Aranya Kanda Sarga 10 In Telugu – అరణ్యకాండ దశమః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ దశమ సర్గలో, శ్రీరాముడు, సీతమ్మ మరియు లక్ష్మణులు తమ కష్టాలకు పరిష్కారం కోసం రుషి శరభంగుడి ఆశ్రమానికి వెళతారు. రాముడు శరభంగుడి ఆశీస్సులతో సుఖంగా గడుపుతాడు. శరభంగుడు తన చివరి క్షణాల్లో రామునికి పుణ్యాలను వివరించి, దివ్య లోకాలకు వెళ్ళడానికి సిద్ధమవుతాడు.

రక్షోవధసమర్థనమ్

వాక్యమేతత్తు వైదేహ్యా వ్యాహృతం భర్తృభక్తయా |
శ్రుత్వా ధర్మే స్థితో రామః ప్రత్యువాచాథ మైథిలీమ్ ||

1

హితముక్తం త్వయా దేవి స్నిగ్ధయా సదృశం వచః |
కులం వ్యపదిశంత్యా చ ధర్మజ్ఞే జనకాత్మజే ||

2

కిం తు వక్ష్యామ్యహం దేవి త్వయైవోక్తమిదం వచః |
క్షత్రియైర్ధార్యతే చాపో నార్త శబ్దో భవేదితి ||

3

మాం సీతే స్వయమాగమ్య శరణ్యాః శరణం గతాః |
తే చార్తా దండకారణ్యే మునయః సంశితవ్రతాః ||

4

వసంతో ధర్మనిరతా వనే మూలఫలాశనాః |
న లభంతే సుఖం భీతా రాక్షసైః క్రూరకర్మభిః ||

5

కాలే కాలే చ నిరతా నియమైర్వివిధైర్వనే |
భక్ష్యంతే రాక్షసైర్భీమైర్నరమాంసోపజీవిభిః ||

6

తే భక్ష్యమాణా మునయో దండకారణ్యవాసినః |
అస్మానభ్యవపద్యేతి మామూచుర్ద్విజసత్తమాః ||

7

మయా తు వచనం శ్రుత్వా తేషామేవం ముఖాచ్చ్యుతమ్ |
కృత్వా చరణశుశ్రూషాం వాక్యమేతదుదాహృతమ్ ||

8

ప్రసీదంతు భవంతో మే హ్రీరేషా తు మమాతులా |
యదీదృశైరహం విప్రైరుపస్థేయైరుపస్థితః ||

9

కిం కరోమీతి చ మయా వ్యాహృతం ద్విజసన్నిధౌ |
సర్వైరేతైః సమాగమ్య వాగియం సముదాహృతా ||

10

రాక్షసైర్దండకారణ్యే బహుభిః కామరూపిభిః |
అర్దితాః స్మ దృఢం రామ భవాన్నస్తత్ర రక్షతు ||

11

హోమకాలేషు సంప్రాప్తాః పర్వకాలేషు చానఘ |
ధర్షయంతి సుదుర్ధర్షా రాక్షసాః పిశితాశనాః ||

12

రాక్షసైర్ధర్షితానాం చ తాపసానాం తపస్వినామ్ |
గతిం మృగయమాణానాం భవాన్నః పరమా గతిః ||

13

కామం తపః ప్రభావేన శక్తా హంతుం నిశాచరాన్ |
చిరార్జితం తు నేచ్ఛామస్తపః ఖండయితుం వయమ్ ||

14

బహువిఘ్నం తపో నిత్యం దుశ్చరం చైవ రాఘవ |
తేన శాపం న ముంచామో భక్ష్యమాణాశ్చ రాక్షసైః ||

15

తదర్ద్యమానాన్రక్షోభిర్దండకారణ్యవాసిభిః |
రక్ష నస్త్వం సహ భ్రాత్రా త్వన్నాథా హి వయం వనే ||

16

మయా చైతద్వచః శ్రుత్వా కార్త్స్న్యేన పరిపాలనమ్ |
ఋషీణాం దండకారణ్యే సంశ్రుతం జనకాత్మజే ||

17

సంశ్రుత్య చ న శక్ష్యామి జీవమానః ప్రతిశ్రవమ్ |
మునీనామన్యథా కర్తుం సత్యమిష్టం హి మే సదా ||

18

అప్యహం జీవితం జహ్యాం త్వాం వా సీతే సలక్ష్మణామ్ |
న తు ప్రతిజ్ఞాం సంశ్రుత్య బ్రాహ్మణేభ్యో విశేషతః ||

19

తదవశ్యం మయా కార్యమృషీణాం పరిపాలనమ్ |
అనుక్తేనాపి వైదేహి ప్రతిజ్ఞాయ తు కిం పునః ||

20

మమ స్నేహాచ్చ సౌహార్దాదిదముక్తం త్వయాఽనఘే |
పరితుష్టోఽస్మ్యహం సీతే న హ్యనిష్టోఽనుశిష్యతే ||

21

సదృశం చానురూపం చ కులస్య తవ చాత్మనః |
సధర్మచారిణీ మే త్వం ప్రాణేభ్యోఽపి గరీయసీ ||

22

ఇత్యేవముక్త్వా వచనం మహాత్మా
సీతాం ప్రియాం మైథిలరాజపుత్రీమ్ |
రామో ధనుష్మాన్సహ లక్ష్మణేన
జగామ రమ్యాణి తపోవనాని ||

23

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే దశమః సర్గః ||

Aranya Kanda Sarga 10 Meaning In Telugu

తన భార్య సీత చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు రాముడు. సీతతో ఇలా అన్నాడు.“ఓ జనకరాజపుత్రీ! సీతా! నీకు అన్ని ధర్మాలూ తెలుసు. నీవు పలికిన పలుకులు నీ సాత్విక ప్రవృత్తికి తగినట్టుగానూ, ధర్మబద్ధంగానూ, యుక్తియుక్తంగానూ ఉన్నాయి.

దీనులను రక్షించడానికే క్షత్రియులు ఆయుధములు చేపడతారని నీవే చెప్పావు కదా! ఈ దండకారణ్యములో ఎంతో మంది మునులు ఉన్నారు. వారికి తపస్సు తప్ప వేరొక పని లేదు. వారందరూ పూజనీయులు. గౌరవింపతగ్గవారు. అటువంటి వారిని రాక్షసులు అనేక రకాలుగా బాధలు పెడుతున్నారు. చంపుతున్నారు. ఆ పరిస్థితులలో ఆ మునులు తమ బాధలనుండి రక్షించమని నన్ను శరణుకోరారు.

ఆ మునులు ఎవరికీ అపకారముచెయ్యరు. దొరికిన కందమూలములు, ఫలములు తిని తపస్సు చేసుకుంటున్నారు. అటువంటి వారికి ఈ రాక్షసుల వలన శాంతి, సుఖము లేకుండా పోయాయి. నరమాంస భక్షకులైన రాక్షసులు ఎప్పుడు ఎవరిని చంపుతారో అని భయంతో వణికిపోతున్నారు. వారందరూ రాక్షసుల బారినుండి తమను కాపాడమని నన్ను అర్ధించారు.

ఒక క్షత్రియుడుగా, ఒక రాజుగా నేనే వారి వద్దకుపోయి, “మీకు నేను ఏమి సేవ చేయాలి” అని అడగడం పోయి, వారే నా
దగ్గరకు వచ్చి తమను కాపాడమని నన్ను అర్థించారు. అందుకు ఒక రాజుగా నేను సిగ్గుపడాలి. నేను వారిని “నేను మీకు ఏమిసేవ చేయగలను” అని అడిగినప్పుడు వారు చెప్పిన మాటలను నీకు చెబుతున్నాను.

“రామా! ఈ దండకారణ్యములో కామరూపులైన రాక్షసులు స్థావరములు ఏర్పరచుకొని ఉన్నారు. వారు నరమాంసభక్షకులు. మేము హోమాలు, యాగాలు చేస్తుంటే వాటిని పాడుచేస్తున్నారు. అదేమని అడిగితే చంపుతున్నారు. మా తపోబలముచేత వారిని మేము ఎదుర్కోగలము, చంపగలము. కాని ఎంతో కష్టపడి ఆర్జించిన మా తపోమహిమలను ఈ నీచుల కోసరం వెచ్చించడం మాకు ఇష్టం లేదు. అందుచేత, ఆ రాక్షసులు మమ్ములను ఎన్ని బాధలు పెడుతున్నా, మా యజ్ఞులు పాడుచేస్తున్నా, మమ్ములను చంపుతున్నా, భరిస్తున్నాము, సహిస్తున్నాము. ఇప్పుడు నీవు వచ్చావు కాబట్టి, నిన్ను అర్ధిస్తున్నాము. ఈ ప్రాంతము నీరాజ్యములో ఉన్నది కాబట్టి నీవే మాకు రక్షకుడవు.”

సీతా! ఈ ప్రకారంగా వారు నాతో పలికిన పలుకులు విని నేను ఊరుకోలేకపోయాను. వారికి అపకారము చేస్తున్న రాక్షసులను సంహరిస్తానని వారికి మాట ఇచ్చాను. ఆ మాట నెరవేర్చడం క్షత్రియునిగా నా కర్తవ్యం. నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకూ వారికి ఇచ్చిన మాటను నెరవేర్చడానికే ప్రయత్నిస్తాను. అవసరం అయితే మీ అందరినీ, నా ప్రాణాలను సైతం విడిచిపెడతాను కానీ ఆ బ్రాహ్మణులకు ఇచ్చిన మాటను నెరవేరుస్తాను. ఇదే నా నిశ్చయము. ఒక క్షత్రియునిగా, ఒక రాజుగా, వారు అడగకపోయినా, నేను వారి కష్టాలు తీర్చాలి. వారికి రక్షణ కల్పించాలి. వారే అడిగినప్పుడు ఇంక వేరుచెప్పాలా!

ఓ సీతా! నీకు తగినట్టు నీవు చెప్పావు. అందులో తప్పులేదు. నిన్ను నేను నా ప్రాణముల కంటే ఎక్కువగా ప్రేమిస్తాను. మునులకు ఇచ్చిన మాటనుకూడా నెరవేరుస్తాను.” అని అన్నాడు రాముడు.

తరువాత అందరూ దండకారణ్యములోనికి ప్రవేశించారు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ ఏకాదశః సర్గః (11) >>

Leave a Comment