Aranya Kanda Sarga 18 In Telugu – అరణ్యకాండ అష్టాదశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “అరణ్యకాండ” అష్టాదశః సర్గలో, రాముడు శూర్పణఖ తన వైపుకు వెళ్లడాన్ని అడ్డుకుంటాడు మరియు బదులుగా లక్ష్మణుడిని వెతకమని కోరతాడు. లక్ష్మణుడు ఆమెను తన మాటల్లోనే తిప్పికొట్టడంలో పదజాలాన్ని ఉపయోగిస్తాడు. కానీ ఆమె లక్ష్మణుడి మాటల అర్థాన్ని గ్రహించి సీతను తినడానికి పరుగెత్తుతుంది. లక్ష్మణుడు ఆమెను అపవిత్రం చేస్తాడు మరియు ఆమె అక్కడ నుండి శబ్దంతో పారిపోతుంది, హింసాత్మక రాక్షసుడైన తన సోదరుడు ఖరాకు నివేదించడానికి మాత్రమే. ఇది రాముడు మరియు రామాయణానికి మరో రౌండ్ ఇబ్బందులను ప్రేరేపించే పరిస్థితి.

శూర్పణఖావిరూపణమ్

తాతః శూర్పణఖాం రామః కామపాశావపాశితామ్ |
స్వచ్ఛయా శ్లక్ష్ణయా వాచా స్మితపూర్వమథాబ్రవీత్ ||

1

కృతదారోఽస్మి భవతి భార్యేయం దయితా మమ |
త్వద్విధానాం తు నారీణాం సుదుఃఖా ససపత్నతా ||

2

అనుజస్త్వేష మే భ్రాతా శీలవాన్ ప్రియదర్శనః |
శ్రీమానకృతదారశ్చ లక్ష్మణో నామ వీర్యవాన్ ||

3

అపూర్వీ భార్యయా చార్థీ తరుణః ప్రియదర్శనః |
అనురూపశ్చ తే భర్తా రూపస్యాస్య భవిష్యతి ||

4

ఏనం భజ విశాలాక్షి భర్తారం భ్రాతరం మమ |
అసపత్నా వరారోహే మేరుమర్కప్రభా యథా ||

5

ఇతి రామేణ సా ప్రోక్తా రాక్షసీ కామమోహితా |
విసృజ్య రామం సహసా తతో లక్ష్మణమబ్రవీత్ ||

6

అస్య రూపస్య తే యుక్తా భార్యాఽహం వరవర్ణినీ |
మయా సహ సుఖం సర్వాన్ దండకాన్ విచరిష్యసి ||

7

ఏవముక్తస్తు సౌమిత్రీ రాక్షస్యా వాక్యకోవిదః |
తతః శూర్పణఖీం స్మిత్వా లక్ష్మణో యుక్తమబ్రవీత్ ||

8

కథం దాసస్య మే దాసీ భార్యా భవితుమిచ్ఛసి |
సోఽహమార్యేణ పరవాన్ భ్రాత్రా కమలవర్ణినీ ||

9

సమృద్ధార్థస్య సిద్ధార్థా ముదితామలవర్ణినీ |
ఆర్యస్య త్వం విశాలాక్షి భార్యా భవ యవీయసీ ||

10

ఏనాం విరూపామసతీం కరాళాం నిర్ణతోదరీమ్ |
భార్యాం వృద్ధాం పరిత్యజ్య త్వామేవైష భజిష్యతి ||

11

కో హి రూపమిదం శ్రేష్ఠం సంత్యజ్య వరవర్ణిని |
మానుషీషు వరారోహే కుర్యాద్భావం విచక్షణః ||

12

ఇతి సా లక్ష్మణేనోక్తా కరాళా నిర్ణతోదరీ |
మన్యతే తద్వచస్తథ్యం పరిహాసావిచక్షణా ||

13

సా రామం పర్ణశాలాయాముపవిష్టం పరంతపమ్ |
సీతయా సహ దుర్ధర్షమబ్రవీత్ కామమోహితా ||

14

ఏనాం విరూపామసతీం కరాళాం నిర్ణతోదరీమ్ |
వృద్ధాం భార్యామవష్టభ్య మాం న త్వం బహుమన్యసే ||

15

అద్యేమాం భక్షయిష్యామి పశ్యతస్తవ మానుషీమ్ |
త్వయా సహ చరిష్యామి నిఃసపత్నా యథాసుఖమ్ ||

16

ఇత్యుక్త్వా మృగశాబాక్షీమలాతసదృశేక్షణా |
అభ్యధావత్ సుసంక్రుద్ధా మహోల్కా రోహిణీమివ ||

17

తాం మృత్యుపాశప్రతిమామాపతంతీం మహాబలః |
నిగృహ్య రామః కుపితస్తతో లక్ష్మణమబ్రవీత్ ||

18

క్రూరైరనార్యైః సౌమిత్రే పరిహాసః కథంచన |
న కార్యః పశ్య వైదేహీం కథంచిత్ సౌమ్య జీవతీమ్ ||

19

ఇమాం విరూపామసతీమతిమత్తాం మహోదరీమ్ |
రాక్షసీం పురుషవ్యాఘ్ర విరూపయితుమర్హసి ||

20

ఇత్యుక్తో లక్ష్మణస్తస్యాః క్రుద్ధో రామస్య పార్శ్వతః |
ఉద్ధృత్య ఖడ్గం చిచ్ఛేద కర్ణనాసం మహాబలః ||

21

నికృత్తకర్ణనాసా తు విస్వరం సా వినద్య చ |
యథాగతం ప్రదుద్రావ ఘోరా శూర్పణఖా వనమ్ ||

22

సా విరూపా మహాఘోరా రాక్షసీ శోణితోక్షితా |
ననాద వివిధాన్నాదాన్ యథా ప్రావృషి తోయదః ||

23

సా విక్షరంతీ రుధిరం బహుధా ఘోరదర్శనా |
ప్రగృహ్య బాహూ గర్జంతీ ప్రవివేశ మహావనమ్ ||

24

తతస్తు సా రాక్షససంఘసంవృతం
ఖరం జనస్థానగతం విరూపితా |
ఉపేత్య తం భ్రాతరముగ్రదర్శనం
పపాత భూమౌ గగనాద్యథాఽశనిః ||

25

తతః సభార్యం భయమోహమూర్ఛితా
సలక్ష్మణం రాఘవమాగతం వనమ్ |
విరూపణం చాత్మని శోణితోక్షితా
శశంస సర్వం భగినీ ఖరస్య సా ||

26

Aranya Kanda Sarga 18 In Telugu Pdf Download

కామంతో కాలిపోతున్న శూర్పణఖను చూచాడు. రాముడు. చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు. “ఓ సుందరీ! నీవు నన్ను పెళ్లిచేసు కుంటాను అన్నావు. కాని నాకు ఇదివరకే పెళ్లి అయింది. ఈమే నా భార్య. ఈమె అంటే నాకు ప్రాణము. నీవు మళ్లీ నన్ను పెళ్లిచేసుకుంటే నీకు సవతి పోరు తప్పదు. నాతో కోరికలు తీర్చుకోవాలి అని గాఢంగా కోరుకున్న నీకు సవతి పోరు ఉండటం నీవు సహించగలవా! నీవంటి కాముకులు సవతి పోరు అస్సలు సహించలేరు.

అడుగో అక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన నా తమ్ముడు లక్ష్మణుడు. మంచి అందగాడు.

(ఇక్కడ వాల్మీకి ‘అకృతదారశ్చ’ అని వాడాడు. దీనికి అర్థం పెళ్లికానివాడు, అనీ, భార్య దగ్గరలేని వాడు అనీ అర్థం చెప్పుకోవచ్చు. పెళ్లికాని వాడు అంటే రాముడు అబద్ధం చెప్పినట్టు అవుతుంది కదా! అందుకని ఒంటరి వాడు. భార్య దగ్గర లేని వాడు అని అర్థం చెప్పుకోవడం సమంజసంగా ఉంటుంది అని నా భావన)

పాపం అతనికి భార్యాసౌఖ్యము లేదు. ప్రస్తుతము అతనికి భార్య అవసరము ఉంది. కాబట్టి అతడు నీకు తగిన భర్త. పైగా నీవు అతనిని పెళ్లిచేసుకుంటే నీకు సవతి బాధ ఉండదు. కాబట్టి నన్ను విడిచిపెట్టి అతని వద్దకు పో!” అని అన్నాడు రాముడు.

ఇద్దరూ అందగాళ్లే. ఎవరైనా ఒకటే అనుకుంటూ శూర్పణఖ లక్ష్మణుని వద్దకు వెళ్లింది. శూర్పణఖ మొదట రాముని వద్దకు పోవడం, ఆయనతో మాట్లాడటం, తరువాత తన వద్దకు రావడం చూస్తున్నాడు లక్ష్మణుడు. శూర్పణఖ చకా చకా లక్ష్మణుని వద్దకు వెళ్లింది.

“ఓ సుందరాకారా! నా పేరు శూర్పణఖ. నన్ను వివాహం చేసుకుంటే నీకు అమర సుఖాలు అందిస్తాను. ఈ వనసీమలలో మనం హాయిగా విహరిద్దాము. రా! నాతోరా!” అని తొందరపెట్టింది శూర్పణఖ.

లక్ష్మణుడు ఆమెను చూచి ఇలా అన్నాడు. “ఓ లలనా! నేను నా అన్న రామునికి సేవకుడను. నా అన్నకు వదినకు దాసుడను. నేనే వారికి సేవలు చేస్తుంటే, నువ్వు కూడా నన్ను పెళ్లిచేసుకొని వారికి సేవలుచేస్తావా! ఎవరైనా రాణి కావాలని కోరుకుంటారు కానీ సేవకురాలు కావాలని కోరుకుంటారా చెప్పు. కాబట్టి నేను నీకు తగినవాడను కాను. నీవు రాముని వద్దకు వెళ్లు. ఆయనకు చిన్నభార్యగా ఉన్నా, ఆనందం అనుభవిస్తావు. అప్పుడు నేనేనీకు సేవలు చేస్తాను.

రాముని భార్యను చూడు. ఎంత అందవికారంగా ఉందో! పైగా ముసలిది. పొట్టలోపలికి పోయి ఎంత వికృతంగా ఉందో చూడు! ఇంకొక్కసారి అడిగావనుకో రాముడు తన అందవికారి అయిన భార్యను విడిచి నిన్నే పెళ్లాడతాడు. రామునితో అమర సుఖాలు అనుభవించు. అయినా లోకోత్తర సుందరి అయిన నిన్ను వదిలి బుద్ధి ఉన్నవాడు ఎవరైనా ఆ మనుష్యకాంతను కోరుకుంటారా చెప్పు! కాబట్టి వెంటనే రాముని వద్దకు వెళ్లు. నీ మంచికోరి చెబుతున్నాను. విను.” అని బంతిని తిరిగి రాముని వద్దకు నెట్టాడు.

లక్ష్మణుడు తనను ఆట పట్టిస్తున్నాడు అని దాని మట్టి బుర్రకు తోచలేదు. ఇదేదో బాగానే ఉందనుకొని, శూర్పణఖ తిరిగి రాముని వద్దకు పోయింది.

“రామా! నన్ను చూడు. నీ భార్యను చూడు. నేను లోకోత్తర సౌందర్యవతిని. నీ భార్య కురూపి. పైగా ముసలిది. దానితో ఏం సుఖపడతావు. నాతో రా. నన్ను పెళ్లిచేసుకో. నీకు అమరసుఖాలు రుచి చూపిస్తాను.

(సీతను చూపిస్తూ) ఈ అందవికారిని చూచా నన్ను వద్దంటున్నావు. ఇది ఉండబట్టి కదా నువ్వు నన్ను కాదంటున్నావు. చూస్తూ ఉండు. ఇప్పుడే దీనిని కరా కరా నమిలి తింటాను. అప్పుడు నాకు సవతి పోరు ఉండదుగా! రా రామా! మనం హాయిగా పెళ్లిచేసుకొని సుఖిద్దాము.” అని రాముని బలవంతం చేసింది. శూర్పణఖ. సీతను చంపడానికి ఆమె మీదికి వెళ్లింది. వెంటనే రాముడు శూర్పణఖను అడ్డుకున్నాడు. పక్కకు నెట్టాడు. లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.

“లక్ష్మణా! ఇలాంటి దుష్టులతోనా నీ పరిహాసాలు. ఇప్పుడు చూడు ప్రమాదం త్రుటిలో తప్పిపోయింది. లేకపోతే ఈ దుష్టురాలు సీతను చంపి ఉండేది. సీత చూడు భయంతో ఎలా వణికిపోతూ ఉందో! లక్ష్మణా! దీనికి దీని అందం చూచుకొని గర్వం. ఆ గర్వం పోగొట్టు. దీనిని అంగవిహీనురాలిగా, అందవిహీనురాలిని చెయ్యి. లేకపోతే ఇది సీతను చంపుతుంది.” అని అన్నాడు రాముడు.

అప్పుడు లక్ష్మణుడు కత్తి తీసుకొని శూర్పణఖ ముక్కు చెవులు కోసి అంగవిహీనురాలిని, అందవిహీనురాలిని చేసాడు లక్ష్మణుడు. హటాత్తుగా జరిగిన ఈ పరిణామానికి తట్టుకోలేకపోయింది శూర్పణఖ. పైగా తెగి పడిన ముక్కు, చెవుల నుండి రక్తం ధారాపాతంగా కారుతూ ఉంది. వెంటనే రాముని వదిలి అడవిలోకి పారిపోయింది.

(ఇటీవల కొంత మంది విమర్శకులు, స్త్రీవాదులు ఈ సంఘటనను విమర్శిస్తుంటారు. శూర్పణఖ ఒక స్త్రీ. ఇష్టంలేకపోతే ఇష్టంలేదని చెప్పవచ్చుకాని, ముక్కు చెవులు కోయడం అమానుషం, దారుణం అని వాదిస్తుంటారు. కాని ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. శూర్పణఖ ఆటవికురాలు. రాక్షసి. నరమాంసభక్షకి. సీతను చంపడానికి ఆమె మీదికి ఉరికింది. అప్పుడు ఏం చెయ్యాలి. ” అయ్యో! శూర్పణఖ స్త్రీ. ఆమెను ఏమీ చేయకూడదు”అని ఊరుకోవాలా! అలా ఊరుకుంటే శూర్పణఖ సీతను మిరపకాయ బజ్జీ తిన్నట్టు కరా కరా నమిలి తిని ఉండేది. తన భార్య అయిన సీతను రక్షించుకోవడం రాముని ధర్మం కాదా!

“తనకు కానీ, తన వారికి కానీ, తన ఆస్తికి కానీ ఆపద కలిగినప్పుడు, ఆ ఆపద కలిగించేవారిని చంపినా, గాయపరిచినా అది నేరం కాదు.” అని నేటి న్యాయశాస్త్రం కూడా చెబుతుంది. దానిని రైట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ అంటారు. రాముడు కూడా అదే పని చేసాడు. అయినా రాముడు శూర్పణఖను చంపలేదు. కేవలం ముక్కు చెవులుకోయించాడు. సీత ప్రాణాలు రక్షించాడు. కాబట్టి నేటి విమర్శకులు అనుకుంటున్నట్టు రాముడుకానీ, లక్ష్మణుడుకానీ శూర్పణఖ ముక్కు చెవులు కోయడంలో అనుచితంగా ప్రవర్తించలేదు. పైగా న్యాయసూత్రాలు పాటించారని చెప్పుకోవచ్చు.)

ఆ ప్రకారంగా ముక్కునుండి చెవుల నుండి రక్తం కారుతుంటే శూర్పణఖ పరుగెత్తిపోయింది. జన స్థానములో తన చుట్టు రాక్షస సేనలు ఉండగా, శూర్పణఖ అన్న ఖరుడు కూర్చొని ఉన్నాడు. శూర్పణఖ సరాసరి తన అన్న ఖరుని వద్దకు వెళ్లింది. ఏడుస్తూ నేలమీద పడిపోయింది.

తన చెల్లి అలా పడిపోవడం చూచి సహించలేక పోయాడు ఖరుడు. ఆమె వద్దకు వచ్చి ఆమెను లేవనెత్తాడు. ఆమె చెవుల నుండి, ముక్కునుండి రక్తం కారడం చూచాడు. ఏం జరిగింది అని అడిగాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పదునెనిమిదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ ఏకోనవింశః సర్గః (19) >>

Leave a Comment