Aranya Kanda Sarga 39 In Telugu – అరణ్యకాండ ఏకోనచత్వారింశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ఏకోనచత్వారింశః సర్గ రామాయణంలోని ఒక ముఖ్యమైన అధ్యాయం. ఈ సర్గలో, రాముడు, లక్ష్మణుడు సీతను వెతికేందుకు దండకారణ్యంలోకి వెళ్తారు. ఈ ప్రయాణంలో, వారు శబరి ఆశ్రమానికి చేరుకుంటారు. శబరి రాముడిని ఆత్మీయంగా ఆహ్వానించి, సీతను కనుగొనడానికి మార్గదర్శకత్వం చేస్తుంది. భక్తితో రాముడిని పూజించి, తన నిష్కల్మష భక్తిని వెల్లడిస్తుంది.

సాహాయ్యకానభ్యుపగమః

ఏవమస్మి తదా ముక్తః కథంచిత్తేన సంయుగే |
ఇదానీమపి యద్వృత్తం తచ్ఛృణుష్వ నిరుత్తరమ్ ||

1

రాక్షసాభ్యామహం ద్వాభ్యామనిర్విణ్ణస్తథా కృతః |
సహితో మృగరూపాభ్యాం ప్రవిష్టో దండకావనమ్ ||

2

దీప్తజిహ్వో మహాకాయస్తీక్ష్ణదంష్ట్రో మహాబలః |
వ్యచరం దండకారణ్యం మాంసభక్షో మహామృగః ||

3

అగ్నిహోత్రేషు తీర్థేషు చైత్యవృక్షేషు రావణ |
అత్యంతఘోరో వ్యచరం తాపసాన్ సంప్రధర్షయన్ ||

4

నిహత్య దండకారణ్యే తాపసాన్ ధర్మచరిణః |
రుధిరాణి పిబంతస్తేషాం తథా మాంసాని భక్షయన్ ||

5

ఋషిమాంసాశనః క్రూరస్త్రాసయన్ వనగోచరాన్ |
తథా రుధిరమత్తోఽహం విచరన్ ధర్మదూషకః ||

6

ఆసాదయం తదా రామం తాపసం ధర్మచారిణమ్ |
వైదేహీం చ మహాభాగాం లక్ష్మణం చ మహరథమ్ ||

7

తాపసం నియతాహారం సర్వభూతహితే రతమ్ |
సోఽహం వనగతం రామం పరిభూయ మహాబలమ్ ||

8

తాపసోఽయమితి జ్ఞాత్వా పూర్వవైరమనుస్మరన్ |
అభ్యధావం హి సంక్రుద్ధస్తీక్ష్ణశృంగో మృగాకృతిః ||

9

జిఘాంసురకృతప్రజ్ఞస్తం ప్రహారమనుస్మరన్ |
తేన ముక్తాస్త్రయో బాణాః శితాః శత్రునిబర్హణాః ||

10

వికృష్య బలవచ్చాపం సుపర్ణానిలనిస్వనాః |
తే బాణా వజ్రసంకాశాః సుముక్తా రక్తభోజనాః ||

11

ఆజగ్ముః సహితాః సర్వే త్రయః సన్నతపర్వణః |
పరాక్రమజ్ఞో రామస్య శరో దృష్టభయః పురా ||

12

సముద్భ్రాంతస్తతో ముక్తస్తావుభౌ రాక్షసౌ హతౌ |
శరేణ ముక్తో రామస్య కథంచిత్ప్రాప్య జీవితమ్ ||

13

ఇహ ప్రవ్రాజితో యుక్తస్తాపసోఽహం సమాహితః |
వృక్షే వృక్షే చ పశ్యామి చీరకృష్ణాజినాంబరమ్ ||

14

గృహీతధనుషం రామం పాశహస్తమివాంతకమ్ |
అపి రామసహస్రాణి భీతః పశ్యామి రావణ ||

15

రామభూతమిదం సర్వమరణ్యం ప్రతిభాతి మే |
రామమేవ హి పశ్యామి రహితే రాక్షసాధిప ||

16

దృష్ట్వా స్వప్నగతం రామముద్భ్రమామి విచేతనః |
రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ ||

17

రత్నాని చ రథాశ్చైవ త్రాసం సంజనయంతి మే |
అహం తస్య ప్రభావజ్ఞో న యుద్ధం తేన తే క్షమమ్ ||

18

బలిం వా నముచిం వాఽపి హన్యాద్ధి రఘునందనః |
రణే రామేణ యుద్ధ్యస్వ క్షమాం వా కురు రాక్షస ||

19

న తే రామకథా కార్యా యది మాం ద్రష్టుమిచ్ఛసి |
బహవః సాధవో లోకే యుక్తా ధర్మమనుష్ఠితాః ||

20

పరేషామపరాధేన వినష్టాః సపరిచ్ఛదాః |
సోఽహం తవాపరాధేన వినాశ్యేయం నిశాచర ||

21

కురు యత్తే క్షమం తత్త్వమహం త్వాం నానుయామి హ |
రామశ్చ హి మహాతేజా మహాసత్త్వో మహాబలః ||

22

అపి రాక్షసలోకస్య న భవేదంతకో హి సః |
యది శూర్పణఖాహేతోర్జనస్థానగతః ఖరః ||

23

అతివృత్తో హతః పూర్వం రామేణాక్లిష్టకర్మణా |
అత్ర బ్రూహి యథాతత్త్వం కో రామస్య వ్యతిక్రమః ||

24

ఇదం వచో బంధుహితార్థినా మయా
యథోచ్యమానం యది నాభిపత్స్యసే |
సబాంధవస్త్యక్ష్యసి జీవితం రణే
హతోఽద్య రామేణ శరైరజిహ్మగైః ||

25

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే ఏకోనచత్వారింశస్సర్గః ||

Aranya Kanda Sarga 39 Meaning In Telugu PDF

తాను చేసిన హితోపదేశములు రావణునికి తలకెక్కలేదని గ్రహించాడు మారీచుడు. ఇంకా తన అనుభవాలు చెప్పడం మొదలెట్టాడు.

“ఓ రాక్షసరాజా! రాముని చేతిలో దెబ్బతిన్న నాకు ఇంకా బుద్ధిరాలేదు. నేను మాయారూపములు ధరించడంలో సిద్ధహస్తుణ్ణి. నేను ఒక మృగరూపము ధరించి, ఇంకా ఇద్దరు రాక్షసులను నా వెంట తీసుకొని దండకారణ్యమునకుపోయాను. అప్పుడు నా రూపము మహా భయంకరంగా ఉండేది. పెద్ద దేహము, ఎర్రటి నాలుక, వాడిఅయిన కోరలు, మహాభయంకరాకారముతో దండకారణ్యములో సంచరిస్తూ మునులను, ఋషులను బెదిరిస్తూ వారిని హింసిస్తూ, వారిని చంపి తింటూ ఉండేవాడిని.

ఒకసారి నాకు రాముడు తారసపడ్డాడు. అంతకు ముందు రాముడు నన్ను కొట్టిన దెబ్బ నాకు గుర్తుకు వచ్చింది. రాముడు ఇప్పుడు మునివేషములో ఉన్నాడు. నన్నేమి చెయ్యగలడు అని అనుకొన్నాను. అంతకు ముందు రాముడు నన్ను కొట్టిన దెబ్బకు ప్రతీకారము తీర్చుకోవాలి అనుకున్నాను. వెంటనే మహోగ్రరూపంతో రాముని మీదికి దూకాను.

తన మీదికి దూకుతున్న నన్ను చూచి రాముడు, తన ధనుస్సు నుండి మూడు బాణములు ప్రయోగించాడు. ఆ బాణములు వాయు వేగంతో వచ్చి నాకు తాకాయి. రామ బాణములను చూచి నాకు భయం వేసి పక్కకు తప్పుకున్నాను. కాని నా వెంట ఉన్న ఇద్దరు రాక్షసులు ఆ బాణాలకు బలి అయ్యారు.

మొదటి సారి రాముని చేతిలో దెబ్బ తిన్నాను. రెండవసారి రామ బాణము నుండి తప్పించుకున్నాను. ఇంక మరలా రాముని జోలికి పోదలుచుకోలేదు. అందుకని అప్పటి నుండి ముని వృత్తి అవలంబించి ఇక్క ఆశ్రమము నిర్మిచుకొని సన్యాసిగా జీవించు చున్నాను.

జటాజూటములతో నార చీరలతో ఎవరు కనపడ్డా నాకు రాముడే గుర్తుకువస్తున్నాడు. రాముడు కలలో కనిపించినా భయంతో వణికిపోతున్నాను. అసలు నాకు “ర” అనే అక్షరంలో ప్రారంభం అయ్యే ఏ వస్సువును చూచినా రాముని చూచినట్టే భయం కలుగుతూ ఉంది. నాకు రామ బాణము శక్తి తెలుసు కాబట్టి ఇంతదాకా చెప్పవలసి వచ్చినది. తరువాత నీ ఇష్టం.

నీకు ఇష్టం అయితే రామునితో యుద్ధం చెయ్యి. లేకపోతే మానెయ్యి. కాని నన్ను మాత్రము ఇందులోకి లాగకు. నేను నాలుగు కాలాల పాటు జీవించాలని నీకు ఉంటే, నా ముందు రాముని మాట ఎత్తకు. నీవు చేసే పాపపు పనులకు నన్ను బాధ్యుడిని చేయకు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నేను మాత్రము నీ వెంటరాను. నీకు సాయం చెయ్యను. ఆ రాముడు రాక్షసుల పాలిట మృత్యువు అని నీవు తెలుసుకోలేకపోతున్నావు.

ఓ రావణా! ఇందులో రాముని తప్పు ఏముంది చెప్పు. ఆ శూర్పణఖ మాటలు విని ఖరుడు దూషణుడు రాముని తో యుద్ధానికి పోకపోతే వ్యవహారము ఇంతవరకూ రాదు కదా! 14,000 మంది బలి అయ్యేవారుకాదు కదా! రాముడు తనంత తాను నీ స్థావరమునకు వచ్చి నీతో యుద్ధము చేయలేదుకదా! నీ సోదరులను, సైన్యాది పతులను అపార సేనలను పోగొట్టుకున్నా ఇంకా నీకు బుద్ధిరాలేదా! మిగిలిన బంధువులను, మిత్రులను రామ బాణములకు బలి చేయ దలచుకున్నావా! నా హితోక్తులు విని నీవు రామునితో వైరము మానకపోతే నీకు సర్వనాశనం తప్పదు.” అని అన్నాడు మారీచుడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ముప్పది తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ చత్వారింశః సర్గః (40) >>

Leave a Comment