Ayodhya Kanda Sarga 59 In Telugu – అయోధ్యాకాండ ఏకోనషష్ఠితమః సర్గః

అయోధ్యాకాండ ఏకోనషష్ఠితమః సర్గలో, భరతుడు రాముని వనవాసం ముగించి తిరిగి రప్పించడానికి పతినిశ్చయంతో చిత్త పెట్టి, అయోధ్య నుండి చిత్తర్కూటం బయలుదేరి వెళతాడు. తనతో పాటు మంత్రి, సైనికులు, శ్రేయోభిలాషులు కూడా ఉంటారు. ఈ ప్రయాణంలో భరతుడు రాముని నిరాకరణ భయంతో, అనేక ఆలోచనలతో కృంగిపోతాడు. మార్గమధ్యంలో గంగానదిని చేరుకుని, తన ప్రయాణం సాఫల్యం కోసం ప్రార్థిస్తాడు. ఈ సర్గలో భరతుడి రాముని పట్ల ప్రేమ, ఆత్మీయత, ఆతని పట్టుదలతో రాముని తిరిగి తీసుకురావాలని ప్రదర్శించబడతాయి. భరతుడి కర్తవ్యనిష్ఠ, తమ్ముడిపై ఉన్న భావోద్వేగాలు స్పష్టంగా ప్రతిఫలిస్తాయి.

దశరథవిలాపః

మమ త్వశ్వా నివృత్తస్య న ప్రావర్తంత వర్త్మని |
ఉష్ణమశ్రు విముంచంతః రామే సంప్రస్థితే వనమ్ || ౧ ||

ఉభాభ్యాం రాజ పుత్రాభ్యామథ కృత్వాఽహమంజలిమ్ |
ప్రస్థితః రథమాస్థాయ తద్దుఃఖమపి ధారయన్ || ౨ ||

గుహేన సార్ధం తత్రైవ స్థితోఽస్మి దివసాన్ బహూన్ |
ఆశయా యది మాం రామః పునః శబ్దాపయేదితి || ౩ ||

విషయే తే మహారాజ రామవ్యసనకర్శితాః |
అపి వృక్షాః పరిమ్లానః సపుష్పాంకుర కోరకాః || ౪ ||

ఉపతప్తోదకా నద్యః పల్వలాని సరాంసి చ |
పరిశుష్కుపలాశాని వనాన్యుపవనాని చ || ౫ ||

న చ సర్పంతి సత్త్వాని వ్యాలా న ప్రసరంతి చ |
రామ శోకాభిభూతం తన్నిష్కూజమభవద్వనమ్ || ౬ ||

లీన పుష్కరపత్రాశ్చ నరేంద్ర కలుషోదకాః |
సంతప్త పద్మాః పద్మిన్యో లీనమీనవిహంగమాః || ౭ ||

జలజాని చ పుష్పాణి మాల్యాని స్థలజాని చ |
నాద్య భాంత్యల్పగంధీని ఫలాని చ యథాపురమ్ || ౮ ||

అత్రోద్యానాని శూన్యాని ప్రలీనవిహగాని చ |
న చాభిరామానారామాన్ పశ్యామి మనుజర్షభ || ౯ ||

ప్రవిశంతమయోధ్యాం మాం న కశ్చిదభినందతి |
నరా రామమపశ్యంతర్నిశ్వసంతి ముహుర్ముహుః || ౧౦ ||

దేవ రాజరథం దృష్ట్వా వినా రామమిహాగతమ్ |
దుఃఖాదశ్రుముఖః సర్వో రాజమార్గగతో జనః || ౧౧ ||

హర్మ్యైః విమానైః ప్రాసాదైః అవేక్ష్య రథమాగతమ్ |
హాహాకారకృతా నార్యో రామాదర్శన కర్శితాః || ౧౨ ||

ఆయతైః విమలైర్నేత్రైః అశ్రువేగపరిప్లుతైః |
అన్యోన్యమభివీక్షంతే వ్యక్తమార్తతరాః స్త్రియః || ౧౩ ||

నామిత్రాణాం న మిత్రాణాముదాసీన జనస్య చ |
అహమార్తతయా కంచిత్ విశేషముపలక్షయే || ౧౪ ||

అప్రహృష్ట మనుష్యా చ దీననాగతురంగమా |
ఆర్తస్వరపరిమ్లానా వినిశ్వసితనిస్వనా || ౧౫ ||

నిరానందా మహారాజ రామ ప్రవ్రాజనాతురా |
కౌసల్యా పుత్రహీనేవ అయోధ్యా ప్రతిభాతి మా || ౧౬ ||

సూతస్య వచనం శ్రుత్వా వాచా పరమదీనయా |
బాష్పోపహతయా రాజా తం సూతమిదమబ్రవీత్ || ౧౭ ||

కైకేయ్యా వినియుక్తేన పాపాభిజన భావయా |
మయా న మంత్రకుశలైః వృద్ధైః సహ సమర్థితమ్ || ౧౮ ||

న సుహృద్భిర్న చామాత్యైః మంత్రయిత్వా చ నైగమైః |
మయాఽయమర్థః సమ్మోహాత్ స్త్రీ హేతోః సహసా కృతః || ౧౯ ||

భవితవ్యతయా నూనమిదం వా వ్యసనం మహత్ |
కులస్యాస్య వినాశాయ ప్రాప్తం సూత యదృచ్ఛయా || ౨౦ ||

సూత యద్యస్తి తే కించిత్ మయా తు సుకృతం కృతమ్ |
త్వం ప్రాపయాశు మాం రామం ప్రాణాః సంత్వరయంతి మామ్ || ౨౧ ||

యద్యద్యాపి మమైవాజ్ఞా నివర్తయతు రాఘవమ్ |
న శక్ష్యామి వినా రామం ముహూర్తమపి జీవితుమ్ || ౨౨ ||

అథవాఽపి మహాబాహుర్గతో దూరం భవిష్యతి |
మామేవ రథమారోప్య శీఘ్రం రామాయ దర్శయ || ౨౩ ||

వృత్తదంష్ట్రో మహేష్వాసః క్వాసౌ లక్ష్మణపూర్వజః |
యది జీవామి సాధ్వేనం పశ్యేయం సీతయా సహ || ౨౪ ||

లోహితాక్షం మహాబాహుమాముక్త మణికుండలమ్ |
రామం యది న పశ్యాయం గమిష్యామి యమ క్షయమ్ || ౨౫ ||

అతో ను కిం దుఃఖతరం యోఽహమిక్ష్వాకునందనమ్ |
ఇమామవస్థామాపన్నో నేహ పశ్యామి రాఘవమ్ || ౨౬ ||

హా రామ రామానుజ హా హా వైదేహి తపస్వినీ |
న మాం జానీత దుఃఖేన మ్రియమాణమనాథవత్ || ౨౭ ||

స తేన రాజా దుఃఖేన భృశమర్పితచేతనః |
అవగాఢః సుదుష్పారం శోకసాగమబ్రవీత్ || ౨౮ ||

రామశోకమహాభోగః సీతావిరహపారగః |
శ్వసితోర్మిమహావర్తో బాష్పఫేనజలావిలః || ౨౯ ||

బాహువిక్షేపమీనౌఘో విక్రందితమహాస్వనః |
ప్రకీర్ణకేశశైవాలః కైకేయీవడవాముఖః || ౩౦ ||

మమాశ్రువేగప్రభవః కుబ్జావాక్యమహాగ్రహః |
వరవేలో నృశంసాయాః రామప్రవ్రాజనాయతః || ౩౧ ||

యస్మిన్ బత నిమగ్నోఽహం కౌసల్యే రాఘవం వినా |
దుస్తరః జీవతా దేవి మయాఽయం శోకసాగరః || ౩౨ ||

అశోభనం యోఽహమిహాద్య రాఘవమ్
దిదృక్షమాణో న లభే సలక్ష్మణమ్-
-ఇతీవ రాజా విలపన్ మహాయశః
పపాత తూర్ణం శయనే స మూర్చితః || ౩౩ ||

ఇతి విలపతి పార్థివే ప్రణష్టే
కరుణతరం ద్విగుణం చ రామహేతోః |
వచనమనునిశమ్య తస్య దేవీ
భయమగమత్ పునరేవ రామమాతా || ౩౪ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకోనషష్ఠితమః సర్గః || ౫౯ ||

Ayodhya Kanda Sarga 59 Meaning In Telugu

సుమంత్రుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు దశరథుడు. “సుమంత్రా! ఇంతేనా! వారు ఇంక ఏమీ అనలేదా! పోనీలే. తరువాత ఏమి జరిగిందీ వివరంగాచెప్పు.” అని అడిగాడు. సుమంత్రుడు తరువాత జరిగిన విషయాలు ఇలా చెప్పసాగాడు.

“మహారాజా! రామలక్ష్మణులు తమ వెంట్రుకలకు మర్రిపాలు పూసుకొని జడలు కట్టుకున్నారు. వారు గంగానదిని దాటి ప్రయాగ క్షేత్రము వైపు వెళ్లారు. లక్ష్మణుడు ముందు నడుస్తుంటే, సీతమధ్య నడుస్తుంటే, రాముడు వెనక నడుస్తూ వారు వెళ్లిపోయారు. నేను వారు వెళ్లిన వంక చూస్తూ వారు కనుమరుగు కాగానే వెనుకకు తిరిగి వచ్చాను.

రాముడు తన మనసు మార్చుకొని వెనకుకు వస్తాడేమో అని మూడురోజులు గుహుడు ఉన్నచోట ఉండి పోయాను. కాని రాముడు తిరిగిరాలేదు. ఇంక చేసేది లేక వెనకకు తిరిగివచ్చాను. దారిలో ఉన్న ఉద్యానవనములు కూడా రాముని వియోగమునకు శోకిస్తున్నాయా అన్నట్టు వాడిపోయి ఉన్నాయి.

నేను అయోధ్యలో ప్రవేశించగానే రామునికోసరం అయోధ్యా ప్రజలు విడిచే నిట్టూర్పులు వినబడ్డాయి. రాజవీధులు నిర్మానుష్యంగా ఉన్నాయి. మేడమీద నిలబడి ఉన్న స్త్రీలు, నేను రాముని లేని రథమును తీసుకొని రావడం చూచి రోదించడం స్వయంగా చూచాను. రామునికి శత్రువులు కూడా రాముని వంటి శత్రువు మనకు దొరకడని దు:ఖించడం చూచాను.” అని అన్నాడు సుమంత్రుడు.

ఆమాటలు విన్న దశరథుడు సుమంత్రునితో ఇలాఅన్నాడు. “సుమంత్రా! నిజమేనయ్యా. కైక వరములు కోరినదే తడవుగా నేను ఎవరినీ సంప్రదించకుండా ఆ వరాలు ఇవ్వడం వలన ఎంతటి తీవ్రపరిణామాలు వస్తాయో ఊహించకుండా, ఆ వరాలు ఇచ్చేసాను. ఇది నేను చేసినఘోరమైన తప్పు. నేను వృద్ధులైన వారితో ఆలోచించి నిర్ణయం తీసుకొని ఉండాల్సింది. నా తొందరపాటుకు ఫలితం అనుభవిస్తున్నాను. నేను కాదు అయోధ్య అంతా అనుభవిస్తూ ఉంది. దీని కంతటికీ కారణము నా కాముకత్వము. అదే నా వంశనాశనానికి కారణమయింది.

సుమంత్రా! నాకు ఒక సాయం చెయ్యి. నన్ను రాముని వద్దకు తీసుకొని వెళ్లు. లేకపోతే నీవు అన్నా వెళ్లి రాముని వెనకకు తీసుకొని రా. నా ఆజ్ఞను రాముడు పాలించనవసరం లేదని చెప్పి తీసుకొని రా. నీ మాట వినడు అనుకుంటే నాకు దారి చూపించు. నేనే వెళతాను. నేను వెంటనే నా రాముని చూడాలి. లేకపోతే నా దేహంలో ప్రాణములు నిలవడం కష్టం. ఇలాగే ఇక్కడే ఉంటే నేను మరణించడం తథ్యం. నేను అనాధగా మరణించాను అన్న విషయం నా రామునికి ఎలా తెలుస్తుంది? ఎవరు చెబుతారు. ఏమో ఏమవుతుందో!” అంటూ బిగ్గరగా ఏడుస్తూ ఆసనం మీద పడిపోయాడు దశరథుడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఏబదితొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

అయోధ్యాకాండ షష్ఠితమః సర్గః (60) >>

Leave a Comment