Aranya Kanda Sarga 3 In Telugu – అరణ్యకాండ తృతీయః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ తృతీయః సర్గం రామాయణంలో ముఖ్యమైన భాగం. ఈ సర్గలో రాముడు, సీత, లక్ష్మణులు అరణ్యంలో ప్రవేశించి, ఋషులతో భేటి అవుతారు మరియు వారి ఆశీర్వాదాలు పొందుతారు. తరువాత, వారు పంచవటికి చేరి అక్కడ నివసించడం ప్రారంభిస్తారు. పంచవటిలో ఉండే సమయంలో రాముడు తన ధర్మానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ, అరణ్యంలో రాక్షసులను అణచి వేస్తాడు.

విరాధప్రహారః

అథోవాచ పునర్వాక్యం విరాధః పూరయన్వనమ్ |
ఆత్మానం పృచ్ఛతే బ్రూతం కౌ యువాం క్వ గమిష్యథః ||

1

తమువాచ తతో రామో రాక్షసం జ్వలితాననమ్ |
పృచ్ఛంతం సుమహాతేజా ఇక్ష్వాకుకులమాత్మనః ||

2

క్షత్రియౌ వృత్తసంపన్నౌ విద్ధి నౌ వనగోచరౌ |
త్వాం తు వేదితుమిచ్ఛావః కస్త్వం చరసి దండకాన్ ||

3

తమువాచ విరాధస్తు రామం సత్యపరాక్రమమ్ |
హంత వక్ష్యామి తే రాజన్నిబోధ మమ రాఘవ ||

4

పుత్రః కిల జయస్యాహం మమ మాతా శతహ్రదా |
విరాధ ఇతి మామాహుః పృథివ్యాం సర్వరాక్షసాః ||

5

తపసా చాపి మే ప్రాప్తా బ్రహ్మణో హి ప్రసాదజా |
శస్త్రేణావధ్యతా లోకేఽచ్ఛేద్యాభేద్యత్వమేవ చ ||

6

ఉత్సృజ్య ప్రమదామేనామనపేక్షౌ యథాగతమ్ |
త్వరమాణౌ పలాయేథాం న వాం జీవితమాదదే ||

7

తం రామః ప్రత్యువాచేదం కోపసంరక్తలోచనః |
రాక్షసం వికృతాకారం విరాధం పాపచేతసమ్ ||

8

క్షుద్ర ధిక్త్వాం తు హీనార్థం మృత్యుమన్వేషసే ధ్రువమ్ |
రణే సంప్రాప్స్యసే తిష్ఠ న మే జీవన్గమిష్యసి ||

9

తతః సజ్యం ధనుః కృత్వా రామః సునిశితాన్ శరాన్ |
సుశీఘ్రమభిసంధాయ రాక్షసం నిజఘాన హ ||

10

ధనుషా జ్యాగుణవతా సప్త బాణాన్ముమోచ హ |
రుక్మపుంఖాన్ మహావేగాన్ సుపర్ణానిలతుల్యగాన్ ||

11

తే శరీరం విరాధస్య భిత్త్వా బర్హిణవాససః |
నిపేతుః శోణితాదిగ్ధా ధరణ్యాం పావకోపమాః ||

12

స విద్ధో న్యస్య వైదేహీం శూలముద్యమ్య రాక్షసః |
అభ్యద్రవత్సుసంక్రుద్ధస్తదా రామం సలక్ష్మణమ్ ||

13

స వినద్య మహానాదం శూలం శక్రధ్వజోపమమ్ |
ప్రగృహ్యాశోభత తదా వ్యాత్తానన ఇవాంతకః ||

14

అథ తౌ భ్రాతరౌ దీప్తం శరవర్షం వవర్షతుః |
విరాధే రాక్షసే తస్మిన్కాలాంతకయమోపమే ||

15

స ప్రహస్య మహారౌద్రః స్థిత్వాఽజృంభత రాక్షసః |
జృంభమాణస్య తే బాణాః కాయాన్నిష్పేతురాశుగాః ||

16

స్పర్శాత్తు వరదానేన ప్రాణాన్ సంరోధ్య రాక్షసః | [బలాత్తు]
విరాధః శూలముద్యమ్య రాఘవావభ్యధావత ||

17

తచ్ఛూలం వజ్రసంకాశం గగనే జ్వలనోపమమ్ |
ద్వాభ్యాం శరాభ్యాం చిచ్ఛేద రామః శస్త్రభృతాం వరః ||

18

తద్రామవిశిఖచ్ఛిన్నం శూలం తస్య కరాద్భువి |
పపాతాశనినా ఛిన్నం మేరోరివ శిలాతలమ్ ||

19

తౌ ఖడ్గౌ క్షిప్రముద్యమ్య కృష్ణసర్పోపమౌ శుభౌ |
తూర్ణమాపతతస్తస్య తదా ప్రాహరతాం బలాత్ ||

20

స వధ్యమానః సుభృశం బాహుభ్యాం పరిరభ్య తౌ |
అప్రకంప్యౌ నరవ్యాఘ్రౌ రోద్రః ప్రస్థాతుమైచ్ఛత ||

21

తస్యాభిప్రాయమాజ్ఞాయ రామో లక్ష్మణమబ్రవీత్ |
వహత్వయమలం తావత్పథాఽనేన తు రాక్షసః ||

22

యథా చేచ్ఛతి సౌమిత్రే తథా వహతు రాక్షసః |
అయమేవ హి నః పంథా యేన యాతి నిశాచరః ||

23

స తు స్వబలవీర్యేణ సముత్క్షిప్య నిశాచరః |
బాలావివ స్కంధగతౌ చకారాతిబలౌ తతః ||

24

తావారోప్య తతః స్కంధం రాఘవౌ రజనీచరః |
విరాధో నినదన్ఘోరం జగామాభిముఖో వనమ్ ||

25

వనం మహామేఘనిభం ప్రవిష్టో
ద్రుమైర్మహద్భిర్వివిధైరుపేతమ్ |
నానావిధైః పక్షిశతైర్విచిత్రం
శివాయుతం వ్యాలమృగైర్వికీర్ణమ్ ||

26

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే తృతీయః సర్గః ||

Aranya Kanda Sarga 3 Meaning In Telugu

తాను రామలక్ష్మణులను వివరాలు అడుగుతుంటే వాళ్లిద్దరూ ఏవేవో మాట్లాడుకోవడం చూచి సహించలేకపోయాడు విరాధుడు.

“నేను మీ ఇద్దరి గురించి అడుగుతుంటే మీలో మీరే ఏం మాట్లాడుకుంటున్నారు. చెప్పండి మీరు ఎవరు? ఈ అరణ్యములకు ఎందుకు వచ్చారు? ఎక్కడికి వెళుతున్నారు?” అని అడిగాడు.

అప్పుడు రాముడు విరాధునితో ఇలా అన్నాడు. “ఓ రాక్షసుడా! మేము క్షత్రియులము. మునులము కాము. నా పేరు రాముడు. ఇతను నా తమ్ముడు లక్ష్మణుడు. ఆమె నా భార్య సీత. కాల వశమున ఈ అరణ్యములో తిరుగుతున్నాము. ఇంతకూ నీవు ఎవరు? ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు?” అని అడిగాడు రాముడు.

“ఓ రామా! నేను రాక్షసుడను. నాపేరు విరాధుడు. నా తండ్రి పేరు జవుడు. నా తల్లి పేరు శతహ్రద. నేను బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసాను. ఆయన వలన ఎవరిచేతా గాయపడకుండా, చావకుండా వరము పొందాను. నాకు ఈమె మీద మోహము కలిగింది. కాబట్టి మీరు ఇద్దరూ ఈమెను నాకు విడిచి పెట్టి ఇక్కడ నుండి పారిపొండి. లేకపోతే మీ ఇద్దరిని చంపి తింటాను. వెంటనే వెళ్లిపొండి.” అనిఅన్నాడు విరాధుడు.

ఆ మాటలకు రామునికి కోపం వచ్చింది. కళ్లు ఎర్రబడ్డాయి. కోపంతో విరాధునితో ఇలా అన్నాడు. “ఓ రాక్షసుడా! నీకు నా చేతిలో చావు మూడింది. అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నిన్ను ప్రాణాలతో వదలను.”అని ధనుస్సు ఎక్కుపెట్టి ఒక బాణాన్ని సంధించి విరాధుని మీదికి వదిలాడు.

వరసగా విరాధుని మీద బాణాలు ప్రయోగించాడు రాముడు. రాముడు వదిలిన బాణాలు విరాధుని శరీరం నిండా గుచ్చుకున్నాయి. విరాధుని శరీరం అంతా రక్తంతో తడిసిపోయింది. ఆ బాణాల బాధకు తట్టుకోలేక విరాధుడు తన తొడమీద ఉన్న సీతను కిందికి దించాడు. శూలాన్ని పట్టుకొని పెద్దగా అరుస్తూ రామలక్ష్మణుల మీదికి దూకాడు.

రామునికి లక్షణుడు కూడా తోడైనాడు. రామలక్ష్మణులు విరాధుని మీద బాణములను వర్షంలా కురిపించారు. ఆ రాక్షసుడు ఒక్కసారి ఆవులించి ఒళ్లు విదిలించగానే అతని శరీరమునకు గుచ్చుకున్న బాణములు అన్నీ జలజలా కింద రాలిపోయాయి. బ్రహ్మ వరప్రభావము వలన రామ లక్ష్మణులు వదిలిన బాణములు విరాధుని ఏమీ చేయలేకపోయాయి.

విరాధుడు మరలా శూలమును పైకెత్తి రామలక్ష్మణుల మీదికి దూకాడు. తన శూలమును రాముని మీదికి విసిరాడు. రాముడు రెండు బాణములతో ఆ శూలమును మధ్యలోనే ఖండించాడు. విరాధుని శూలము రెండు ముక్కలై కిందపడిపోయింది. రామలక్ష్మణులు రెండు కత్తులను తీసుకున్నారు. విరాధునిమీదికి దూకారు. ఆ కత్తులతో విరాధుని బలంగా కొట్టారు. ఇలా కాదని.

విరాధుడు రామలక్ష్మణులను తన చేతుల మధ్య బంధించాలని అనుకొన్నాడు. విరాధుని ఊహను పసికట్టాడు రాముడు. అక్ష్మణునితో ఇలా అన్నాడు.

“లక్షణా! వీడు మన ఇద్దరినీ చేతులతో ఎత్తుకొని మోసుకొని పోవాలని చూస్తున్నాడు. వాడి ఇష్టం వచ్చినట్టు మనలను మోసుకుంటూ పోనిద్దాము. ఎందుకంటే మనం కూడా ఇదే దారిలో వెళ్లాలి కదా!” అని అన్నాడు.

ఇంతలో విరాధుడు రామలక్ష్మణులను తన చేతులతో ఎత్తుకొని తన బుజాల మీద కూర్చోపెట్టుకున్నాడు. అరణ్యంలోకి పరుగెత్తాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అరణ్యకాండ చతుర్థః సర్గః (4) >>

Leave a Comment