Lalitha Ashtottara Satha Nama Sthotra Ratnam In Telugu | లలితాష్టోత్తరశతనామస్తోత్రరత్నమ్

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు లలితాష్టోత్తరశతనామస్తోత్రరత్నమ్ గురించి తెలుసుకుందాం…

Lalitha Ashtottara Satha Nama Sthotra Ratnam In Telugu

లలితాష్టోత్తరశతనామస్తోత్రరత్నమ్

శివాభవానీకల్యాణీ గౌరీ కాళీశివప్రియా
కాత్యాయనీ మహాదేవీ దుర్గార్యాచండికాభవా.

1

చంద్రచూడాచంద్రముఖీ చంద్రమండలవాసినీ
చంద్రహాసకరా చంద్రహాసినీ చంద్రకోటిభా.

2

చిద్రూపా చిత్కళానిత్యానిర్మలానిష్కళాకళా
భవ్యాభవప్రియా భవ్యరూపిణీ కులభాషిణీ.

3

కవిప్రియా కామకళా కామదా కామరూపిణీ
కారుణ్యసాగరఃకాళీ సంసారార్ణవతారికా.

4

దూర్వాభా దుష్టభయదా దుర్జయా దురితాపహా
లలితారాజ్యదాసిద్ధాసిద్దేశీ సిద్ధిదాయినీ.

5

శర్మదా శాంతిరవ్యక్తాశంఖకుండలమండితా
శారదా శాంకరీ సాధ్వీశ్యామలాకోమలాకృతిః

6

పుష్పిణీ పుష్పబాణాంబా కమలాకమలాసనా
పంచబాణస్తుతా పంచవర్ణరూపా సరస్వతీ.

7

పంచమీపరమాలక్ష్మీః పావనీ పాపహారిణీ
సర్వజ్ఞా వృషభారూఢా సర్వలోకవశంకరీ

8

సర్వస్వతంత్రాసర్వేశీ సర్వమంగళకారిణీ
నిరవద్యా నీరదాభా నిర్మలానిశ్చయాత్మికా.

9

నిర్మదానియతాచారానిష్కామానిగమాలయా
అనాదిబోధా బ్రహ్మాణీకౌమారీ గురురూపిణీ.

10

వైష్ణవీసమయాచారా కౌళినీ కుళదేవతా
సామగానప్రియా సర్వవేదరూపాసరస్వతీ.

11

అంతర్యాగప్రియానందా బహిర్యాగపరార్చితా
వీణాగానరసానందా అర్థోన్మీలితలోచనా.

12

దివ్యచందనదిగ్ధాంగీ సర్వసామ్రాజ్యారూపిణీ
తరంగీకృతసాపాంగవీక్షారక్షితసజ్జనా.

13

సుధాపానసముద్వేలహేలామోహితధూర్జటీ
మతంగమునిసంపూజ్యా మతంగకులభూషణా.

14

మకుటాంగదమంజీరమేఖలాదామ భూషితా
ఊర్మిలా కింకిణీరత్న కంకణాదిపరిష్కృతా

15

మల్లికామాలతీకుందమందారాంచితమస్తకా
తాంబూలకబళో దంచత్కపోలతలశోభినీ

16

త్రిమూర్తిరూపా త్రైలోక్య సుమోహనతనుప్రభా
శ్రీమచ్చక్రాధినగరీసామ్రాజ్య శ్రీస్వరూపిణీ.

17

మరిన్ని అష్టోత్తర పోస్ట్లు మీకోసం:

Leave a Comment