మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ ఏకపంచాశః సర్గం రామాయణంలో ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ సర్గలో రాముడు శబరిని కలుస్తాడు, ఆమె భక్తి పట్ల ఆకర్షితుడవుతాడు. శబరి రాముడి రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటుంది. రాముడు ఆమెకు ఆశీర్వాదాలు ఇవ్వడం, హనుమంతుడు సీతా అన్వేషణకు బయలుదేరిన విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది.
జటాయూరావణయుద్ధమ్
ఇత్యుక్తస్య యథాన్యాయం రావణస్య జటాయుషా |
క్రుద్ధస్యాగ్నినిభాః సర్వా రేజుర్వింశతిదృష్టయః ||
1
సంరక్తనయనః కోపాత్తప్తకాంచనకుండలః |
రాక్షసేంద్రోఽభిదుద్రావ పతగేంద్రమమర్షణః ||
2
స సంప్రహారస్తుములస్తయోస్తస్మిన్ మహావనే |
బభూవ వాతోద్ధతయోర్మేఘయోర్గగనే యథా ||
3
తద్బభూవాద్భుతం యుద్ధం గృధ్రరాక్షసయోస్తదా |
సపక్షయోర్మాల్యవతోర్మహాపర్వతయోరివ ||
4
తతో నాలీకనారాచైస్తీక్ష్ణాగ్రైశ్చ వికర్ణిభిః |
అభ్యవర్షన్మహాఘోరైర్గృధ్రరాజం మహాబలః ||
5
స తాని శరజాలాని గృధ్రః పత్రరథేశ్వరః |
జటాయుః ప్రతిజగ్రాహ రావణాస్త్రాణి సంయుగే ||
6
తస్య తీక్ష్ణనఖాభ్యాం తు చరణాభ్యాం మహాబలః |
చకార బహుధా గాత్రే వ్రణాన్ పతగసత్తమః ||
7
అథ క్రోధాద్దశగ్రీవో జగ్రాహ దశ మార్గణాన్ |
మృత్యుదండనిభాన్ ఘోరాన్ శత్రుమర్దనకాంక్షయా ||
8
స తైర్బాణైర్మహావీర్యః పూర్ణముక్తైరజిహ్మగైః |
బిభేద నిశితైస్తీక్ష్ణైర్గృధ్రం ఘోరైః శిలీముఖైః ||
9
స రాక్షసరథే పశ్యన్ జానకీం బాష్పలోచనామ్ |
అచింతయిత్వా తాన్ బాణాన్ రాక్షసం సమభిద్రవత్ ||
10
తతోఽస్య సశరం చాపం ముక్తామణివిభూషితమ్ |
చరణాభ్యాం మహాతేజా బభంజ పతగేశ్వరః ||
11
తతోఽన్యద్ధనురాదాయ రావణః క్రోధమూర్ఛితః |
వవర్ష శరవర్షాణి శతశోఽథ సహస్రశః ||
12
శరైరావారితస్తస్య సంయుగే పతగేశ్వరః |
కులాయముపసంప్రాప్తః పక్షీవ ప్రబభౌ తదా ||
13
స తాని శరవర్షాణి పక్షాభ్యాం చ విధూయ చ |
చరణాభ్యాం మహాతేజా బభంజాస్య మహద్ధనుః ||
14
తచ్చాగ్నిసదృశం దీప్తం రావణస్య శరావరమ్ |
పక్షాభ్యాం స మహావీర్యో వ్యాధునోత్పతగేశ్వరః ||
15
కాంచనోరశ్ఛదాన్ దివ్యాన్ పిశాచవదనాన్ ఖరాన్ |
తాంశ్చాస్య జవసంపన్నాన్ జఘాన సమరే బలీ ||
16
వరం త్రివేణుసంపన్నం కామగం పావకార్చిషమ్ |
మణిహేమవిచిత్రాంగం బభంజ చ మహారథమ్ ||
17
పూర్ణచంద్రప్రతీకాశం ఛత్రం చ వ్యజనైః సహ |
పాతయామాస వేగేన గ్రాహిభీ రాక్షసైః సహ ||
18
సారథేశ్చాస్య వేగేన తుండేనైవ మహచ్ఛిరః |
పునర్వ్యపాహరచ్ఛ్రీమాన్ పక్షిరాజో మహాబలః ||
19
స భగ్నధన్వా విరథో హతాశ్వో హతసారథిః |
అంకేనాదాయ వైదేహీం పపాత భువి రావణః ||
20
దృష్ట్వా నిపతితం భూమౌ రావణం భగ్నవాహనమ్ |
సాధు సాధ్వితి భూతాని గృధ్రరాజమపూజయన్ ||
21
పరిశ్రాంతం తు తం దృష్ట్వా జరయా పక్షియూథపమ్ |
ఉత్పపాత పునర్హృష్టో మైథిలీం గృహ్య రావణః ||
22
తం ప్రహృష్టం నిధాయాంకే గచ్ఛంతం జనకాత్మజామ్ |
గృధ్రరాజః సముత్పత్య సమభిద్రుత్య రావణమ్ ||
23
సమావార్య మహాతేజా జటాయురిదమబ్రవీత్ |
వజ్రసంస్పర్శబాణస్య భార్యాం రామస్య రావణ ||
24
అల్పబుద్ధే హరస్యేనాం వధాయ ఖలు రక్షసామ్ |
సమిత్రబంధుః సామాత్యః సబలః సపరిచ్ఛదః ||
25
విషపానం పిబస్యేతత్పిపాసిత ఇవోదకమ్ |
అనుబంధమజానంతః కర్మణామవిచక్షణాః ||
26
శీఘ్రమేవ వినశ్యంతి యథా త్వం వినశిష్యసి |
బద్ధస్త్వం కాలపాశేన క్వ గతస్తస్య మోక్ష్యసే ||
27
వధాయ బడిశం గృహ్య సామిషం జలజో యథా |
న హి జాతు దురాధర్షో కాకుత్స్థౌ తవ రావణ ||
28
ధర్షణం చాశ్రమస్యాస్య క్షమిష్యేతే తు రాఘవౌ |
యథా త్వయా కృతం కర్మ భీరుణా లోకగర్హితమ్ ||
29
తస్కరాచరితో మార్గో నైష వీరనిషేవితః |
యుద్ధ్యస్వ యది శూరోఽసి ముహూర్తం తిష్ఠ రావణ ||
30
శయిష్యసే హతో భూమౌ యథా భ్రాతా ఖరస్తథా |
పరేతకాలే పురుషో యత్కర్మ ప్రతిపద్యతే ||
31
వినాశాయాత్మనోఽధర్మ్యం ప్రతిపన్నోఽసి కర్మ తత్ |
పాపానుబంధో వై యస్య కర్మణః కర్మ కో ను తత్ ||
32
కుర్వీత లోకాధిపతిః స్వయంభూర్భగవానపి |
ఏవముక్త్వా శుభం వాక్యం జటాయుస్తస్య రక్షసః ||
33
నిపపాత భృశం పృష్ఠే దశగ్రీవస్య వీర్యవాన్ |
తం గృహీత్వా నఖైస్తీక్ష్ణైర్విరరాద సమంతతః ||
34
అధిరూఢో గజారోహో యథా స్యాద్దుష్టవారణమ్ |
విరరాద నఖైరస్య తుండం పృష్ఠే సమర్పయన్ ||
35
కేశాంశ్చోత్పాటయామాస నఖపక్షముఖాయుధః |
స తథా గృధ్రరాజేన క్లిశ్యమానో ముహుర్ముహుః ||
36
అమర్షస్ఫురితోష్ఠః సన్ ప్రాకంపత స రావణః |
స పరిష్వజ్య వైదేహీం వామేనాంకేన రావణః ||
37
తలేనాభిజఘానాశు జటాయుం క్రోధమూర్ఛితః |
జటాయుస్తమభిక్రమ్య తుండేనాస్య ఖగాధిపః ||
38
వామబాహూన్ దశ తదా వ్యపాహరదరిందమః |
సంఛిన్నబాహోః సద్యైవ బాహవః సహసాఽభవన్ ||
39
విషజ్వాలావలీయుక్తా వల్మీకాదివ పన్నగాః |
తతః క్రోధాద్దశగ్రీవః సీతాముత్సృజ్య రావణః ||
40
ముష్టిభ్యాం చరణాభ్యాం చ గృధ్రరాజమపోథయత్ |
తతో ముహూర్తం సంగ్రామో బభూవాతులవీర్యయోః ||
41
రాక్షసానాం చ ముఖ్యస్య పక్షిణాం ప్రవరస్య చ |
తస్య వ్యాయచ్ఛమానస్య రామస్యార్థే స రావణః ||
42
పక్షౌ పార్శ్వౌ చ పాదౌ చ ఖడ్గముద్ధృత్య సోఽచ్ఛినత్ |
స చ్ఛిన్నపక్షః సహసా రక్షసా రౌద్రకర్మణా |
నిపపాత హతో గృధ్రో ధరణ్యామల్పజీవితః ||
43
తం దృష్ట్వా పతితం భూమౌ క్షతజార్ద్రం జటాయుషమ్ |
అభ్యధావత వైదహీ స్వబంధుమివ దుఃఖితా ||
44
తం నీలజీమూతనికాశకల్పం
సుపాండురోరస్కముదారవీర్యమ్ |
దదర్శ లంకాధిపతిః పృథివ్యాం
జటాయుషం శాంతమివాగ్నిదావమ్ ||
45
తతస్తు తం పత్రరథం మహీతలే
నిపాతితం రావణవేగమర్దితమ్ |
పునః పరిష్వజ్య శశిప్రభాననా
రురోద సీతా జనకాత్మజా తదా ||
46
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే ఏకపంచాశః సర్గః ||
Aranya Kanda Sarga 51 Meaning In Telugu PDF
జటాయువు పలికిన పలుకులను చాలా తేలిగ్గా తీసుకున్నాడు రావణుడు. రావణుని దృష్టిలో జటాయువు ఒక సామాన్య పక్షి. అందువల్ల జటాయువు మాటలను లెక్కచేయలేదు. జటాయువు మాటలకు బదులు కూడా పలకలేదు. కానీ ఒక పక్షి తనను అంతలేసి మాటలు అంటుదా. తనకే నీతులు చెబుతుందా అని కోపం ముంచుకొచ్చింది. ఒక్క ఉదుటున జటాయువు మీదికి ఎగిరాడు.
రావణునికి జటాయువుకు ఘోరయుద్ధం జరిగింది. రెండు పర్వతములు ఢీకొన్నట్టు ఉంది. రావణుడు జటాయువు మీద నారాచముల వర్షం కురిపించాడు. జటాయువు ఆ బాణములను తనరెక్కలతో చెల్లాచెదరు చేసింది. వాడి అయిన తన గోళ్లతో ముక్కుతో రావణుని మొహం, శరీరం అంతా రక్కింది. రావణుడు పదిబాణములను జటాయువు మీద ప్రయోగించాడు.
జటాయువుకు రావణుని రథంలో కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ ఉన్న సీత కనపడింది. ఆమె బాధ చూచి జటాయువు రావణుడు ప్రయోగించిన బాణములను లెక్కచేయలేదు. రాముని ధనుస్సును అతని చేతిలోనుండి ఎగురగొట్టాడు. బాణములను విరిచాడు. రావణుడికి కోపం ముంచుకొచ్చింది. మరొక ధనుస్సు తీసుకున్నాడు. వేలకొలది బాణములను జటాయువు మీద ప్రయోగించాడు. రావణుడు వదిలిన బాణములు జటాయువును కప్పివేసాయి.
జటాయువు ఆకాశంలో ఎగురుతూ ఆబాణములను తనరెక్కలతో చెదరగొట్టింది. మరలా రావణుని ధనుస్సును తన కాళ్లతో విరిచింది. రావణుని కవచమును తన ముక్కుతో చీల్చింది. తన రెక్కలతో ఆ కవచమును ఊడగొట్టింది. తరువాత జటాయువు రావణుని రథమునకు కట్టిన గాడిదలను చంపింది. రావణుని రథమును విరుగగొట్టింది. రావణుని రథానికి కట్టిన పతాకమును విరిచింది. రావణుని తలమీద తన కాళ్లతో తన్నుతూ ఉంది. ముక్కుతో పొడుస్తూ ఉంది.
రావణుడు సీతను పొదివి పట్టుకొని నేలమీదికి దూకాడు. అప్పటికి జటాయువు అలసినట్టు కనపడ్డాడు. రావణుడు సీతను పట్టుకొని మరలా ఆకాశంలోకి ఎగిరాడు. లంక వైపుగా పోసాగాడు. జటాయువు కూడా రావణుని తో పాటు పైకి ఎగిరాడు. రావణునికి అడ్డంగా నిలిచాడు. రావణుని తో ఇలా అన్నాడు.
“రావణా! ఇంకా నీకు బుద్ధిరాలేదా! నీవు సీతను అపహ రించడం నీ వినాశనానికి దారి తీస్తుంది. నువ్వే కాదు రాక్షస వంశము మొత్తం నాశనం అవుతుంది. సీతను అపహరించడం అంటే విషం కలిపిన నీరు తాగడం వంటిది అని తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు బుద్ధిలేకుండా ప్రవర్తిస్తూ నీ నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావు. నీ కంఠం చుట్టు యమపాశము బిగుసుకుంటూ ఉంది. నీవు దానిని తప్పించుకోలేవు. రామలక్ష్మణులు నిన్ను ఎన్నటికీ క్షమించరు. అయినా రావణా! చేతనైతే రామలక్ష్మణులతో వీరోచితంగా పోరాడు. వారిని ఓడించి సీతను తీసుకుపో. అంతే గానీ వారు ఆశ్రమంలో లేని సమయంలో, దొంగమాదిరి సీతను అపహరించడం వీరత్వం అనిపించుకోదు. నీవంటి వీరుడు చేయదగ్గ పనికాదు. చావు దగ్గర పడ్డవాడే ఇటువంటి పనిచేస్తాడు. చెడ్డ ఫలితములను ఇచ్చు కర్మలను నీవు వరాలిచ్చిన బ్రహ్మ కూడా చేయడే. నీవు ఎందుకు చేస్తున్నావు?” అని రావణునికి హితోక్తులు చెప్పాడు.
కాని రావణునిలో ఏమాత్రం మార్పు రాలేదు. అందుకని జటాయువు మరలా రావణుని వీపు మీద వాలి రావణుని గోళ్లతో చీల్చాడు. అతడి జుట్టు పీకాడు. ముక్కుతో రక్కాడు. రావణుడు తప్పించుకోలేకపోతున్నాడు. కోపంతో ఊగిపోతున్నాడు. ఒక చేత్తో సీతను చంకలో ఇరికించుకున్నాడు. రెండో చేత్తో జటాయువు వీపు మీద బాదాడు. జటాయువు పైకి ఎగిరి రావణుని పది బుజములను చీల్చింది. రావణుని బుజాలు విరిగి కిందపడ్డాయి. విచిత్రంగా రావణునికి కొత్తగా బుజాలు మొలిచాయి.
అప్పుడు రావణుడు సీతను కింద దింపాడు. జటాయువును రెండు చేతులతో కొట్టాడు. జటాయువుకు, రావణునికి కొంచెంసేపు ముష్టియుద్ధం జరిగింది. రావణుడు కిందపడి ఉన్న ఖడ్గమును తీసుకొన్నాడు. తన మీదికి వస్తున్న జటాయువు రెక్కలను నరికాడు. పక్షికి రెక్కలే ఆయుధములు. ఆ రెక్కలు విరగగానే జటాయువు నేలకూలాడు.
నేల మీద పడిన జటాయువును చూచి సీత బిగ్గరగా రోదించింది. ఆఖరి ఆశకూడా అలా నేలకూలినందుకు సీతకు దుఃఖము ఆగలేదు. గబా గబా జటాయువు వద్దకు పరుగెత్తింది. జటాయువు మీద పడి ఏడిచింది సీత,
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఏబది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
అరణ్యకాండ ద్విపంచాశః సర్గః (52) >>