మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మంగళ హారతి పాటలు గురించి భక్తి గీతాలలో తెలుసుకుందాం…
Mangala Harathi Patalu In Telugu
మంగళ హారతి పాటలు
పల్లవి:
శ్రీ లలితా శివజ్యోతి సర్వకామదా
శ్రీగిరి నిలయా నిరామయా సర్వమంగళా
||శ్రీలలితా||
జగముల చిరునగవుల పరిపాలించే జననీ
అనయము మము కనికరమున కాపాడే జననీ
మనసే నీవశమై స్మరణే జీవనమై
మాయని వరమీయవె పరమేశ్వరి మంగళనాయకి
||శ్రీలలితా||
అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి
అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి
రవ్వల తళుకుల కళలజ్యోతుల కర్పూర హారతి
సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి.
||శ్రీలలితా||
శీతాద్రి శిఖరాన
శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు
మాతల్లి లత్తుకకు నీరాజనం –
నిండైన నీరాజనం – భక్తి మెండైన నీరాజనం.
యోగీంద్ర హృదయాల మ్రోగేటి మాతల్లి
బాగైన అందెలకు నీరాజనం
బంగారు నీరాజనం – భక్తి పొంగారు నీరాజనం
నెలతాల్పు డెందాన వలపు వీణలు మీటు
మాతల్లి గాజులకు నీరాజనం
రాగాల నీరాజనం – భక్తి తాళాల నీరాజనం.
మనుజాళి హృదయాల తిమిరాలు కరిగించు
మాతల్లి నవ్వులకు నీరాజనం
ముత్యాల నీరాజనం – భక్తి నృత్యాల నీరాజనం.
చెక్కిళ్ళ కాంతితో కిక్కిరిసి అలరారు
మాతల్లి ముంగెరకు నీరాజనం
రతనాల నీరాజనం – భక్తి జతనాల నీరాజనం.
శ్రీ లలితా పూజా విధానం
పసిబిడ్డలను చేసి ప్రజనెల్ల పాలించు
మాతల్లి చూపులకు నీరాజనం
అనురాగ నీరాజనం – భక్తి కనరాగ నీరాజనం.
దహరాన కనిపించు ఇనబింబమనిపించు
మాతల్లి కుంకుమకు నీరాజనం
కెంపైన నీరాజనం – భక్తి పెంపైన నీరాజనం.
తేటి పిల్లలవోలె గాలి కల్లల లాడు.
మాతల్లి కురులకు నీరాజనం
నీలాల నీరాజనం – భక్తి భావాల నీరాజనం.
జగదేక మోహినీ సర్వేశదేహినీ
మాతల్లి రూపులకు నీరాజనం
నిలువెత్తు నీరాజనం – భక్తి విలువెత్తు నీరాజనం.
అండగా నీవు మాకు ఉండాలనీ
అండగా నీవు మాకు ఉండాలనీ
దండ నీ మెడలో వేశానమ్మా
కొండంత నీ ప్రేమ కావాలని
కోటి దండాలు నీకే పెడుతున్నానమ్మా.
॥అండ||
రాగద్వేషాలు మాలో నశించాలని
రత్న సింహాసన మమరించావమ్మా
రాజరాజేశ్వరి రమ్యముగా ఏతెంచి
మా పూజలందుకొని కాపాడవమ్మా.
॥అండ||
పవిత్ర మౌనీ పాదము మాకు ఆధారమని
పాలాభిషేకాలు చేశానమ్మా
పవిత్రమౌనీ నామము మానోట పలకాలని
పసుపు కుంకుమతో నిను అర్చించానమ్మా.
॥అండ||
తామసమును పోగొట్టే తరుణీమణి నీవని
పరిమళ తాంబూలాన్ని అందించానమ్మా
నా జీవన సర్వస్వం నీకే అంకితమని
కర్పూర నీరాజన మిస్తున్నానమ్మా.
॥అండ||
మధురమౌ నా మనసును మంత్రపుష్పముచేసి
మహేశ్వరి ముందుంచి మైమరచానమ్మా
ఆత్మ ప్రదక్షిణతో ఐక్యమై పోవాలని
అనుక్షణము నీ దీవెన ఆశించానమ్మా.
॥అండ||
మంగళ హారతి పాటలు: