మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ మల్లికార్జున స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…
Sri Mallikarjuna Stotram In Telugu Lyrics
శ్రీ మల్లికార్జున స్తోత్రమ్
నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం
పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యామ్,
నగేంద్రకన్యావృషకేతనాభ్యాం
నమో నమశ్శంకరపార్వతీభ్యామ్.
టీక. నవయౌవనాభ్యాం = నిత్యనూతనమగు యౌవనమును గల్గినట్టియు, పరస్పర = అన్యోన్యము, అశ్లిష్ట = ఆలింగనముఁ జేసికొనఁబడిన, వపుః = శరీరమును, ధరాభ్యాం = ధరించినట్టియు, నాగేంద్రకన్యా = హిమవ త్పుత్రికయు, వృష కేతనాభ్యాం = నృవభధ్వజమును గల్గినట్టియు, శివాభ్యాం = మంగళకరులైన, శంకరపార్వతీభ్యాం = పార్వతీపరమేశ్వరుల కొఱకు, నమోనమః = ముమ్మాటికి నమస్కారము ( ఇందు మొదట నొక – నమః, నాల్గవపాదాది నమోనమః – అని రెండును గలిని ముమ్మారు నమ స్కారమని యర్థము.)
తా. నిత్యనూత్న యౌవనశోభితులును, పరస్పరాలింగిత శరీరులు నర్ధనారీశ్వర రూపులును, హైమవతీ వృషభవ తాకములను గలిగి శోభన దేహమున నొప్పారు పార్వతీపరమేశ్వరులకు మా నమస్కారము.
నమశ్శివాభ్యాం వృషవాహనాభ్యాం
విరించివిష్ణ్వింద్రసుపూజితాభ్యామ్,
విభూతి పాటీరవిలేపనాభ్యాం
నమో నమశ్శంకరపార్వతీభ్యామ్.
టీక. శివాభ్యాం=మంగళకరులైనట్టియు, వృష వాహనాభ్యాం = వృష భము వాహనము: గఁ గలిగినట్టియు; విరించి = బ్రహ్మ చేత, విష్ణు = విష్ణువుచేత, ఇంద్ర = దేవేంద్రునిచేత, సుపూజితాభ్యాం = బాగుగఁ బూజింపఁబడినట్టియు, విభూతిపాటీరవిలేపనాభ్యాం = భస్మ మొక వైపు నను, మంచిగంద మొక ప్రక్కను మైపూతగాఁగలిగినట్టి, శంకరపార్వతీభ్యాం = పార్వతీపర మేశ్వరులకు, నమః, నమోనమః = ముమ్మాటికి నమస్కారము,
తా. శుభాకారులైనట్టియు, వృషభ వాహనారూఢులును, బ్రహ్మ విష్ణ్వంద్రాదులచేఁ బూజింపఁబడునట్టియు, విభూతియు, మంచిగందము నిరుప్రక్కలఁ బ్రత్యేకముగఁ బూసి కొన్న దేహముగల ఆ పార్వతీపరమేశ్వరులు నా నమస్కారములను గ్రహింతురుగాక!
అనఘం జనకం జగతాం ప్రథమం
వరదం కరశూలధరం సులభమ్,
కరుణాంబునిధిం కలుషాపహరం
ప్రణమామి మహేశ్వరమేకమహమ్.
టీక. అనఘం = పాపరహితుఁడును, జగతాం = లోకములకు, జనకం = తండ్రియైనట్టివాఁడును, ప్రథమం = దేవతలలో నాద్యుఁడైనట్టివాఁడును, వరదం = వరము లిచ్చు వాఁడును, కరశూలధరం = చేతియందు శూలా యుధమును ధరించినవాఁడును, సులభం = సౌలభ్యముగలవాఁడును (ఆఁగా భగవతుఁడు భక్తసులభుఁడనుట) కరణాంబునిధిం = దయా సముద్రుఁడును,కల షాపహరం = ఆశ్రితుల పాపమునుబోగొట్టువాఁడును, ఏకం = ఆద్వితీయమైన, మహేశ్వరం = శ్రీ శైలనాథుని, అహం = నేను, ప్రణమామి = నమస్కరించుచు న్నాను.
తా. పుణ్యరాశియు, సర్వలోకజనకుఁడును, ఆద్యుఁడును, వర ప్రదాతయు, శూలపాణియు, సులభుఁడును, దయాసము ద్రుఁడును, జీవులాశ్రయించినచోఁ బాపములు హరించు వాఁడును, నద్వైతమూర్తి యునగు నా శివుని నే నెల్లప్పుడు నమస్కరించుచున్నాను.
అమలం కమలోద్భవగీతగుణం
శమదం సమదా సుర నాశకరమ్,
రమణీయరుచిం కమనీయ తనుం
నమ, సాంబశివం నతపాపహరమ్.
టీక. ఆమలం = స్వచ్ఛుఁడైనట్టియు, కమలోద్భవ = బ్రహ్మచే, గీత = కీర్తింపఁబడిన, గుణం = గుణములు గలవాఁడును, శమదం = ఇంద్రియ నిగ్రహప్రదుఁడును, సమదాసుర = మదముతోఁ గూడిన రాక్షసులకు, నాశకరం = వినాశకరుఁడైనట్టివాఁడును, రమణీయ = సుందరమైన, రుచిం = కాంతిగలవాఁడును, కమనీయ = కోరఁదగిన, తనుం = దేహముగలవాఁడును, నత = నమస్కరించెఁడివారి, పాపహరం = పాపముల హరించునట్టి, సాంబశివం = అర్థనారీశ్వరుఁడగు శివుని, నమ = నమస్కరింపుమా !
తా. ఓ మనసా! నీవు – నిర్మలుఁడును, బ్రహ్మాది దేవతాస్తూయ మానుఁడును, మనోనిగ్రహప్రదుఁడును, మదించిన రాక్షసుల మదమడంచినవాఁడును, సుందరమగు కాంతియు, స్వచ్ఛమై రమణీయ దేహముగల సాంబశివుని నమస్కరింపుము – నీ నమస్కారముచే నీ పాతకము లాతఁడడంచును.
శివం, శంకరం బంధురం సుందరేశం
నటేశం, గణేశం, గిరీశం, మహేశం,
దినేశేందునేత్రం సుగాత్రం మృడా నీ
పతిం శ్రీగిరీశం హృదా భావయామి.
టీక. శివం = మంగళకరుఁడును, శంకరం = సుఖప్రదుఁడును, బంధురం = ప్రేమయుక్తుఁడును, సుంద రేశం = సౌందర్యరాశియును, నటేశం = నట రాజైశెట్టియు, గణేశం = ప్రమథగణ ప్రభువైనట్టియు గిరీశం = కైలా సాధిపతియు, మ హేశమ్ = సర్వేశ్వగుడైనట్టియు, దినేనేందునేత్రం = సూర్యచంద్రుల కన్నులుగాఁ గలవాఁడును, సుగాత్రం = మంచి దేహము గలవాఁడును, మృడానీపతిం = పార్వతీపతియునగు, శ్రీగిరీశం = శ్రీశైలాధిపతియగు మల్లి కార్జునుని, హృదా = నామనస్సుచేత, భావయామి = తలఁచుచున్నాను.
తా. లోకమంగళప్రదుఁడును, సర్వసుఖంకరుఁడును, సుందరేశ, నటేశ, గణేశ, గిరీశ, మహేశాది నామములు ధరించిన వాఁడును, సూర్యచంద్రులఁ గన్నులుగాఁగలవాఁడును, మంచి దేహముతోఁగూడి పార్వతీప్రియుఁడైయున్న మల్లికార్జున స్వామిని నా మనసులోఁదలఁచుకొందును.
భృంగీచ్ఛానటనోత్కటః, కరిమదగ్రాహీ, స్ఫురన్మాధవా
హ్లాదో, నాయుదతో, మహసితవపుః, పంచేషుణా చాదృతః,
సత్పక్షః సుమనోవనేషు, స పునస్సాక్షాన్మదీయే మనో
రాజీవే, భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః.
టీక. భృంగీచ్ఛానటనోత్కటః = భృంగియను ప్రమధగణనాయకుని లయానుసారము నాట్యముఁజేయు వేడ్కగలవాఁడును, కరిమవగ్రాహీ = గజేంద్రుని మదమడంచినవాఁడును, స్ఫురన్మాధవాహ్లాదః = ప్రకాశవంతుఁడగు విష్ణువున కాహ్లాదమిచ్చువాఁడును, నాదయుతః = ప్రణవ నాదముతోఁగూడినవాఁడును, మహాసితవపుః = మిక్కిలి తెల్లనగు శరీరము గలవాఁడును, పంచేషుణా చ = మన్మధునిచేత, ఆదృతః = ఆదరింపఁ బడినవాఁడును, సుమనోవనేషు = మంచిమనస్సుల నెడి వనములందు, సత్పక్షః = సదాశ్రయముగల పతంగమువంటివాఁడును, భ్రమరాధిపః = భ్రమరాంబానాథుఁడును, శ్రీశైలవాసీ = శ్రీగిరియందా వాసముగల, సః = ఆ, విభుఃపునః = ప్రభువగు మల్లికార్జున దేవుఁడయితే, సాక్షాత్ = ప్రత్యక్షముగ, మదీయే = నా సంబంధమైన, మనోరాజీవే = మనస్స సెడి కలువపూవునందు, విహరతాం విహారముఁజేయును గాక!
తా. భృంగి లయానుసారము నాట్యముఁ జేయువాఁడును, గజాసుర సంహారకుఁడును, విష్ణుమనోహ్లాదకుఁడును, ప్రణవ నాదప్రియుఁడును, ధవళాంగుఁడును, మన్మధునిచే నుతింపఁబడిన వాఁడును, సత్పురుష వృక్షపాతముగల శ్రీశైలవాసియైన భ్రమరాంబికాపతినా మనో రాజీవమున నుండుగాక!
సోమోత్తంస స్సుర పరిషదామేష జీవాతురీశః
పాశచ్ఛేత్తా పదయుగ జుషాం ఫుల్లమల్లీనికాశః,
ద్యేయో దేవః ప్రకటిత వధూరూపవామాత్మభాగః
శ్రీశైలాగ్రే కలితవసతి ర్విశ్వరక్షాధురీణః.
టీక. సోమోత్తంసః = చంద్రుఁడు శిరోభూషణ ముగఁ గలవాఁడును, సుర పరిషదాం = దేవ సంఘములకు, జీవాతుః = బ్రదుకుఁచెఱువుఁ జూపిన వాఁడును, ఏషః = ఈ ముందు భాగముననున్న, ఈశః = ఈశ్వరుఁడును (నియమనశీలుఁడు) పదయుగ = తన పాదద్వంద్వమును. జుషాం = ఆశ్రయించినవారలయొక్క, పాళచ్ఛేత్తా = సంసార పాశమును ద్రెంచువాఁడును, ఫుల్ల = వికసించిన, మళ్లీ = మల్లెపూలతో, నికాశః = సమానమైనవాఁడు, (తెల్లని దేహము గలవాఁడనుట) ప్రకటితే = స్పష్ట ఫఱచు చున్న, వనరూప= ఆఁడురూపము. వామ = ఎడమదగు, ఆత్మ భాగః = తన దేహభాగముఁ గలవాఁడును, శ్రీశైలాగే = శ్రీశైల శిఖరమున, కలితవసతిః = కల్పించుకొనిన నివాసముగలవాఁడును, విశ్వరక్షాధురీణః = ప్రపంచర క్షణ భారమునుగలిగిన, దేవః = మల్లి కార్జ·న దేవుఁడు, ధ్యేయః = ధ్యానగోచరుఁడగు గాక !
తా. చంద్ర శేఖరుఁడును, దేవసంఘములు కాధారుఁడును, తన చరణముల నాశ్రయించినవారి భవబంధచ్ఛేదకుఁడును, మల్లెపూలవలె తెల్లనికాంతిగల శరీరమును ధరించినవాఁడును, అర్ధనారీశ్వరుఁడైన మల్లికార్జున దేవుఁడు నా ధ్యానమున గోచరించుఁగాక!
ఏణం పాణౌ, శిరసి తరుణోల్లాస మేణాంక ఖండం
పార్శ్వే వామే వపుషి తరుణీం, దృక్షు కారుణ్యలీలామ్,
భూతిం ఫాలే, స్మితమపి ముఖే, గంగమంభః కపర్దే,
బిభ్రత్ప్రేమ్ణా, భువనమఖిలం శ్రీగిరీశస్స పాయాత్.
టీక. పాణౌ = చేతియందు, ఏణం = లేడిని; శిరసి = తలపైన, తరుణోల్లాసం = యౌవనముచేఁ బ్రకాశించు (అనఁగా సప్తమ్యష్టమినాఁటి) ఏణాంక ఖండం — చంద్రకళను; వామే = ఎడమదైన, పార్శ్వే = భాగ మందు (ప్రశ్కయందు) వపుషి = శరీరమున, తరుణీం – ఆఁడురూప మును; దృక్షు=చూపులందు, కారుణ్యలీలాం = దయాపిలాసమును; ఫాలే = నొసటియందు, భూతిం = ఓ భూతిని, ముఖే = వదనమందు, = స్మితూపి = చిఱునవ్వును, కపర్దే = జటాజూటమున, గాంగం = గంగ సంబంధమైన, ఆంభః = ఉదకమునఁ; బిభ్రత్ = ధరించునట్టి, సః = ఆ, శ్రీ గిరీశః = శ్రీగిరిప్రభువగు మల్లికార్జునుఁడు, ఆఖిలం = చరాచర రూపమగు, భువనం = విశ్వమును, పాయాత్ = రక్షించుఁగాక!
తా. హస్తమున లేడిని, తలపై బాలచంద్రుని, వామదేహమున నారిని, చూపులలో దయను, ఫాలమున విభూతిని ముఖమునఁజిఱునవ్వును, జటాజూటమున గంగోదకమ ను ధరించిన శ్రీశైలవాసుఁడు ప్రీతితో నీ విశ్వమంతటిని రక్షించుఁగాక !
శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృషాళిశీతే
స్ఫీతే సౌవర్ణరత్నస్ఫురితనవగృహే దివ్యపీఠే శుభార్హే,
ఆసీనస్సోమచూడస్స కరుణనయన స్సాంగనస్స్మేరవక్త్రః
శంభుశ్శ్రీ భ్రామరీశః ప్రకటితవిభవో దేవతా సార్వభౌమః.
టీక. స్వర్ణశృంగే = బంగారు గోపురములుగల, శ్రీశైలే = శ్రీగిరియందు, మణిగణరచితే = మణిసముదాయముచే నిర్మింపఁబడినదియు, కల్పవృక్షాళిళీ తే = కల్పవృక్ష సమూహముతోఁ జల్లనైనట్టియు, స్ఫీతే = విశాలమైనట్టియు, సౌవర్ణరత్నస్ఫురిత = బంగారముతోను, రత్నములతోఁ బ్రకాశించు, సవగృహే = నూతనాలయమందు, శుభార్హే = మంగళో చితమైన, దివ్యపీఠే = శోభించు పీఠముపై, ఆసీనః = కూర్చున్నావాఁడును, సోమచూడః = చంద్రుని శిరముననుంచుకొనినవాఁడును, పకరణ నయనః = దయతోఁగూడిన నేత్రములుగలవాఁడును, సాంగనః = ఆఁడు దానితోఁగూడినవాఁడును, (అర్ధనారీశ్వరుఁడనులు) స్మేరవక్త్రః = నవ్వుచున్న ముఖముతో నున్నవాఁడును, శ్రీ భ్రామరీశః = మంగళ పతి యగు భ్రమరాంబకుఁ బతియును, దేవతాసార్వభౌమః = దేవతలలో సమ్రాట్టయిన, శంభుః = శివుఁడు, ప్రకటిత విధవః = తన వైభవ మును బ్రకాశింపఁ జేయుచుండెను.
తా. కనకగోపురములుగల శ్రీగిరియందు, కల్పవృక్షచ్ఛాయ విశాలమై, రత్నములు పొదివిన బంగరు కాంతులతో నొప్పు నాలయమన, మంగళాసనముపైఁ గూరుచుండి, పార్వతిని వామాంకమున నిడుకొని, దయా కటాక్షములఁ బఱపు దేవతా సార్వభౌముఁడైన ఆ భ్రమరాంబాపతి తనవైభ వము నాత్మీయులకఁ బ్రకటించుచుండెను.
యా యోగిబృంద హృదయాంబజ రాజహంసీ
మందస్మితస్తుతముఖీ మధుకైట భఘ్నీ,
విఘ్నాంధకార పట భేదపటీయసీ సా
మూర్తిః కరోతు కుతుకం భ్రమరాంబికాయాః.
టీశ. యా = ఏ భ్రమరాంబామూర్తి, యోగిబృంద = యోగీశ్వరసముదాయము యొక్క. హృదయాంబుజ = హృదయమను పద్మమందు. రాజహంసీ = రాజరాజ హంసాంగనయయ్యెనో, మందస్మిత = ఛిఱు, నవ్వుచే, స్తుశముఖీ = కొనియాడఁడ గిస మేముగలడ య్యెనో, మధుకైట భఘ్నీ = మధుకైటభాది రాక్షస విధ్వంసకారిణియో, విఘ్నాంధకార = విఘ్నముల నెడు చీఁకటి యొక్క, పట = సముదాయమును, భేదపటీయసీ = చీల్చివేయ సమర్థ రాలో, సా = ఆ, భ్రమరాంబికాయాః = భ్రమ రాంబాదేవియొక్క, మూర్తిః = స్వరూపము, కుతుకం = ఉల్లాస మును, శరోతు చేయఁ గాక!
తా. ఏ మూర్తిని యోగిబృందము హృదయాంబుజమున నిల్పెనో, ఎల్లప్పుడేమూర్తి చిఱునవ్వుమోముతో విలసిల్లు చుండునో, ఏమూర్తి మధుకైటభాది రాక్షస నిహంత్రియో, ఏమూర్తి విఘ్నాంధకార నిర్మూలన మొనర్చునో ఆభ్రమ రాంబాదేవియొక్క మూర్తిమా కుల్లాసమును గల్గించుఁగాక!
కస్తూరీ తిలకాంచితేందు విలసత్ప్రోద్భాసి ఫాలస్థలీం
కర్పూరద్రవ మిశ్రచూర్ణ ఖపురామోదోల్లస ద్వీటికామ్,
లోలాపాంగ తరంగితైరతి కృపాసారైర్నతా నందినీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే.
టీశ. కస్తూరీతిలక = కస్తురిబొట్టుతో, అంచిత = కూడి, ఇందు విలసత్ = చంద్రునితోఁ బ్రకాశించుచు, ప్రోద్భాసి = మిక్కిలి కాంతివంతమైన, = ఫాలభాగముగలదియు, కర్పూరద్రవ పచ్చ క ప్పుర పు ద్రవమాతో, మిశ్ర = కలిసిన, చూర్ణఖపురా= తుంగము స్తెలపొడితో, ఆమోద = పరిమళముతో, ఉల్లసత్ = ఉల్లాసమునుగొల్పెడి, వీటి కాం= తాఁబూలచర్వణము గలదియు, లోలాపాంగ తరంగితైః = చం చలములగు క్రీగటిప్రసారముల వెడి తరంగములతో గూడిన, (అతి) కృపాసా రైః = జమితమగు దయావర్షములచేత, నతానందినీం = సమస్యరించు భక్తుల కానందమిచ్చునదియు, శ్రీశైలస్థలవాసినీం = శ్రీశైల ప్రదేశమున శపించనట్టి, భగవతీం = షడ్గుణేశ్వర్యవంతురాలగు, శ్రీమాతరం = శ్రీమాతను (జగడంబను) భావయే = ధ్యానించుచున్నాను.
తా. కస్తూరీ తిలకమ తోను, చంద్రకళతో నొప్పగు నొగులు గలదియు, కర్పూరాది పరిమళవస్తు మిశ్రమగు తాంబూల చర్వణగలదియు, డయావర్షమున విలసిల్లు కటాక్ష ప్రసార ముల భ క్తులకానంద మొసఁగు శ్రీశైల వాసినియైన భ్రమ రాంబా తల్లిని, నా మనసులో ధ్యానించుచున్నాను.
రాజన్మత్తమరాళమందగమనాం రాజీవపత్రేక్షణాం
రాజీవప్రభవాదిదేవమకుటై రాజత్పదాంభోరుహామ్,
రాజీవాయతపత్రమండితకుచాం రాజాధిరాజేశ్వరీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే.
టీక. రాజత్ … గమనాం :- రాజత్ = ప్రకాశించెడి, మత్తమరాళ = మదించిన రాజహంసవలె, మందగమనాం = మొల్లనికులకు నాడకఁగల దియు, రాజీవపత్రేక్షణాం = పద్మపత్రములవలె విశాలమైనకన్నులుగల దియు, రాజీవప్రభవాది = బ్రహ్మ మొదలగు, దేవ = దేవతలయొక్క, మకుటైః = కిరీటములచే, రాజత్ పదాంభోరుహాం = ప్రకాశించు పాద పద్మములఁగలదియు, రాజీన = పద్మమువలె, ఆయత = వెడల్పయిన, పత్ర = మకరి కాపత్రములతో, మండిత = అలంకరింపఁబడిన, కుచాం = స్తనద్వయముగలదియు, రాజాధి రాజేశ్వరీ = రాజాధి రాజులకుఁగూడ రాజ్ఞియైన, శైలస్థలవాసినీం = శ్రీ శైలక్షేత్రనివాసియగు, శ్రీ మాతరం శ్రీమాతయను నామము ధరించి, భగవతీం = సద్గుణె శ్వర్యపన్నయగు భ్రమరాంబికను, భావయే = నా హృదయమునఁ దలఁచుచున్నాను.
తా. రాజహంసగమనయు, పద్మపత్రాయతాక్షియు, బ్రహ్మాది దేవతలు నమస్కరింపుచుండ వారి మణికిరీటములతో నలంకరింపఁబడిన పాదపద్మములు గలదియు, మకరికాపత్ర రచనగల నురోజభాగముతో శోభిల్లుచు రాజరాజేశ్వరీ, శ్రీమాతా, భగవతీయను నామములతో నొప్పారు శ్రీశైల భ్రమరాంబ నాత్మలో ధ్యానించుచున్నాను.
శ్రీనాథాదృతపాలితత్రిభువనాం శ్రీచక్రసంచారిణీం
గానాసక్తమనోజ్ఞయౌవనలసద్గంథర్వకన్యావృతామ్,
దీనానామతివేలభాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే.
టీశ. శ్రీనాథ = విష్ణువుచే ఆదృత = ఆదరింపఁబడి, పాలిత = పాలించిన త్రిభువనాం = మాల్లోకముగలడియు, శ్రీ చక్రసంచారిణీం = శ్రీచక్ర మందుఁ = దిరుగాడునదియు, గానాసక్త = సంగీతాసక్తిగల, మనోజ్ఞ యౌవన = మనోహరిమైన తరుణవయస్సుతో. లసత్ = ప్రకాశించెడి, గంధర్వకన్యా = గంధర్వకుమారికులతో, వృతాం = చుట్టుకొనఁబడినదియు, దీనానాం = దీనులగువారికి, అతివేల = హద్దుమీరిన, భాగ్య = సంపదను, జననీం = కల్గించునదియు, దివ్యాంబర = ప్రకాశించు వస్త్రమలతో, అలంకృతాం = అలంకరింపఁబడినదియు, శ్రీశైలస్థల వాసి = శ్రీ శైల క్షేత్రని వాసి : యైన, భగవతీం = పూజ్యురాలుగు, శ్రీమాతరం = శ్రీమద్య్రమరాంబికను, భావయే = తలఁచుచున్నాను.
తా. విష్ణ్వాది దేవ జ్యేష్ఠు లాదరించురీతి లోకరక్షణ మొనర్చు నదియా, శ్రీ చక్రనివాసినియై, చక్కఁగ గాన మొనర్చుచు యౌవనములోనున్న గంధర్వకన్యలతోఁ బరి వేష్టింపఁబడి, దీనులకు భాగ్యము లొడఁగూర్చెడి శ్రీశైలనివాసియగు శ్రీ మాతృమూర్తిని మనసులోఁదలఁచెద,
ఉభౌ దర్వీకుంభౌ మణికనకసంభావితగుణౌ
దధానా పాణిభ్యామమృతరసమృష్టాన్నకలితౌ,
కలాడ్యా కళ్యాణీ కలితసదనా శ్రీగిరిశిర
స్యసౌ భ్రామర్యంభా రచయతు మదిష్టార్థవిభవమ్.
టీక. మణిశనక సంభావిఠగుణా మణులతోను, బంగారముతోను తయారు గావింపఁబడిన క్రమాన్వయము) ఉభౌ రెండైన, దర్వీకుంభౌ తెడ్డును, పాత్రయును, ఆమృతరసమృష్టాన్న కలితే = ఆమృతర సమును – (దర్వితోను) అన్నమును (పాత్రతోను) లిగియున్న వానిని, భ్యాం = హ స్తద్వంద్వముచే, దధానా = ధరించునదియు, కలాఢ్యా = సర్వకళాసంపూర్ణురాలును, కల్యాణీ = మంగళాంగియు, శ్రీ గిరిశిరసి = శ్రీశైలశిఖరమున, కలితపదనా = ఆవాసమును గల్పించుకొనిన, అసౌ = ఈ; భ్రామర్యంబా = భ్రమరాంబ, మడిష్టార్థ విభవమ్ = నాకిష్టమైన సంపదను, రచయతు= కూర్చుఁగాక !
తా. మణులతోఁ గూర్చబడిన తెడ్డు నమృతముతో నింపి యొక్క చేతను, బంగరుపాత్రలో నన్నమును నింపుకొని వేటొక చేతను ధరించినదియు, చతుష్షష్టి కళలతో ఁగూడి నదియు, కల్యాణగాత్రియగు శ్రీ శైల భ్రమరాంబిక నా యభీష్ట భాగ్యము లొసఁగుఁగాక.