Kishkindha Kanda Sarga 26 In Telugu – కిష్కింధాకాండ షడ్వింశః సర్గః

కిష్కింధాకాండ ఈ సర్గలో, సుగ్రీవుని రాముడు శాపం నుండి విముక్తుడిని చేస్తాడు. సుగ్రీవుడు తన సైన్యాన్ని సిద్ధం చేసి, సీతమ్మను వెతకడానికి నాలుగు దిక్కులకు పంపాలని నిర్ణయిస్తాడు. ఈ క్రమంలో, సీతమ్మ జాడ తెలుసుకోవడానికి హనుమంతుడు, అంగదుడు మరియు ఇతర వానరులు దక్షిణ దిశలో వెళ్లాలని సూచించబడతారు. సుగ్రీవుడు వారికి రాముడు ఇచ్చిన ఉంగరం అందజేస్తాడు, దాన్ని సీతమ్మకు చూపించి ఆమెను నమ్మించేందుకు. ఈ ప్రయాణంలో, వారు వివిధ ప్రాంతాలు మరియు అవాంతరాలు ఎదుర్కొంటారు, చివరికి సీతమ్మ యొక్క జాడ తెలుసుకోవడం అనేది ఈ సర్గలో ముఖ్యాంశం.

సుగ్రీవాభిషేకః

తతః శోకాభిసంతప్తం సుగ్రీవం క్లిన్నవాససమ్ |
శాఖామృగమహామాత్రాః పరివార్యోపతస్థిరే || ౧ ||

అభిగమ్య మహాబాహుం రామమక్లిష్టకారిణమ్ |
స్థితాః ప్రాంజలయః సర్వే పితామహమివర్షయః || ౨ ||

తతః కాంచనశైలాభస్తరుణార్కనిభాననః |
అబ్రవీత్ప్రాంజలిర్వాక్యం హనుమాన్మారుతాత్మజః || ౩ ||

భవత్ప్రసాదాత్సుగ్రీవః పితృపైతామహం మహత్ |
వానరాణాం సుదుష్ప్రాపం ప్రాప్తో రాజ్యమిదం ప్రభో || ౪ ||

భవతా సమనుజ్ఞాతః ప్రవిశ్య నగరం శుభమ్ |
సంవిధాస్యతి కార్యాణి సర్వాణి ససుహృద్గణః || ౫ ||

స్నాతోఽయం వివిధైర్గంధైరౌషధైశ్చ యథావిధి |
అర్చయిష్యతి రత్నైశ్చ మాల్యైశ్చ త్వాం విశేషతః || ౬ ||

ఇమాం గిరిగుహాం రమ్యామభిగంతుమితోఽర్హసి |
కురుష్వ స్వామిసంబంధం వానరాన్ సంప్రహర్షయన్ || ౭ ||

ఏవముక్తో హనుమతా రాఘవః పరవీరహా |
ప్రత్యువాచ హనూమంతం బుద్ధిమాన్వాక్యకోవిదః || ౮ ||

చతుర్దశ సమాః సౌమ్య గ్రామం వా యది వా పురమ్ |
న ప్రవేక్ష్యామి హనుమన్ పితుర్నిర్దేశపాలకః || ౯ ||

సుసమృద్ధాం గుహాం రమ్యాం సుగ్రీవో వానరర్షభః |
ప్రవిష్టో విధివద్వీరః క్షిప్రం రాజ్యేఽభిషిచ్యతామ్ || ౧౦ ||

ఏవముక్త్వా హనూమంతం రామః సుగ్రీవమబ్రవీత్ |
వృత్తజ్ఞో వృత్తసంపన్నముదారబలవిక్రమమ్ || ౧౧ ||

ఇమమప్యంగదం వీర యౌవరాజ్యేఽభిషేచయ |
జ్యేష్ఠస్య స సుతో జ్యేష్ఠః సదృశో విక్రమేణ తే || ౧౨ ||

అంగదోఽయమదీనాత్మా యౌవరాజ్యస్య భాజనమ్ |
పూర్వోఽయం వార్షికో మాసః శ్రావణః సలిలాగమః || ౧౩ ||

ప్రవృత్తాః సౌమ్య చత్వారో మాసా వార్షికసంజ్ఞికాః |
నాయముద్యోగసమయః ప్రవిశ త్వం పురీం శుభామ్ || ౧౪ ||

అస్మిన్వత్స్యామ్యహం సౌమ్య పర్వతే సహలక్ష్మణః |
ఇయం గిరిగుహా రమ్యా విశాలా యుక్తమారుతా || ౧౫ ||

ప్రభూతసలిలా సౌమ్య ప్రభూతకమలోత్పలా |
కార్తికే సమనుప్రాప్తే త్వం రావణవధే యత || ౧౬ ||

ఏష నః సమయః సౌమ్య ప్రవిశ త్వం స్వమాలయమ్ |
అభిషిక్తః స్వరాజ్యే చ సుహృదః సంప్రహర్షయ || ౧౭ ||

ఇతి రామాభ్యనుజ్ఞాతః సుగ్రీవో వానరాధిపః |
ప్రవివేశ పురీం రమ్యాం కిష్కంధాం వాలిపాలితామ్ || ౧౮ ||

తం వానరసహస్రాణి ప్రవిష్టం వానరేశ్వరమ్ |
అభివాద్య ప్రవిష్టాని సర్వతః పర్యవారయన్ || ౧౯ ||

తతః ప్రకృతయః సర్వా దృష్ట్వా హరిగణేశ్వరమ్ |
ప్రణమ్య మూర్ధ్నా పతితా వసుధాయాం సమాహితాః || ౨౦ ||

సుగ్రీవః ప్రకృతీః సర్వాః సంభాష్యోత్థాప్య వీర్యవాన్ |
భ్రాతురంతఃపురం సౌమ్యం ప్రవివేశ మహాబలః || ౨౧ ||

ప్రవిశ్య త్వభినిష్క్రాంతం సుగ్రీవం వానరర్షభమ్ |
అభ్యషించంత సుహృదః సహస్రాక్షమివామరాః || ౨౨ ||

తస్య పాండురమాజహ్నుశ్ఛత్రం హేమపరిష్కృతమ్ |
శుక్లే చ వాలవ్యజనే హేమదండే యశస్కరే || ౨౩ ||

తథా సర్వాణి రత్నాని సర్వబీజౌషధీరపి |
సక్షీరాణాం చ వృక్షాణాం ప్రరోహాన్ కుసుమాని చ || ౨౪ ||

శుక్లాని చైవ వస్త్రాణి శ్వేతం చైవానులేపనమ్ |
సుగంధీని చ మాల్యాని స్థలజాన్యంబుజాని చ || ౨౫ ||

చందనాని చ దివ్యాని గంధాంశ్చ వివిధాన్బహూన్ |
అక్షతం జాతరూపం చ ప్రియంగుమధుసర్పిషీ || ౨౬ ||

దధి చర్మ చ వైయాఘ్రం వారాహీ చాప్యుపానహౌ |
సమాలంభనమాదాయ రోచనాం సమనః శిలామ్ || ౨౭ ||

ఆజగ్ముస్తత్ర ముదితా వరాః కన్యాస్తు షోడశ |
తతస్తే వానరశ్రేష్ఠం యథాకాలం యథావిధి || ౨౮ ||

రత్నైర్వస్త్రైశ్చ భక్షైశ్చ తోషయిత్వా ద్విజర్షభాన్ |
తతః కుశపరిస్తీర్ణం సమిద్ధం జాతవేదసమ్ || ౨౯ ||

మంత్రపూతేన హవిషా హుత్వా మంత్రవిదో జనాః |
తతో హేమప్రతిష్ఠానే వరాస్తరణసంవృతే || ౩౦ ||

ప్రాసాదశిఖరే రమ్యే చిత్రమాల్యోపశోభితే |
ప్రాఙ్ముఖం వివిధైర్మంత్రైః స్థాపయిత్వా వరాసనే || ౩౧ ||

నదీనదేభ్యః సంహృత్య తీర్థేభ్యశ్చ సమంతతః |
ఆహృత్య చ సముద్రేభ్యః సర్వేభ్యో వానరర్షభాః || ౩౨ ||

అపః కనకకుంభేషు నిధాయ విమలాః శుభాః |
శుభైర్వృషభశృంగైశ్చ కలశైశ్చాపి కాంచనైః || ౩౩ ||

శాస్త్రదృష్టేన విధినా మహర్షివిహితేన చ |
గజో గవాక్షో గవయః శరభో గంధమాదనః || ౩౪ ||

మైందశ్చ ద్వివిదశ్చైవ హనుమాన్ జాంబవాన్నలః |
అభ్యషించంత సుగ్రీవం ప్రసన్నేన సుగంధినా || ౩౫ ||

సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా |
అభిషిక్తే తు సుగ్రీవే సర్వే వానరపుంగవాః || ౩౬ ||

ప్రచుక్రుశుర్మహాత్మానో హృష్టాస్తత్ర సహస్రశః |
రామస్య తు వచః కుర్వన్ సుగ్రీవో హరిపుంగవః || ౩౭ ||

అంగదం సంపరిష్వజ్య యౌవరాజ్యేఽభ్యషేచయత్ |
అంగదే చాభిషిక్తే తు సానుక్రోశాః ప్లవంగమాః || ౩౮ ||

సాధు సాధ్వితి సుగ్రీవం మహాత్మానోఽభ్యపూజయన్ |
రామం చైవ మహాత్మానం లక్ష్మణం చ పునః పునః || ౩౯ ||

ప్రీతాశ్చ తుష్టువుః సర్వే తాదృశే తత్ర వర్తితి |
హృష్టపుష్టజనాకీర్ణా పతాకాధ్వజశోభితా |
బభూవ నగరీ రమ్యా కిష్కింధా గిరిగహ్వరే || ౪౦ ||

నివేద్య రామాయ తదా మహాత్మనే
మహాభిషేకం కపివాహినీపతిః |
రుమాం చ భార్యాం ప్రతిలభ్య వీర్యవా-
-నవాప రాజ్యం త్రిదశాధిపో యథా || ౪౧ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే షడ్వింశః సర్గః || ౨౬ ||

Kishkindha Kanda Sarga 26 Meaning In Telugu

వాలికి దహన సంస్కారములు చేసిన అనంతరము, సుగ్రీవుడు, మిగిలిన వానర ప్రముఖులు అందరూ కలిసి రాముని వద్దకు వెళ్లారు. వారందరి సమక్షములో హనుమంతుడు రామునితో ఇలాఅన్నాడు.

“ఓ ప్రభో! కాకుత్థా! నీ అనుగ్రహము వలన సుగ్రీవునికి తిరిగి రాజ్యము లభించింది. నీ అనుజ్ఞ అయితే సుగ్రీవుడు కిష్కింధలో ప్రవేశించి యథావిధిగా రాజ్యాభిషిక్తుడై, కిష్కింధను పాలిస్తాడు. నీకు తగిన కానుకలు సమర్పించుకొని నిన్ను పూజించవలెనని అనుకుంటున్నాడు. కాబట్టి మా అందరి కోరిక మేరకు నీవు కిష్కింధా నగరమునకు వచ్చి మా సత్కారములను అందుకని మమ్ములను ఆనందింపజేయమని ప్రార్ధించుచున్నాము.” అని వినయంగా అన్నాడు హనుమంతుడు.

ఆ మాటలకు రాముడు ఇలా అన్నాడు. “హనుమా! నేను నా తండ్రి ఆజ్ఞమేరకు వనవాసము చేయుచున్నాను. ఈ పదునాలుగు సంవత్సరములు జనావాసములలోకి అడుగుపెట్టను. మీరందరూ కలిసి సుగ్రీవునికి పట్టాభిషేకము చేయండి.” అని అన్నాడు రాముడు. తరువాత సుగ్రీవునితో ఇలా అన్నాడు. “మిత్రమా! సుగ్రీవా! వాలి కుమారుడు అంగదుని యువరాజుగా అభిషేకించు. నీ అన్నగారి కుమారుడు అంగదుడు యువరాజుగా అభిషేకించడానికి తగినవాడు. ఇప్పుడు వర్షకాలము ఆరంభమయినది. ఈ నాలుగు నెలలు సీతాన్వేషణకు తగిన సమయము కాదు. కాబట్టి ఈ నాలుగు నెలలు నీవు కిష్కింధకుపోయి రాజ్యాభిషిక్తుడవై, రాచ కార్యములు చక్కబెట్టుకో. ఈ నాలుగునెలలు నేను, లక్ష్మణుడు, ఈ పర్వతము మీద నివాసము ఉండెదము. కార్తీక మాసము రాగానే సీతను వెదకడానికీ, సీతను అపహరించిన రావణుని చంపడానికీ ప్రయత్నాలు మొదలు పెట్టాలి. అదీ మన ఒప్పందము. మిత్రమా! ఇప్పుడు నీవు కిష్కింధకు వెళ్లి పట్టాభిషిక్తుడివి కా!” అని పలికాడు రాముడు.

రాముని అనుజ్ఞపొంది సుగ్రీవుడు కిష్కింధకు బయలు దేరాడు. సుగ్రీవుడు వెళుతుంటే వానరులందరూ ఆయనకు సాష్టాంగపడి నమస్కారాలు చేస్తున్నారు. సుగ్రీవుడు వారిని లేవదీసి ఆదరిస్తున్నాడు. వానరులందరూ సుగ్రీవుని కిష్కింధకు రాజుగా అభిషిక్తుని చేసారు. బంగారుతో చేసిన తెల్లని గొడుగును, తెల్లని జాలను సిద్ధం చేసారు. రత్నములు, మణులు, మాణిక్యాలు సుగ్రీవునికి సమర్పించారు. సుగంధ ద్రవ్యములు, తేనెను, నవధాన్యములను సిద్ధం చేసారు. తూర్పుగా ప్రవహించే నదుల నుండి, నాలుగు సముద్రముల నుండి బంగారు కలశములలో పుణ్యజలములు తీసుకొని వచ్చారు. బ్రాహ్మణులకు దానములు చేసారు. అగ్నిని ప్రజ్వరిల్లజేసి హోమం చేసారు. వానర శ్రేష్టులు అయిన గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గన్ధమానుడు, మైందుడు, ద్వివిదుడు, హనుమంతుడు, జాంబవంతుడు ఇంకా ఇతర వానర ప్రముఖులు పుణ్యజలములతో సుగ్రీవుని అభిషేకించారు. వానరులందరూ ఆనందంతో ఊగిపోయారు.

అదే సమయంలో వాలి కుమారుడైన అంగదుని యువరాజుగా అభిషేకించారు. అంగదునికి యౌవరాజ్య పట్టాభిషేకము చేసినందుకు సుగ్రీవుని అందరూ అభినందించారు. సుగ్రీవుని రాజుగా అభిషిక్తుడు కావడానికి, అంగదుడు యువరాజుగా అభిషిక్తుడు కావడానికి కారణమైన రామలక్ష్మణులను అందరూ వేనోళ్ల స్తుతించారు. సుగ్రీవుడు కిష్కింధా రాజ్యమును, తన భార్య రుమను మరలాపొంది ఇంద్రుని వలె రాజ్యపాలన సాగించాడు.

శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము ఇరువది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

కిష్కింధాకాండ సప్తవింశః సర్గః (27) >>>

Leave a Comment