మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ షట్పంచాశః సర్గః (56వ సర్గ), సీతను రక్షించేందుకు రాముడు పంచవటిని చుట్టుముట్టి అన్వేషిస్తాడు, అనేక రాక్షసులను ఎదుర్కొంటాడు. సీతను కనుగొనలేక, రాముడు లక్ష్మణుడితో కలిసి మరింత విస్తృతంగా వెతుకుతాడు. ఈ సమయంలో, రాముడు సీత కోసం విచారంగా పాటలు పాడుతాడు. సీత కోసం తన ప్రాణాలను అర్పిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు.
వత్సరావధికరణమ్
సా తథోక్తా తు వైదేహీ నిర్భయా శోకకర్శితా |
తృణమంతరతః కృత్వా రావణం ప్రత్యభాషత ||
1
రాజా దశరథో నామ ధర్మసేతురివాచలః |
సత్యసంధః పరిజ్ఞాతో యస్య పుత్రః స రాఘవః ||
2
రామో నామ స ధర్మాత్మా త్రిషు లోకేషు విశ్రుతః |
దీర్ఘబాహుర్విశాలాక్షో దైవతం హి పతిర్మమ ||
3
ఇక్ష్వాకూణాం కులే జాతః సింహస్కంధో మహాద్యుతిః |
లక్ష్మణేన సహ భ్రాత్రా యస్తే ప్రాణాన్ హరిష్యతి ||
4
ప్రత్యక్షం యద్యహం తస్య త్వయా స్యాం ధర్షితా బలాత్ |
శయితా త్వం హతః సంఖ్యే జనస్థానే యథా ఖరః ||
5
య ఏతే రాక్షసాః ప్రోక్తా ఘోరరూపా మహాబలాః |
రాఘవే నిర్విషాః సర్వే సుపర్ణే పన్నగా యథా ||
6
తస్య జ్యావిప్రముక్తాస్తే శరాః కాంచనభూషణాః |
శరీరం విధమిష్యంతి గంగాకూలమివోర్మయః ||
7
అసురైర్వా సురైర్వా త్వం యద్యవధ్యోఽసి రావణ |
ఉత్పాద్య సుమహద్వైరం జీవంస్తస్య న మోక్ష్యసే ||
8
స తే జీవితశేషస్య రాఘవోంతకరో బలీ |
పశోర్యూపగతస్యేవ జీవితం తవ దుర్లభమ్ ||
9
యది పశ్యేత్ స రామస్త్వాం రోషదీప్తేన చక్షుషా |
రక్షస్త్వమద్య నిర్దగ్ధో గచ్ఛేః సద్యః పరాభవమ్ ||
10
యశ్చంద్రం నభసో భూమౌ పాతయేన్నాశయేత వా |
సాగరం శోషయేద్వాపి స సీతాం మోచయేదిహ ||
11
గతాయుస్త్వం గతశ్రీకో గతసత్త్వో గతేంద్రియః |
లంకా వైధవ్యసంయుక్తా త్వత్కృతేన భవిష్యతి ||
12
న తే పాపమిదం కర్మ సుఖోదర్కం భవిష్యతి |
యాఽహం నీతా వినాభావం పతిపార్శ్వాత్త్వయా వనే ||
13
స హి దైవతసంయుక్తో మమ భర్తా మహాద్యుతిః |
నిర్భయో వీర్యమాశ్రిత్య శూన్యో వసతి దండకే ||
14
స తే దర్పం బలం వీర్యముత్సేకం చ తథావిధమ్ |
అపనేష్యతి గాత్రేభ్యః శరవర్షేణ సంయుగే ||
15
యదా వినాశో భూతానాం దృశ్యతే కాలచోదితః |
తదా కార్యే ప్రమాద్యంతి నరాః కాలవశం గతాః ||
16
మాం ప్రధృష్య స తే కాలః ప్రాప్తోఽయం రాక్షసాధమ |
ఆత్మనో రాక్షసానాం చ వధాయాంతఃపురస్య చ ||
17
న శక్యా యజ్ఞమధ్యస్థా వేదిః స్రుగ్భాండమండితా |
ద్విజాతిమంత్రపూతా చ చండాలేనావమర్దితుమ్ ||
18
తథాఽహం ధర్మనిత్యస్య ధర్మపత్నీ పతివ్రతా |
త్వయా స్ప్రష్టుం న శక్యాఽస్మి రాక్షసాధమ పాపినా ||
19
క్రీడంతీ రాజహంసేన పద్మషండేషు నిత్యదా |
హంసీ సా తృణషండస్థం కథం పశ్యేత మద్గుకమ్ ||
20
ఇదం శరీరం నిస్సంజ్ఞం బంధ వా ఖాదయస్వ వా |
నేదం శరీరం రక్ష్యం మే జీవితం వాపి రాక్షస ||
21
న తు శక్ష్యామ్యుపక్రోశం పృథివ్యాం దాతుమాత్మనః |
ఏవముక్త్వా తు వైదేహీ క్రోధాత్ సుపరుషం వచః ||
22
రావణం మైథిలీ తత్ర పునర్నోవాచ కించన |
సీతాయా వచనం శ్రుత్వా పరుషం రోమహర్షణమ్ ||
23
ప్రత్యువాచ తతః సీతాం భయసందర్శనం వచః |
శృణు మైథిలి మద్వాక్యం మాసాన్ ద్వాదశ భామిని ||
24
కాలేనానేన నాభ్యేషి యది మాం చారుహాసిని |
తతస్త్వాం ప్రాతరాశార్థం సూదాశ్ఛేత్స్యంతి లేశశః ||
25
ఇత్యుక్త్వా పరుషం వాక్యం రావణః శత్రురావణః |
రాక్షసీశ్చ తతః క్రుద్ధ ఇదం వచనమబ్రవీత్ ||
26
శీఘ్రమేవ హి రాక్షస్యో వికృతా ఘోరదర్శనాః |
దర్పమస్యా వినేష్యధ్వం మాంసశోణితభోజనాః ||
27
వచనాదేవ తాస్తస్య సుఘోరా రాక్షసీగణాః |
కృతప్రాంజలయో భూత్వా మైథిలీం పర్యవారయన్ ||
28
స తాః ప్రోవాచ రాజా తు రావణో ఘోరదర్శనః |
ప్రచాల్య చరణోత్కర్షైర్దారయన్నివ మేదినీమ్ ||
29
అశోకవనికామధ్యే మైథిలీ నీయతామియమ్ |
తత్రేయం రక్ష్యతాం గూఢం యుష్మాభిః పరివారితా ||
30
తత్రైనాం తర్జనైర్ఘోరైః పునః సాంత్వైశ్చ మైథిలీమ్ |
ఆనయధ్వం వశం సర్వా వన్యాం గజవధూమివ ||
31
ఇతి ప్రతిసమాదిష్టా రాక్షస్యో రావణేన తాః |
అశోకవనికాం జగ్ముర్మైథిలీం ప్రతిగృహ్య తు ||
32
సర్వకాలఫలైర్వృక్షైర్నానాపుష్పఫలైర్వృతామ్ |
సర్వకాలమదైశ్చాపి ద్విజైః సముపసేవితామ్ ||
33
సా తు శోకపరీతాంగీ మైథిలీ జనకాత్మజా |
రాక్షసీవశమాపన్నా వ్యాఘ్రీణాం హరిణీ యథా ||
34
శోకేన మహతా గ్రస్తా మైథిలీ జనకాత్మజా |
న శర్మ లభతే భీరుః పాశబద్ధా మృగీ యథా ||
35
న విందతే తత్ర తు శర్మ మైథిలీ
విరూపనేత్రాభిరతీవ తర్జితా |
పతిం స్మరంతీ దయితం చ దైవతం
విచేతనాఽభూద్భయశోకపీడితా ||
36
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే షట్పంచాశః సర్గః ||
Aranya Kanda Sarga 56 Meaning In Telugu
తన ముందు అలా ప్రాధేయపడుతున్న రావణుని చూచింది సీత. పక్కన పడి ఉన్న ఒక గడ్డిపరకను తీసి తనకూ రావణుని మధ్య పడవేసింది. రావణునితో ఇలాఅంది..
“ఓ రావణా! ధర్మానికి ప్రతిరూపము, సత్యసంధతకు నిలయము అయిన దశరథుని కుమారుడు రాముడు, ఆజాను బాహుడు, అరవిందదళాయతాక్షుడు అయిన ఆ రాముడు, నా భర్త. నా భర్తే నాకు దైవము. రాముని సోదరుడు లక్ష్మణుడు. వీరిద్దరూ కలిసి నీ ప్రాణములు బలి తీసుకుంటారు. అది తథ్యము. నీవు రాముని ఎదుట నా మీద చేయివేసినట్టయితే, నీసోదరుడు ఖర, దూషణులకు పట్టిన గతే నీకూపట్టి ఉండేది.
ఇందాకటినుండి, నీవు నీ రాక్షస వీరుల గురించి ఏవేవో గొప్పలు చెప్పావు. కానీ అటువంటి రాక్షసులు 14,000 మందిని నా రాముడు ఒంటిచేత్తో మట్టికరిపించాడు. అది మరిచిపోయావా! నా రాముని ధనుస్సునుండి వచ్చిన ఒక్కొక్క బాణము నీ ఒక్కొక్క ప్రాణము తీస్తుంటే అప్పుడు తెలుస్తుంది నా రాముని ప్రతాపం ఏమిటో!
నీవు దేవతలు, దానవులు, అసురులు, గంధర్వులు మొదలగు దేవాసుర గణములతో చావక పోవచ్చు. కాని మానవమాత్రుడైన నా రాముని చేతిలో నీకు చావు తప్పదు. యజ్ఞములో ఊపస్తంభమునకు కట్టిన పశువులాగా నువ్వు గిలా గిలా కొట్టుకుంటున్నావు. నీ చావు త్వరలోనే ఉంది. రాముడు రావడం, నిన్ను చంపడం, నన్ను నీ చెరనుండి విడిపించడం తథ్యం. నీకు ఆయువు మూడింది. నీ వైభవం నశించింది. నీ లంకా రాజ్యలక్ష్మికి వైధవ్యము రానుంది. అది తెలుసుకో!
నేను నా భర్త కలిసి ఉండగా మా ఇద్దరికీ వియోగం కల్పించావు. నీకు కూడా రాబోవు జన్మలలో భార్యవియోగం తప్పదు. వినాశకాలే విపరీతబుద్ధి అని నీకు పోయేకాలం దాపురించబట్టే ఇటువంటి దుర్బుద్ధిపుట్టింది. నేను పవిత్రమైన యజ్ఞభూమిని. నన్ను నీ వంటి ఛండాలుడు తాకనుకూడా తాక జాలడు. నేను రాముని ధర్మ పత్నిని. నా భర్తను తక్క పరపురుషుని కలలో కూడా తలవని దానను. పాపాత్ముడవైన నీవు నన్ను తాకను కూడా తాకలేవు.
నేను రాజహంసను. నీవు కాకివి. నీతో నాకు పొందేమిటి? ఈ శరీరం నీ ఇష్టం. నన్ను బంధించు. చిత్రహింసలకు గురిచెయ్యి.. లేకపోతే చంపెయ్యి. నీనుంచి నా ప్రాణాలను కాపాడుకోవాలనే కోరిక నాకు లేదు. నీవు ఏమి చేసినా నేను మాత్రం నీకు లొంగను. జాగ్రత్త!” అని పలికి తలవంచుకొని నిలుచుంది సీత.
సీత మాటలు విని రావణుడు కోపగించుకోలేదు. ఇప్పటిదాకా రావణుడు తన సంపదలు ఐశ్వర్యము చూపి ఆశపెట్టాడు. కానీ సీత లొంగలేదు. ఇప్పుడు సీతను బెదిరించి లొంగదీసుకోవాలని అనుకున్నాడు. సీతను చూచి పరుషంగా ఇలా అన్నాడు.
“ఓ సీతా! ఇంక నీవు ఏమి చెప్పినా నేను వినదలచుకోలేదు. నీకు పన్నెండు మాసాలు గడువు విధిస్తున్నాను. ఈ లోపల నీవు నా సరసన చేరాలి. లేకపోతే నిన్ను వంటశాలకు పంపించి, ముక్కలు ముక్కలు గా నరికించి, నాకు ఆహారంగా తయారు చేయించు కుంటాను. జాగ్రత్త!” అని పలికాడు.
సీతకు కాపలాగా ఉన్న రాక్షస స్త్రీలతో రావణుడు ఇలా అన్నాడు. “మీరు సీతకు కాపలాగా ఉండండి. నయానో భయానో సీతను నాకు వశం చేయండి.” అని పలికాడు. వెంటనే ఆ రాక్షస స్త్రీలు సీత చుట్టు వలయాకారంలో నిలబడ్డారు.
“ఈ సీత రాజాంతఃపురములో ఉండటానికి అర్హురాలు కాదు. మీరు ఈమెను అశోక వనమునకు తీసుకొని వెళ్లండి. ఈమెను ఒక రహస్య ప్రదేశములో ఉంచండి. ప్రతిరోజూ ఈమెను బతిమాలో భయపెట్టో ఆమె మనసు నా మీద లగ్నం అయేట్టు చేయండి.” అని ఆదేశించాడు.
వెంటనే ఆ రాక్షస స్త్రీలు సీతను అశోకవనమునకు తీసుకొని వెళ్లారు. లంకారాజ్యములో ఉన్న అశోక వనము ఫలవృక్షములతోనూ పూల తోటలతోనూ, చిన్న చిన్న సరోవరములతో నిండి శోభాయ మానంగా ఉంది. ఆ అశోకవనములో శోకదేవత వలె ఉన్న సీత ఆ రాక్షస స్త్రీల వశంలో బందీగా ఉంది. చిన్నప్పటి నుండిసుకుమారంగా పెరిగిన సీత, భయంకారాకారులైన ఆ రాక్షసస్త్రీల ఆకారములు చూచి, అరుపులు విని భయంతో మూర్ఛపోయింది.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము ఏబది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
అరణ్యకాండ సప్తపంచాశః సర్గః (57) >>