Aranya Kanda Sarga 40 In Telugu – అరణ్యకాండ చత్వారింశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ చత్వారింశః సర్గ రామాయణంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో రాముడు, లక్ష్మణుడు శబరి ఆశ్రమం నుండి మరింత దూరం ప్రయాణిస్తారు. వారు పంపా సరస్సు వద్ద చేరి హనుమంతుడు, సుగ్రీవుడు వంటి వానరులతో పరిచయం కలుగుతుంది. సుగ్రీవుడు రాముడికి సీత ఆచూకీ తెలిపి, తన సోదరుడు వాలి నుండి సహాయం కోరుతాడు.

మాయామృగరూపపరిగ్రహనిర్బంధః

మారీచేన తు తద్వాక్యం క్షమం యుక్తం నిశాచరః |
ఉక్తో న ప్రతిజగ్రాహ మర్తుకామ ఇవౌషధమ్ ||

1

తం పథ్యహితవక్తారం మారీచం రాక్షసాధిపః |
అబ్రవీత్పరుషం వాక్యమయుక్తం కాలచోదితః ||

2

యత్కిలైతదయుక్తార్థం మారీచ మయి కథ్యతే |
వాక్యం నిష్ఫలమత్యర్థముప్తం బీజమివోషరే ||

3

త్వద్వాక్యైర్న తు మాం శక్యం భేత్తుం రామస్య సంయుగే |
పాపశీలస్య మూర్ఖస్య మానుషస్య విశేషతః ||

4

యస్త్యక్త్వా సుహృదో రాజ్యం మాతరం పితరం తథా |
స్త్రీవాక్యం ప్రాకృతం శ్రుత్వా వనమేకపదే గతః ||

5

అవశ్యం తు మయా తస్య సంయుగే ఖరఘాతినః |
ప్రాణైః ప్రియతరా సీతా హర్తవ్యా తవ సన్నిధౌ ||

6

ఏవం మే నిశ్చితా బుద్ధిర్హృది మారీచ వర్తతే |
న వ్యావర్తయితుం శక్యా సేంద్రైరపి సురాసురైః ||

7

దోషం గుణం వా సంపృష్టస్త్వమేవం వక్తుమర్హసి |
అపాయం వాఽప్యుపాయం వా కార్యస్యాస్య వినిశ్చయే ||

8

సంపృష్టేన తు వక్తవ్యం సచివేన విపశ్చితా |
ఉద్యతాంజలినా రాజ్ఞే య ఇచ్ఛేద్భూతిమాత్మనః ||

9

వాక్యమప్రతికూలం తు మృదుపూర్వం హితం శుభమ్ |
ఉపచారేణ యుక్తం చ వక్తవ్యో వసుధాధిపః ||

10

సావమర్దం తు యద్వాక్యం మారీచ హితముచ్యతే |
నాభినందతి తద్రాజా మానార్హో మానవర్జితమ్ ||

11

పంచ రూపాణి రాజానో ధారయంత్యమితౌజసః |
అగ్నేరింద్రస్య సోమస్య వరుణస్య యమస్య చ ||

12

ఔష్ణ్యం తథా విక్రమం చ సౌమ్యం దండం ప్రసన్నతామ్ |
ధారయంతి మహాత్మానో రాజానః క్షణదాచర ||

13

తస్మాత్సర్వాస్వవస్థాసు మాన్యాః పూజ్యాశ్చ పార్థివాః |
త్వం తు ధర్మమవిజ్ఞాయ కేవలం మోహమాస్థితః ||

14

అభ్యాగతం మాం దౌరాత్మ్యాత్ పరుషం వక్తుమిచ్ఛసి |
గుణదోషౌ న పృచ్ఛామి క్షమం చాత్మని రాక్షస ||

15

మయోక్తం తవ చైతావత్ సంప్రత్యమితవిక్రమ |
అస్మింస్తు త్వం మహాకృత్యే సాహాయ్యం కర్తుమర్హసి ||

16

శృణు తత్కర్మ సాహాయ్యే యత్కార్యం వచనాన్మమ |
సౌవర్ణస్త్వం మృగో భూత్వా చిత్రో రజతబిందుభిః ||

17

ఆశ్రమే తస్య రామస్య సీతాయాః ప్రముఖే చర |
ప్రలోభయిత్వా వైదేహీం యథేష్టం గంతుమర్హసి ||

18

త్వాం తు మాయామృగం దృష్ట్వా కాంచనం జాతవిస్మయా |
ఆనయైనమితి క్షిప్రం రామం వక్ష్యతి మైథిలీ ||

19

అపక్రాంతే చ కాకుత్స్థే దూరం యాత్వాప్యుదాహర |
హా సీతే లక్ష్మణేత్యేవం రామవాక్యానురూపకమ్ ||

20

తచ్ఛ్రుత్వా రామపదవీం సీతాయా చ ప్రచోదితః |
అనుగచ్ఛతి సంభ్రాంతః సౌమిత్రిరపి సౌహృదాత్ ||

21

అపక్రాంతే చ కాకుత్స్థే లక్ష్మణే చ యథాసుఖమ్ |
ఆనయిష్యామి వైదేహీం సహస్రాక్షః శచీమివ ||

22

ఏవం కృత్వా త్విదం కార్యం యథేష్టం గచ్ఛ రాక్షస |
రాజ్యస్యార్ధం ప్రయచ్ఛామి మారీచ తవ సువ్రత ||

23

గచ్ఛ సౌమ్య శివం మార్గం కార్యస్యస్య వివృద్ధయే |
అహం త్వాఽనుగమిష్యామి సరథో దండకావనమ్ ||

24

ప్రాప్య సీతామయుద్ధేన వంచయిత్వా తు రాఘవమ్ |
లంకాం ప్రతి గమిష్యామి కృతకార్యః సహ త్వయా ||

25

న చేత్ కరోషి మారీచ హన్మి త్వామహమద్య వై |
ఏతత్కార్యమవశ్యం మే బలాదపి కరిష్యసి |
రాజ్ఞో హి ప్రతికూలస్థో న జాతు సుఖమేధతే ||

26

ఆసాద్య తం జీవితసంశయస్తే
మృత్యుర్ధ్రువో హ్యద్య మయా విరుద్ధ్య |
ఏతద్యథావత్ప్రతిగృహ్య బుద్ధ్యా
యదత్ర పథ్యం కురు తత్తథా త్వమ్ ||

27

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే చత్వారింశః సర్గః ||

Aranya Kanda Sarga 40 Meaning In Telugu

మారీచుడు సుదీర్ఘంగా చెప్పిన హితోక్తులు రావణునికి రుచించలేదు. చావబోయేవాడికి అమృత తుల్యమైన ఔషధము రుచించనట్టు మారీచుని మాటలు రావణునికి తలకెక్కలేదు. పైగా తన ముందు తన శత్రువు అయిన రాముని మారీచుడు పొగడటం చూచి రావణునికి కోపం వచ్చింది.

“మారీచా! నీవు ఏవేవో వ్యర్ధములైన మాటలు మాట్లాడు తున్నావు. వాటి వల్ల ఏమీ ప్రయోజనము లేదు. నీవు పొగిడిన రాముడు కేవలం ఒక మానవమాత్రుడు. పైగా మూర్ఖుడు. నీ మాటలు విని ఒక మానవునికి భయపడే పిరికిపంద కాడు ఈ రావణుడు. ఒక స్త్రీకోరిన కోరికలు తీర్చడానికి, తల్లితండ్రులను బంధుమిత్రులను విడిచి భార్యతో సహా పారిపోయిన పిరికి పంద ఆ రాముడు.

ఆ రాముడు నా ప్రియాతి ప్రియమైన సోదరుడు ఖరుని చంపాడు. దానికి ప్రతీకారంగా నేను కూడా రాముడు తన ప్రాణంకన్నా మిన్నగా ప్రేమించే అతని భార్యను అపహరిస్తాను. దానికి నీ సాయం కావాలి తప్పదు. నేను ఒక నిర్ణయం తీసుకున్న తరువాత, దేవేంద్రుడు దిగివచ్చినా నా నిర్ణయం మార్చుకోను. నేను నిన్ను సాయం చెయ్యమని అడిగాను అంతే కానీ, నా నిర్ణయం తప్పా ఒప్పా అని నేను నిన్ను అడగలేదు. కాబట్టి నీవు అలా మాట్లాడటం తగదు. అయినా, నీ మాటలు నేను పట్టించుకోనవసరం లేదు.

మంత్రులు రాజు అడిగినప్పుడు మాత్రమే తగిన సమాధానము వినయంగా చేతులు కట్టుకొని మరీ చెప్పాలి. అదీకూడా రాజుకు ఇష్టమైనవి, అంగీకారయోగ్యమైన మాటలు మాత్రమే చెప్పాలి. ఇష్టం వచ్చినట్టు చెప్పకూడదు.

ఓ మారీచా! నీవు చెప్పేది ఎంత హితమైనా, చెప్పేవిధానంలో తిరస్కారధోరణి ఉంటే ఆ హితోక్తులను రాజులు హర్షించరు. నీకు ఆ మాత్రం జ్ఞానం కూడా లేదు. నేను నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వచ్చాను. అటువంటి నాతో ఇంత పరుషంగా మాట్లాడతావా! నేను నిన్ను సాయం చెయ్యమని అడిగాను. నేను చెయ్యబోయే పని మంచిదా చెడ్డదా! నేను చెయ్యగలనా లేదా! నేను సమర్థుడినా కాదా! అని నేను నిన్ను అడగలేదు.

కాబట్టి నేను చెప్పింది విను. ఈ కార్యంలో నీవు నాకు సాయం చేస్తున్నావు. ఇది నా ఆజ్ఞ. నీవు ఏమి చెయ్యాలో చెబుతాను శ్రద్ధగా విను. నీవు మాయారూపములు ధరించుటలో ప్రజ్ఞాశాలివి. అందుకని నీవు ఒక బంగారు వర్ణము కల లేడి రూపము ధరించు. రాముని ఆశ్రమమునకు వెళ్లు. సీత చూచేట్టు ఆ పరిసరములలో సంచరించు. ఆమె నిన్ను చూచి నీ మీద ఆసక్తి పెంచుకుంటుంది. తరువాత నీ ఇష్టం. ఎటైనా పరుగెత్తు.

సీత మృగరూపంలో ఉన్న నిన్ను చూచి “ఆ బంగారు లేడి నాకు కావాలి” అని రాముని అడుగుతుంది. భార్య మాటలు విని రాముడు ధనుర్బాణములు ధరించి నిన్ను పట్టుకోడానికి నీ వెంట వస్తాడు. నీవు పరుగెత్తు. చాలా దూరం పోయిన తరువాత “హా సీతా’ హా లక్షణా” అనిపెద్దగా రాముని గొంతుకతో, రాముడు అరిచినట్టు అరువు. ఆశ్రమంలో ఉన్న లక్ష్మణుడు ఆ అరుపులు వింటాడు. కంగారు పడుతూ రాముని వెదుక్కుంటూ వస్తాడు. రాముడు లక్ష్మణుడు ఆశ్రమంలో లేని సమయంలో నేను ఆశ్రమంలో ప్రవేసించి సీతను బలవంతంగా తీసుకొని వస్తాను. నీవు రామ బాణమునకు అందకుండా పరుగెత్తు. నీ ఇష్టం వచ్చినట్టు వెళ్లిపో. నీవు నాకు ఈ పని చేసి పెడితే, నీకు నా రాజ్యంలో అర్థ రాజ్యం ఇస్తాను.

ఓ మారీచా! వెంటనే బయలుదేరు. నేను నీ వెంటనే నా రథం మీద వస్తాను. నీవు రాముని తీసుకొని అడవులలోకి పరుగెత్తు. నేను సీతను అపహరించి లంకకు తీసుకొని వస్తాను. మనం లంకలో కలుసుకుందాము. నేను చెప్పినట్టు చేయకపోతే నిన్ను ఇప్పుడే ఇక్కడే చంపుతాను. లేకపోతే బలవంతంగా నైనా నీతో ఈ పని చేయిస్తాను. రాజును ఎదిరించి ఎవరూ సుఖంగా బతకలేరు అన్న సత్యాన్ని తెలుసుకో!

మారీచా! ఇంకొక విషయం. నీవు రాముని చేతిలో చావ వచ్చు, చావ కుండా తప్పించుకోనూవచ్చు. కాని నేను చెప్పినట్టు చేయకపోతే నా చేతిలో నీ చావు తప్పదు. కాబట్టి బాగా ఆలోచించుకొని ఏది మంచిదో అది చెయ్యి.” అని తన నిర్ణయాన్ని తెలియజేసాడు రావణుడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము నలుబదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ ఏకచత్వారింశః సర్గః (41) >>

Leave a Comment