస్తాడు? ఏదో స్త్రీసహజమైన చాపల్యంతో నీకు తోచింది చెప్పావు. ఇంకచాలు లోపలకు వెళ్లు.
పిచ్చిదానా! నేను నా సోదరుని చంపుతాను అనుకున్నావా! లేదు. నేను కేవలం సుగ్రీవుని అహంకారము అణిచి బుద్ధి చెప్పి పంపేస్తాను. అంతే. ప్రస్తుతము సుగ్రీవుడు రాజ్యం కోరడం లేదు. యుద్ధం కోరుకుంటున్నాడు. వాడు కోరుకున్న యుద్ధాన్ని వాడికి ఇస్తాను. నీకు నా మీద ఉన్న ప్రేమకొద్దీ, నీ బుద్ధికి తోచిన ఉపాయము చెప్పావు. అది చాలు. ఇంక లోపలకు వెళ్లు. నేను చిటికలో సుగ్రీవుని గర్వము అణిచి అతనిని పారిపోయేట్టు చేసి వస్తాను.” అని పలికాడు వాలి.
తార ఇంక చేసేది లేక దుఃఖిస్తూ వాలికి ప్రదక్షిణ పూర్వక నమస్కారము చేసింది. భర్త విజయాన్ని కాంక్షిస్తూ అతనికి వీరతిలకము దిద్దింది. అంతఃపుర కాంతలతో సహా లోపలకు వెళ్లింది. వాలి కోపంతో బుసలు కొడుతూ నగరం బయటకు వచ్చాడు. సుగ్రీవుడు ఎక్కడ ఉన్నాడా అని నలుదిక్కులా చూస్తున్నాడు. అల్లంత దూరంలో నడుముకు ధట్టికట్టుకొని ధైర్యంగా నిలబడి రంకెలు వేస్తున్న సుగ్రీవుని చూచాడు. వాలి కోపంతో సుగ్రీవుని వైపుకు వెళ్లాడు.
వాలి మెడలో ఇంద్రుడు ఇచ్చిన బంగారు మాల ఉంది. సుగ్రీవుని మెడలో రాముడు వేసిన గజపుష్పమాల ఉంది. సుగ్రీవుని చూచి వాలి ఇలా అన్నాడు. “ఒరేయ్ సుగ్రీవా! ఈ పిడికిలితో గట్టిగా గుద్దితే చస్తావురా! నాతో ఎందుకురా నీకు” అని అన్నాడు.
“ఓ వాలీ! నాకూ పిడికిలి ఉంది. నేనూ నీ తల మీద ఒక గుద్దు గుద్దితే తలపగిలి చస్తావు.” అని మాటకు మాట బదులు చెప్పాడు సుగ్రీవుడు. ఇంక వాలి ఊరుకోలేకపోయాడు. సుగ్రీవుని పిడికిలితో మోదాడు. సుగ్రీవునికి ఒళ్లంతా రక్తసిక్తము అయింది. సుగ్రీవుడు పక్కనే ఉన్న సాలవృక్షమును పీకి వాలి మీదికి విసిరాడు. ఆ వృక్షము దెబ్బకు వాలి కదిలిపోయాడు. వాలి సుగ్రీవులు ద్వంద్వయుద్ధమునకు తలపడ్డారు. ఒకరితో ఒకరు ఘోరంగా పోరాడుతున్నారు. తన మెడలో ఉన్న సువర్ణమాల మహిమతో వాలి బలము క్షణక్షణము వృద్ధి చెందుతుంటే, సుగ్రీవుని బలము క్షీణించసాగింది. కాని పట్టుదలతో యుద్ధం చేస్తున్నాడు. రాముని సాయం కోసం ఎదురు చూస్తున్నాడు.
వాలి సుగ్రీవులు కొమ్మలతోనూ, రాళ్లతోనూ, చెట్లతోనూ, గోళ్లతోనూ, పిడికిళ్లతోనూ ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుంటున్నారు. ఇద్దరి దేహముల నుండి రక్తం కారుతూ ఉంది. వాలి దెబ్బకు తట్టుకోలేక సుగ్రీవుడు దిక్కులు చూస్తున్నాడు. సుగ్రీవుని బలం సన్నగిల్లింది అని గ్రహించాడు రాముడు. వాలిని చంపడానికి బాణం ఎక్కుపెట్టాడు. ధనుస్సును ఆకర్ణాంతము లాగి, వాలి మీదికి గురి చూచి, బాణమును వదిలాడు. రాముడు వదిలిన బాణము సరిగ్గా వాలి వక్షస్థలమును చీల్చుకుంటూ వీపు నుండి బయటకు వచ్చింది. ఆ బాణము దెబ్బతిన్న వాలి, పక్షిమాదిరి నేలకూలాడు. ఆ రోజు ఆశ్వయుజ శుద్ధపౌర్ణమి. ఆరోజు వాలి నేలకూలాడు. వాలికి క్రమ క్రమంగా స్పృహ తప్పుతూ ఉంది. గొంతులో గుర గుర శబ్దం వస్తూ ఉంది. వాలియుద్ధరంగంలో దీనంగా పడి ఉన్నాడు.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము పదునారవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్