Kishkindha Kanda Sarga 22 In Telugu – కిష్కింధాకాండ ద్వావింశః సర్గః

కిష్కింధాకాండ ద్వావింశః సర్గంలో, హనుమాన్ సుగ్రీవుని సల్లాపాన్ని రాముని వద్ద వివరిస్తాడు. రాముడు సుగ్రీవుని సమస్యలు తెలుసుకొని, వాలిని చంపడానికి సుగ్రీవుని సహాయం చేయడానికి నిర్ణయిస్తాడు. సుగ్రీవుడు తన యోధులను సమీకరించి, రాముని సహాయంతో వాలిని ఎదిరించడానికి సిద్ధమవుతాడు. వాలి తన సోదరుడు సుగ్రీవుని ఎదిరించడానికి వస్తాడు. సుగ్రీవుడు రాముని మద్దతుతో వాలితో యుద్ధం చేయడం ప్రారంభిస్తాడు. యుద్ధం తీవ్రంగా సాగుతుంది, కానీ రాముడు వాలిని నిశితంగా చూసి సుగ్రీవుని రక్షణలో నిలబడి, వాలిని కుష్టిదాడితో చంపేస్తాడు.

వాల్యనుశాసనమ్

వీక్షమాణస్తు మందాసుః సర్వతో మందముచ్ఛ్వసన్ |
ఆదావేవ తు సుగ్రీవం దదర్శ త్వాత్మజాగ్రతః || ౧ ||

తం ప్రాప్తవిజయం వాలీ సుగ్రీవం ప్లవగేశ్వరః |
ఆభాష్య వ్యక్తయా వాచా సస్నేహమిదమబ్రవీత్ || ౨ ||

సుగ్రీవ దోషేణ న మాం గంతుమర్హసి కిల్బిషాత్ |
కృష్యమాణం భవిష్యేణ బుద్ధిమోహేన మాం బలాత్ || ౩ ||

యుగపద్విహితం తాత న మన్యే సుఖమావయోః |
సౌహార్దం భ్రాతృయుక్తం హి తదిదం తాత నాన్యథా || ౪ ||

ప్రతిపద్య త్వమద్యైవ రాజ్యమేషాం వనౌకసామ్ |
మామప్యద్యైవ గచ్ఛంతం విద్ధి వైవస్వతక్షయమ్ || ౫ ||

జీవితం చ హి రాజ్యం చ శ్రియం చ విపులామిమామ్ |
ప్రజహామ్యేష వై తూర్ణం మహచ్చాగర్హితం యశః || ౬ ||

అస్యాం త్వహమవస్థానాం వీర వక్ష్యామి యద్వచః |
యద్యప్యసుకరం రాజన్ కర్తుమేవ తదర్హసి || ౭ ||

సుఖార్హం సుఖసంవృద్ధిం బాలమేనమబాలిశమ్ |
బాష్పపూర్ణముఖం పశ్య భూమౌ పతితమంగదమ్ || ౮ ||

మమ ప్రాణైః ప్రియతరం పుత్రం పుత్రమివౌరసమ్ |
మయా హీనమహీనార్థం సర్వతః పరిపాలయ || ౯ ||

త్వమేవాస్య హి దాతా చ పరిత్రాతా చ సర్వతః |
భయేష్వభయదశ్చైవ యథాఽహం ప్లవగేశ్వర || ౧౦ ||

ఏష తారాత్మజః శ్రీమాంస్త్వయా తుల్యపరాక్రమః |
రక్షసాం తు వధే తేషామగ్రతస్తే భవిష్యతి || ౧౧ ||

అనురూపాణి కర్మాణి విక్రమ్య బలవాన్ రణే |
కరిష్యత్యేష తారేయస్తరస్వీ తరుణోఽంగదః || ౧౨ ||

సుషేణదుహితా చేయమర్థసూక్ష్మవినిశ్చయే |
ఔత్పాతికే చ వివిధే సర్వతః పరినిష్ఠితా || ౧౩ ||

యదేషా సాధ్వితి బ్రూయాత్ కార్యం తన్ముక్తసంశయమ్ |
న హి తారామతం కించిదన్యథా పరివర్తతే || ౧౪ ||

రాఘవస్య చ తే కార్యం కర్తవ్యమవిశంకయా |
స్యాదధర్మో హ్యకరణే త్వాం చ హింస్యాద్విమానితః || ౧౫ ||

ఇమాం చ మాలామాధత్స్వ దివ్యాం సుగ్రీవ కాంచనీమ్ |
ఉదారా శ్రీః స్థితా హ్యస్యాం సంప్రజహ్యాన్మృతే మయి || ౧౬ ||

ఇత్యేవముక్తః సుగ్రీవో వాలినా భ్రాతృసౌహృదాత్ |
హర్షం త్యక్త్వా పునర్దీనో గ్రహగ్రస్త ఇవోడురాట్ || ౧౭ ||

తద్వాలివచనాచ్ఛాంతః కుర్వన్యుక్తమతంద్రితః |
జగ్రాహ సోఽభ్యనుజ్ఞాతో మాలాం తాం చైవ కాంచనీమ్ || ౧౮ ||

తాం మాలాం కాంచనీం దత్త్వా వాలీ దృష్ట్వాఽఽత్మజం స్థితమ్ |
సంసిద్ధః ప్రేత్యభావాయ స్నేహాదంగదమబ్రవీత్ || ౧౯ ||

దేశకాలౌ భజస్వాద్య క్షమమాణః ప్రియాప్రియే |
సుఖదుఃఖసహః కాలే సుగ్రీవవశగో భవ || ౨౦ ||

యథా హి త్వం మహాబాహో లాలితః సతతం మయా |
న తథా వర్తమానం త్వాం సుగ్రీవో బహు మంస్యతే || ౨౧ ||

మాస్యామిత్రైర్గతం గచ్ఛేర్మా శత్రుభిరరిందమ |
భర్తురర్థపరో దాంతః సుగ్రీవవశగో భవ || ౨౨ ||

న చాతిప్రణయః కార్యః కర్తవ్యోఽప్రణయశ్చ తే |
ఉభయం హి మహాన్ దోషస్తస్మాదంతరదృగ్భవ || ౨౩ ||

ఇత్యుక్త్వాఽథ వివృత్తాక్షః శరసంపీడితో భృశమ్ |
వివృతైర్దశనైర్భీమైర్బభూవోత్క్రాంతజీవితః || ౨౪ ||

తతో విచుక్రుశుస్తత్ర వానరా హరియూథపాః |
పరిదేవయమానాస్తే సర్వే ప్లవగపుంగవాః || ౨౫ ||

కిష్కింధా హ్యద్య శూన్యాసీత్స్వర్గతే వానరాధిపే |
ఉద్యానాని చ శూన్యాని పర్వతాః కాననాని చ || ౨౬ ||

హతే ప్లవగశార్దూలే నిష్ప్రభా వానరాః కృతాః |
యేన దత్తం మహద్యుద్ధం గంధర్వస్య మహాత్మనః || ౨౭ ||

గోలభస్య మహాబాహోర్దశ వర్షాణి పంచ చ |
నైవ రాత్రౌ న దివసే తద్యుద్ధముపశామ్యతి || ౨౮ ||

తతస్తు షోడశే వర్షే గోలభో వినిపాతితః |
హత్వా తం దుర్వినీతం తు వాలీ దంష్ట్రాకరాలవాన్ |
సర్వాభయకరోఽస్మాకం కథమేష నిపాతితః || ౨౯ ||

హతే తు వీరే ప్లవగాధిపే తదా
ప్లవంగమాస్తత్ర న శర్మ లేభిరే |
వనేచరాః సింహయుతే మహావనే
యథా హి గావో నిహతే గవాం పతౌ || ౩౦ ||

తతస్తు తారా వ్యసనార్ణవాప్లుతా
మృతస్య భర్తుర్వదనం సమీక్ష్య సా |
జగామ భూమిం పరిరభ్య వాలినం
మహాద్రుమం ఛిన్నమివాశ్రితా లతా || ౩౧ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే ద్వావింశః సర్గః || ౨౨ ||

Kishkindha Kanda Sarga 22 Meaning In Telugu

అప్పటికి వాలి ప్రాణాలు ఇంకా పోలేదు. కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడు. నెమ్మదిగా కళ్లు తెరిచాడు. తార వంక చూచాడు. తన కుమారుడు అంగదుని వంక, తార వంక మార్చి మార్చి చూచాడు. సుగ్రీవుని తన దగ్గరకు పిలిచాడు. అతి కష్టం మీద ఇలా అన్నాడు.
“సుగ్రీవా! నేను నీ పట్ల చాలా అపరాధము చేసాను. నన్ను క్షమించు. నా బుద్ధి వక్రించి నీ భార్యను నా దగ్గర ఉంచుకొని నిన్ను రాజ్యము నుండి వెడలగొట్టాను. మన ఇద్దరిలో ఎవరో ఒకరే ఉండవలెనని బ్రహ్మ రాసి ఉన్నాడు. అందుకే నేను యమలోకమునకు పోతున్నాను. నీవు ఈ కిష్కింధను పాలించు. ఎవరి చేతిలోనూ ఓడి పోని నేను రామునిచేతిలో ఓడిపోయాను. ధర్మానికి ఓడిపోయాను. నా మరణావస్థలో నేను నీకు ఒక మాట చెపుతాను.

సావధానంగా విను. వీలైతే ఆచరణలో పెట్టు. నా కొడుకు అంగదుడు. చిన్నవాడు. చూడు ఎలా నేల మీద పడి పొర్లుతున్నాడో. అంగదుడు చిన్నప్పటి నుండి. సుఖాలలో పెరిగాడు. కష్టము అంటే ఎరుగడు. వాడిని నేను నా ప్రాణముల కంటే ఎక్కువగా చూచుకున్నాను. నా కుమారుడు అంగదుని నీ కుమారునిగా భావించు. వాడికి ఏ లోటూ రాకుండా చూచుకో. ఇంక మీదట నుండి అంగదునికి తండ్రివి, దాతవు, రక్షకుడివి, అభయ ప్రదాతవు అన్నీ నువ్వే. అంగదుడు నీకు అన్ని విధాలా తోడ్పడగలడు. యుద్ధములో నీకు అండగాఉండి అన్ని విధాలా నా కొడుకు అనిపించుకుంటాడు. ఇంక ఈమె నా భార్య తార. సుషేణుని కుమార్తె. ఎంతటి క్లిష్ట సమస్యనైనా చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోడంలో సమర్థురాలు. ఎటువంటి ఉపద్రవకర పరిస్థితులకు కూడా ఎదురు నిలిచి, సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం కలది. తార ఆలోచించి చేయమన్న కార్యమును నీవు నిస్సందేహంగా చేయవచ్చును. నీకు జయం లభిస్తుంది.

తరువాత, నీవు రామునితో ఏ కార్యము నిమిత్తము మైత్రి చేసుకున్నావో ఆ కార్యమును తక్షణం నెరవేర్చు. రాముడిని అవమానించకు. మోసగించకు. అలాచేస్తే రాముడు నా మాదిరి నిన్ను కూడా చంపుతాడు.

సుగ్రీవా! నా మెడలో ఉన్న బంగారు మాల నాకు ఇంద్రుడు ఇచ్చాడు. దానిని నీవు వెంటనే తీసుకో. అది నా ఒంటిమీద ఉండగా నేను చనిపోతే దానికి శవదోషం తగులుతుంది. అప్పుడు దాని మహత్తు పోతుంది. కాబట్టి వెంటనే తీసుకొని నీ మెడలో వేసుకో.” అని అన్నాడు వాలి.
వాలి మాటలు విని సుగ్రీవునికి దుఃఖము పొర్లుకొచ్చింది. ఏడుస్తూనే వాలి మెడలో ఉన్న బంగారు మాలను తీసుకొని తనమెడలో వేసుకున్నాడు. వాలి అంగదుని వంక చూచి ఇలా అన్నాడు. “కుమారా! అంగదా! ఇంక మీదట నీకు అన్నీ నీ పినతండ్రి సుగ్రీవుడే. సు:ఖము వచ్చినా, దు:ఖము వచ్చినా ఓర్చుకో. కాలానుగుణంగా ప్రవర్తించు. సుగ్రీవుని ఆజ్ఞలను పాలించు. నేను కాబట్టి నీవు ఏమి చేసినను ఓర్చుకున్నాను. సహించాను. కాని ఇదివరకటి మాదిరి చేస్తే సుగ్రీవునికి కోపం రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా నడుచుకో. సుగ్రీవునికి కోపం తెప్పించకు.

ఇంకొక మాట. నీవు ఇంక మీదట సుగ్రీవుని అధీనంలో ఉండబోతున్నావు. సుగ్రీవుని శత్రువులతో స్నేహం చేయకు. అలాగే సుగ్రీవుని మిత్రులతో శత్రుత్వం పెట్టుకోకు. సుగ్రీవునికి ఇష్టమైన పనులనే చేస్తూ ఉండు. ఇంకొక విషయం. నీవు ఎవరి పట్ల ఎక్కువ ప్రేమ, అలాగే ఎక్కువ ద్వేషము కలిగి ఉండకు. ఎందుకంటే అతిగా ఉండటం ఎప్పుడూ అనర్థాలకు దారి తీస్తుంది. కాబట్టి రాగద్వేషాలలో సమతుల్యం పాటించు. మధ్యస్తంగా వ్యవహరించు.”

అలా మాట్లాడుతూనే వాలి ఆఖరిశ్వాస విడిచాడు. వాలి మరణించాడు అని తెలియగానే వానరులందరూ బిగ్గరగా ఏడవడం మొదలెట్టారు. వాలి మరణంతో కిష్కింధా నగరము కళావిహీన మయింది. వాలి యొక్క పరాక్రమము, వీరత్వము, వాలి చేసిన యుద్ధములు, వాలి చంపిన వారి గురించి వానరులు తలచుకొని తలచుకొని ఏడుస్తున్నారు. తన కళ్ల ఎదుటే ప్రాణాలు విడిగిన తనభర్త వాలినిచూచి తట్టుకోలేక తార వాలి శరీరం మీద పడి ఏడుస్తూ ఉంది.

శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము ఇరువది రెండవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

కిష్కింధాకాండ త్రయోవింశః సర్గః (23) >>>

Leave a Comment