Aranya Kanda Sarga 41 In Telugu – అరణ్యకాండ ఏకచత్వారింశః సర్గః

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ఏకచత్వారింశః సర్గ రామాయణంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ సర్గలో రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు మరియు ఇతర వానరులు సీతను వెతికేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో, రాముడు తన సంకేత రింగ్‌ను హనుమంతుడికి ఇస్తాడు, ఇది సీతకు రాముడి గుర్తుగా ఉంటుంది. హనుమంతుడు ఆ రింగ్‌ను తీసుకుని లంకకు ప్రయాణిస్తాడు.

రావణనిందా

ఆజ్ఞప్తోఽరాజవద్వాక్యం ప్రతికూలం నిశాచరః |
అబ్రవీత్ పరుషం వాక్యం మారీచో రాక్షసాధిపమ్ ||

1

కేనాయముపదిష్టస్తే వినాశః పాపకర్మణా |
సపుత్రస్య సరాష్ట్రస్య సామాత్యస్య నిశాచర ||

2

కస్త్వయా సుఖినా రాజన్ నాభినందతి పాపకృత్ |
కేనేదముపదిష్టం తే మృత్యుద్వారముపాయతః ||

3

శత్రవస్తవ సువ్యక్తం హీనవీర్యా నిశాచరాః |
ఇచ్ఛంతి త్వాం వినశ్యంతముపరుద్ధం బలీయసా ||

4

కేనేదముపదిష్టం తే క్షుద్రేణాహితవాదినా |
యస్త్వామిచ్ఛతి నశ్యంతం స్వకృతేన నిశాచర ||

5

వధ్యాః ఖలు న హన్యంతే సచివాస్తవ రావణ |
యే త్వాముత్పథమారూఢం న నిగృహ్ణంతి సర్వశః ||

6

అమాత్యైః కామవృత్తో హి రాజా కాపథమాశ్రితః |
నిగ్రాహ్యః సర్వథా సద్భిర్న నిగ్రాహ్యో నిగృహ్యసే ||

7

ధర్మమర్థం చ కామం చ యశశ్చ జయతాం వర |
స్వామిప్రసాదాత్ సచివాః ప్రాప్నువంతి నిశాచర ||

8

విపర్యయే తు తత్సర్వం వ్యర్థం భవతి రావణ |
వ్యసనం స్వామివైగుణ్యాత్ ప్రాప్నువంతీతరే జనాః ||

9

రాజమూలో హి ధర్మశ్చ జయశ్చ జయతాం వర |
తస్మాత్సర్వాస్వవస్థాసు రక్షితవ్యా నరాధిపాః ||

10

రాజ్యం పాలయితుం శక్యం న తీక్ష్ణేన నిశాచర |
న చాపి ప్రతికూలేన నావినీతేన రాక్షస ||

11

యే తీక్ష్ణమంత్రాః సచివా భజ్యంతే సహ తేన వై |
విషమే తురగాః శీఘ్రా మందసారథయో యథా ||

12

బహవః సాధవో లోకే యుక్తా ధర్మమనుష్ఠితాః |
పరేషామపరాధేన వినష్టాః సపరిచ్ఛదాః ||

13

స్వామినా ప్రతికూలేన ప్రజాస్తీక్ష్ణేన రావణ |
రక్ష్యమాణా న వర్ధంతే మేషా గోమాయునా యథా ||

14

అవశ్యం వినశిష్యంతి సర్వే రావణ రాక్షసాః |
యేషాం త్వం కర్కశో రాజా దుర్బుద్ధిరజితేంద్రియః ||

15

తదిదం కాకతాళీయం ఘోరమాసాదితం మయా |
అత్రైవ శోచనీయస్త్వం ససైన్యో వినశిష్యసి ||

16

మాం నిహత్య తు రామశ్చ న చిరాత్త్వాం వధిష్యతి |
అనేన కృతకృత్యోఽస్మి మ్రియే యదరిణా హతః ||

17

దర్శనాదేవ రామస్య హతం మాముపధారయ |
ఆత్మానం చ హతం విద్ధి హృత్వా సీతాం సబాంధవమ్ ||

18

ఆనయిష్యసి చేత్ సీతామాశ్రమాత్ సహితో మయా |
నైవ త్వమసి నైహం చ నైవ లంకా న రాక్షసాః ||

19

నివార్యమాణస్తు మయా హితైషిణా
న మృష్యసే వాక్యమిదం నిశాచర |
పరేతకల్పా హి గతాయుషో నరా
హితం న గృహ్ణంతి సుహృద్భిరీరితమ్ ||

20

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే ఏకచత్వారింశః సర్గః ||

Aranya Kanda Sarga 41 Meaning In Telugu

రావణుడు చెప్పిన పని చేస్తే రాముడు చంపుతాడు. తను చెప్పిన పని చెయ్యకపోతే రావణుడు చంపుతాడు. ఎవరో ఒకరి చేతిలో తనకు చావు తప్పదు. అందుకని మరలా ఒకసారి రావణునికి చెప్పి చూస్తే మంచిదేమో అనుకున్నాడు మారీచుడు. అయితే ఈ సారి స్వరం మార్చి కొంచెం కటువుగా మాట్లాడాడు.

“ఓ రావణా! నీవు సకుటుంబంగా నశించే ఈ మార్గాన్ని ఎవరు చెప్పారు? వాళ్లు చెప్పినా నీవు ఎలా విన్నావు?నాకు తెలుసు. నీవు సుఖంగా ఉండటం చూచి ఓర్వలేక నీకు గిట్టని వాళ్లు నీకు ఈ దురూపదేశం చేసి ఉంటారు. ఇంతకూ వారు ఎవరో నాకు తెలియాలి. నీ చావు చూడాలని కోరుకొనే నీ శత్రువులు ఎవరో నాకు తెలియాలి.

రాముని శత్రువులు ఎవరో కానీ వాళ్లు రాముని చంపలేక, మహా పరాక్రమ వంతుడైన నీ చేత చంపించాలని చూస్తున్నారు. వారి మాయమాటలకు లోబడి నీవు రామునితో వైరం పెట్టుకుంటున్నావు. నీ సర్వనాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావు. వాళ్లు ఎవరో నాకు చెప్పు. వాళ్లు నీ మంత్రులే అయితే వారిని వెంటనే చంపెయ్యి.

నీవు దారి తప్పి నడిచినా, నిన్ను సక్రమ మార్గంలో పెట్టే వాళ్లే నీ మంత్రులు కానీ నీ చావును కోరే వారు నీకు మంత్రులు, హితులు ఎలా అవుతారు? రాజు చెడ్డ మార్గంలో పోతుంటే, మంత్రులు రాజుకు హితం చెప్పి, మంచి మార్గంలో నడిచేట్టు చెయ్యాలి. అటువంటి మంత్రులు నీ వద్ద లేరనుకుంటాను!

(మారీచుడు చెప్పిన ఈ మాటలు నేటికి కూడా వర్తిస్తాయి. ముఖ్యమంత్రి చెడు నిర్ణయాలు తీసుకుంటుంటే కాబినెట్ మంత్రులు అడ్డుకోవాలి. ముఖ్యమంత్రిని సక్రమమైన మార్గంలో నడిపించాలి. ముఖ్యమంత్రి, మంత్రులు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటే సెక్రటరీలు (ఐ.ఏ.యస్ ఆఫీసర్లు) వారికి మార్గనిర్దేశం చెయ్యాలి. వారి తప్పుడు నిర్ణయాలను అడ్డుకోవాలి. ప్రజాక్షేమాన్ని కాపాడాలి. కానీ ఈ నాడు జరుగుతున్నదేమిటి. ముఖ్యమంత్రికి కాబినెట్ మంత్రులు తాన అంటే తందానా అంటున్నారు. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతున్నారు. లేకపోతే వారి మంత్రి పదవులు పోతాయని భయం.

అలాగే సెక్రటరీలు మంత్రులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాలు తప్పని తేలితే మాదేం లేదు అంతా మంత్రులు చెప్పినట్టే చేసాము అని సమర్ధించు కుంటున్నారు. మంత్రులు చెప్పింది చెయ్యడానికి ఐ.ఏ.యస్ లు ఎందుకు. గుమాస్తాలు చాలు కదా. పాలకులను సక్రమమార్గంలో నడిపించడమే కార్యదర్శుల పని. ఈ విషయాన్నే నాడు మారీచుడు రావణునికి స్పష్టంగా చెప్పాడు.)

రాజు మంచి వాడైతే మంత్రులకు కూడా మంచి పేరు వస్తుంది. రాజు చెడ్డ వాడైతే మంత్రులు రాజును సరిదిద్దాలి లేకపోతే ప్రజలకు నష్టం జరుగుతుంది. రాజ్యానికి మూలం రాజు. అటువంటి రాజును మంచి మార్గంలో నడిపించి, రాజును రక్షించుకోవడం మంత్రులవిధి. ప్రజావ్యతిరేకుడైన రాజు, ప్రజలను పీడించేరాజు ప్రజాభిమానము చూరగొనలేడు. అటువంటి రాజుకు రాజ్యమును పాలించే అర్హత లేదు.

రాజు మంచి వాడైనా, మంత్రులు చెడ్డ వారైతే, మంత్రుల చెడు సలహాల ఫలితంగా, రాజు కూడా వారితో పాటు నశించి పోతాడు. ప్రజాక్షేమాన్ని మరిచిన రాజు పాలనలో ప్రజలు అష్టకష్టాల పాలవుతారు. ఇప్పుడు నీవు తీసుకునే ఈ నిర్ణయంతో నీతోపాటు అమాయకులైన నీ ప్రజలు కూడా నశించిపోతారు.

ఓ రావణా! నాకు ఎటూ చావు తప్పదు. అది నాకు తెలుసు. నా బాధ అంతా నీ గురించే. పోతే నేను ఒక్కడినే పోతాను. కానీ నీవు, నీ ప్రజలు, సైన్యంతో సహా నశించిపోతావు. నీవు చెప్పిన పని నేను చేస్తాను. రాముడి చేతిలో చస్తాను. కాని నేను చచ్చిన కొద్ది కాలంలో నువ్వు కూడా నా మార్గాన్నే అనుసరిస్తావు.

నీవు నాకు ఇస్తానన్న రాజ్యాన్ని ఆశించి నేను ఈ పని చేయడం లేదు. రాముని చూడగానే నాకు చావు తప్పదు అని నాకు తెలుసు. కాని సీతను అపహరించిన తరువాత, లంకను పాలించ డానికి నీవు ఉండవు అని తెలుసుకో!

కాబట్టి ఓ రావణా! ఇదే మన ఆఖరు సమావేశము. నేను నీతో వచ్చి రాముని దూరంగా తీసుకొని వెళ్లగానే నేను చస్తాను. సీతను అపహరించగానే నీవు చస్తావు. అప్పుడు ఈ లంకా ఉండదు. ఈ రాక్షసులూ ఉండరు.

నేను ఏమి చెప్పినా నీవు వినవు అని నాకు తెలుసు. కానీ చెప్పడం నా ధర్మం కనుక చెప్పాను. తరువాత నీ ఇష్టం. ఇంక పోదాం పద.” అని అన్నాడు మారీచుడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము నలుబది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ ద్విచత్వారింశః సర్గః (42) >>

Leave a Comment