Kishkindha Kanda Sarga 21 In Telugu – కిష్కింధాకాండ ఏకవింశః సర్గః

కిష్కింధాకాండంలో ఏకవింశః సర్గంలో, హనుమాన్ సుగ్రీవుని దర్శించి శ్రీరాముని సందేశం తెలియజేస్తాడు. సుగ్రీవుడు రాముని పరిచయం గురించి విన్నతర్వాత తన బాధలను వివరించడానికి హనుమాంతో మాట్లాడతాడు. వాలి భయంతో సుగ్రీవుడు కిష్కింధను విడిచిపెట్టి మల్యవంత పర్వతం వద్ద ఆశ్రయం పొందినట్లు చెప్పినప్పుడు హనుమాన్ రాముని దక్షిణ దిశలో వెతికినట్లు వివరిస్తాడు. రాముడు సుగ్రీవుని సమస్యను పరిష్కరించడానికి వాలి యుద్ధంలో సహాయం చేస్తానని వాగ్దానం చేస్తాడు.

హనుమదాశ్వాసనమ్

తతో నిపతితాం తారాం చ్యుతాం తారామివాంబరాత్ |
శనైరాశ్వాసయామాస హనుమాన్ హరియూథపః || ౧ ||

గుణదోషకృతం జంతుః స్వకర్మఫలహేతుకమ్ |
అవ్యగ్రస్తదవాప్నోతి సర్వం ప్రేత్య శుభాశుభమ్ || ౨ ||

శోచ్యా శోచసి కం శోచ్యం దీనం దీనాఽనుకంపసే |
కస్య కో వాఽను శోచ్యోఽస్తి దేహేఽస్మిన్ బుద్బుదోపమే || ౩ ||

అంగదస్తు కుమారోఽయం ద్రష్టవ్యో జీవపుత్రయా |
ఆయత్యాం చ విధేయాని సమర్థాన్యస్య చింతయ || ౪ ||

జానాస్యనియతామేవం భూతానామాగతిం గతిమ్ |
తస్మాచ్ఛుభం హి కర్తవ్యం పండితేనైహలౌకికమ్ || ౫ ||

యస్మిన్ హరిసహస్రాణి ప్రయుతాన్యర్బుదాని చ |
వర్తయంతి కృతాంశాని సోఽయం దిష్టాంతమాగతః || ౬ ||

యదయం న్యాయదృష్టార్థః సామదానక్షమాపరః |
గతో ధర్మజితాం భూమిం నైనం శోచితుమర్హసి || ౭ ||

సర్వే హి హరిశార్దూలాః పుత్రశ్చాయం తవాంగదః |
ఇదం హర్యృక్షరాజ్యం చ త్వత్సనాథమనిందితే || ౮ ||

తావిమౌ శోకసంతాపౌ శనైః ప్రేరయ భామిని |
త్వాయా పరిగృహీతోఽయమంగదః శాస్తు మేదినీమ్ || ౯ ||

సంతతిశ్చ యథా దృష్టా కృత్యం యచ్చాపి సామ్ప్రతమ్ |
రాజ్ఞస్తత్క్రియతాం తావదేష కాలస్య నిశ్చయః || ౧౦ ||

సంస్కార్యో హరిరాజశ్చ అంగదశ్చాభిషిచ్యతామ్ |
సింహాసనగతం పుత్రం పశ్యంతీ శాంతిమేష్యసి || ౧౧ ||

సా తస్య వచనం శ్రుత్వా భర్తృవ్యసనపీడితా |
అబ్రవీదుత్తరం తారా హనుమంతమవస్థితమ్ || ౧౨ ||

అంగదప్రతిరూపాణాం పుత్రాణామేకతః శతమ్ |
హతస్యాప్యస్య వీరస్య గాత్రసంశ్లేషణం వరమ్ || ౧౩ ||

న చాహం హరిరాజస్య ప్రభావామ్యంగదస్య వా |
పితృవ్యస్తస్య సుగ్రీవః సర్వకార్యేష్వనంతరః || ౧౪ ||

న హ్యేషా బుద్ధిరాస్థేయా హనుమన్నంగదం ప్రతి |
పితా హి బంధుః పుత్రస్య న మాతా హరిసత్తమ || ౧౫ ||

న హి మమ హరిరాజసంశ్రయాత్
క్షమతరమస్తి పరత్ర చేహ వా |
అభిముఖహతవీరసేవితం
శయనమిదం మమ సేవితుం క్షమమ్ || ౧౬ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే ఏకవింశః సర్గః || ౨౧ ||

Kishkindha Kanda Sarga 21 Meaning In Telugu

తార అలా ఏడుస్తుంటే హనుమంతుడు ముందుకు వచ్చి ఆమెను ఓదారుస్తున్నాడు. “అమ్మా! తారా! మనము చేసిన కర్మలను బట్టి ఫలితాలు వస్తుంటాయి. వాలి తాను చేసిన అకృత్యములకు ఫలితము అనుభవించాడు. దీనికి చింతించి ప్రయోజనము లేదు. ఈ దేహములు నీటి బుడగలు. కాలానుగుణంగా అవి బద్దలు అవుతుంటాయి. అందరూ ఎప్పుడో ఒకప్పుడు పోవలసిన వారమే. పోయిన వాలి గురించి విచారించే కంటే బతికి ఉన్న అంగదుని క్షేమం గురించి విచారించు. పుట్టిన ప్రతి ప్రాణీ చావక తప్పదు. కాబట్టి చనిపోయిన వారి గురించి ఆలోచించక, నీ శేషజీవితములో శుభం కలగాలని కోరుకో! అదే ప్రస్తుత కర్తవ్యము.

ఇప్పటి దాకా ఈ కిష్కింధలో ఉన్న వేలకొలది వానరులు వాలి సంరక్షణలో హాయిగా జీవించారు. ఇప్పుడు వాలి లేడు. స్వర్గమునకు వెళ్లాడు. స్వర్గసుఖములు అనుభవించుచున్న వాలి గురించి దు:ఖించడం అవివేకము. ఈ కిష్కింధలో ఉన్న వేలాది వానరులకు, భల్లూకములకు వాలి మరణానంతరము నీవు, అంగదుడు రక్షకులు. అంగదునికి పట్టాభిషేకము చేస్తాము. నీ సంరక్షణలో అంగదుడు రాజ్యము చేస్తాడు. తదుపరి కార్యక్రమములు నిర్వర్తించమని సుగ్రీవునికి ఆదేశములు ఇవ్వు. ఇప్పుడు అంగదుడు, సుగ్రీవుడు, వాలికి శాస్త్రములలో నిర్ణయింపబడినట్టు ఉత్తర క్రియలు నిర్వహించాలి. వాలికి దహన సంస్కారములు చెయ్యాలి.” అని పలికాడు హనుమంతుడు.

భర్త మరణముతో బాధ పడుతున్న తార, హనుమంతుని మాటలు విని ఇలా అంది. “హనుమా! నాకు నా భర్త లేకపోయిన తరువాత అంగదుని వంటి కుమారులు నూరు మంది ఉన్నా ఏమి ప్రయోజనము. నా శక్తి, నా సామర్థ్యము అన్నీ నా భర్తతోనే పోయాయి. నేను అశక్తురాలను. అన్ని వ్యవహారములు అంగదుని పినతండ్రి సుగ్రీవుని ఆజ్ఞప్రకారమే చెయ్యండి. అంగదుని యోగక్షేమములు విచారించుటకు నేను అర్హురాలిని కాను. అది తండ్రి బాధ్యత. తండ్రి లేనపుడు పినతండ్రి బాధ్యత. కాబట్టి అంగదుని యోగక్షేమముల గురించి సుగ్రీవుడు చూచుకొన గలడు. ఇన్నాళ్లు నేను నా భర్త వాలిని సేవించాను. ఇప్పుడు ఆయన పోయిన మార్గమునే అనుసరిస్తాను. నా భర్త పక్కనే నేను ఉంటాను. ఇది నా నిశ్చయము.” అని పలికింది తార.

శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము ఇరువది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

కిష్కింధాకాండ ద్వావింశః సర్గః (22) >>>

Leave a Comment